ప్రజల ఆకాంక్షను గౌరవించి, కేంద్రం వెంటనే తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గురువారం ముదిగొండ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములను పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని, కాని పేద ప్రజలు జానెడు జాగా అడిగితే కాల్చి చంపారని విమర్శించారు.
యూపీఏ ప్రభుత్వం కుంభకోణాల్లో ఇరుక్కొ ని , కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సీపీఎం పేదప్రజల పక్షాన ఉండి , ప్రజాపోరాటాల చేస్తూ అమరవీరుల ఆశయ సాధనకు కృషిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
భట్టీ మట్టి కొట్టుకుపోతావ్: పొన్నం వెంకటేశ్వర్లు
మధిర నియోజక వర్గంలో సీపీఎంను అణచటానికి డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క కుయుక్తులు పన్నుతూ గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నాడని, అధికారంతో అధికారులను బెదిరిస్తూ తన చెప్పుచేతల్లో ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు అమరవీరుల సంస్మరణ సభలో తీవ్రంగా విమర్శించారు. ముదిగొండ తహసీల్దార్‌తో పాటు కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు.
సీపీఎంపై కక్షసాధింపు ధోరణి అవలంభిస్తున్నాడని విమర్శించారు. ఈ ధోరణి విడనాడకుంటే ప్రజా కంటకులు అందరిలా మట్టి కొట్టుకుపోతాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ సభకు సీపీఎం మండల కార్యదర్శి కూరపాటి శ్రీనవాసరావు అధ్యక్షత వహించగా , సీపీయం నాయకులు బంకా మల్లయ్య . బండి రమేష్ , లింగాల కమల్రాజు , మచ్చా లక్ష్మి , బండారు రవికుమార్ , పీసీ వీరస్వామి, బండి పద్మ , వాసిరెడ్డి ప్రసాద్ , పాల్వాయి పాండు రంగారావు , భట్టు పురుషోత్తం పాల్గొన్నారు.
ఘనంగా నివాళి...
స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి అమరవీరుల స్మారక స్థూపం వరకు కార్యకర్తలు , నాయకులు , మృతవీరుల కుటుంబ సభ్యులు ప్రదర్శన నిర్వహించి స్మారక స్థూపం వద్ద అమరులకు ఘనంగా నివాళులర్పించారు. డప్పు బృందాలతో , ప్రజానాట్యమండలి కళాకారులు పాటలు నృత్యాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. సభా వేదికపైన ప్రజానాట్యమండలి కళాకారులు అమరవీరుల త్యాగాల పాటలు విన్పించారు. మృత వీరుల కుటుంబాల సభ్యులను సీపీఎం నాయకులు బంకా మల్లయ్య వేదిక మీదకు పిలిచి సభికులకు పరిచయం చేశారు.
‘నమస్తే తెలంగాణ’కు అభినందనల వెల్లువ...
ఆనాటి ముదిగొండ కాల్పుల ఘటనను కళ్ళకు కట్టినట్లు చూపించిన నమస్తే తెలంగాణ దినపత్రికను ముదిగొండ అమరవీరుల కుటుంబాల వారు అభినందనలతో ముంచెత్తారు. ఏ పత్రికలో రాయని విధంగా ఆమరవీరుల కుటుంబాల బాధలు వర్ణించారని పేర్కొన్నారు . పేద ప్రజానీకానికి తెలంగాణ ముద్దుబిడ్దలకు అండగా నిలిచిన నమస్తే తెలంగాణ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.
Friday, 29 July 2011
GOVERNMENT EMPLOYEES LO 90% SEEMANDRU LE
ప్రభుత్వ అధికారుల్లో 90శాతానికి పైగా వారే ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. పై స్థాయి సీమాంధ్ర అధికారులు కిందిస్థాయి తెలంగాణ ఉద్యోగులపై వివక్ష చూపుతూ నానా విధాలుగా వారిని హింసిస్తున్నారు. విటన్నీంటిని తిప్పి కొట్టాలం తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారానే సాధ్యమని గ్రహించి ఉద్యమిస్తున్నామంటు న్నారు టీఎన్జీఓ జేఏసీ జిల్లా ఛైర్మన్ రాజేందర్డ్డి. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓల పాత్ర గురించి..
2009లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం చరిత్ర తిరగరాసింది. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం డిసెబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రక్రియ మొదలైనట్లు ప్రకటన చేసి మళ్లీ 23న మాట మార్చింది. ఆ సమయంలోనే జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓలు సమావేశమై టీఎన్జీఓ అధ్యక్షుడిడు రాజేందర్డ్డిని ఉద్యోగ జేఏసీ ఛైర్మన్గా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటునారు. రాష్ట్ర పొలిటికల్, ఉద్యోగ జేఏసీల ఆదేశానుసారం ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకొని ఉద్యమంలో కొత్త పంథాలో పాలుపంచుకుంటున్నారు.
అందులో భాగంగానే ఒకటి జనవరి 2010న పాల్కొండనుంచి తెలంగాణ చౌరస్తా వరకు మోటార్సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జనవరి నాలుగు 2010న ఉద్యోగుల పెన్డౌన్, అదే నెల 28న జెడ్పీ స్టేడియంలో పాలమూరు ప్రజల ధర్మాక్షిగహం లక్ష్య మందితో సత్యాక్షిగహాలు అనే వినూత్న కార్యక్షికమాన్ని నిర్వహించారు. అలాగే 6 ఏప్రిల్ 2010న జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాం కావొచ్చు, 14 జూలై 2010న జిల్లాలో మౌన ప్రదర్శన, 14 ఆగస్టు 2010న ఉద్యమంలో అసువులు బాసిన 12మంది అమరవీరుల కుటుంబాలకు 30,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే కావొచ్చు అనేక రూపాల్లో కార్యక్షికమాలు చేపట్టారు.
ఆయా కార్యక్షికమాలకు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కె.స్వామిగౌడ్, కార్యదర్శి దేవి ప్రసాద్లు, హరీష్రావు, లక్ష్మణ్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ, జేఏసీ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు. 26 నవంబర్ 2010న టీఎన్జీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలమూరు ప్రజా యాత్రను పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ప్రారంభించారు.
అదే నెల 28న నాగర్కర్నూల్లో అమరవీరుల స్థూపం నిర్మాణానికి టీఎన్జీఓ అధ్యక్షుడు రాజేందర్డ్డి భూమి పూజ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీ కృష్ణ కమిటీకి తెలంగాణ ఉద్యోగాల్లో సీమాంవూధులు ఎంత మంది ఉన్నది తెలియజేశారు. తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులను దూరం చేయాలనే కుట్రతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను ఉపసంహరించుకునే వరకు నిరసనలు, రాస్తారోకోలు చేశారు. ఆగస్టులో నిర్వహించే సకల జనుల సమ్మెలో పాల్గొంటామంటున్నారు. ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తే సహించేది లేదని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

raginamalu upasamharincuko:madhu yashki
రాజీనామాలు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఎంపీ మధుయాష్కి ఆజాద్‌కు స్పష్టం చేశారు. తెలంగాణ ఎంపీలతో నేడు ఆజాద్ చర్చించారు. పార్లమెంటు సమావేశాలకు సహకరించాలని తెలంగాణ ఎంపీలను కోరారు. ఆగస్టు 6న సీమాంధ్ర నేతలతో చర్చలు జరుపుతామని ఆజాద్ వెల్లడించారు. తెలంగాణ అంశంపై ఎటువంటి హామీ లేకుండానే చర్చలు ముగిసాయి.
chanrababu telangana drohi:nagam janardan
రెండు కండ్ల సిద్ధాంతకర్త చంద్రబాబు పథకం ప్రకారమే యనమలతో సమైఖ్యనినాదాన్ని అనిపించాడని నాగం జనార్దన్‌రెడ్డి విమర్సించారు. రెండు ప్రాంతాలకు స్వేచ్ఛ యిచ్చానాని చెప్పడం తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడమేనన్నారు. డబ్బుల కోసం నీచమైన రాజకీయం చేస్తూన్నాడన్నారు. యనమల ప్రకటనకు మద్ధతుగా చంద్రబాబు నిస్సిగ్గుగా తెలంగాణపై నేను చెప్పిందే విధానమని చెప్పడం టీటీడీపీ ఫోరం నేతలు గ్రహించాలన్నారు. బస్సు యాత్రలపేరుతో తెలంగాణ టీడీపీ నేతలు చెప్పిన మాటలు గాలీ మాటలేనా? అని ప్రశ్నించారు.ఎంతసేపు రెండు ప్రాంతాలలో పార్టీనీ కాపాడుకోవలనేకుంటుండు కాని తెలంగాణ తేవాలనే ఏలాంటి ఆలోచన లేదని చంద్రబాబు స్పష్టంగా చేపుతున్నాడన్నారు. ఇకనైనా బాబు అడుగులకు మడుగులు వత్తకుండా టీటీడీపీ కన్వీనర్ యర్రబెల్లి దయాకర్‌రావు కండ్లు తెరవాలన్నారు.
seemandhra leaders are terrorists:trs leader harish rao
యనమల వ్యాఖ్యలపై హరీష్‌రావు మండిపాటు
టీడీపీ ఫోరం నేతలు ఇప్పుడేమంటారని ప్రశ్న
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణకోసం యువకులు పిట్టల్లాగా రాలిపోతున్నా సీమాంధ్ర నేతలు కనీస మానవత్వం లేకుండా కసాయిల్లాగా, తీవ్రవాదుల్లాగా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు మండిపడ్డారు. గురువారమిక్కడ తెలంగాణభవన్‌లో పార్టీ నేతలు ఎస్.నిరంజన్‌రెడ్డి, బి.సుమన్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘‘తెలంగాణకు అనుకూలమంటూ టీడీపీ 2008లో ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన తీర్మానానికి కాలం చెల్లిందని, 2011లో సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామంటూ ఆ పార్టీ సీనియర్ నేత యనుమల రామకృష్ణుడు మాట్లాడారు. చంద్రబాబుతో సమావేశమైన వెంటనే, పొలిట్‌బ్యూరో హాలులో మాట్లాడిన మాటలు టీడీపీ విధానాన్ని చెబుతున్నాయి. యనమల వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించకుంటే సమైక్యవాదమే టీడీపీ విధానమని ప్రజలు తేల్చుకుంటారు. తెలంగాణలో పీఆర్పీకి పట్టిన గతే టీడీపీకి పడుతుంది. టీడీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారు’ అని హెచ్చరించారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని, ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖను వాపస్ తీసుకోలేదని చెప్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ తెలంగాణ నేతలు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నిం చారు. చంద్రబాబుతో తేల్చుకుంటారో, టీడీపీ నుండి బయటకొస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ తెలంగాణ నేతలు ఇంకా కళ్లు తెరువకుంటే ప్రజలు మూడోకన్ను తెరుస్తారన్నారు. టీడీపీ సమైక్యవాదానికి వెళ్లిందా.. తెలంగాణకు కట్టుబడి ఉందా అనేది చంద్రబాబుతో చెప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉంటే యనమల రామకృష్ణుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రవారు నాయకులు కాదని, ఖల్ నాయకులని విమర్శిం చారు. హైదరాబాద్‌లో రాజధాని పెట్టడం ద్వారా తెలంగాణ ప్రజలే త్యాగం చేశారన్నారు. విడిపోవడానికి ఏకాభిప్రాయం కావాలంటున్న వారికి కలిసి ఉండటానికి ఏకాభిప్రాయం అవసరంలేదా అని హరీష్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని సీమాంధ్ర నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.

telangana ku anukulam ga echina lekha ku kalam chellindi:yanamala
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం గతంలో నియమిం చిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి కాలం చెల్లిందనీ... అలాగే ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలమంటూ తాము ఆ కమిటీకిచ్చిన లేఖకూ కాలం చెల్లిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ప్రణబ్ కమిటీ తర్వాత.. రోశయ్య కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, డిసెంబరు 9న చిదంబరం ప్రకటన, ఆ ప్రకటనకు సవరణ, తాజాగా మరో కేంద్రమంత్రి ఆజాద్ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపుల వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ తాజాగా జారీ చేసిన జీవోనే అందరూ పరిగణనలోకి తీసుకుంటారని, తెలంగాణ విషయంలో తమ లేఖ పరిస్థితి కూడా అంతేనని వ్యాఖ్యానించారు. ఆ లేఖకు విలువ ఉందో లేదో వెల్లడించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ విషయంలో కేంద్రం త్వరగా తేల్చాలని తాజాగా జరిగిన మహానాడులో తాము తీర్మానం చేశామని, అందులో అన్ని ప్రాంతాల వారు భాగస్వాములు అయినందున అదే అంతిమమని పేర్కొన్నారు. ఆ తీర్మానానికే తాము కట్టుబడి ఉంటామన్నారు. గురువారం ఎన్‌టీఆర్ భవన్‌లో యనమలతో పాటు మోత్కుపల్లి నర్సింహులు, కాలువ శ్రీనివాసులు, పి.చంద్రశేఖర్, ఎం.అరవిందకుమార్‌గౌడ్ , వేం నరేందర్‌రెడ్డి, పెద్దిరె డ్డి తదితరులు పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. అరవిందకుమార్‌గౌడ్, వేం నరేందర్‌రెడ్డి అక్కడ్నుంచి వెళ్లాక.. మిగిలిన నేతలు పొలిట్‌బ్యూరో సభ్యుల గదుల్లో ఉన్న సమయంలో యనమల మీడియాతో మాట్లాడారు. మే నెలలో జరిగిన మహానాడులో.. తెలంగాణపై తాము చెప్పాల్సింది అంతా చెప్పామని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని తీర్మానించినట్లు గుర్తుచేశారు. ‘‘చిదంబరం, ఆజాద్ అడిగితేనో, వారు సమావేశాలు ఏర్పాటు చేస్తేనో వెళ్లాల్సిన అవసరం లేదు. మరోమారు అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామా లేదా అన్నది తర్వాత చెప్తాం. ఏ ప్రాంత నేతలు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఉద్యమాలు చేయటంతో పాటు ప్రజలు చేపట్టిన ఆందోళనల్లో భాగస్వాములు అవుతున్నారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన సీమాంధ్ర ప్రాంత నేతల సమావేశంలో కూడా సమైక్యాంధ్రకు కట్టుబడాలని తీర్మానించాం’’ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన తమకు అంగీకారం కాదని, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో భాగమని చెప్పారు. రెండు, మూడు రాజధానులు అంటూ ఆజాద్ ఆంధ్రప్రదేశ్‌ను మరో జమ్మూకాశ్మీర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ర్టం రావణకాష్టం కావటానికి, ప్రాంతాల మధ్య విభేదాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు. శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్ధత లేదని, ఆ కమిటీ చేసిన ఖర్చును కాగ్ ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. తమ పార్టీలోని సీమాంధ్ర, తెలంగాణ నేతలు కూర్చొని ఉమ్మడి అభిప్రాయానికి రావాలని చెప్తున్న చిదంబరం.. కాంగ్రెస్‌లో ఆ ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తమ పార్టీలోని అంతర్గత వివాదాలను పరిష్కరించుకునేందుకు కాంగ్రెస్.. తెలంగాణ సమస్యను అడ్డం పెట్టుకుంటోందని మండిపడ్డారు.
Subscribe to:
Posts (Atom)
Pages
In this blog it consists of all categories of
Telangana information such as Telangana
images,Telangana information,Telangana
maps,Telangana videos,Telangana movies,Telangana
news,Telangana history,Telangana
Samskruthi,Festivals of Telangana,Bathukamma :
Telangana Festival,bonalu........etc
Disclamier
The entire content available in this blog is my personal views only.
There is no connection with any one for the content I published in this blog.
I Just want to share my views about telangana. Because I am belongs to Telangana.
Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana...........
We do any thing for Telangana.
If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts