Saturday, 23 July 2011
Khammam lo telangana bandh prashantham
telangana pi charchalu malli malli
ముందు నిర్ణయించిన ప్రకారమైతే శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు పదిమంది నేతలతో తెలంగాణ అంశంపై ఆజాద్ అధికారిక చర్చలు ప్రారంభించాలి. అయితే ఆజాద్‌తో చర్చలు జరిపేందుకు వెళ్లాల్సిన పదిమందిని ఎంపిక చేసుకోవటంలో టి.కాంగ్రెస్ బృందం విఫలమైంది. మంత్రి కె జానారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు సాయంత్రం ఐదు గంటలకు ఆజాద్ వద్దకొచ్చి చర్చల అజెండా నిర్ణయిస్తే, చర్చలకు వస్తామని స్పష్టం చేశారు. ఇరువురు నేతలతో దాదాపు గంటపాటు చర్చలు జరిపిన ఆజాద్, అనంతరం మిగతా నేతలనూ అక్కడికి పిలిపించారు. ఆజాద్ మరోసారి 30మంది తెలంగాణ నేతలతో మూడు గంటలపాటు సంప్రదింపులు జరిపారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని టి.కాంగ్రెస్ గట్టిగా వివరించింది. దీనిపై ఆజాద్ స్పందిస్తూ ‘మీరిలా ప్రతిసారీ అందరూ మాట్లడుతూ కూర్చుంటే సమస్యను పరిష్కరించలేం’ అని స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర నేతల మధ్య ఏకాభిప్రాయం సాధించాలంటే ఇరుపక్షాలకూ చెందిన ఎంపిక చేసిన కొంతమందితో మాత్రమే సంప్రదింపులు జరుపుతామని ఆజాద్ తెగేసి చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యతపై మీ వాదన వినిపించింది. దానిపై సీమాంధ్ర నేతల అభిప్రాయాలు తెలుసుకుంటాం. వారు వ్యక్తం చేసే అంశాలపై మీ వాదనలు మళ్లీ వింటాం. ఇలా ఇరుపక్షాలతో పలు దఫాలు చర్చలు జరిపితేనే సమస్యకు పరిష్కారం కనుగొనే వీలు కలుగుతుంది’ అని ఆజాద్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే రాజధాని హైదరాబాద్ విషయంలో ఏం చేయాలనేది కూడా పరిశీలించవచ్చునని ఆయన సూచించినట్టు సమాచారం. ఇరుపక్షాలతో తాను జరిపే చర్చలపై ప్రభుత్వానికి, పార్టీకి నివేదిక అందిస్తానని, నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం ఉంటుందని టి.కాంగ్రెస్ బృందానికి ఆజాద్ స్పష్టం చేశారు. దీంతో సోమవారం నుంచీ తెలంగాణపై తాజా చర్చలు జరిపేందుకు టి.కాంగ్రెస్ అంగీకరించటంతో వివాదానికి తెర పడిందని అంటున్నారు.
రాజీనామాల విషయంలో విభేదాలు
ఎంపీ సభ్యత్వాలకు సమర్పించిన రాజీనామాలను యథాతథంగా కొనసాగించాలా? లేక ఉపసంహరించుకోవాలా? అనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల్లో విభేదాలు పొడసూపాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సానుకూల ప్రకటన చేస్తే రాజీనామాలు ఉపసంహరించుకుంటామని కొందరు ఎంపీలు చేసిన ప్రతిపాదనను మరికొందరు ఎంపీలు గట్టిగా వ్యతిరేకించారని అంటున్నారు. చర్చల పేరిట మరోసారి మోసం చేస్తున్నారని ఒకరిద్దరు ఎంపీలు ఆరోపించినట్టు తెలిసింది. కొందరు రాష్ట్ర మంత్రులు రాజీనామాల విషయంలో మెత్తపడ్డారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చలు
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చ జరిగింది. సీమాంధ్ర నేతలతో తాను జరిపిన చర్చల గురించి లోక్‌సభ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ వివరంచారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణ, సీమాంధ్ర నేతలతో జరుపుతున్న చర్చల గురించి కూడా కోర్ కమిటీ సమీక్షించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆజాద్ ఇరుపక్షాల నాయకులతో చర్చలు జరిపిన అనంతరం యుపిఏ సంకీర్ణ సర్కారు, కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ అంశంపై ఒక ప్రకటన చేస్తుందని అంటున్నారు.
telangana distircts lo telangana bandh prashantham
రాజధాని నుండి జిల్లాలకు బయలు దేరాల్సిన బస్సులు ఎమ్‌జిబిఎస్, జూబ్లీ డిపోల లోనే నిలిపి వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులను ఎదుర్కొన్నారు. అదిలాబాద్ జిల్లాలోని ఆరు డిపోల ముందు తెరాస, ఐకాస నేతలు బైటాయించడంతో 600 బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. అదేవిదంగా మెదక్ జిల్లాలో ఏడు డిపోల పరిధిలో 550 బస్సులు, మహబూబ్‌నగర్‌జిల్లాలోని లోని ఎనమిది డిపోల పరిధి లోని 804 బస్సులు , నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల పరి ధిలోని 705 బస్సులు, కరీంనగర్ జిల్లా పరిధిలోని 11 డిపోలలో ఉన్న 865 బస్సులు, నిజామాబాద్ జిల్లాలో 630 బస్సులు రహదారులపైకి రాలేకపోయాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో...
బంద్ కారణంగా జిల్లాలో వ్వాపార సంస్థలు, రవాణ సౌకర్యాలు స్థంబించి పోయాయి. జిల్లాలోని షాద్‌నగర్, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, గద్వాల డిపోలలో బస్సులను నిలిపివేశారు. ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదు ర్కొన్నారు. ఆర్టీసీకి శుక్రవారం ఒక్కరోజే రూ. 70 లక్ష లకు పైగా నష్టం వచ్చినట్లు అధికారుల అంచనా. యాది రెడ్డి మృతిపై తెలంగాణవాదులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. సీమాంధ్రులకు వ్యతిరెకంగా నినాదాలు చేస్తూ యాదిరెడ్డికి నివాళులు అర్పించారు. టీడీపీ, కాంగ్రెస్, టిఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమక్రసి, ఐఎన్‌టియుసి, ఎబి విపి, టిఆర్‌ఎస్‌వి, పాలమూర్ యూనివర్షిటి విద్యార్థులు బారీగా ర్యాలీలు నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.మండల కేంద్రా లలో యాదిరెడ్డికి నివాళులు అర్పించారు.
మెదక్ జిల్లాలో...
చెదురుమదురు సంఘటనలు మినహా మెదక్‌లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, తూప్రాన్, పటాన్‌చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో ప్రశాంతంగా బంద్ జరగడమే కాకుండా చిన్న చిన్న సంఘటనలు చోటుచేసు కున్నాయి. నారాయణఖేడ్‌లో ఒకరు, సిద్ధిపేటలో నలు గురు యువకులు సెల్‌టవర్‌పైకెక్కారు. హరీష్‌రావుపై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకోవాలని లేకుంటే తీవ్రపరి ణామాలు జరుగుతాయని హెచ్చరించారు. కొండపాకలో ఒక వ్యక్తి టవర్‌పైకెక్కడానికి యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదాశివపేట మండలంలోని నిజాంపూర్‌లో ఒక ఆటో డ్రైవర్ సూసైడ్ నోట్‌రాసి ఆత్మ హత్య చేసుకున్నాడు. రాజకీయ నాయకులు బిజెపి, టీడీపీ, టిఆర్‌ఎస్, మరికొందరు న్యాయవాదులు, ఉద్యో గులు సంగారెడ్డి, కలెక్టరేట్ ఉద్యోగులు విధులను బిహ ష్కరించారు.
వరంగల్ జిల్లాలో...
బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. బ్యాం కుల నుండి కిల్లీ షాపుల వరకు అన్నింటిని మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జిలు ధరిం చారు. యాదిరెడ్డి మతికి నిరసనగా శాంతి ర్యాలీలు నిర్వ హించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో శాంతి ర్యాలీలు, పలుచోట్ల రాస్తారోకోలు చేసి ప్రత్యేక తెలంగాణ నినాదాలు చేశారు. వరంగల్‌లో అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని ఘనంగా నివాళులు అర్పించాయి. జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది. జిల్లాలోని ఎనిమిది బస్‌డిపోల నుంచి 900 బస్సులను ఆపివేశారు. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీకి శుక్రవారం ఒక్కరోజే రూ. 60 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. పోలీసులు భారీ పికె టింగ్‌లు, పెట్రోలింగ్‌లు చేపట్టారు. వరంగల్‌లో జరిగిన బంద్ కార్యక్రమంలో టిడిపికి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, హన్మకొండలో జరగిన కార్యక్రమాలలో టిఎన్‌జీవోస్ కేంద్రం సంఘం నాయ కులు పరిటాల సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లాలో...
బీజేపి, సిపిఐ (ఎంఎల్), జెఏసి, టిఆర్‌ఎస్‌ల ఆధ్వ ర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. రాస్తా రోకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు జెఏసి నాయకులు మాట్లాడుతూ సీమాంధ్ర నాయకుల ప్రలోభాలకు కేంద్రం తలొగ్గి రాష్ర్ట్ర ఏర్పాటు ప్రక్రియను జాప్యం చేస్తోందని తెలంగాణ కోసం బలి దానాలు జరుగుతున్న సోనియాగాంధీకి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు. యాదిరెడ్డికి ఘనంగా నివా ళులు అర్పించారు.
కరీంనగర్ జిల్లాలో...
జిల్లాలోని 11 డిపోలలో 900ల ఆర్టీసి బస్సులు డిపో దాటి బయటకు రాలేదు. దీంతో రవాణా స్తంభించి పోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గుర య్యారు.ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరు పట్టికలో సంతకాలు చేసి విధులు బహిష్కరిం చారు. హుజూరాబాద్ డివిజన్‌లో ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలి పారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను పలుచోట్ల దగ్ధం చేశారు. అన్ని పార్టీల శ్రేణులు బందులో పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లాలో...
జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరి గింది. ఉదయం నుంచి తెలంగాణ వాదులు ఆర్టీసి బస్సులు బయటకు వెళ్లకుండ ఆదిలాబాద్, ఉట్నూర్, భైైంసా, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల వద్ద బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టిఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలిపెట్టారు. బెల్లంపల్లి డివిజన్ పరిధిలో,జిల్లా కేంద్రంలో ర్యాలీలు, మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పా టును అడ్డుకుంటున్న నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అంతరాష్ట్ర సర్వీసులతో పాటు మరికొన్ని బస్సు లను పోలీస్ ఎస్కార్టు మధ్య మధ్యాహ్నం ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లాలో ..
జిల్లాలో శుక్రవారం జరిగిన బంద్ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు పూర్తిగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపి వేశారు. ఆరు డిపోల్లోని 630 బస్సులు సాయంత్రం వరకు డిపోలకే పరిమితమవటంతో ఆర్టీసీకి రూ.50 లక్షల నష్టం వాటిల్లినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమ సంఘాల నేతలు డిపోల ఎదుట బైఠాయించారు.
ఖమ్మం జిల్లాలో ...
రాజకీయ జేఏసీ పక్షాలన్ని బంద్‌లో పాల్గొన్నాయి. జిల్లాలోని ఆరు ఆర్టీసీ బస్స్ డిపోల నుంచి ఒక బస్సుకూడా కదలలేదు.దీంతో జిల్లా ఆర్టీసీకి రూ. 20లక్షల ఆదాయం కోల్పోయింది. పాల్వంచలోని కెటిపిఎస్ ఉద్యోగులు విధు లకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దెందూకూర్- రాయ పట్నంరోడ్డు ఆంధ్రవాహనాలను అడ్డుకున్నారు.
telangana pi cheppalisindi cheppam:chandrababu
యువకులు సమస్య పరిష్కారం చేయని ప్రభుత్వంపై పోరాడాలే తప్ప బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే అధికారులు విధులు నిర్వహి స్తారంటూ ఏపీ భవన్‌లో టిఆర్‌ఎస్ శాసనసభ్యుడు ఓఎస్ డిపై దాడి చేయడాన్ని ఖండించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆలస్యం చేయ కుండా తెలంగాణ అంశాన్ని తక్షణమే పరిష్కరించాలని డి మాండ్ చేశారు. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాన్ని అవినీతిలో ముంచి, అభివృద్ధిని దెబ్బతీసి అస్తవ్యస్తంగా మార్చిందని విమర్శించారు. టిడిపి కాపాడిన భూములను సెజ్‌ల పేరుతో ధారాదత్తం చేసి సొంత కంపెనీ లలో పెట్టుబడులు పెట్టించుకున్నారని విమర్శించారు.
ప్రాజెక్టులపై రూ.60 వేల కోట్లు ఖర్చు పెట్టినా 6 వేల ఎక రాలకు సాగునీరు అందించలేక పోయారని ధ్వజమెత్తారు. 18 నెలల్లో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న హామీ అతీగతీ లేకుండా పోయిందన్నారు. గోదావరిపై బాబ్లీ సహా 13 ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోలేక పోయారని, కృష్ణా, వంశధార వివాదాలను పరిష్కరించలేక పోయారని మండి పడ్డారు. ఉత్తర తెలంగాణ ఏడారిగా మారకూడదనే ఉద్దే శంతో మహారాష్టక్రు వ్యతిరేకంగా బాబ్లీపై పోరాడి జైలుకెళ్తే దానిని కూడా రాజకీయం చేశారనిఆవేదన వ్యక్తం చేశారు.
ఖనిజ సంపద దోచేశారు
ఆంధ్రప్రదేశ్, కర్నాటకలోని ఇనుప ఖనిజం మొత్తం గాలి జనార్ధనరెడ్డి, వైఎస్ జగన్‌లు లూటీ చేశారని చంద్ర బాబు నాయుడు ఆరోపించారు. 14 నెలల్లో రూ. 1800 కోట్లు దోపిడీ చేశారని ధ్వజ మెత్తారు. ముఖ్యమంత్రుల ప్రమేయంతోనే ఇది జరిగిం దన్నారు.
కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది...
నక్సలైట్ల చేతిలో మరణించినా, భూములు-ఆస్తులు కోల్పోయినా, అక్రమ కేసులలో చిక్కుకున్నా అధైర్యపడ కుండా టిడిపి జెండా మోస్తున్న కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదన్నారు. తనకు వచ్చిన పేరు ప్రతిష్ట అంతా కార్యకర్తల వల్లేనని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అన్నారు. ఎన్టీఆర్ మొమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య, వైద్యం, తాగు నీటి వసతి, ఉపాధి అవకాశాల కల్పన కార్యక్రమాలు చేపట్టామన్నారు.
చివరి రక్తపు బొట్టు వరకు కార్యకర్తల కోసం, ప్రజల కోసం పని చేస్తానన్నారు. ఈ సదస్సుకు నామా నాగేశ్వరరావు, దాడి వీరభద్రరావు, తుమ్మల నాగేశ్వర రావు, కడియం శ్రీహరి, రావుల చంద్రశేఖరరెడ్డి, అర వింద్‌కుమార్ గౌడ్ తదితరులు హాజరై ప్రసంగించారు. పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
telangana lo bandh karanam ga nilichina rtc buses
తెలంగాణలో బంద్ కారణంగా నిలిచిన బస్సులు
నేడు తెలంగాణ బంద్ సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాలో బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. నగరంలోని ఎంజీబీఎస్, జూబ్లీబస్‌స్టేషన్ నుంచి వెళ్లాల్సిన బస్సులు నిలిపివేశారు. ఆదిలాబాద్‌లోని ఆరు డిపోల పరిధిల్లో 600 బస్సులు నిలిచిపోయాయి. ఉదయం నుంచే బస్సులు డిపోలనుంచి బయటికి వెళ్లనీయకుండా టిఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
మెదక్ జిల్లాలో ఏడు డిపోల పరిధిలో 550 బస్సులు, నిలిచిపోయాయి. డిపోల ఎదుట ఆందోళనకారులు ధర్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హకీంపేట డిపోనుంచి బస్సుల్ని బయటకు వెళ్లకుండా నిలిపివేశారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో బంద్ సందర్భంగా 8 డిపోల్లో, 804 బస్సుల్ని నిలిపివేశారు. తెలంగాణ బంద్‌కి మద్దతుగా షాద్‌నగర్‌లో తెలంగాణ వాదులు రోడ్డుపై బైఠాయించారు. నల్గొండ రీజియన్‌లోని 7 డిపోల్లో 705 బస్సులు నిలిచిపోయాయి. టిఆర్‌ఎస్, బీజేపీ నేతలు డిపోల ముందు బైఠాయించారు. కరీంనగర్‌లో 11 డిపోల్లో 865 బస్సుల్ని నిలిచిపోయాయి. నిజామాబాద్‌లో 630 బస్సులు డిపోలోనే ఆగిపోయాయి.
we will go with resign:t-congress
telangana lo marina tdp janda
telangana kosam ninadinchina ou
- బంద్ సంపూర్ణం
- కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి దిష్టి బొమ్మ దహనం
- సమర భేరి పోస్టర్ విడుదల
యూనివర్సిటీలో శుక్రవారం బంద్ సంపూర్ణంగా జరిగింది. క్యాంపస్‌లోని అన్ని కళాశాలలు, కార్యాలయాలు, గ్రంథాలయాలు మూతపడ్డాయి. కొందరు విద్యార్థులు యాదిడ్డి అంత్యక్షికియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. మరికొంత మంది ఓయూలో తెలంగాణ కోసం నిరసన కార్యక్షికమాలను చేపట్టారు. టీఎస్ జాక్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి దిష్టిబొమ్మను ఆర్ట్స్ కళాశాల నుంచి శవయావూతగా తీసుకు పోలీస్‌స్టేషన్ ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తార్నాక వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్షికమంలో టీఎస్ జాక్ చైర్మన్ విజయ్, తెలంగాణ రీసర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్, టీఎస్ జాక్ నాయకులు మర్రి అనిల్, ఆజాద్, దుర్గం భాస్కర్ పాల్గొన్నారు. కాగా, తెలంగాణ కోసం ఈనెల 27న జరగనున్న ‘సమరభేరి సభ’ పోస్టర్లను ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏబీవీపీ నాయకులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్షికమంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు, కార్యవర్గ సభ్యుడు టి.రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్యాణ్, వీరబాబు, ఓయూ నాయకులు ఎల్లస్వామి, రాజేంవూదవూపసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కోసం ఆగస్టు 1 నుంచి సమ్మె చేప ఉద్యోగులు సిద్ధమవగా ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయాగిస్తానని హెచ్చరించడాన్ని పీడీఎస్‌యూ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరును నిరసించారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిషిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ తల్లి కేంద్ర ప్రభుత్వం, పోలీసు బలగాల చేతిలో ఎట్లా బందీ అయిందో ఈ సందర్భంగా విద్యార్థులు ఓ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్షికమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి గౌతమ్ ప్రసాద్, నగర అధ్యక్షురాలు సత్యవతి, ఓయూ అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.
telangana bandh success
-నినదించిన తెలంగాణ
- పలు బస్సులు
పాక్షిక ధ్వంసం
- యాదిడ్డికి నివాళులు
- బంద్‌కు అన్నివర్గాల వారి మద్దతు
- మూతపడ్డ దుకాణాలు, విద్యాలయాలు
- నిర్మానుష్యంగా మారిన రహదారులు
రెచ్చగొట్టే ధోరణిలో పోలీసుల రక్షణ వయలంలో కొన్ని ఆర్టీసీ బస్సులను నగరంలో తిప్పేందుకు ప్రయత్నించింది. దీనికి ఆగ్రహించిన తెలంగాణవాదులు 30బస్సులను పాక్షికంగా ధ్వంసం చేశారు. కూకట్‌పల్లి ప్రాంతంలో కొన్ని దుకాణాలు తెరిచి ఉంచడంపై మండిపడ్డారు. వాటిని మూసివేయించారు. రాజేంవూదనగర్ వెటర్నరీ కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విద్యార్థులు పరిపాలనా భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. హైకోర్టు, సిటీ సెమీకోర్టు, మియాపూర్ కోర్టుల తెలంగాణ న్యాయవాదులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పద్మారావు ఆధ్వర్యంలో సికింవూదాబాద్ నియోజకవర్గ పరిధిలో దుకాణాలు మూసి వేయించి బంద్‌ను విజయవంతం చేశారు. మాజీ మంత్రి నాయిని నర్సింహాడ్డి తన కార్యకర్తలతో కలిసి తిరుగుతూ ముషీరాబాద్, చిక్కడపల్లి ప్రాంతాల్లో దుకాణాలను మూసి వేయించారు.
సైఫాబాద్‌లోని అరణ్యభవన్‌లో తెలంగాణ అమరవీరుడు యాదిడ్డికి శ్రద్ధాంజలి ఘటించి, ఉద్యోగులు విధులు బహిష్కరించారు. తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ ఆధ్వర్యంలో యాదిడ్డికి నివాళులు అర్పించారు. అనంతరం జలసౌధలో విధులను బహిష్కరించి బంద్‌లో పాల్గొన్నారు. విద్యుత్, ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీసీపీడీసీఎల్, కార్మికశాఖ, ఆర్టీసీ, జలమండలి, విద్యా శాఖ, వైద్య శాఖ, కలెక్టరేట్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, సచివాలయం, బూర్గుల రామకృష్ణ భవన్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారు. యాదిడ్డిని స్మరించుకుంటూ పశుసంవర్థక శాఖ ఉద్యోగులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం విధులను బహిష్కరించారు.
సచివాలయం వద్ద బీజేపీ ధర్నా
బంద్‌కు మద్దతుగా సచివాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు బండారు దత్తావూతేయ, రాంచందర్‌రావు, కాశం వెంక అశోక్‌యాదవ్‌లతో పాటు వంద మంది కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. దత్తావూతేయ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో కిరణ్ సర్కారు అప్రకటిత ఎమ్జన్సీని అమలు చేస్తున్నదని మండిపడ్డారు.
భయోత్పాతాన్ని సృష్టిస్తున్న సర్కారు: అల్లం నారాయణ
తెలంగాణ బంద్‌కు తెలంగాణ జర్నలిస్టు ఫోరం(టీజేఎఫ్) సంపూర్ణ మద్దతును ప్రకటించింది. జర్నలిస్టులపై పోలీసుల అమానుష దాడులను ఖండించింది. దాడులకు నిరసనగా డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఫాసిస్టు విధానాన్ని అవలంబిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణవాదులపై, జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతూ భయోత్పాతాన్ని సృష్టించే దిశగా సర్కారు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఉద్యమంలో అంతా కలిసి శాంతియుత పోరాటం చేస్తున్నారని, దీన్ని హింస వైపునకు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.
sthambinchina telangana
- ‘ఎస్మా’ చట్టంపై మండిపడ్డ తెలంగాణవాదులు
- స్వచ్ఛందంగా బంద్
- ఊరూరా రాస్తారోకో, ర్యాలీలు
- తెలంగాణ ద్రోహుల దిష్టిబొమ్మల దహనం
- కదలని ఆర్టీసీ బస్సులు
- విధులు బహిష్కరించిన న్యాయవాదులు
- కరీంనగర్‌లో కలెక్టర్, ఎస్పీలకు సమ్మె నోటీసిచ్చిన ఉద్యోగులు
- నల్లబ్యాడ్జీలతో సింగరేణి కార్మికుల నిరసన
- బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన యాదిడ్డి భౌతికకాయాన్ని అవమానించడంతోపాటు ఉద్యోగులపై ఎస్మా చట్టం ప్రయోగిస్తామని చెప్పడాన్ని నిరసిస్తూ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది. శుక్రవారం తెలంగాణలోని పది జిల్లాల్లో వాణిజ్య, వ్యాపార, పాఠశాలల యాజమాన్యాలతోపాటు ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. న్యాయవాదులు విధులు బహిష్కరించగా, కరీంనగర్‌లో కలెక్టరేట్ ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. ఊరూరా రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ఎక్కడా ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. పలు చోట్ల ఎమ్మెల్యేలు కూడా పాల్గొని నిరసన తెలిపారు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. రాజీనామా చేయని నేతలతోపాటు సీఎం, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు.
భారీగా తెలంగాణవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.వరంగల్‌లో సీమాంధ్ర వ్యక్తికి చెందిన నాగార్జున ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన ఒక దుకాణాన్ని తెలంగాణవాదులు బంద్ చేయించే క్రమంలో కొందరు ఆ దుకాణంపై రాళ్లురువ్వారు. ఈ కేసులో వరంగల్ తూర్పు నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకుడు అచ్చా విద్యాసాగర్ సహా 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులను బంద్ సందర్భంగా ముందస్తుగా అరెస్టు చేశారు. న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు చేశారు. న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించి రోడ్డెక్కారు. రాస్తారోకోలో చిక్కుకున్న వారికి తెలంగాణ వాదులు అక్కడే వంటలు చేసి భోజనాలు పెట్టించారు. జిల్లాలో పలు చోట్ల జగ్గాడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సోనియా, సీఎం కిరణ్‌కుమార్‌డ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. పటాన్‌చెరులో పరిక్షిశమలు మూసేసి సెలవు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ఉద్యోగ సంఘాలు, రాజకీయ పక్షాలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేశాయి.
తెలంగాణవాదులు రాస్తారోకోలు చేపట్టి, మానవహారాలుగా ఏర్పడ్డారు. ఖమ్మం, మధిరలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జిలు ధరించి విధులకు హాజరయ్యారు. పలు చోట్ల డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దహనం చేశారు. బంద్‌లో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, పొలిట్ బ్యూరో సభ్యులు రామారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ రంగరాజు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్షికసీ జిల్లా కార్యదర్శి రంగారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి హేమంతరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌డ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు బంద్‌లో పాల్గొన్నారు. పశ్చిమ ప్రాంతం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీహరిరావు, తూర్పు ప్రాంతం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సతీశ్ సహా జిల్లా వ్యాప్తంగా 220 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కిరణ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బొగ్గు బావుల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
పలు చోట్ల విలేకరులు రాస్తారోకోలు నిర్వహించారు. శ్రీరాంపూర్‌లోని శిర్కేలో సింగరేణి మహిళా జేఏసీ ఆధ్వర్యంలో క్యాండీల్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌లో టీజేఏసీ, టీఎన్‌జీఓలు కలెక్టర్ స్మితాసబర్వాల్‌కు, ఎస్పీ రవీందర్‌కు సమ్మెనోటీసు ఇచ్చారు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. జగిత్యాలలో టీఆర్‌ఎస్ నాయకులు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. న్యాయవాదులు విధులు బహిష్కరించారు. మహబూబ్‌నగర్‌లో కౌలు రైతుల రుణ అర్హత కార్డుల పంపిణీ కార్యక్షికమం జరుగుతుండగా రెవెన్యూ ఉద్యోగులు వెళ్లి అడ్డుకున్నారు. వనపర్తిలో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, లగడపాటి, టీజీ వెంక పయ్యావుల కేశవ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. న్యాయవాదులు, టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లతో అమరులకు నివాళులు అర్పించారు.
జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఉద్యోగులు డిపో వద్ద వంటావార్పు చేశారు. పాలెంలో తెలంగాణవాదులు పాల శీతలీకరణ కేంద్రంపై దాడికి దిగారు. నల్లగొండ జిల్లాలో తెలంగాణవాదులంతా రోడ్లపై నిరసన తెలిపారు. నల్లగొండలో జేఏసీ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీ నిర్వహించారు. కోర్టు నుంచి గడియారం సెంటర్ వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపం వద్ద యాదిడ్డికి నివాళులర్పించారు. సూర్యాపేట డివిజన్‌లో వద్ద రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సీమాంవూధులకు చెందిన చక్కెర ఫ్యాక్టరీ వద్ద పోలీసులు అతిగా ప్రవర్తించారు. ఎన్‌డీఎస్‌ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగులను బంద్‌లో పాల్గొననీయకుండా పనిచేయిస్తున్న సీమాంధ్ర కంపెనీ తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఫ్యాక్టరీ గేటులోని సెక్యూరిటీ పాయింట్‌పై తెలంగాణవాదులు దాడిచేశారు. జేఏసీ చైర్మన్ గోపాల్‌డ్డి, గంగాడ్డితోపాటు 15మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కామాడ్డిలో 50 మంది ఉద్యమకారులను అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌లో విద్యార్థి నాయకుడు ప్రదీప్, జేఏసీ నాయకుడు ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి దురుసుగా వ్యవహరించారు.
హైదరాబాద్‌లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణిలో పోలీసుల రక్షణ వలయంలో కొన్ని ఆర్టీసీ బస్సులను నగరంలో తిప్పేందుకు ప్రయత్నించగా ఆగ్రహించిన తెలంగాణవాదులు 30 బస్సులను పాక్షికంగా ధ్వంసం చేశారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పద్మారావు ఆధ్వర్యంలో సికింవూదాబాద్ పరిధిలో దుకాణాలు మూసి వేయించి బంద్‌ను విజయవంతం చేశారు. మాజీ మంత్రి నాయిని నర్సింహాడ్డి కార్యకర్తలతో కలిసి తిరుగుతూ దుకాణాలను మూసి వేయించారు. రంగాడ్డి జిల్లాలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి రోడ్డెక్కారు. ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లా ఉద్యోగ జేఏసీ నేతలు రాజేందర్‌డ్డి, లక్ష్మాడ్డి, రామ్మోహన్, బాల్‌రాజ్ పాల్గొన్నారు. కడ్మూర్‌లో ఐదుగురు సెల్‌టవర్ ఎక్కి నినాదాలు చేశారు. మర్పల్లి మండలం బూచన్‌పల్లిలో టీఆర్‌ఎస్ నేతలు సీమాంధ్ర వ్యాపారి ఫాంహౌస్‌పై దాడికి దిగారు.
athma hathyalu vaddu
- ఆత్మహత్యల నిరోధక కమిటీ చైర్మన్ ఘంటా చక్రపాణి వ్యాఖ్య
- యాదిడ్డి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకుంటే ఆ వార్తను ప్రసారం చేయరా?
- టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ సూటి ప్రశ్న
యాదిడ్డి ఆత్మహత్యలో ప్రధాన దోషి కేంద్ర ప్రభుత్వమేనని ఆత్మహత్యల నిరోధక కమిటీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆత్మహత్యల నిరోధక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మహత్యల ద్వారా తెలంగాణ రాదనే విషయాన్ని గ్రహించాలని యువతకు సూచించారు. ఆత్మహత్యలు వద్దని, పోరాడి తెలంగాణ సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కమిటీ ఆధ్వర్యంలో ఏడాది నుంచి ఆత్మహత్యల నివారణకు తెలంగాణ పది జిల్లాల్లో అవగాహన కార్యక్షికమాలు నిర్వహించామని, దీంతో మంచిఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు.
తాజాగా సీమాంధ్ర ప్రజావూపతినిధులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో ఆత్మహత్యలు మళ్లీ ప్రారంభమయ్యాయని చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, యాదిడ్డి ఆత్మహత్య యూపీఏ ప్రభుత్వపు హత్యగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంకన్వీనర్ అల్లం నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజావూపతినిధులు రాజీనామాలు చేసినప్పటికీ, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నప్పటికీ, ఎక్కడికక్కడ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకపోవడంతో యువకులు కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ కోసం ఉద్యమాన్ని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమీపంలో యాదిడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయం సంచలన వార్త అయినప్పటికీ కొన్ని పత్రికలు, చానళ్లు ఆ వార్తను ప్రసారం చేయకపోవడం బాధాకరమన్నారు.
తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత విఠల్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజావూపతినిధులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నందున ప్రభుత్వం సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆత్మహత్యల వ్యతిరేక కమిటీ సభ్యులు డాక్టర్ నర్సయ్య, డాక్టర్ వీరేందర్, వీవీ రావు, బాల్‌డ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
తెలంగాణకు అవమానం: టీజేఎఫ్
శుక్రవారంనాటి బంద్‌కు తెలంగాణ జర్నలిస్టు ఫోరం తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అమరవీరుడి పట్ల జరిగిన అవమానం, తెలంగాణకు జరిగిన అవమానమని టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
telangana kosam jailakkaina veltham
సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రజల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని టీఆర్‌ఎస్ మెదక్ జిల్లా కన్వీనర్ రఘునందన్‌రావు అన్నారు. తెలంగాణ కోసం, ప్రజల ఆకాంక్ష మేరకు జైళ్లకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న మోసపూరిత విధానాలతో కలత చెందిన యాదిడ్డి ఢిల్లీ వరకు వెళ్లి పార్లమెంట్ సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. యాదిడ్డి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి రాష్ట్రానికి పంపించే బాధ్యతను తీసుకోవాల్సిన ఏపీభవన్ అధికారులు కనీసం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. యాదిడ్డి మృతదేహాన్ని పట్టించుకోకపోవడమే కాకుండా శవాన్ని నేరుగా శ్మశాన వాటికకు తీసుకు కాల్చివేయమని ఢిల్లీ పోలీసులకు లేఖ రాయడమేమిటని ప్రశ్నించారు.
ఈ విషయం తెలుసుకుని హరీశ్‌రావుతో పాటు తెలంగాణవాదులు ఏపీభవన్‌కు వెళ్లి ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలు చెప్పారని, ఈ క్రమంలో అనుకోని విధంగా హరీశ్‌రావు ఆవేశంతో చందర్‌రావు అనే ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన వివరించారు. ఎవరూ అడగకపోయినా జరిగిన సంఘటనపై ఉద్యోగికి హరీశ్‌రావు క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో పనిచేస్తున్న జయబాబు అనే అధికారిపై ఓసారి వి.హనుమంతరావు, 1986లో ఆనందరాఘవ అనే అధికారిపై కావూరి సాంబశివరావు, 1990లో మరో అధికారిపై వైఎస్ రాజశేఖరడ్డి దాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. అంతేకాకుండా 1991లో మల్లికార్జున్‌రావు అనే డిప్యూటీ కమిషనర్‌పై బాలరాజు అనే గ్రంథాలయ చైర్మన్, 1996లో గఫార్ అనే డిప్యూటీ కమిషనర్‌పై దానం నాగేందర్, 1998లో నాగేశ్వర్‌రావు అనే అధికారిపై ఓసారి రాజ్యసభ్యుడు కేఎం ఖాన్, మరోసారి మహ్మద్‌జానీ దాడిచేసి కొట్టారని ఆయన గుర్తుచేశారు. 2009లో ఏసీ కారు పంపలేదనే కోపంతో లింగరాజు అనే దళిత అధికారిపై మహ్మద్‌జానీ చెప్పుతో దాడిచేశారని రఘునందన్‌రావు తెలిపారు. 1996లో దానం నాగేందర్ దాడి చేసిన సమయంలో ఆంధ్ర భవన్ ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయోగించిదన్నారు.
వీరంతా మంచి గది ఇవ్వలేదని, ఏసీ కారులు పంపలేదని వ్యక్తిగత కారణాల కోసం దాడులు చేసినప్పటికీ ఏ రోజు కూడా కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు. కానీ హరీశ్‌రావు భావోద్వేగంతో చేయిచేసుకున్నప్పటికీ వెంటనే క్షమాపణ చెప్పారని, అయినా ప్రభుత్వం, సీమాంవూధులు కేసులు నమోదు చేయించడం, సీమాంధ్ర మీడియా పనిగట్టుకుని ప్రచారం చేయడం ఏమిటని రఘునందన్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ వాదులకు కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు.
ashru nayanalatho yadireddy anthyakriyalu
- కన్నీటి సంద్రమైన పెద్దమంగళారం
- ఊరు ఊరంతా శ్మశానవాటికకు
- పొద్దంతా ఉపవాసంతోనే
- పెల్లుబికిన ఉద్యమ నినాదాలు
- రెండు గంటలపాటు అంతిమయాత్ర
- దుఖ్ఖం ఆపుకోలేక పోయిన హరీష్‌రావు
- పాడెమోసిన టీఆర్‌ఎస్ నేతలు
- ఎర్రబెల్లి వాహనంపై రాళ్ల దాడి
ఉద్యమ ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు చాటిన పోరుబిడ్డ మందడి యాదిడ్డికి అశ్రు నయనాలు, ఉద్యమగీతాలు, జోహార్ల మధ్య రంగాడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఆయన స్వగ్రామమైన పెద్దమంగళారంలో శుక్రవారం ఘనంగా అంత్యక్షికియలు జరిగాయి. అంతిమయాత్ర సందర్భంగా పెద్దమంగళారం గ్రామం కన్నీటి జన సంద్రమైంది. యాదిడ్డి కు టుంబంతోపాటే ఉపవాసం ఉన్న పెద్దమంగళారం.. ఊరు ఊరంతా శ్మశానవాటికకు కదిలొచ్చింది. ఓవైపు బంద్‌తో ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా తెలంగాణ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా కదలివచ్చిన తెలంగాణవాదులు, ఉద్యమకారులతో పాటు అశేషంగా తరలివచ్చిన జనవూపవాహం మధ్య అంతిమయాత్ర రెండు గంటల పాటు కొనసాగింది.
మా తెలంగాణ మాకు ఇవ్వండంటూ ఏకంగా ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్‌భవన్ సమీపంలో ఆత్మబలిదానం చేసిన యాదిడ్డి ధైర్యసాహసాలను, అతడి ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కీర్తిస్తూ పాడిన పాటలతో అంతిమయావూతలో పాల్గొనేందుకు వచ్చిన వారి హృదయాలు ద్రవించాయి. ఆయన ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరం కృషిచేస్తామంటూ ప్రతినబూనారు. ఉదయం 11.45 గంటలకు మొదలైన అంతిమయాత్ర మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. మృతదేహాన్ని పూలతో అలంకరించిన ట్రాక్టర్‌పై ఉంచి గ్రామ ప్రధాన వీధులగుండా ఊరేగించి శ్మశానవాటికలో అంతిమ సంస్కారం నిర్వహించారు. ఢిల్లీలో పోస్టుమార్టం నిర్వహించినప్పటి నుంచి యాదిడ్డి మృతదేహం వెంటే ఉన్న టీఆర్‌ఎస్ నేతలు హరీశ్, కేటీఆర్, ఈటెల రాజేందర్‌లు పాడె మోసి అతడికి అంతిమ సంస్కారాలు పూర్తయ్యేంత వరకూ ఉన్నారు.
జనసంవూదమైన పెద్దమంగళారం యాదిడ్డి అంతిమయావూతలో పాల్గొనేందుకు తెలంగా వ్యాప్తంగా ప్రజలు విశేషంగా తరలిరావటంతో పెద్దమంగళారం జనసంవూదంగా మారింది.
మొన్నటి వరకు సామాన్య యువకుడిగా ఉండి, ఒక్కడే ఢిల్లీకి వెళ్లి ఆత్మత్యాగం చేయటంతో చరివూతలోకి ఎక్కాడని ప్రతి ఒక్కరూ కీర్తించారు. యాదిడ్డి అంత్యక్షికియల్లో పాల్గొనాలని, కడసారి చూపు చూడాలని గ్రామస్తులంతా పనులన్నీ వదులుకుని ఇంటి వద్దే ఉండి అంతిమయావూతలో పాల్గొన్నారు. యాదిడ్డి బలిదానం గురించి తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, వివిధ పార్టీల నాయకులు, కళాకారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు, తెలంగాణవాదులు గురువారం రాత్రి నుండే వేల సంఖ్యలో పెద్దమంగళారం తరలివచ్చారు. యాదిడ్డి భౌతికకాయం చేరుకున్నది మొదలు శుక్రవారం మధ్యాహ్నం అంతిమ సంస్కరణలు ముగిసే వరకు గ్రామంలో కన్నీళ్ళు కార్చని వారులేరు. మంచికి మారుపేరుగా, తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు తన బలిదానంతోనే రావాలని ఆకాంక్షించిన సాహసిగా యాదిడ్డిని కొనియాడుతూ కట్టలు తెంచుకునే కన్నీళ్లను ఆపుకోలేక పోయారు.
తెలంగాణ గడ్డలో తమ పులిబిడ్డగా యాదిడ్డి చేసిన సాహసం దేశ చరివూతలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెప్పారు. ఇదిలా ఉండగా పెద్దమంగళారంలో రెండు రోజులుగా కనీసం ఒక్క ఇంట్లో నైనా పొయ్యిలు రాజుకోలేదు. ఊరు ఊరంతా ఉపవాసంతో ఉండిపోయారు. కన్నీళ్లతోనే వారు గడిపారు. అంతిమయావూతకు వచ్చిన వారు కూడా ఉపవాసం ఉన్నారు.
కన్నీటి పర్యంతమైన హరీశ్‌రావు
యాదిడ్డి మృతదేహానికి నివాళులర్పించేందుకు అతడి ఇంటికి వచ్చిన టీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్‌రావు.. యాదిడ్డి తల్లి చంద్రమ్మను ఒక్కసారిగా కంట తడిపెట్టారు. ‘‘మీ బిడ్డ చరివూతకారుడమ్మా. అతనిలేని లోటును ఎవరం తీర్చలేం..’’ అంటూ ఆమెను ఓవైపు ఓదార్చుతూనే తాను కన్నీళ్లను ఆపుకోలేక పోయారు. ‘‘అమ్మా నేనూ నీ కొడుకునే’’ అంటూ రోదించారు. అమ్మ చేతి వంట తిందామనుకున్నా.. ఎక్కడ మనసు మారుస్తుందోనని తినకుండానే వచ్చేశానని యాదిడ్డి రాసిన లేఖ చూసి తట్టుకోలేక పోయానని చెప్పారు. ‘‘ఎం ధీశాలిని కన్నావు తల్లీ.. నీ వెంటే మేముంటాం. యాదిడ్డి ఆశయాలు సాధిస్తాం..’’ అంటూ ఓదార్చారు. మీడియాతో మాట్లాడుతూ కూడా యాదిడ్డి ఆత్మబలిదానం వెనుక ఉన్న కారణాన్ని, లేఖలో అతడు ఏ విధంగా రాశాడో చెబుతూ మళ్లీ కన్నీటిపర్యంతమయ్యారు.
హైదరాబాద్ నుంచి కచ్చితమైన నిర్ణయంతోనే అన్నింటికీ సిద్ధమై అతడు బయలుదేరి అనుకున్న పని చేయడం ఎంతో బాధించిందని రోదించారు. కొద్దిసేపు ఏం మాట్లాడలేని పరిస్థితిలో మౌనంగా ఉండిపోయారు. అంతిమ యాత్రలో చివరి సారిగా కేటీఆర్, ఈటెల రాజేందర్, వేదకుమార్ తదితరులతో కలిసి పాడెమోశారు.
టీడీపీ నాయకులకు తప్పని నిరసన
టీడీపీ నేతలకు యాదిడ్డి అంత్యక్షికియల సందర్భంగానూ నిరసన తప్పలేదు. యాదిడ్డికి నివాళులర్పించి తమ వాహనాలవైపు వెళుతున్న టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌డ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కేఎస్.రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌డ్డిలను ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు వెంబడించారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు, టీడీపీల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. దాంతో వారు త్వరత్వరగా తమ వాహనాలవద్దకు చేరుకుని వాటిల్లో ఎక్కి బయలుదేరే సమయంలో విద్యార్థులు రాళ్లతో వారి వాహనాలపై దాడిచేశారు. ఎర్రబెల్లి వాహనంపై రాయిపడినా వాహనాన్ని ఆపకుండా అలాగే వెళ్లిపోయారు.
అంతిమ నివాళిఘటించిన నేతలు
యాదిడ్డికి అంతిమ నివాళులు అర్పించేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, కో-చైర్మన్ విఠల్, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మెన్ స్వామిగౌడ్, గెజిటెడ్ ఉద్యోగలు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కే తారక రామారావు, కొప్పుల ఈశ్వర్, గడ్డం అరవిందడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ, జీ తెలుగు చానల్ సీఈవో శైలేష్‌డ్డి, టీఆర్‌ఎస్ పశ్చిమ అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, రంగాడ్డి జడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌డ్డి, టీడీపీ నేతలు దేవేందర్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డాక్టర్ పీ మహేందర్‌డ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌డ్డి, స్వప్న, గడ్డం వెంకట్‌డ్డి, దేశమల్ల ఆంజనేయులు, టీడీపి తిరుగుబాటు ఎమ్మెల్యేలు హరీశ్వర్‌డ్డి, రామన్న, కాంగ్రెస్ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, సీపీఐ ముదిగొండ ఎమ్మెల్యే యాదిగిరి, ఎమ్మెల్సీ రహమాన్‌లు పెద్దమంగళారం చేరుకున్నారు.
అలాగే బీజేపీ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగర్‌రావు, ఆ పార్టీ నేతలు బద్దం బాల్‌డ్డి, మల్లాడ్డి, రంగన్న, అంజన్‌కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకుడు కార్తీక్‌డ్డి, మాజీ ఎమ్మెల్యే కోదండడ్డి, టీటీడీ మాజీ సభ్యుడు కాలే యాదయ్య, సీనియర్ నాయకులు పడాల వెంకటస్వామి, జ్ఞానేశ్వర్, జడ్పీటీసీ బాల్‌రాజ్, ఎంపీపీ కరణం రాజ్యలక్ష్మి, ప్రకాష్‌గౌడ్, రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక సంఘం అధ్యక్షుడు ఎల్లయ్య, న్యాయవాదుల జేఏసీ కో-కన్వీనర్ గోవర్థన్‌డ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్, పుస్తకాల నర్సింగ్‌రావు, యాదయ్య, మండల కాంగ్రెస్ ఆధ్యక్షులు పురుషోత్తమడ్డి, గోపాల్‌డ్డి, టీఆర్‌ఎస్ ఎస్సీసెల్ రాష్ర్ట అధ్యక్షుడు మందుల శామ్యూల్, కార్యదర్శి బద్దం బాస్కర్‌డ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జి దేశమోళ్ల అంజనేయులు, జిల్లా యూత్ అధ్యక్షుడు గడ్డం వెంకట్‌డ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న సతీష్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్, యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క, భీంభరత్, కడమంచి నారాయణదాసు, తెలంగాణ బలిదానం దర్శకుడు రఫీ, కథానాయిక సుమాంజలి, న్యూ డెమాక్షికసీ నాయకులు గోవర్థన్ తదితరులు పెద్దమంగళారం చేరుకున్నారు. యాదిడ్డి అంతిమయావూతలో పాల్గొన్నారు.
ఉద్యమ పాటలతో హోరెత్తిన ఊరు
కళాకారులు గద్దర్, విమలక్క, రసమయి బాలకిషన్, సాయిచంద్, జలజ, రాజు తదితరులు సహా పెద్దమంగళారానికి చేరుకున్న కళాకారులు.. ఆలపించిన అమరవీరుల గీతాలతో గ్రామం హోరెత్తింది. యాదిడ్డి.. నువ్వు అమరుడవన్నా.. అంటూ గద్దర్‌గళం విప్పడంతో అందరూ కన్నీరు కార్చారు. వీరులారా వందనం.. అమరులారా వందనం.. అంటూ విమలక్క, తెలంగాణ బిడ్డలు, అమరులు, బాధలు తదితరాలపై రసమయి బాలకిషన్, సాయిచంద్‌లు పాటలు పాడారు. వీరందరికీ వేలాది ప్రజలు, వివిధ పార్టీల నేతలు సైతం కోరస్‌లిచ్చారు. ఇదే సమయంలో విద్యార్థులు, తెలంగాణవాదులు సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ అధినేత సోనియా, కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి, సీమాంధ్ర నేతలు లగడపాటి, రాయపాటి, కావూరి, టీజీ వెంక పయ్యావుల కేశవ్, మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ తదితరులకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా మహిళలు శాపనార్థాలు పెట్టారు.
పోలీసు వలయంలో పెద్దమంగళారం
యాదిడ్డి అంతిమయాత్ర సందర్భంగా పెద్ద మంగళారం పోలీసుల వలయంగా మారింది. గ్రామానికి ఆరు వాహనాల్లో 120 మందితో కూడిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చింది. కేరళ, మహారాష్ట్రలకు చెందిన వజ్ర కంపెనీ బెటాలియన్ చేరుకుంది. వాటర్ క్యానన్‌లు, టీయర్ గ్యాస్ వ్యాన్‌లు రావటంతోనే పెద్ద మంగళారం గ్రామాల్లోని ప్రాంతాలను వారు పర్యటించారు. 50 మంది మహిళా సీఆర్‌పీఎఫ్ జవాన్లు చేరుకున్నారు. రాజకీయ పార్టీలు, విద్యార్థులు చేయబోయే కార్య్రకమాలపై నిఘావర్గాలకు చెందిన 15 మంది ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఫోటోలు తీస్తూ గ్రామస్తులను భయవూభాంతులను చేశారు. నిఘా విభాగాలకు చెందిన పలువురు తాము జేఏసీ నేతలమంటూ యాదిడ్డికి పూల దండలు తెచ్చి, జనంతో కలిసి తిరగడం, విలేకరులు, రాజకీయ నేతలు, జేఏసీ ప్రతినిధుల ఫోన్ నెంబర్లు సేకరించటం టీ న్యూస్ కంట పడింది.
సీమాంధ్ర మీడియాకు దాడుల భయం
యాదిడ్డి అంతిమ యాత్రను కవర్ చేసేందుకు వచ్చిన సీమాంధ్ర మీడియాపై జనం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర రంగుడబ్బాలు తప్పుదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో స్టూడియో ఎన్, సాక్షి, ఎన్‌టీవీ, టీవీ5, ఏబీఎన్, మహాటీవీ తదితర చానళ్ల ప్రతినిధులపై విద్యార్థులు, తెలంగాణవాదులు ఆవేశం ప్రదర్శించారు. దీంతో వీటి లైవ్ వాహనాలను మొయినాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించి పోలీసులు రక్షణ కల్పించారు. తరువాత జనాన్ని నాయకులు సముదాయించడంతో లైవ్ కవరేజ్ వాహనాలు వచ్చి తమ పని చేసుకున్నాయి.
చంద్రమ్మను ఓదార్చిన అల్లం నారాయణ
యాదిడ్డి తల్లి చంద్రమ్మ, చెల్లెలు మంగమ్మలను నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ, జీ తెలుగు చానల్ సీఈవో శైలేష్‌డ్డిలు ఓదార్చారు. చంద్రమ్మ కన్నీళ్ళు చూసి చలించిపోయారు. యాదిడ్డి చెల్లి మంగమ్మకు తాము అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. యాదిడ్డి ఆశయ సాధనకు తామంతా పోరాటం చేస్తామన్నారు.
యాదన్న సాక్షిగా ప్రతిన
తెలంగాణ కోసం అసువులు బాసి, తనదే చివరి చావు కావాలని కోరుకున్న యాదిడ్డి బలిదానం సాక్షిగా తాము ఉద్యమం సాగిస్తామని టీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, రాజేందర్, కేటీఆర్‌లు ప్రతిజ్ఞ చేశారు. యాదిడ్డి ఖనన స్థలంలో వారు కార్యకర్తలు, విద్యార్థులు, వేలాది మందితో ప్రతిజ్ఞ చేయించారు. అంతిమయావూతలో పాల్గొన్న ఉస్మానియా జేఏసీ నేతలు పిడమర్తి, రాజారంయాదవ్, కిషోర్‌కుమార్, కైలాష్ తదితరులు యాదిడ్డి ఆశయాలు సాధిస్తామని ప్రతినబూనారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తామని, సీమాంవూధుల భరతం పడుతామని హెచ్చరించారు.
పటిష్ట భద్రత
అంతిమయాత్ర సందర్భంగా ఎలాంటి సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏసీపీలు, పదిమంది సీఐలు, 25మంది ఎస్‌ఐలతో పాటు వందలాది మంది సిబ్బంది, ర్యాపిడ్‌యాక్షన్, సీఆర్‌పీఎఫ్ దళాలు ఇందులో పాల్గొన్నాయి. అంతిమయాత్ర సజావుగా సకాలంలో జరగటం, ఎలాంటి అపక్షిశుతి చోటుచేసుకోకపోవటంతో వారు ఊపిరిపీల్చుకుని వెనుదిరిగారు.