Monday, 1 August 2011

1oth baribahiranga sabha in chennuru:kcr

ఈ నెల 10న ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు. తెలంగాణ నేతలను ఒక్కతాటిపైకి తీసుకువస్తే సీమాంధ్ర నేతలు కుతంత్రంతో వారిని విడదీస్తున్నారని ఆరోపించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను స్పీకర్ పిలిచి మాట్లాడాలని ఆయన అన్నారు.

delhi ki t_congress leaders payanam

పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతుండగా, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలతో రాజీనామాలు ఉపసంహరింపజేసేందుకు పార్టీ అధిష్ఠానం చివరి క్షణాల్లో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. శనివారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ ప్రజావూపతినిధుల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్లు కె.జానాడ్డి, కె.కేశవరావులతో మాట్లాడిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ ఆదివారం రెండు, మూడు సార్లు కేకేకు ఫోన్ చేసి రాజీనామాలపై ఒత్తిడి తీవ్రతరం చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి చర్చలు కొనసాగిస్తున్నందున రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో స్పీకర్‌కు లేఖలు ఇప్పించండని ఆజాద్ ఈ సందర్భంగా కోరినట్లు తెలిసింది.

అందుకు కేకే ససేమిరా అన్నారు. తెలంగాణపై సానుకూల ప్రకటన వచ్చేవరకు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని, అలా చేస్తే ఆత్మహత్యగానే భావించాల్సి వస్తుందని కేకే స్పష్టం చేసినట్లు సమాచారం. రాజీనామాలు ఉపసంహరించుకోబోమని, తెలంగాణ సాధనే మా లక్ష్యమని కేకే తేల్చిచెప్పారు.
యాష్కీ నివాసంలో ఎంపీల భేటీ
ఆజాద్ నుంచి ఫోన్లు వచ్చిన నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ నివాసంలో సమావేశమై ఢిల్లీ పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు. కేకేతో పాటు యాష్కీ, మందా జగన్నాథం, జి.వివేక్, పొన్నం ్ర పభాకర్, బలరాం నాయక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధిష్ఠానం నుంచి రాజీనామాలపై వస్తున్న ఒత్తిడి విషయంపై ప్రధానంగా చర్చించారు. సోమవారం ఆజాద్‌తో సమావేశమైనపుడు అనుసరించాల్సిన వ్యూహం, లోక్‌సభ స్పీకర్ వైఖరి వం ఆంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం మీడియాతో మాట్లాడుతూ, రాజీనామాలపై రాజీ లేదన్నారు. చిత్త శుద్ధితోనే తాము రాజీనామాలు చేశామని, ఎంపీలు అందరం ఒకే డిమాండ్‌తో, ఒకే లైన్‌తో ముందుకు పోతున్నామన్నారు.

తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే దాకా తమ నిర్ణయంలో మార్పు ఉండదని తేల్చి చెప్పారు. లోక్‌సభ స్పీకర్ కూడా ఇప్పటి వరకు రాజీనామాలు చేసిన ఎంపీలతో సంప్రతింపులు జరుపలేదన్నారు. ఆజాద్‌తో కలిసిన తరువాతే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. రాష్ట్ర కాఁగ్రెస్ ఇన్‌చార్జీ ఆజాద్‌తో చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఢిల్లీ వెళ్లగానే, కేకే నివాసంలో మరో దఫా ఎంపీలు భేటీ కానున్నారు. సోమవారం పార్లమెంటు తొలి రోజు కావడంతో లోక్‌సభ మధ్యాహ్నం లోగా వాయిదా పడనున్నది. ఆ తరువాత ఆజాద్‌తో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సమావేశం కానున్నారు. మూడు రోజుల క్రితం ఆజాద్ ఎంపీలకు ఫోన్ చేసి రాజీనామాల విషయం చర్చించేందుకు ఢిల్లీ రావాలని పిలిచారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం చర్చల ద్వారానే సాధ్యం. తెగేదాకా లాగితే ఫలితముండదు.రాజీనామాలు చేసిన మేము కేంద్రంతో సంప్రతింపులు జరుపుతూ సానుకూల నిర్ణయం రాబ కృషి చేస్తాం.

- జానారెడ్డి



కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నట్లు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని గులాం నబీ ఆజాద్ నాకు రెండు మూడు సార్లు ఫోన్లు చేసి ఒత్తిడి చేశారు. రాజీనామాలపై మేం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశాం.

- కేశవరావు



కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించేవరకు రాజీనామాలపై పునరాలోచించేది లేదు. రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా స్పందించనట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ కష్టసాధ్యం.

- గుత్తా సుఖేందర్ రెడ్డి

aaru nurina thelangana vasthadi :kcr

‘‘పొరపాటున, ఏ కారణంచేతనైనా, పరిస్థితులు ఆగమై తెలంగాణ రాకుంటే సీమాంవూధులు బతకనిస్తారా? తెలంగాణకు ఒక్క చప్రాసి ఉద్యోగమైనా దక్కనిస్తారా? ఈ పరిస్థితిని ఊహించుకుం భరించలేకున్నాం. అటువంటి తెలంగాణ చూస్తూ నేనైతే గ్యారంటీగా బతికి ఉండను. విషం తాగి చనిపోవడం నయం. ఆరునూరైనా తెలంగాణను సాధించుకోవాలి. తెలంగాణ సాధించడం జీవిత లక్ష్యం కావాలి’’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం భారీ ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్న ఇలాంటి సమయంలోనే సమైక్య పాలకులు రకరకాల దురాగతాలకు పాల్పడుతున్నారని, ఒకవేళ పొరపాటున తెలంగాణ రాకుంటే పరిస్థితి ఊహించుకోలేమని ఆయన అన్నారు.

అందుకే యావత్ తెలంగాణ సమాజం ఇదే స్ఫూర్తితో ఐక్యం గా ఉండి తెలంగాణను సాధించుకునే వరకు విరామమెరుగకుం డా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర, జిల్లా కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన మండిపడ్డారు. 14ఎఫ్‌ను రద్దుచేసేవరకు ఎస్‌ఐ, డిగ్రీ లెక్చరర్ల పరీక్షలను వాయిదా వేయాలని ఆయన ముఖ్యమంవూతిని డిమాండ్ చేశా రు. పరీక్షలను రద్దుచేస్తే ఆయన కు వచ్చే నష్టం, కష్టం ఏముందని నిలదీశారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజావూపతినిధులు, కాంగ్రె స్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, యావత్ తెలంగాణ పరీక్షలను వాయిదా వేయాలంటుంటే ఆయన జులుం ఏంది? షరారత్ ఏంది? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

14ఎఫ్‌ను రద్దు చేయాలని అసెంబ్లీ ఏకక్షిగీవంగా చేసిన తీర్మానాన్ని ఉల్లంఘిస్తావా? అది ప్రివిలేజ్ కిందికి రాదా? అని ప్రశ్నించారు. మొండిగా వ్యవహరించడం సీఎం మూర్ఖత్వానికి పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇదేం నిరంకుశత్వం? అని ప్రశ్నించారు. పోలీసు ఫోర్స్‌తో దొంగచాటున బీహెచ్‌ఈఎల్‌లో పరీక్షలు నిర్వహించడమేందని ఆయన ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ఉద్యమాన్ని విరమించుకుంటే ఆస్తి అంతా రాసిస్తానని విజయవాడ ఎంపీ లగడపాటి ఆస్తి అంతా రాసిస్తానని విజయవాడ ఎంపీ లగడపాటి అంటున్నడు. ఇది విచివూతంగా ఉంది. లగడపాటి ఆస్తి ఎవరికి కావాలి. కాళ్లు మొక్కి ఇచ్చినా తీసుకోం.

తెలంగాణవాళ్లకు మందిసొమ్ము తినే అలవాటు లేదు’’ అని కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ఆంధ్ర ఎంిపీ కావూరి వెకిలి మాటలు మాట్లాడుతున్నారని, అలా మాట్లాడినందుకు సిగ్గు పడాలన్నారు. అసలు మెడ మీద తలకాయ ఉండి మాట్లాడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంవూధులు ఇంకా భ్రమల్లోనే ఉన్నారని, దోచుకొని తినడం అలవాటైంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. సకల సమస్యలకు తెలంగాణ రాష్ట్ర సాధనే పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. ముమ్మాటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉంటారన్నారు. తెలంగాణ సర్కారులో తాను కాపలా కాస్తూ ఉంటానన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పునర్నిర్మాణ పనులు ముఖ్యమని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమినివ్వడం, సంక్షేమ పథకాలను అమలు చేయడం, కుల, మతాల ప్రస్తావన లేకుండా అందరినీ ఒకే గొడుగు కింద రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు చదివించడం వంటి అనేక కార్యక్షికమాలను అమలు చేయాల్సి ఉంటుందన్నారు.

14ఎఫ్ రద్దు కోసం ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. విద్యార్థుల పోరాటాలకు అందరూ అండగా నిలవాలని కేసీఆర్ కోరారు. ఎస్‌ఐ, డిగ్రీ లెక్చరర్ల పరీక్షల రద్దు డిమాండ్‌తో సోమవారం తెలంగాణవ్యాప్తంగా భారీగా రాస్తారోకోలు నిర్వహించాలని, 2న తరగతులను బహిష్కరించి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని, 3న ముఖ్యమంత్రి, డీజీపీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని, 4న పరీక్షలను రద్దుచేసేందుకు సహకరించాల్సిందిగా పాలకులకు విజ్ఞప్తి చేయాలని, అప్పటికీ ప్రభుత్వం వినకుంటే 5న తెలంగాణ బంద్ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా చీమ చిటుక్కుమనొద్దు అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారం చూస్తుంటే ‘నహీ మర్త, కుచ్ నహీ కర్త’ (చావడు, ఏమీ చేయడు) అన్న చందంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సకల జనుల సమ్మె సందర్భంగా జరిగే జాతీయ రహదారుల దిగ్బంధాన్ని సూపర్‌హిట్ చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రహదారుల దిగ్బంధాన్ని ఎక్కడికక్కడ పూర్తిగా రాకపోకలు లేకుండా సక్సెస్ చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చురుక్కుమనాలన్నారు. రాకపోకలు అసలు లేకుండా చేయాలని ఆయన కోరారు. ‘‘మేం బస్సుల అద్దాలను పగులగొట్టం. శాంతియుతంగానే ఉద్యమిస్తాం. అప్పటికీ వినకుంటే ముఖ్యమంవూతిది, ప్రభుత్వంది ఖర్మ, నేనేమీ చేయలేను’’ అని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్వీ ఇంచార్జీ, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్వీ సెక్రటరీ జనరల్స్ గాదరి కిషోర్‌కుమార్, రాకేష్, వాసుదేవడ్డి, శ్రీనివాస్, వేణు, ప్రముఖ తెలంగాణ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు కళ్లెం యాదగిరిడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆరు తీర్మానాల ఆమోదం
ఈ సమావేశంలో ఆరు తీర్మానాలను ఆమోదించినట్లు టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. అవి: 1) తెలంగాణ సాధన గమ్యాన్ని చేరుకునేందుకు పోరాడాలి, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. 2) ప్రజావూపతినిధులంతా మళ్లీ రాజీనామాలు చేయాలి. 3) 14ఎఫ్‌ను రద్దుచేసేవరకు ఎస్‌ఐ, డిగ్రీ లెక్చరర్ల పరీక్షలను వాయిదా వేయాలి. 4) సకల జనుల సమ్మెను విజయవంతం చేయాలి. 5) ఫీజు రీఎంబర్స్‌మెంట్ అర్హులందరికీ వర్తింపజేయాలి. 6) ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల రద్దు కుట్రను విరమించుకొని హాస్టళ్లకు మరమ్మతులు జరిపి నిధులు విడుదల చేయాలి.

Friday, 29 July 2011

telangana ku anukulam ante a charcha kaina siddam:kothandaram

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ప్రకటిస్తే హైదరాబాద్ సహా ఏ విషయంపైనైనా చర్చించటానికి సిద్ధమని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించటానికి అవసరమైన మద్దతును అందచేస్తామని ఆయన విలేఖరులకు చెప్పారు. తెలంగాణను ఇవ్వటంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన తరువాతే ప్రభుత్వానికి సమస్య తీవ్రత అర్థమైందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం మొదలుపెట్టిన చర్చలు లక్ష్య సాధన దిశలో జరగటం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక ఎట్టి జాప్యం చేయకుండా ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆగస్టు ఒకటి లోపు తెలంగాణ గురించి స్పష్టమైన హామీ లభించకపోతే సకల జన సమ్మె తప్పదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకోసం తాము ప్రారంభించనున్న సకల జన సమ్మె గురించి జాతీయ పార్టీల నాయకులకు వివరించటానికే తమ ప్రతినిధివర్గం ఢిల్లీకి వచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణకు జాతీయ పార్టీల నాయకుల నుంచి పూర్తి మద్దతు లభించిందని ఆయన చెప్పారు.
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత: డిజిపి
హైదరాబాద్, జూలై 28: పోలీసు శాఖలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామని డిజిపి వి.దినేష్‌రెడ్డి చెప్పారు. అంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తరపున సభ్యులు డిజిపిని కలిశారు. ఈ సందర్భంగా సభ్యులు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను డిజిపి దృష్టికి తీసుకెళ్ళారు. సిబ్బందికి వెయిటేజ్ ఇంక్రీమెంట్, మహిళా పోలీసులకు సౌకర్యాలు వంటి అంశాలను వారు వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని డిజిపి హామీ ఇచ్చారు. డిజిపిని కలిసిన వారిలో అధ్యక్షుడు కెవి చలపతిరావు, ఉపాధ్యక్షుడు రవీంద్రకుమార్, గౌరవ అధ్యక్షుడు సి.రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.

october lo telangana:p shankar rao

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అక్టోబర్‌ మూడో వారంలో సానుకూల ప్రకటన రానున్నదని మంత్రి పి.శంకర్‌రావు పేర్కొన్నారు. నూటికి నూరుపాళ్లు తెలంగాణ వచ్చితీరుతుందని చెప్పారు. తాను చెప్పిన సమయానికంటే ముందే వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదన్నారు. గురువారం సిఎల్‌పిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావ ేశంలో ఎమ్మెల్యే ప్రసాద్‌, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు.

తెలంగాణ రావడం ఖాయం కనుక విద్యార్ధులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. అందరం కలసి తెలంగాణ కోసం పాటుపడాల్సి ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలిచ్చిన యాదిరెడ్డి కుటుంబానికి రూ.1లక్ష ఆర్ధిక సహాయం చేసినట్లు ఆయన వెల్లడించారు. యాదిరెడ్డి కుటుంబంలో ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణాలిచ్చిన శ్రీకాంత్‌చారి కుటుంబానికి కూడా ఔట్‌ సోర్సింగ్‌ కింద ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వ సహాయంతో ఇళ్లు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ కోసం మళ్లీ రాజీనామాలు చేయాలని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా రాజీనామాలు గొప్పవా, త్యాగాలు(ప్రాణత్యాగం) గొప్పదా అన్నది ప్రజాభిప్రాయం కోరాల్సి ఉందని పొంతన లేని సమాధానం ఇచ్చారు.

telangana kosam athmabali thanaloddu

తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుకు అనుకూల ప్రకటన అక్టోబర్‌ 3వ వారం లో వెలువడుతుందని మంత్రి శంకర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ర్టం కోసం ఢిల్లీ పార్లమెంటు ముందు ఆత్మ బలిదానం చేసుకున్న యాదిరెడ్డి కుటుంబాన్ని గురువారం మంత్రి శంకర్‌రావు, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ కొత్త సంజీవరెడ్డి పరామర్శించారు. యాదిరెడ్డి తల్లి చంద్రమ్మకు, తమ్ముడు ఓంరెడ్డిలకు మనోధైర్యం చ ెప్పారు. ఈసందర్భంగా మంత్రి శంకర్‌రావు, ఏఐసీసీ కార్యదర్శి పీ. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కోసం వేగవంతంగా చర్యలు జరుగుతున్నాయి.

అక్టోబర్‌ 3 వ వారంలో తెలంగా ణకు అనుకూల ప్రకటన రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. యాదిరెడ్డి ఆశయం త్వర లో నెరవేరనుందన్నారు. సోనియాగాంధీ తెలంగాణ కు అనుకూలంగా ఉందని చెప్పారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీ, తెచ్చేది తెలంగాణ అమరవీరులన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ గత 56 సంవత్సరాలుగా ఉందని తెలిపారు. రానురాను తెలంగాణ సెంటిమెంట్‌ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. 1956 లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతా లు కలిసి ఆంధ్ర రాష్ర్టం ఏర్పడింది. తెలంగాణ అమా యక అమ్మాయి, సీమాంధ్ర పోకిరీ అబ్బాయితో బం ధం ఏర్పడుతుందని ఆనాడు పండిట్‌ జవ హర్‌లాల్‌ నెహ్రూ అన్నారు.

ఏకారణాల వల్లనైనా విడిపోవచ్చని నెహ్రూ నిజామాబాద్‌లో చెప్పారు. ఇరు ప్రాంతాలు ఒకటైనప్పుడు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆఒప్పందాలను తుంగలో తొక్కారని అన్నారు. తెల ంగాణ ఉద్యమానికి ఉన్న చరిత్ర ప్రపంచంలో ఏ ఉద్యమానికి లేదని వివరించారు. ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలతో ఆత్మబలిదానం చేసుకో వద్దని పిలుపునిచ్చారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందామన్నారు. వారి వెంట గ్రామ సర్పంచ్‌ చేగూరి రామకృష్ణగౌడ్‌, మాజీ ఎంపీటీసీ ఖండిక రమేశ్‌, నాయకులు శ్రీరాంసాగర్‌, కృష్ణారెడ్డి, ఓంరెడ్డి లు ఉన్నారు. యాదిరెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన మందడి యాదిరెడ్డి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఏదైనా ఓ శాఖలో ఉద్యోగం పెట్టిస్తామని మంత్రి శం కర్‌రావు, ఎమ్మెల్సీ పీ. సుధాకర్‌రెడ్డిలు చెప్పారు. అదే విధంగా వారి కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్థిక సహా యం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వా రా వారికి ఇల్లు మంజూరు చేయడానికి కృషి చేస్తామ ని తెలిపారు. తెలంగాణ యువతీ-యువకులకు, తెలంగాణ ఉద్యమకారులకు అందిరికి ఆత్మబ లిదానాలు చేసుకోవద్దని ధైర్యంగా ముందుకు నడిచి తెలంగాణ సాధించుకోవాలని ఆయతతతన కోరారు.

poradi telangana sadhichukunda:nagam janardhan reddy

నిజామాబాద్ సాక్షిగా చెబుతున్నా..వాళ్లిచ్చేదేంది మనమంతా ఏకమై తెలంగాణ ను గుంజుకుందాం అని రాజీనామా చేసిన తాజా ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని నాయకులంతా ఏకం కావాలని ఐక్య పోరాటానికి తాము సిద్ధమన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట మందాడి యాదిరెడ్డి ప్రాంగణం లో జరిగిన తెలంగాణ ఐక్యతా దీక్షలో కూర్చున్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ లోని నాయకులంతా ఒకటి కావాలన్నదే ఐక్యతా దీక్ష ఉద్దేశమన్నారు. నాయ కులంతా ఒకటి కావాలని కానీ వారంతా తెలంగాణ ద్రోహులని అన్నారు.

తెలంగా ణ తెలుగు దేశం ఫోరం ఎమ్మెల్యేలు మొదట మేమే రాజీనామాలు చేశామని బస్సు యాత్ర జేసి చెపుకున్నా రాజీనామాల తిరస్కరించిన తర్వాత ఎందుకు రాజీనా మాలు చేయడం లేదని వాళ్లు ఇప్పుడెక్కడికి పోయిండ్రని నాగం ప్రశ్నించారు. వారికి కాగితం కలం దొరకడం లేదా? అని ఎద్దేవా చేశారు. నాటకాలు పక్కన బెట్టాలని వారికి హితవు పలికారు.

రాజీనామాల ఉచ్చులోంచి తిరస్కరించడంతో బయటపడ్డామని చంకలెగురుసుకుంటున్న దేశం,కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు మళ్ళీ రాజీనామాలు చేసేందుకు వెనుకాడుతున్నారని ఆరోపించారు.వారిని మళ్ళీ రాజీనామాలు చేయనివ్వకుండా సీమాంధ్ర పెట్టుబడిదారులు బేరసారాలు చేస్తున్నా రని ఆరోపించారు. ఇందుకు లొంగిపోయేందుకు కొందరు సిద్ధమై రాజీనామాలకు వెనుకడుగు వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు.

ఖబడ్దార్ ..ఎట్టి పరిస్థితుల్లో 141 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మళ్లీ రాజీనామాలు చేయాల్సిందేనని ఆయన హెచ్చరించారు. రాజీనామాలు చేయని వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని,ఆంధ్రోళ్లుగా గుర్తించాల్సి వస్తుందన్నారు. భావోద్వేగం లో చేసిన రాజీనామాలంటూ స్పీకర్ ఆమోదించకుండా తిరస్కరించడా న్ని ఆయన తప్పు పట్టారు.ఏం స్పీకర్ తమాషా చేస్తున్నావా..నిన్ను నిర్బంధం చేసైనా మా రాజీనామాలను ఆమోదించుకుంటామని అన్నారు. కాశ్మీర్‌లో ఒక మాట చైనాలో మరో మాట చెబుతూ తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకు లకు మోసం చేస్తున్న అ‘జాదు’లు తెలంగాణలో నడవవని అన్నారు.

ఆజాద్‌ను గద్దర్, దోకేబాజ్‌గా తిట్టాలని ఉందంటూనే తిట్టారు. మళ్లీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చర్చల పేరిట ఢిల్లీకి వెళితే వారిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. మనకు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం నుంచి బయటపడ్డ మా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలను నియమించే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు అసలు చార్జీ ఉందో లేదో తెలియని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అంతర్భాగమే హైదరాబాద్ అని ఆయన స్పష్టం చేశారు.

మా చార్మినార్,ఉస్మానియా ఆసుపత్రి,ఉస్మానియా క్యాంపస్, అసెంబ్లీ, సెక్రటేరియేట్ మీరొచ్చాక కట్టిండ్రా?తమిళనాడుల మిమ్మల్ని తంతే గతి లేక మా తెలంగాణలో అచ్చి పడ్డరని సీమాంధ్ర ప్రాంత ప్రజలనుద్దేశించి అన్నారు. మా ప్రాంత వనరులను దోచిన మీరు హైదరాబాద్‌ను వదలమంటారా?ఖబడ్దార్ అని హెచ్చరించారు.

తెలంగాణ విడిచి పెట్టిపోతరా? ఇలాగే హైదరాబాద్‌ను పేచిగా పెట్టి మా చీమల దండును రెచ్చగొడ్తరా? తేల్చుకోవాల్సింది ఆంధ్రోళ్లేనన్నారు.ద మ్ముంటే నిజామాబాద్‌లో సీమాంధ్ర మీటింగు పెట్టుండ్రి..చూద్దాం అంటూ వారికి సవాల్ విసిరారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సర్‌ప్లేస్ 10 కోట్ల నిధులను ఆంధ్ర పాల కులు మళ్లించుకున్నారని ఈ విషయాన్ని అప్పట్లో గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య బయటపెట్టి పెద్ద ఎత్తున ఉద్యమించారన్నారు.

1956 నవంబర్ నుంచి ఇలా మన ప్రాంత వనరుల దోపిడీ ప్రారంభమైందన్నారు. ఇదే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు 14 ఎఫ్ తొలగిస్తున్నామని అసెంబ్లీలో చేసిన తీర్మానం పాస్ చేసి ఇప్పుడేమో 14 ఎఫ్‌తో సంబంధం లేకుండా ఎస్‌ఐ రాత పరీక్షలు జరుపుతామని ప్రకటించడంపై ధ్వజమెత్తారు.విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని కోరారు.యాదిరెడ్డి పార్లమెంటు సాక్షిగా ఆత్మబలిదానమిచ్చి ఇదే ఆఖరి చావు కావాలని యావత్తు తెలంగాణ విద్యార్థి లోకానికి చాటి చెప్పాడన్నారు.ఇక చావులొద్దు తెలంగాణ సాధించి యాదిరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని నాగరం విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts