Tuesday, 19 July 2011

ఆజాద్‌పై t_congress aagraham

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అంశంలో ఏ నిర్ణయం చేస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా ప్రాంతాలకతీతంగా హర్షిస్తారు? అనే కోణంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తున్న ప్రస్తుత తరుణంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి, కేంద్ర మంత్రి గులాంనబీ అజాద్‌ తెలంగాణ సమస్యను మొదటికి తెచ్చే విధంగా వ్యవహ రించారని ఈ ప్రాంత కాంగ్రెస్‌ సీనియర్‌ నాయ కులు ఆగ్రహోదగ్రులవుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను అయిదు, లేక ఆరు పేజీలతో నోట్‌ను తయారుచేసి ఇవ్వాలని అజాద్‌ కోరడాన్ని పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు తప్పుబడుతున్నారు. అంతేగాక మంగళ వారంనాడు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో మాట్లాడిన అజాద్‌ సంధించిన ప్రశ్నలు, మాట్లాడిన వైనం పరిశీలిస్తే ఒక అడ్వొకేట్‌లా ప్రశ్నలను సంధిం చినట్లుగా ఉందని కొందరు సీనియర్‌ నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్ది న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని, సోనియా మేడమ్‌ ముందు మాట్లాడేందుకు తనకు 'టాకింగ్‌ పాయింట్స్‌ కావాలి కదా! అని ఆజాద్‌ కోరడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. జరిగిన అన్యాయాలకు ప్రతి గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరు తుండగా ఆజాద్‌ ఇలా జరిగిన తప్పులను సరిది ద్దుతానని ముందుకు రావడంతో అనేక అనుమా నాలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను 'ఫూల్స్‌ (తెలివి తక్కువ)ను చేసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకివ్వాలి?, తెలంగాణను ఇస్తే సీమాం ధ్రలో కాంగ్రెస్‌పార్టీ గల్లంతవుతుంది కదా!, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.ఆర్‌.ఎస్‌. అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు లబ్ది చేకూరుతుంది కదా! అని అజాద్‌ నిలదీసినట్లుగా అడగటం తమను కలచివే సిందని అంటున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల గురించి, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాల గురించి, తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌, టి.ఆర్‌.ఎస్‌.ఆవిర్భావం, కె.సి.ఆర్‌.తో అజాద్‌కున్న సంబంధాలు, 2009 డిసెంబర్‌ 9వ తేదీన చిదం బరం చేసిన ప్రకటన, ఆ తర్వాత జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, నివేదికను ఇవ్వడం, అంతకు ముందు ప్రణబ్‌ముఖర్జీ కమిటి, సి.ఎల్‌.పి.లో తీర్మానాలు జరిగినవైనం, సోనియాగాంధీ హామీలు, కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పొందుపరిచిన వైనం, యు.పి.ఎ.ప్రభుత్వంలో కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంలో తెలంగాణ అంశం, రాష్ట్రపతి ప్రసం గాల్లో తెలంగాణ సమస్యను ప్రస్తావించడం వంటి మొత్తం వ్యవహారంపై కూలంకషంగా, స్పష్టమైన అవగాహన ఉన్న అజాద్‌ ఇప్పుడు ఏమీ తెలియ నట్లుగా 1965 నుంచి ఇప్పటి వరకూ తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ఒక నోట్‌ ఇవ్వాలని కోరడం బాధగా ఉందని పలువురు సీనియర్‌ నాయకులు తీవ్ర మనస్థాపం వ్యక్తంచేస్తున్నారు. పెద్ద మనుషుల ఒప్పందాల ఉల్లంఘన, 610 జీవోను అమలు చేయకపోవడం, ఉద్యోగ, విద్య, వైద్య, వ్యవ సాయం, విద్యుత్తు, ఇతర అనేక రంగాల్లో తెలం గాణ దగాకు గురయ్యిందనే అంశాలపై కాంగ్రెస్‌ అధిష్టానంలో ఏ నాయకుడిని కదిలించినా కనీసం పది పాయింట్లను స్పష్టంగా చెప్పగలరని అంటు న్నారు. అధిష్టానంలో కీలకమైన పాత్ర పోషిస్తూ, ఆంధ్రప్రదేశ్‌పైన, తెలంగాణపైన స్పష్టమైన అవగా హన ఉన్న నాయకుడిగా అధిష్టానం గుర్తించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా వచ్చిన అజాద్‌ ఇలా మాట్లాడటం సబబుగాలేదని, ఆయన తీరును చూస్తుంటే తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రపూరి తంగా వ్యవహరిస్తున్నారేమోననే అనుమానం కలు గుతోందని అంటున్నారు.
ఒకవైపు తెలంగాణను ఇవ్వకుండా నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తే పార్టీకి పుట్టగతులుండవని, కాంగ్రెస్‌ నాయకులెవ్వరూ తెలంగాణ పల్లెల్లో తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని అధిష్టానం లోని ప్రతి ఒక్క నేతకూ వివ రిస్తూ వచ్చామని చెప్పారు.అంతేగాక వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మూలంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని, కనీసం తెలంగాణాలోనైనా కాంగ్రెస్‌ను బ్రతికించాలని అధినేత్రి సోనియాగాంధీకి ప్రత్య క్షంగా, పరోక్షంగా వివరిస్తూ వచ్చామని అంటు న్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, చివరకు ఎంపీలు కూడా ఎవ్వరి స్థాయిల్లో వారు తెలంగాణ కోసం ఉద్య మాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారని, ఇంత జరుగుతున్నా, రాజకీయంగా అంతులేని సంక్షోభ పరిస్థితులున్నప్పటికీ అజాద్‌ సాదాసీదాగా తెలం గాణపై నోట్‌ అడగటం,తెలంగాణకు జరిగిన అన్యా యాలను సరిదిద్దుతానని చెబుతుండటం విడ్డూ రంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయినప్పటికీ అజాద్‌ను నొప్పించకుండా, తమలోని ఆవేదన, బాధను దిగమింగుకొని నోట్‌కు బదులుగా జరిగిన అన్యాయాల నివేదికలనే అందజేశామని వివరిం చారు.అయిదురాష్ట్రాల ఎన్నికలను సాకుగా చూపిం చి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ వేచి ఉండా లని ఆదేశించినందున తాముఎలాంటి ఉద్యమాలు చేయలేదని, ఈనెలాఖరుకు గానీ, జూన్‌ మొదటి వారంలో స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమ కార్యాచరణలను ప్రకటిస్తామని కాంగ్రెస్‌ అధిష్టా నాన్ని, ముఖ్యంగా గులాంనబీఅజాద్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు హెచ్చరిస్తున్నారు.

bjp jai andhra

‘జై ఆంధ్ర’ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్న కమలనాథులు
- రాష్ట్రాలుగా విడిపోతేనే ప్రయోజనమంటున్న శ్రేణులు
- అదే విషయాన్ని సీమాంధ్రలో వివరించేందుకు సిద్ధం
- రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ‘జై ఆంధ్ర’ కోసం తీర్మానం
- ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్న కమలనాథులు
- రాష్ట్రాలుగా విడిపోతేనే ప్రయోజనమంటున్న శ్రేణులు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర స్థాయిలో మద్దతు ఇస్తున్న బీజేపీ... అదే స్థాయిలో ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రం రెండుగా విడిపోతే కలిగే ప్రయోజనాలను సీమాంధ్ర ప్రజలకు వివరించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరనుంది. ఇటీవల రెండురోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందించింది. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన తర్వాత బీజేపీలోని తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. దీన్ని సీమాంధ్ర ప్రాంత ఆ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న పార్టీ నాయకత్వం అప్పటినుంచి ఇరువూపాంతాల నాయకులతో సంప్రదింపులు జరుపుతూనే తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ వస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇరు ప్రాంతాల నుంచి పాల్గొన్న నాయకుల అభివూపాయాలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం చర్చించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సీమాం్ర ప్రతినిధులు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకించకపోయినా హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంవూధుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికోసం బీజేపీ ప్రత్యేక కార్యక్షికమాన్ని రూపొందించి హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రజల భద్రతకు పూర్తిగా అండగా నిలవాలని నిర్ణయించింది.

సీమాంధ్రలో పట్టుకోసం...
సీమాంవూధలో పార్టీ బలోపేతం జరిగే విధంగా కార్యాచరణను రూపొందించే పనిలో బీజేపీ సమాయత్తం అవుతున్నది. అందుకోసం ఇప్పటి వరకు అధికారంలో ఉన్న సీమాంధ్ర నేతలు సీమాంధ్ర ప్రాంతానికి ఏవిధంగా అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలకు వివరించడం ద్వారా రాష్ట్ర విభజనకు మార్గం వేయాలని బీజేపీ నాయకత్వం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించింది. విడిపోతే ఏర్పడే ప్రయోజనాలపై సమావేశంలో పార్టీ నేతలు చర్చించారు. అందుకోసం సీమాంవూధలో ఉన్న సహజవనరులు, వాటిని ఉపయోగించుకుంటే కలిగే ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయించింది. దీని ద్వారా సీమాంధ్ర ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేసి తెలంగాణ ఉద్యమాన్ని బలపరచడమే కాక ‘జైఆంధ్ర’ ఉద్యమాన్ని చేపట్టాలని బీజేపీ కార్యవర్గం తీర్మానించింది.

kalasi poradithene telangana

జేఏసీ, టీఆర్‌ఎస్‌లతో పనిచేసేందుకు సిద్ధం
- ఈనెల 21 నుంచి పోరుబాట:ఫోరం
- ఆగస్టు 5 నుంచి నిరహార దీక్షలు

తెలంగాణ రాజకీయ జేఏసీ, టీఆర్‌ఎస్‌లతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమేనని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎరవూబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌తో నేరుగా కలిస్తే అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని, మధ్యవర్తుల ద్వారా చెప్పిస్తామని ఆయన అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఫోరం విస్తృత సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఫోరం నేతలు మెత్కుపల్లి నర్సింహులు, కొత్త కోట దయాకర్‌డ్డి, పి.రాములు, పట్నం మహేందర్‌డ్డి, ఎల్.రమణ, అరికెల నర్సాడ్డి, బి కలిసి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసిన వాళ్లంతా కలిసి కట్టుగా ఉద్యమిస్తేనే తెలంగాణ వస్తుందని, అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

కేంద్రం దిగి వచ్చే విధంగా తెలంగాణ కోసం పోరాటం చేయాలని తాము నిర్ణయించామని ఎర్రబెల్లి తెలిపారు. ఇందుకోసం ఈనెల 21 నుంచి ఆగస్టు రెండవ వారం వరకు ఉద్యమ కార్యక్షికమాలను రూపొందించామని వివరించారు. గ్రామ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఈనెల 21, 24 తేదీల్లో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని, స్థానికంగా కలిసి వచ్చే వారందరిని ఈ కమిటీలో కలుపుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. అదేవిధంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో ఈనెల 25 నుంచి 31 వరకు పల్లెపప్లూకు టీ టీడీపీ పేరుతో ఊరేగింపులు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 1న అన్ని మండల కేంద్రాల్లో టీ టీడీపీ జెండాలు ఎగురవేస్తామని వివరించారు. ఆగస్టు 5 నుంచి ఇందిరాపార్కు వద్ద వారంరోజులు రోజుకు 10మంది చొప్పున దీక్షలు చేస్తామన్నారు.

రాజకీయేతర సంస్థలతో కలుస్తాం: ఎర్రబెల్లి
రాజకీయ జేఏసీ సహా అందరినీ ఒకే గొడుడు కిందకు వచ్చి ఉద్యమించాలని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రాజకీయేతర సంస్థలతో తాము కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ యునైటెడ్‌ఫోరం నేతలు దిలీప్‌కుమార్, విమల, కేశవరావ్ జాదవ్‌లను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సోమవారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ఉద్యమంలో ఎమ్మెల్సీ దిలీప్ మొదటి నుంచి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేర్కొన్నారు. జేఏసీతో సహా అందరూ పార్టీని, జెండా, ఎజెండాలను వదలిపెట్టి ఒక్కటిగా పని చేయాలని కోరారు. ప్రస్తుత జేఏసీ తెలంగాణకు చొరవ చూపడం లేదని విమర్శించారు. అవసరమైతే పార్టీని వదులుకొని వస్తానని తాను పేర్కొనడాన్ని దిలీప్‌కుమార్ స్వాగతించారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికలంటూ వస్తే ఇక తెలంగాణ రాష్ట్రంలోనే రావాలని పేర్కొన్నారు.

telangana kosam maro balithanam

సీమాంధ్ర నాయకులు సోమవారం ఢిల్లీ వెళ్లడంతో తెలంగాణను అడ్డుకుంటారనే బెంగతో టీఆర్‌ఎస్ కండువాతోనే సొంత చేనులో ఆ పార్టీ కార్యకర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నిజామాబాద్ జిల్లాలోని కామాడ్డి మండలం గర్గుల్ గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు వడ్ల నాగభూషణం(50) ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. సోమవారం సీమాంధ్ర ఎంపీలు ఢిల్లీకి వెళ్లిన విషయాన్ని టీవీలో ఉదయం నుంచి చూశాడు. గ్రామ కూడలిలోని హోటళ్లో సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకుంటున్నారని స్థానికులతో చర్చించాడు.

ఆవేదనతో కలత చెంది సాయంత్రం పొలానికి వెళ్లి టీఆర్‌ఎస్ కండువాతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నా డు. ‘తెలంగాణ కోసం చనిపోతున్నా, తెలంగాణ వస్తదని అందరికి చెప్పే వాడిని, రాష్ట్రం ప్రకటించకుండా కేంద్రం ప్రదర్శిస్తున్న వైఖరికి నిరసనగా చనిపోతున్నా, నా చావుతోనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే తెలంగాణను ప్రకటించాలి’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

rajinamala amotham eka lenatle

జిల్లాపరిషత్ ప్రాదేశిక సభ్యుల్లో కొందరి రాజీనామాలు ఆమోదం పొందే అవకాశం లేనట్టేనని తేలిపోయింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు రాజీనామా బాటను ఎంచుకున్నారు. తాము తెలంగాణకు ముందువరుసలో ఉన్నామని ప్రజలకు భ్రమ కల్పించారు. రాజీనామాలు ఆమో దించే రీతిలో (ఫార్మట్‌లో)కాకుండా ఇతర మార్గాలను అనుసరించి రాజీనామాలు చేసి ఆమోదం పొందేందుకు తిరకాసును ఎంచుకున్నారు. ఇటు ప్రజాగ్రహానికి గురికాకుండా, అటు రాజీనామా ఆమోదం పొందకుండా ద్వంద్వ నీతిని ప్రద ర్శించారు.

ఉత్తుత్త రాజీనామాలు చేసి తెలంగాణపై తమకున్న ఆకాంక్ష ఏ పాటిదో ప్రజలకు చాటి చెప్పుకున్నారు. నిబంధనల ప్రకారం వివిధ మార్గాల ద్వారా రాజీనామాలు సమర్పించిన జడ్పీటీసీలకు వ్యక్తిగతంగా వారి వివరణ కోరేందుకు కలెక్టర్ తేదీ నిర్ణయించి ముందుగా వారికి సమాచారం అందించాలి. సభ్యుల పదవీకాలం ఈ నెల 21తో ముగుస్తోంది.

అంటే ఈ లెక్కన రాజీనామాల ఆమోదం సాధ్యపడదనే విషయం స్పష్టమవుతోంది. జిల్లాలో 36 మంది జడ్పీటీసీలకు గాను 20 మంది రాజీనామాలు చేశారు. వీరిలో మొదట 8 మంది జడ్పీటీసీలు రాజీనామాలు ఆమోదించే విధంగా పంపించారు. అందరికంటే ముందు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా చేసిన డిచ్‌పల్లి జడ్పీటీసీ దినేష్‌కుమార్ అనంతరం కలెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామాను ఆమోదించుకున్నారు. ఇక మిగతా 19 మంది జడ్పీటీసీలు తమ రాజకీయ వక్రబుద్ధిని చాటుకున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Monday, 18 July 2011

తెలంగాణా మాతృగీతం-telangana matru githam

మాతృ గీతం రచన: అందెశ్రీ

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

|| జయ…||
తరతరాల చరితగల తల్లీ నీరాజనం

|| తర…||
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ

|| జై…||

పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్

|| జై…||

జానపదా జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం

|| జై…||

సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద
సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద

|| జై…||

గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి

|| జై…||
In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts