Friday, 9 September 2011
nimajjananiki patista arpatlu(నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు)
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు
చేసినట్లు డిజీపీ దినేశ్ ప్రకటించారు. చార్మినార్, హుస్సేన్‌సాగర్,
మొజాంజాహి మార్కెట్ తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను
మోహరించినట్లు నగర కమిషనర్ ఏకేఖాన్ తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా
జరుగటానికి ప్రజలు సహకరించాలని కోరారు.
nagam nagara mogindi(నాగం నగారా మోగింది!)
- ‘తెలంగాణ నగారా సమితి’ ఆవిర్భావం
- అచ్చంపేటలో రోడ్ షోకు అనూహ్య స్పందన
- పోలవరం నిర్మాణాన్ని అడ్డుకుంటాం
- బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇక సాగనివ్వం: నాగం
- కేసీఆర్‌ను గెలిపించుకొని ఉద్యమ సత్తా చాటిన పాలమూరు
- నాగం వెంటే నడుస్తాం: హరీశ్వర్, జోగు రామన్న, బోడ జనార్దన్
- పోలవరం నిర్మాణాన్ని అడ్డుకుంటాం
- ‘తెలంగాణ నగారా సమితి’ ఆవిర్భావ సదస్సులో నాగం
- అచ్చంపేటలో రోడ్ షోకు అనూహ్య స్పందన
- నాగం వెంటే నడుస్తాం
- ఎమ్మెల్యేలు హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, బోడ జనార్దన్ మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 9(టీన్యూస్): తెలంగాణ ప్రాంత గిరిజనులను ముంపునకు గురి చేస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ నాగం జనార్దన్‌డ్డి అన్నారు. తెలంగాణ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులు, కడుతున్న ప్రాజెక్టులలో ఇక్కడి ప్రాంతం వారి భూములు మునిగితే నీళ్లు మాత్రం ఆంధ్ర ప్రాంతానికి వెళుతున్నాయని, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులే ఇందుకు ఉదాహరణ అని ఆయన మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వరం దేవస్థానం సమీపంలో తెలంగాణ నగారా సమితి ఉద్యమ వేదికను నాగం ప్రకటించారు. అనంతరం అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నాగం ఆధ్వర్యంలో ‘తెలంగాణ నగారా సమితి’ ఆవిర్భావ సభ నిర్వహించారు.
ఈ సభకు అచ్చంపేట జేఏసీ కన్వీనర్ వెంక అధ్యక్షత వహించగా.. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన నాగం వర్గం ఎమ్మెల్యేలు కే హరీశ్వర్‌డ్డి, జోగు రామన్న, బోడ జనార్దన్ పాల్గొని ప్రసంగించారు. నాగం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనే గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా మారుతాయని, వారికి 12 శాతం రిజర్వేషన్ వస్తుందని అన్నారు. రెండుకళ్ల సిద్ధాంతం పేరిట చంద్రబాబు ఆడుతున్న నాటకాన్ని కట్టిపెట్టాలని హెచ్చరించారు. ఈ రెండు కళ్ల సిద్ధాంతాన్ని భరించలేకనే తాము టీడీపీ నుంచి బయటకు వచ్చామని పునరుద్ఘాటించారు. అచ్చంపేట ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాము బలమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే రాములు మాత్రం పదవి పట్టుకొని వేలాడుతున్నారని విమర్శించారు. రాములు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనాలని సభలో పాల్గొన్న ప్రజలతో అనిపించారు.
ఈ నెల 13వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తలపెట్టిన సకల జనుల సమ్మెలో తాము కూడా భాగస్వాములమవుతామని నాగం స్పష్టం చేశారు. అంతకుముందు ఉమామహేశ్వరం నుంచి అచ్చంపేట వరకు రోడ్‌షో నిర్వహించారు. దీనికి వేలాదిగా ప్రజలు హాజరయ్యారు.
అందరూ ఒకే వేదికపైకి రావాలి: నాగం వర్గ ఎమ్మెల్యేలు
తెలంగాణ కోసం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన రాజీనామాలను ఆమోదింపజేసుకొని ఒకే వేదికపైకి వచ్చి పని చేయాలని తెలంగాణ నగారా సమితి నాయకులు హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, బోడ జనార్దన్ డిమాండ్ చేశారు. తెలంగాణలో పంటలు ఎండిపోతుంటే చలించని చంద్రబాబు ఆంధ్రా రైతులపై మాత్రం ప్రేమ చూపుతూ ద్వంద్వ వైఖరి ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజీనామాలు చేయని, తెలంగాణ ఉద్యమంలో కలిసి రాని ఎంపీలు, ఎమ్మెల్యేలను గ్రామాల్లోకి రానీయకుండా తరిమి తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సీమాంవూధలో క్రాప్ హాలిడే ప్రకటిస్తే జాతీయ నాయకులను తీసుకొచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్న బాబుకు తెలంగాణ రైతులు కనిపించడం లేదా? అని వారు ప్రశ్నించారు. కిరణ్ సర్కార్‌కు చంద్రబాబు లోపాయకారి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఇకపై తెలంగాణలో బాబు ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. మొదటి నుంచి తెలంగాణకు అడ్డుపడుతున్నది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. పాలమూరు జిల్లా వెనకబాటులో లేదని సీమాంధ్ర పాలకుల వల్ల వెనకబడిపోయిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జిల్లా ఎంతో ముందంజలో ఉందని కొనియాడారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేశర్‌రావును ఎంపీగా గెలిపించుకొని పాలమూరు ప్రజలు తెలంగాణ వాదాన్ని బలంగా చాటారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలమూరు ప్రజల ఉద్యమాలు తెలంగాణ జిల్లాలకు దిక్సూచిగా మారాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడే వరకు నాగం వెంటే నడుస్తామని స్పష్టం చేశారు.

samme pi sarkaru visham(సమ్మెపై సర్కారు విషం)
- ఉపాధ్యాయులపై ఉక్కుపాదం
- 60 శాతం ఫలితాలు సాధించకపోతే..డిస్‌మిస్ చేయండి.. లేదా తొలగించండి
- 90 శాతం ఫలితాలు సాధిస్తేనే ఉత్తమ ఉపాధ్యాయుడికి సిఫారసు
- 130 జీఓ జారీచేసిన పాఠశాల విద్యాశాఖ
- టీచర్లను భయపెట్టడానికేనని విమర్శలు
- స్వయం సహాయక సంఘాలకూ చెక్
- 15 నుంచి ‘సెర్ప్’ మాసోత్సవాలు
- 50 లక్షల మంది దృష్టి మరల్చే యత్నం
- ఉద్యమానికి దూరంగా ఉంచేందుకు ఎత్తుగడ
- ఐదు రకాల చర్యలకు ప్రభుత్వం ఆదేశం

- ఉపాధ్యాయులను భయపెట్టడానికేనని విమర్శలు
నాలుగున్నర కోట్ల ప్రజల ఏకైక డిమాండైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేందుకు అఖరిపోరాటంగా రూపుదిద్దుకున్న సకల జనుల సమ్మెపై సీమాంధ్ర సర్కారు విషం చిమ్ముతోంది. పోరాటాన్ని పలుచన చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొంటున్న విద్యార్థులను కట్టడి చేసేందుకు టీచర్ల కాళ్లకు బంధాలు వేస్తోంది. సంస్కరణల మసుగులో ఆత్మరక్షణలో పడేసి అడుగు ముందుకేయకుండా కుట్ర చేస్తోంది. 60 శాతం ఉత్తీర్ణత సాధించకపోతే డిస్‌మిస్, లేదా రిమూవ్ చేయాలని, 90 శాతంపైగా ఫలితాలు సాధిస్తేనే ఉత్తమ ఉపాధ్యాయుడి కోసం సిఫారసు చేయాలని సూచిస్తూ జీఓ తెచ్చింది. ఉద్యమంలో సగభాగమైన తెలంగాణ ఆడబిడ్డలను దూరం చేసేందుకు ఎత్తుగడ వేసింది.
దాదాపు 50 లక్షల మంది ఉన్న ఎస్‌హెచ్‌జీ మహిళలను ఊపిరిసలపనివ్వకుండా ప్రత్యేకంగా మాసోత్సవం నిర్వహించనుంది. గత ఏడాది వరంగల్‌లో కేయూ హాస్టళ్లు మూసివేస్తే స్వయం సహాయక సంఘాలు అండగా నిలిచి, సొంత ఖర్చుతో వండిపెట్టాయి. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న సర్కారు.. ఈ రెండు వర్గాలను కట్టడిచేయకపోతే ఉద్యమాన్ని అదుపు చేయలేమని భావిస్తోంది. ఈ రెండు కార్యక్షికమాలు మొత్తం రాష్ట్రానికి వర్తించేవైనా సకల జనుల సమ్మెను కట్టడి చేయడమే అసలు లక్ష్యంగా కనిపిస్తోందని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు.
కరీంనగర్, టీన్యూస్ ప్రతినిధి: రాష్ట్ర సర్కారు మూడు లక్షల మంది ఉపాధ్యాయులపై ప్రతాపం చూపాలని నిర్ణయించుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ జీఓను తీసుకొచ్చి ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నిస్తోంది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖాన్ పేరుతో జీఓనంబర్ 130ని శుక్రవారం జారీచేసింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠశాలపరంగా 60 శాతం ఫలితాలు సాధించలేకపోయినా, ఉపాధ్యాయుడి పరంగా తనకు సంబంధించిన సబ్జెక్టులో 60 శాతం మార్కులు సాధించలేకపోయినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీఓలో పేర్కొంది. సంబంధిత ఉపాధ్యాయులపై ఐదు రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను అదేశించింది.
డిస్‌మిస్, రిమూవల్, రివర్షన్, నిర్భంద పదవీ విరమణ, ఇంక్రిమెంట్లలో కోత వంటి ఐదు రకాల చర్యలు చేపట్టాలని పేర్కొంది. క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్ (సీసీఏ) నిబంధనలకు అనుగుణంగా పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించింది. ఇక ముందు 90 శాతం ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులను మాత్రమే ఉత్తమ టీచర్ల ఎంపికకు సిఫారసు చేయాలని స్పష్టం చేసింది.
సకల జనుల సమ్మెనుంచి మరల్చేందుకే..
పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు, ఉపాధ్యాయులను కేటాయించకుండా సీసీఏ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడంపై విమర్శలొస్తున్నాయి. ఇది ఉపాధ్యాయులను భయవూబాంతులకు గురిచేసే జీఓనని, దీనిపై అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. జీఓ రాష్ట్ర వ్యాప్తంగా వర్తించేలా ఉన్నా.. లోతుగా చూస్తే తెలంగాణ ఉద్యమంలో చురుకైనా పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు సకల జనుల సమ్మెలో పాల్గొనకుండా చేసే దురుద్దేశం ఉందన్న విమర్శలున్నాయి. ఉద్యమంలో పాల్గొంటే ఫలితాలు తగ్గి ఉద్యోగాలకు ఎసరు వస్తుందేమోననే భయాన్ని ఉపాధ్యాయుల్లో కల్పించి తెలంగాణ ఉద్యమం నుంచి దృష్టి మరల్చే కుట్ర దీని వెనుక దాగి ఉందని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలి
అన్ని పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎన్‌సీ) ఎన్నికలు నిర్వహించాలని జీఓ స్పష్టంచేసింది. 2001లో ఎస్‌ఎన్‌సీ ఎన్నికలను అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాఠశాలల్లో రాజకీయాలు జోరందుకోవడంతో 2005 నుంచి ఎన్నికలు జరగడం లేదు. కేవలం నామినేటడ్ పద్ధతిలో కమిటీలను నియమిస్తూ సాగిస్తున్నారు. ఇకపై ఎన్నికలు నిర్వహించి ఆరుగురు కమిటీ సభ్యులను ఎన్నుకోవాలని సూచించింది. కమిటీ ఎంపికకు చేతులు ఎత్తడం, వాయిస్ ఓటు, రహస్య బ్యాలెట్ ఏదో ఒక పద్ధతిలో ఎంపిక చేయాలని సూచించింది. కమిటీ సమక్షంలో ప్రైమరీ పాఠశాలల్లో 30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 42, ఉన్నత పాఠశాలల్లో 48 మందిని ఎంపికచేయాలని సూచించింది. ప్రతి కమిటీలోనూ ఆయా పాఠశాలల పరిధిలో ఉన్న వార్డుమెంబర్, లేదా కౌన్సిలర్, కార్పొరేటర్‌ను ఉండాలని సూచించింది. ఈ విధానం వల్ల పాఠశాలల్లో రాజకీయాలు చోటు చేసుకుంటాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
- స్వయం సహాయక సంఘాలకూ చెక్
- 15 నుంచి ‘సెర్ప్’ మాసోత్సవాలు
- నిత్యం మీటింగ్‌లకు వెళ్లనున్న ఆడబిడ్డలు
- 50 లక్షల మంది దృష్టి మరల్చే యత్నం
- ఉద్యమానికి దూరంగా ఉంచేందుకు ఎత్తుగడ
వరంగల్, టీన్యూస్ ప్రతినిధి: తెలంగాణ ఉద్యమం నుంచి మహిళల్ని, ఇందిరా క్రాంతిపథం సిబ్బందిని దూరం చేసేందుకు సర్కారు కొత్త ఎత్తగడ వేసింది. ఉద్యమంలో సగభాగమైన తెలంగాణ ఆడబిడ్డలకు మీటింగుల పేరిట సకల జనుల సమ్మెకు దూరం చేసేందుకు నెలరోజులపాటు కార్యక్షికమాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సెర్ప్ నగామీణ పేదరిక నిర్మూలనా పథకం) కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాలు సకల జనుల సమ్మెకు సమాయాత్తమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీయాశీలకమైన ఐకేపీ (డీఆర్‌డీఎ)లోని కాంట్రాక్టు ఉద్యోగులు, మహిళా సంఘాలను సమ్మెలో పాల్గొనకుండా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.
పావలా వడ్డీ మదింపు చేస్తామని, బ్యాంకులింకేజీ తదితర అంశాలను బూచీగా చూపి అన్ని రకాల పథకాల ప్రగతిపై గ్రామక్షిగామాన సమీక్ష చేయాలని సెర్ప్ నిర్ణయం తీసుకుంది. దీని కోసం ప్రత్యేకంగా మాసోత్సవాన్ని నిర్వహించాలని ఈనెల 7న సెర్ప్ సీఈఓ రాజశేఖర్ (ఎల్‌ఆర్ నెంబర్: 987) జారీ చేశారు. దీని ప్రకారం ఈనెల 15 నుంచి వచ్చెనెల 14 దాకా నెలరోజుల పాటు సుదీర్ఘ కార్యాచరణ విధిగా నిర్వహించాలని అందులో పేర్కొన్నారు.
సమరానికి దూరం చేసేందుకే?
సెర్ప్ చేపడుతున్న కార్యక్షికమాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పదిజిల్లాల్లో 20 వేల మంది సీఏ (కమ్యూనిటీ అసిస్టెంట్స్)లు ఉన్నారు. అలాగే రాష్ట్రంలో 9.95లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటి నిర్మాణంలో రాష్ర్టవ్యాప్తంగా దాదాపు 1.11 కోట్ల మంది సభ్యులున్నారు. ఇందులో తెలంగాణ పది జిల్లాలో కనీసం 50లక్షల మంది మహిళా సభ్యులు ఉంటారని అంచనా. తెలంగాణ ఉద్యమం నుంచి మహిళాశక్తిని దూరం చేసేందుకే సర్కారు కొత్త ఎత్తుగడ వేసిందని విమర్శలున్నాయి. ఇటీవలే ఓ వీడియో కాన్ఫన్స్‌లో మహిళా సాధికారత, స్వావలంబన, వివిధ పథకాలపై మరింత అవగాహన కల్పించాలంటే కళారూపాల ద్వారా చేయవచ్చని కరీంనగర్‌కు చెందిన జిల్లా సమాఖ్య సిఫారసు చేస్తే... సాక్షాత్తు సీఈవోనే ‘చూడమ్మా..డప్పు చప్పుళ్లు, పాటలు కూడుపెట్టవులే కానీ మేం వేరే ఆలోచిస్తాం’ అంటూ తెలంగాణ సంస్కృతిని అవహేళన చేశాడనే ఆరోపణలున్నాయి.
ఆయన త్వరలో చేస్తున్నామంటే ఏందో అనుకున్నాం కానీ తీరా మమ్మల్నందరినీ సకల జనుల సమ్మెకు దూరం చేసే కుట్ర చేస్తాడని అనుకోలేదని మహిళా సంఘాలు ప్రతినిధులు వాపోతోన్నారు. గత ఏడాది వరంగల్ జిల్లా మహిళా సమాఖ్య పెద్ద ఎత్తున ‘మహిళా గర్జన’ నిర్వహించింది. కేయూ విద్యార్థులు నిరాహార దీక్షలు చేపట్టినపుడు, హాస్టళ్లు మూసివేసినప్పుడు ’బిడ్డా మీరేం భయపడకండి..మీవెంట మేమున్నాం. మేం ఒకపూట పస్తులైనా ఉంటాం..మిమ్మల్ని కాపాడుకుంటాం’అంటూ విద్యార్థులకు ధైర్యం చెప్పారు. విద్యార్థులకు వండిపెట్టారు. ఇవి పునరావృతమైతే ఉద్యమాన్ని అదుపు చేయలేమని భావించిన సర్కారు కొత్తగా మాసోత్సవాలు పెట్టిందనే అభివూపాయాలు వ్యక్తం అవుతోన్నాయి.
నెలరోజులు ఏం చేస్తారు..?
తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రగతికి పది సూత్రాలు, స్త్రీశక్తికి అభ్యున్నతి కోసం సర్కారు ఏం కార్యక్షికమాలు చేపడుతోన్నది? ఏ విధంగా వారు సద్వినియోగం చేసుకుంటున్నదో గ్రామస్థాయిలో సంఘాల వారీగా ప్రచారం, సమీక్షలు చేయాలి. గోడలమీద రాతలు, రికార్డుల పనితీరు, ఆడిట్, ఇంటిటి సర్వేలు, లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్, పోషకార విలువలు పాటిస్తోన్నారా?లేదా ఇలా రోజుకో కార్యక్షికమం చొప్పున చేపట్టాలి. బ్యాంకు లింకేజీ, పావలా వడ్డీ తదితర అంశాలపై పరిశీలన చేయాలనేది ఆ మార్గదర్శకా సారాంశం. ఇవన్నీ తమ రోజువారీ కార్యక్షికమాలేనని, కొత్తగా చేయాల్సినవి, తెలుసుకోవలసినవి ఏమీ లేవనేది సిబ్బంది వాదన.
కేవలం సకల జనుల సమ్మె నుంచి దూరం చేసేందుకే సర్కారు కుట్ర చేస్తోందని, తమనే కాదు మొత్తం మహిళల్ని అందులో పాల్గొన కుండా చూసేందుకు వారికి రుణాలిస్తామని, వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికేందుకు సర్కారు వేసిన ఎత్తుగడ అని వారు ఆరోపిస్తోన్నారు. మరోవైపు గతంలో వారోత్సవాలు విరివిగా సాగాయని, ఒకసారి పక్షోత్సవాలు జరిగాయి కానీ ఇలా మాసోత్సవాలు చేయాలనడం ఇదే తొలిసారి అని పేర్కొంటున్నారు. నిజంగా సర్కారుకు పేదలపట్ల ప్రేమే ఉంటే, మహిళా సంఘాలను బలోపేతం చేయాలని, జ్వరాల బారినపడి పిట్టల్లా రాలుతున్న మనుషుల ప్రాణాలు కాపాడేందుకు, ఆరోగ్యమేళాలు, వారోత్సవాలు ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తున్నారు.

poru telangana release date 16-09-2011(16 ‘పోరు తెలంగాణ’)
అరవై ఏళ్ళ నుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ విప్లవ
చిత్రాల కథానాయకుడు ఆర్.నారాయణమూర్తి స్వీయనిర్మాణ దర్శకత్వంలో స్నేహ చిత్ర
పతాకంపై తెరకెక్కించిన చిత్రం ‘పోరు తెలంగాణ’. సెన్సార్ కార్యక్షికమాలు
పూర్తిచేసుకుంది. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా
నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యురాలు
ధనలక్ష్మీ ఎంతగానో మెచ్చుకున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత
జరుగుతున్న ఉద్యమాన్ని యథాతథంగా ఆవిష్కరించానని ప్రశంసించారు. తెలంగాణ
పోరాటం ఎంత ధర్మబద్ధమైందో, నీతి బద్ధమైందో ఈ చిత్రం ద్వారా తెలియజెప్పానని,
‘పోరు తెలంగాణ’ చరివూతలో నిలిచిపోయే ఓ కళాఖండం లాంటి చిత్రమని ఆమె
అభినందించారు. తెలంగాణ ఉద్యమంలో 1952 నుంచి జరిగిన అన్ని సంఘటనలన్నింటినీ ఈ
చిత్రంలో ఆవిష్కరించాను.
1969లో అధికారం, స్వావలంభన, ఆత్మగౌరవ నినాదంతో కె.టి.పి.సి పాల్వంచలో ఉద్యమం ప్రారంభమైంది. ఖమ్మంలో రవీంవూధనాథ్ అనే విద్యార్థి నిరాహార దీక్షకు దిగాడు. ఇలాంటి చారివూతక సంఘటనలన్నింటినీ ఈ చిత్రం ద్వారా చూపెడుతున్నాం. ‘అన్నదమ్ముల్లారా విడిపోదాం ఆత్మీయుల్లా కలిసుందాం’ అనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందిస్తున్నాను. ఎలాంటి వైషమ్యాలు లేకుండా విడిపోవాలని సూచించాను. ఈ చిత్రాన్ని విశాల దృక్పథంతో చూడాలని ఆంధ్రవూపదేశ్ ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 16న రాష్ర్ట వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాను. కొందరు ఓవర్సీస్‌లో కూడా విడుదల చేయాలని అడుగుతున్నారు’ అన్నారు.

nedu t-congress nethala samavesham(నేడు టీకాంగ్రెస్ నేతల సమావేశం)
తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ నేతలు శనివారం సమావేశం కానున్నారు. సకలజనులసమ్మె సమీపించటం, సోనియా భారత్‌కు రావటం, నేతలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
Subscribe to:
Posts (Atom)
Pages
In this blog it consists of all categories of
Telangana information such as Telangana
images,Telangana information,Telangana
maps,Telangana videos,Telangana movies,Telangana
news,Telangana history,Telangana
Samskruthi,Festivals of Telangana,Bathukamma :
Telangana Festival,bonalu........etc
Disclamier
The entire content available in this blog is my personal views only.
There is no connection with any one for the content I published in this blog.
I Just want to share my views about telangana. Because I am belongs to Telangana.
Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana...........
We do any thing for Telangana.
If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts