ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ప్రకటిస్తే హైదరాబాద్ సహా ఏ విషయంపైనైనా చర్చించటానికి సిద్ధమని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించటానికి అవసరమైన మద్దతును అందచేస్తామని ఆయన విలేఖరులకు చెప్పారు. తెలంగాణను ఇవ్వటంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన తరువాతే ప్రభుత్వానికి సమస్య తీవ్రత అర్థమైందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం మొదలుపెట్టిన చర్చలు లక్ష్య సాధన దిశలో జరగటం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక ఎట్టి జాప్యం చేయకుండా ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆగస్టు ఒకటి లోపు తెలంగాణ గురించి స్పష్టమైన హామీ లభించకపోతే సకల జన సమ్మె తప్పదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకోసం తాము ప్రారంభించనున్న సకల జన సమ్మె గురించి జాతీయ పార్టీల నాయకులకు వివరించటానికే తమ ప్రతినిధివర్గం ఢిల్లీకి వచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణకు జాతీయ పార్టీల నాయకుల నుంచి పూర్తి మద్దతు లభించిందని ఆయన చెప్పారు.
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత: డిజిపి
హైదరాబాద్, జూలై 28: పోలీసు శాఖలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామని డిజిపి వి.దినేష్‌రెడ్డి చెప్పారు. అంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తరపున సభ్యులు డిజిపిని కలిశారు. ఈ సందర్భంగా సభ్యులు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను డిజిపి దృష్టికి తీసుకెళ్ళారు. సిబ్బందికి వెయిటేజ్ ఇంక్రీమెంట్, మహిళా పోలీసులకు సౌకర్యాలు వంటి అంశాలను వారు వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని డిజిపి హామీ ఇచ్చారు. డిజిపిని కలిసిన వారిలో అధ్యక్షుడు కెవి చలపతిరావు, ఉపాధ్యక్షుడు రవీంద్రకుమార్, గౌరవ అధ్యక్షుడు సి.రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.
Friday, 29 July 2011
october lo telangana:p shankar rao
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అక్టోబర్ మూడో వారంలో సానుకూల ప్రకటన రానున్నదని మంత్రి పి.శంకర్‌రావు పేర్కొన్నారు. నూటికి నూరుపాళ్లు తెలంగాణ వచ్చితీరుతుందని చెప్పారు. తాను చెప్పిన సమయానికంటే ముందే వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదన్నారు. గురువారం సిఎల్‌పిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావ ేశంలో ఎమ్మెల్యే ప్రసాద్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు.
తెలంగాణ రావడం ఖాయం కనుక విద్యార్ధులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. అందరం కలసి తెలంగాణ కోసం పాటుపడాల్సి ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలిచ్చిన యాదిరెడ్డి కుటుంబానికి రూ.1లక్ష ఆర్ధిక సహాయం చేసినట్లు ఆయన వెల్లడించారు. యాదిరెడ్డి కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణాలిచ్చిన శ్రీకాంత్‌చారి కుటుంబానికి కూడా ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వ సహాయంతో ఇళ్లు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ కోసం మళ్లీ రాజీనామాలు చేయాలని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా రాజీనామాలు గొప్పవా, త్యాగాలు(ప్రాణత్యాగం) గొప్పదా అన్నది ప్రజాభిప్రాయం కోరాల్సి ఉందని పొంతన లేని సమాధానం ఇచ్చారు.

telangana kosam athmabali thanaloddu
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుకు అనుకూల ప్రకటన అక్టోబర్ 3వ వారం లో వెలువడుతుందని మంత్రి శంకర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ర్టం కోసం ఢిల్లీ పార్లమెంటు ముందు ఆత్మ బలిదానం చేసుకున్న యాదిరెడ్డి కుటుంబాన్ని గురువారం మంత్రి శంకర్‌రావు, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్, ఆర్టీసీ మాజీ చైర్మన్ కొత్త సంజీవరెడ్డి పరామర్శించారు. యాదిరెడ్డి తల్లి చంద్రమ్మకు, తమ్ముడు ఓంరెడ్డిలకు మనోధైర్యం చ ెప్పారు. ఈసందర్భంగా మంత్రి శంకర్‌రావు, ఏఐసీసీ కార్యదర్శి పీ. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కోసం వేగవంతంగా చర్యలు జరుగుతున్నాయి.
అక్టోబర్ 3 వ వారంలో తెలంగా ణకు అనుకూల ప్రకటన రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. యాదిరెడ్డి ఆశయం త్వర లో నెరవేరనుందన్నారు. సోనియాగాంధీ తెలంగాణ కు అనుకూలంగా ఉందని చెప్పారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, తెచ్చేది తెలంగాణ అమరవీరులన్నారు. తెలంగాణ సెంటిమెంట్ గత 56 సంవత్సరాలుగా ఉందని తెలిపారు. రానురాను తెలంగాణ సెంటిమెంట్ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. 1956 లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతా లు కలిసి ఆంధ్ర రాష్ర్టం ఏర్పడింది. తెలంగాణ అమా యక అమ్మాయి, సీమాంధ్ర పోకిరీ అబ్బాయితో బం ధం ఏర్పడుతుందని ఆనాడు పండిట్ జవ హర్‌లాల్ నెహ్రూ అన్నారు.
ఏకారణాల వల్లనైనా విడిపోవచ్చని నెహ్రూ నిజామాబాద్‌లో చెప్పారు. ఇరు ప్రాంతాలు ఒకటైనప్పుడు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆఒప్పందాలను తుంగలో తొక్కారని అన్నారు. తెల ంగాణ ఉద్యమానికి ఉన్న చరిత్ర ప్రపంచంలో ఏ ఉద్యమానికి లేదని వివరించారు. ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలతో ఆత్మబలిదానం చేసుకో వద్దని పిలుపునిచ్చారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందామన్నారు. వారి వెంట గ్రామ సర్పంచ్ చేగూరి రామకృష్ణగౌడ్, మాజీ ఎంపీటీసీ ఖండిక రమేశ్, నాయకులు శ్రీరాంసాగర్, కృష్ణారెడ్డి, ఓంరెడ్డి లు ఉన్నారు. యాదిరెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన మందడి యాదిరెడ్డి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఏదైనా ఓ శాఖలో ఉద్యోగం పెట్టిస్తామని మంత్రి శం కర్‌రావు, ఎమ్మెల్సీ పీ. సుధాకర్‌రెడ్డిలు చెప్పారు. అదే విధంగా వారి కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్థిక సహా యం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వా రా వారికి ఇల్లు మంజూరు చేయడానికి కృషి చేస్తామ ని తెలిపారు. తెలంగాణ యువతీ-యువకులకు, తెలంగాణ ఉద్యమకారులకు అందిరికి ఆత్మబ లిదానాలు చేసుకోవద్దని ధైర్యంగా ముందుకు నడిచి తెలంగాణ సాధించుకోవాలని ఆయతతతన కోరారు.

poradi telangana sadhichukunda:nagam janardhan reddy
నిజామాబాద్ సాక్షిగా చెబుతున్నా..వాళ్లిచ్చేదేంది మనమంతా ఏకమై తెలంగాణ ను గుంజుకుందాం అని రాజీనామా చేసిన తాజా ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని నాయకులంతా ఏకం కావాలని ఐక్య పోరాటానికి తాము సిద్ధమన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట మందాడి యాదిరెడ్డి ప్రాంగణం లో జరిగిన తెలంగాణ ఐక్యతా దీక్షలో కూర్చున్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ లోని నాయకులంతా ఒకటి కావాలన్నదే ఐక్యతా దీక్ష ఉద్దేశమన్నారు. నాయ కులంతా ఒకటి కావాలని కానీ వారంతా తెలంగాణ ద్రోహులని అన్నారు.
తెలంగా ణ తెలుగు దేశం ఫోరం ఎమ్మెల్యేలు మొదట మేమే రాజీనామాలు చేశామని బస్సు యాత్ర జేసి చెపుకున్నా రాజీనామాల తిరస్కరించిన తర్వాత ఎందుకు రాజీనా మాలు చేయడం లేదని వాళ్లు ఇప్పుడెక్కడికి పోయిండ్రని నాగం ప్రశ్నించారు. వారికి కాగితం కలం దొరకడం లేదా? అని ఎద్దేవా చేశారు. నాటకాలు పక్కన బెట్టాలని వారికి హితవు పలికారు.
రాజీనామాల ఉచ్చులోంచి తిరస్కరించడంతో బయటపడ్డామని చంకలెగురుసుకుంటున్న దేశం,కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు మళ్ళీ రాజీనామాలు చేసేందుకు వెనుకాడుతున్నారని ఆరోపించారు.వారిని మళ్ళీ రాజీనామాలు చేయనివ్వకుండా సీమాంధ్ర పెట్టుబడిదారులు బేరసారాలు చేస్తున్నా రని ఆరోపించారు. ఇందుకు లొంగిపోయేందుకు కొందరు సిద్ధమై రాజీనామాలకు వెనుకడుగు వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు.
ఖబడ్దార్ ..ఎట్టి పరిస్థితుల్లో 141 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మళ్లీ రాజీనామాలు చేయాల్సిందేనని ఆయన హెచ్చరించారు. రాజీనామాలు చేయని వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని,ఆంధ్రోళ్లుగా గుర్తించాల్సి వస్తుందన్నారు. భావోద్వేగం లో చేసిన రాజీనామాలంటూ స్పీకర్ ఆమోదించకుండా తిరస్కరించడా న్ని ఆయన తప్పు పట్టారు.ఏం స్పీకర్ తమాషా చేస్తున్నావా..నిన్ను నిర్బంధం చేసైనా మా రాజీనామాలను ఆమోదించుకుంటామని అన్నారు. కాశ్మీర్‌లో ఒక మాట చైనాలో మరో మాట చెబుతూ తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకు లకు మోసం చేస్తున్న అ‘జాదు’లు తెలంగాణలో నడవవని అన్నారు.
ఆజాద్‌ను గద్దర్, దోకేబాజ్‌గా తిట్టాలని ఉందంటూనే తిట్టారు. మళ్లీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చర్చల పేరిట ఢిల్లీకి వెళితే వారిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. మనకు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం నుంచి బయటపడ్డ మా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలను నియమించే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు అసలు చార్జీ ఉందో లేదో తెలియని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అంతర్భాగమే హైదరాబాద్ అని ఆయన స్పష్టం చేశారు.
మా చార్మినార్,ఉస్మానియా ఆసుపత్రి,ఉస్మానియా క్యాంపస్, అసెంబ్లీ, సెక్రటేరియేట్ మీరొచ్చాక కట్టిండ్రా?తమిళనాడుల మిమ్మల్ని తంతే గతి లేక మా తెలంగాణలో అచ్చి పడ్డరని సీమాంధ్ర ప్రాంత ప్రజలనుద్దేశించి అన్నారు. మా ప్రాంత వనరులను దోచిన మీరు హైదరాబాద్‌ను వదలమంటారా?ఖబడ్దార్ అని హెచ్చరించారు.
తెలంగాణ విడిచి పెట్టిపోతరా? ఇలాగే హైదరాబాద్‌ను పేచిగా పెట్టి మా చీమల దండును రెచ్చగొడ్తరా? తేల్చుకోవాల్సింది ఆంధ్రోళ్లేనన్నారు.ద మ్ముంటే నిజామాబాద్‌లో సీమాంధ్ర మీటింగు పెట్టుండ్రి..చూద్దాం అంటూ వారికి సవాల్ విసిరారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సర్‌ప్లేస్ 10 కోట్ల నిధులను ఆంధ్ర పాల కులు మళ్లించుకున్నారని ఈ విషయాన్ని అప్పట్లో గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య బయటపెట్టి పెద్ద ఎత్తున ఉద్యమించారన్నారు.
1956 నవంబర్ నుంచి ఇలా మన ప్రాంత వనరుల దోపిడీ ప్రారంభమైందన్నారు. ఇదే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు 14 ఎఫ్ తొలగిస్తున్నామని అసెంబ్లీలో చేసిన తీర్మానం పాస్ చేసి ఇప్పుడేమో 14 ఎఫ్‌తో సంబంధం లేకుండా ఎస్‌ఐ రాత పరీక్షలు జరుపుతామని ప్రకటించడంపై ధ్వజమెత్తారు.విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని కోరారు.యాదిరెడ్డి పార్లమెంటు సాక్షిగా ఆత్మబలిదానమిచ్చి ఇదే ఆఖరి చావు కావాలని యావత్తు తెలంగాణ విద్యార్థి లోకానికి చాటి చెప్పాడన్నారు.ఇక చావులొద్దు తెలంగాణ సాధించి యాదిరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని నాగరం విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.

telangana pi ventane thelchali:cpm
ప్రజల ఆకాంక్షను గౌరవించి, కేంద్రం వెంటనే తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గురువారం ముదిగొండ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములను పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని, కాని పేద ప్రజలు జానెడు జాగా అడిగితే కాల్చి చంపారని విమర్శించారు.
యూపీఏ ప్రభుత్వం కుంభకోణాల్లో ఇరుక్కొ ని , కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సీపీఎం పేదప్రజల పక్షాన ఉండి , ప్రజాపోరాటాల చేస్తూ అమరవీరుల ఆశయ సాధనకు కృషిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
భట్టీ మట్టి కొట్టుకుపోతావ్: పొన్నం వెంకటేశ్వర్లు
మధిర నియోజక వర్గంలో సీపీఎంను అణచటానికి డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క కుయుక్తులు పన్నుతూ గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నాడని, అధికారంతో అధికారులను బెదిరిస్తూ తన చెప్పుచేతల్లో ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు అమరవీరుల సంస్మరణ సభలో తీవ్రంగా విమర్శించారు. ముదిగొండ తహసీల్దార్‌తో పాటు కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు.
సీపీఎంపై కక్షసాధింపు ధోరణి అవలంభిస్తున్నాడని విమర్శించారు. ఈ ధోరణి విడనాడకుంటే ప్రజా కంటకులు అందరిలా మట్టి కొట్టుకుపోతాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ సభకు సీపీఎం మండల కార్యదర్శి కూరపాటి శ్రీనవాసరావు అధ్యక్షత వహించగా , సీపీయం నాయకులు బంకా మల్లయ్య . బండి రమేష్ , లింగాల కమల్రాజు , మచ్చా లక్ష్మి , బండారు రవికుమార్ , పీసీ వీరస్వామి, బండి పద్మ , వాసిరెడ్డి ప్రసాద్ , పాల్వాయి పాండు రంగారావు , భట్టు పురుషోత్తం పాల్గొన్నారు.
ఘనంగా నివాళి...
స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి అమరవీరుల స్మారక స్థూపం వరకు కార్యకర్తలు , నాయకులు , మృతవీరుల కుటుంబ సభ్యులు ప్రదర్శన నిర్వహించి స్మారక స్థూపం వద్ద అమరులకు ఘనంగా నివాళులర్పించారు. డప్పు బృందాలతో , ప్రజానాట్యమండలి కళాకారులు పాటలు నృత్యాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. సభా వేదికపైన ప్రజానాట్యమండలి కళాకారులు అమరవీరుల త్యాగాల పాటలు విన్పించారు. మృత వీరుల కుటుంబాల సభ్యులను సీపీఎం నాయకులు బంకా మల్లయ్య వేదిక మీదకు పిలిచి సభికులకు పరిచయం చేశారు.
‘నమస్తే తెలంగాణ’కు అభినందనల వెల్లువ...
ఆనాటి ముదిగొండ కాల్పుల ఘటనను కళ్ళకు కట్టినట్లు చూపించిన నమస్తే తెలంగాణ దినపత్రికను ముదిగొండ అమరవీరుల కుటుంబాల వారు అభినందనలతో ముంచెత్తారు. ఏ పత్రికలో రాయని విధంగా ఆమరవీరుల కుటుంబాల బాధలు వర్ణించారని పేర్కొన్నారు . పేద ప్రజానీకానికి తెలంగాణ ముద్దుబిడ్దలకు అండగా నిలిచిన నమస్తే తెలంగాణ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.

GOVERNMENT EMPLOYEES LO 90% SEEMANDRU LE
ప్రభుత్వ అధికారుల్లో 90శాతానికి పైగా వారే ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. పై స్థాయి సీమాంధ్ర అధికారులు కిందిస్థాయి తెలంగాణ ఉద్యోగులపై వివక్ష చూపుతూ నానా విధాలుగా వారిని హింసిస్తున్నారు. విటన్నీంటిని తిప్పి కొట్టాలం తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారానే సాధ్యమని గ్రహించి ఉద్యమిస్తున్నామంటు న్నారు టీఎన్జీఓ జేఏసీ జిల్లా ఛైర్మన్ రాజేందర్డ్డి. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓల పాత్ర గురించి..
2009లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం చరిత్ర తిరగరాసింది. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం డిసెబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రక్రియ మొదలైనట్లు ప్రకటన చేసి మళ్లీ 23న మాట మార్చింది. ఆ సమయంలోనే జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓలు సమావేశమై టీఎన్జీఓ అధ్యక్షుడిడు రాజేందర్డ్డిని ఉద్యోగ జేఏసీ ఛైర్మన్గా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటునారు. రాష్ట్ర పొలిటికల్, ఉద్యోగ జేఏసీల ఆదేశానుసారం ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకొని ఉద్యమంలో కొత్త పంథాలో పాలుపంచుకుంటున్నారు.
అందులో భాగంగానే ఒకటి జనవరి 2010న పాల్కొండనుంచి తెలంగాణ చౌరస్తా వరకు మోటార్సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జనవరి నాలుగు 2010న ఉద్యోగుల పెన్డౌన్, అదే నెల 28న జెడ్పీ స్టేడియంలో పాలమూరు ప్రజల ధర్మాక్షిగహం లక్ష్య మందితో సత్యాక్షిగహాలు అనే వినూత్న కార్యక్షికమాన్ని నిర్వహించారు. అలాగే 6 ఏప్రిల్ 2010న జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాం కావొచ్చు, 14 జూలై 2010న జిల్లాలో మౌన ప్రదర్శన, 14 ఆగస్టు 2010న ఉద్యమంలో అసువులు బాసిన 12మంది అమరవీరుల కుటుంబాలకు 30,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే కావొచ్చు అనేక రూపాల్లో కార్యక్షికమాలు చేపట్టారు.
ఆయా కార్యక్షికమాలకు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కె.స్వామిగౌడ్, కార్యదర్శి దేవి ప్రసాద్లు, హరీష్రావు, లక్ష్మణ్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ, జేఏసీ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు. 26 నవంబర్ 2010న టీఎన్జీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలమూరు ప్రజా యాత్రను పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ప్రారంభించారు.
అదే నెల 28న నాగర్కర్నూల్లో అమరవీరుల స్థూపం నిర్మాణానికి టీఎన్జీఓ అధ్యక్షుడు రాజేందర్డ్డి భూమి పూజ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీ కృష్ణ కమిటీకి తెలంగాణ ఉద్యోగాల్లో సీమాంవూధులు ఎంత మంది ఉన్నది తెలియజేశారు. తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులను దూరం చేయాలనే కుట్రతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను ఉపసంహరించుకునే వరకు నిరసనలు, రాస్తారోకోలు చేశారు. ఆగస్టులో నిర్వహించే సకల జనుల సమ్మెలో పాల్గొంటామంటున్నారు. ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తే సహించేది లేదని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

raginamalu upasamharincuko:madhu yashki
రాజీనామాలు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఎంపీ మధుయాష్కి ఆజాద్‌కు స్పష్టం చేశారు. తెలంగాణ ఎంపీలతో నేడు ఆజాద్ చర్చించారు. పార్లమెంటు సమావేశాలకు సహకరించాలని తెలంగాణ ఎంపీలను కోరారు. ఆగస్టు 6న సీమాంధ్ర నేతలతో చర్చలు జరుపుతామని ఆజాద్ వెల్లడించారు. తెలంగాణ అంశంపై ఎటువంటి హామీ లేకుండానే చర్చలు ముగిసాయి.
chanrababu telangana drohi:nagam janardan
రెండు కండ్ల సిద్ధాంతకర్త చంద్రబాబు పథకం ప్రకారమే యనమలతో సమైఖ్యనినాదాన్ని అనిపించాడని నాగం జనార్దన్‌రెడ్డి విమర్సించారు. రెండు ప్రాంతాలకు స్వేచ్ఛ యిచ్చానాని చెప్పడం తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడమేనన్నారు. డబ్బుల కోసం నీచమైన రాజకీయం చేస్తూన్నాడన్నారు. యనమల ప్రకటనకు మద్ధతుగా చంద్రబాబు నిస్సిగ్గుగా తెలంగాణపై నేను చెప్పిందే విధానమని చెప్పడం టీటీడీపీ ఫోరం నేతలు గ్రహించాలన్నారు. బస్సు యాత్రలపేరుతో తెలంగాణ టీడీపీ నేతలు చెప్పిన మాటలు గాలీ మాటలేనా? అని ప్రశ్నించారు.ఎంతసేపు రెండు ప్రాంతాలలో పార్టీనీ కాపాడుకోవలనేకుంటుండు కాని తెలంగాణ తేవాలనే ఏలాంటి ఆలోచన లేదని చంద్రబాబు స్పష్టంగా చేపుతున్నాడన్నారు. ఇకనైనా బాబు అడుగులకు మడుగులు వత్తకుండా టీటీడీపీ కన్వీనర్ యర్రబెల్లి దయాకర్‌రావు కండ్లు తెరవాలన్నారు.
seemandhra leaders are terrorists:trs leader harish rao
యనమల వ్యాఖ్యలపై హరీష్‌రావు మండిపాటు
టీడీపీ ఫోరం నేతలు ఇప్పుడేమంటారని ప్రశ్న
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణకోసం యువకులు పిట్టల్లాగా రాలిపోతున్నా సీమాంధ్ర నేతలు కనీస మానవత్వం లేకుండా కసాయిల్లాగా, తీవ్రవాదుల్లాగా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు మండిపడ్డారు. గురువారమిక్కడ తెలంగాణభవన్‌లో పార్టీ నేతలు ఎస్.నిరంజన్‌రెడ్డి, బి.సుమన్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘‘తెలంగాణకు అనుకూలమంటూ టీడీపీ 2008లో ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన తీర్మానానికి కాలం చెల్లిందని, 2011లో సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామంటూ ఆ పార్టీ సీనియర్ నేత యనుమల రామకృష్ణుడు మాట్లాడారు. చంద్రబాబుతో సమావేశమైన వెంటనే, పొలిట్‌బ్యూరో హాలులో మాట్లాడిన మాటలు టీడీపీ విధానాన్ని చెబుతున్నాయి. యనమల వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించకుంటే సమైక్యవాదమే టీడీపీ విధానమని ప్రజలు తేల్చుకుంటారు. తెలంగాణలో పీఆర్పీకి పట్టిన గతే టీడీపీకి పడుతుంది. టీడీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారు’ అని హెచ్చరించారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని, ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖను వాపస్ తీసుకోలేదని చెప్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ తెలంగాణ నేతలు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నిం చారు. చంద్రబాబుతో తేల్చుకుంటారో, టీడీపీ నుండి బయటకొస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ తెలంగాణ నేతలు ఇంకా కళ్లు తెరువకుంటే ప్రజలు మూడోకన్ను తెరుస్తారన్నారు. టీడీపీ సమైక్యవాదానికి వెళ్లిందా.. తెలంగాణకు కట్టుబడి ఉందా అనేది చంద్రబాబుతో చెప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉంటే యనమల రామకృష్ణుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రవారు నాయకులు కాదని, ఖల్ నాయకులని విమర్శిం చారు. హైదరాబాద్‌లో రాజధాని పెట్టడం ద్వారా తెలంగాణ ప్రజలే త్యాగం చేశారన్నారు. విడిపోవడానికి ఏకాభిప్రాయం కావాలంటున్న వారికి కలిసి ఉండటానికి ఏకాభిప్రాయం అవసరంలేదా అని హరీష్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని సీమాంధ్ర నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.

telangana ku anukulam ga echina lekha ku kalam chellindi:yanamala
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం గతంలో నియమిం చిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి కాలం చెల్లిందనీ... అలాగే ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలమంటూ తాము ఆ కమిటీకిచ్చిన లేఖకూ కాలం చెల్లిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ప్రణబ్ కమిటీ తర్వాత.. రోశయ్య కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, డిసెంబరు 9న చిదంబరం ప్రకటన, ఆ ప్రకటనకు సవరణ, తాజాగా మరో కేంద్రమంత్రి ఆజాద్ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపుల వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ తాజాగా జారీ చేసిన జీవోనే అందరూ పరిగణనలోకి తీసుకుంటారని, తెలంగాణ విషయంలో తమ లేఖ పరిస్థితి కూడా అంతేనని వ్యాఖ్యానించారు. ఆ లేఖకు విలువ ఉందో లేదో వెల్లడించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ విషయంలో కేంద్రం త్వరగా తేల్చాలని తాజాగా జరిగిన మహానాడులో తాము తీర్మానం చేశామని, అందులో అన్ని ప్రాంతాల వారు భాగస్వాములు అయినందున అదే అంతిమమని పేర్కొన్నారు. ఆ తీర్మానానికే తాము కట్టుబడి ఉంటామన్నారు. గురువారం ఎన్‌టీఆర్ భవన్‌లో యనమలతో పాటు మోత్కుపల్లి నర్సింహులు, కాలువ శ్రీనివాసులు, పి.చంద్రశేఖర్, ఎం.అరవిందకుమార్‌గౌడ్ , వేం నరేందర్‌రెడ్డి, పెద్దిరె డ్డి తదితరులు పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. అరవిందకుమార్‌గౌడ్, వేం నరేందర్‌రెడ్డి అక్కడ్నుంచి వెళ్లాక.. మిగిలిన నేతలు పొలిట్‌బ్యూరో సభ్యుల గదుల్లో ఉన్న సమయంలో యనమల మీడియాతో మాట్లాడారు. మే నెలలో జరిగిన మహానాడులో.. తెలంగాణపై తాము చెప్పాల్సింది అంతా చెప్పామని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని తీర్మానించినట్లు గుర్తుచేశారు. ‘‘చిదంబరం, ఆజాద్ అడిగితేనో, వారు సమావేశాలు ఏర్పాటు చేస్తేనో వెళ్లాల్సిన అవసరం లేదు. మరోమారు అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామా లేదా అన్నది తర్వాత చెప్తాం. ఏ ప్రాంత నేతలు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఉద్యమాలు చేయటంతో పాటు ప్రజలు చేపట్టిన ఆందోళనల్లో భాగస్వాములు అవుతున్నారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన సీమాంధ్ర ప్రాంత నేతల సమావేశంలో కూడా సమైక్యాంధ్రకు కట్టుబడాలని తీర్మానించాం’’ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన తమకు అంగీకారం కాదని, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో భాగమని చెప్పారు. రెండు, మూడు రాజధానులు అంటూ ఆజాద్ ఆంధ్రప్రదేశ్‌ను మరో జమ్మూకాశ్మీర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ర్టం రావణకాష్టం కావటానికి, ప్రాంతాల మధ్య విభేదాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు. శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్ధత లేదని, ఆ కమిటీ చేసిన ఖర్చును కాగ్ ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. తమ పార్టీలోని సీమాంధ్ర, తెలంగాణ నేతలు కూర్చొని ఉమ్మడి అభిప్రాయానికి రావాలని చెప్తున్న చిదంబరం.. కాంగ్రెస్‌లో ఆ ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తమ పార్టీలోని అంతర్గత వివాదాలను పరిష్కరించుకునేందుకు కాంగ్రెస్.. తెలంగాణ సమస్యను అడ్డం పెట్టుకుంటోందని మండిపడ్డారు.
Subscribe to:
Posts (Atom)
Pages
In this blog it consists of all categories of
Telangana information such as Telangana
images,Telangana information,Telangana
maps,Telangana videos,Telangana movies,Telangana
news,Telangana history,Telangana
Samskruthi,Festivals of Telangana,Bathukamma :
Telangana Festival,bonalu........etc
Disclamier
The entire content available in this blog is my personal views only.
There is no connection with any one for the content I published in this blog.
I Just want to share my views about telangana. Because I am belongs to Telangana.
Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana...........
We do any thing for Telangana.
If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts