Saturday, 6 August 2011

telangana esthamani appu cheppaledu(తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదు):kavuri

తెలంగాణపై శుక్రవారం లోక్‌సభలో సావధాన తీర్మానం సందర్భంగా సీమాంధ్ర ఎంపీ కావూరి సాంబశివరావు ప్రసంగం ఆయన మాటల్లో..
రాష్ర్టంలోని వాస్తవాలను సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకొస్తున్నా. 2004 ఎన్నికల ప్రణాళికలోగానీ, సీఎంపీలోగానీ, రాష్ర్టపతి ప్రసంగంలోగానీ ఎక్కడా తెలంగాణను ఏర్పరుస్తామని కాంగ్రెస్ ప్రకటించలేదు. (ఈ చర్చలో కావూరికి ఎలా అవకాశం ఇచ్చారని బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, చర్చలో పాల్గొనాల్సి ఉన్న మరో ఇద్దరు సభ్యులు విరమించుకోవటంతో తన విశేషాధికారం ఉపయోగించి ఆయనకు అవకాశం ఇచ్చినట్లు స్పీకర్ పేర్కొన్నారు.)

కాకినాడలో బీజేపీ తీసుకున్న ఒక ఓటు - రెండు రాష్ట్రాల హామీ నుంచి వెనక్కు తగ్గటానికి బాధ్యుపూవరు? రాష్ర్టం నుంచి ఒక్క ఎంపీ లేని బీజేపీ మాట్లాడటం కడు దయనీయం. రాష్ర్టంలో రెండు శాతం ఓటు బ్యాంకు లేని పార్టీకి తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదు. రాష్ర్టంలోని అన్ని పార్టీల ఆమోదంతోనే శ్రీ కృష్ణ కమిటీ ఏర్పడింది. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి బుర్గుల రామకృష్ణారావు కోరిక మేరకే విశాలాంధ్ర ఏర్పడింది. పసంగం ముగించాల్సిందిగా స్పీకర్, చిదంబరం, ఆజాద్ పదే పదే కోరినా కావూరి ఆగలేదు. మైక్ కట్ చేసిన అనంతరం కూడా నిలబడి ఏదో మాట్లాడుతున్న ఆయనపై చిదంబరం అసంతృప్తిని వ్యక్త పరిచారు.)

loksabha lo Garginchina Sushma Swaraj

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశంపై శుక్రవారం నాడు లోక్‌సభ దద్దరిల్లిపోయింది. వాద ప్రతివాదాలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు.. విమర్శలతో హోరెత్తిపోయింది. కుటిల సమైక్యవాదం.. లోక్‌సభ సాక్షిగా పటాపంచలైంది. అడ్డగోలు వాదన మినహా సూటిగా సమాధానాలు చెప్పలేని దైన్యంలో సీమాంవూధవాదం చిన్నబోయింది. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత యావత్ భారతానికి చేరింది. మొట్ట మొదటిసారిగా తెలంగాణపై సుదీర్ఘ చర్చకు లోక్‌సభ వేదికైంది. తెలంగాణ ఆర్తిని, ఆత్మబలిదానాలను, రాష్ట్రం ఏర్పాటు అవసరాన్ని భారతజాతికి కళ్లకు కట్టినట్లు తెలియజెప్పడంలో తెలంగాణ ఆడబిడ్డ పాత్ర సమర్థంగా పోషించి, వూపతిపక్ష నేత సుష్మాస్వరాజ్ విజయవంతమయ్యారు. అటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సర్వే సత్యనారాయణ సైతం తెలంగాణ నా జన్మహక్కు అంటూ తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ స్థాయిలో గట్టిగా వినిపించారు.

తెలంగాణకు అడుగడుగునా జరిగిన అన్యాయాలను సవివరంగా ప్రస్తావించిన సుష్మ.. వివిధ ఒప్పందాలు ఉల్లంఘనకు గురైన తీరును ఎండగట్టారు. తాజా శ్రీకృష్ణ కమిటీ బండారాన్ని బయటపెట్టారు. నిక్కచ్చిగా.. ముక్కుసూటిగా సుష్మ చేసిన ప్రసంగంతో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి కావూరి సాంబశివరావు బిత్తర పోయారు. హోం మంత్రి చిదంబరం సమాధానాలు వెతుక్కునే పనిలో పడిపోయారు. చివరికి కొత్తగా ఏమీ చెప్పలేకపోయారు. పాత పాటలనే వల్లెవేశారు. ఓ దశలో సుష్మ ప్రసంగంతో కంగుతిన్న చిదంబరం.. తమ చేతిలో ఏమీ లేదని, తేల్చుకోవాల్సింది ఆంధ్రవూపదేశ్‌లోని రాజకీయ పార్టీలేనని పాత మాటలనే పునరుద్ఘాటించారు. తమ పార్టీలోనూ ఏకాభివూపాయం లేదని ఒప్పుకున్నారు.

సుష్మ మాట్లాడుతుంటే కావూరి సాంబశివరావు ఆమెకు అడుగడుగునా అడ్డుపడి అడ్డదిడ్డమైన వాదన చేశారు. కానీ.. ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు. రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ కూడా లేని బీజేపీ తెలంగాణ గురించి మాట్లాడటమేంటన్న కావూరి వాదనను సుష్మ దీటుగా తిప్పి కొట్టారు. కేంద్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మాట్లాడుతున్నామని చెప్పారు. గతంలోనూ తెలంగాణ కోసం మాట్లాడింది తామేనని చెప్పారు. కావూరికి బాసటగా మరో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి లగడపాటి నిలిచినా.. సుష్మ వాగ్ధాటితో మిన్నకుండిపోయారు. అర్థవంతమైన చర్చ జరగలేదని చిదంబరం తేల్చినా.. తెలంగాణపై కాంగ్రెస్ కచ్చితమైన నిర్ణయానికి రాలేదన్న వాస్తవం బయటపడింది. దీంతో ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన నేతలు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలన్న ఒత్తిడి రావచ్చునన్న వాదన వినిపిస్తున్నది. పార్టీకి విధేయతతో ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమవుతామంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉండదని పలువురు తెలంగాణవాదులు అంటున్నారు.

మొత్తం మీద మూడు నెలల్లో చర్చల ప్రక్రియను ముగిస్తామని చిదంబరం ప్రకటించడంతో సావధాన తీర్మానం లక్ష్యం కొంతలో కొంత నెరవేరిందనే చెప్పొచ్చు. చిదంబరం ప్రకటన నేపథ్యంలో మరో మూడు నెలల్లోగా తెలంగాణపై ఒక నిర్ణయం వెలువడుతుందనే ఆశ ప్రజాస్వామ్యవాదుల్లో, తెలంగాణ ప్రజల్లో నెలకొంది. అటు తెలంగాణపై పార్లమెంటులో గంటన్నర పాటు సాగిన చర్చ దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపనుండటంతో అధికార పార్టీ కొంత ఆత్మ రక్షణలో పడింది. తెలంగాణపై నిర్ణయం వెలువరించే ముందు రాష్ట్రంలో జరిగే లాభ నష్టాలను మాత్రం బేరీజు వేసుకుంటున్న అధికార పార్టీ, తాజా విస్తృత చర్చ అనంతరం తన పరిధిని విస్తరించుకోవచ్చన అభివూపాయం వినిపించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. రాజకీయ అవసరాల కోసం వాటిని తుంగలో తొక్కిందనే వాస్తవం చర్చ ద్వారా బహిరంగమవడంతో దేశ వ్యాప్తంగా ఆ పార్టీపై విశ్వసనీయత సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. పైగా ఇకపై కాంగ్రెస్ చేసే వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండబోదు.

ఆ దిశలోనే బీజేపీ చేసిన కృషి ఫలించిందని నిపుణులు అంటున్నారు. లోక్‌పాల్, ధరల పెరుగుదల, అవినీతిపై ప్రభుత్వాన్ని పెద్దగా ఇరుకున పెట్టలేక పోయిన బీజేపీ, తెలంగాణపై జరిగిన చర్చలో మాత్రం పై చేయి సాధించింది. అన్ని విషయాల్లో ప్రతిపక్షాల్లో చీలిక తెచ్చే అధికార పార్టీ తెలంగాణ విషయంలో మాత్రం పార్లమెంటు సాక్షిగా తానే చీలిపోయింది. సొంత పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులను కట్టడి చేయలేక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్, హోం మంత్రి చిదంబరం తలపట్టుకున్నారు. పార్లమెంటు గత సమావేశాల్లో నిరసన తెలిపిన టీ ఎంపీలను బెదిరించి బయటకు పంపిచినవూపణబ్ ఇప్పుడు మాత్రం సీమాంధ్ర నాయకుల పట్ల ఉదాసీనత ప్రదర్శించారు. సీమాంధ్ర ఎంపీలు కావూరి, లగడపాటి, ఆనంత, రాయపాటి, సబ్బం హరి తదితరులు చర్చకు ఆడుగడుగునా అడ్డుతగిలారు.

సావధాన తీర్మానంపై చర్చకు అనుమతిస్తున్నానని స్పీకర్ ప్రకటించిన వెను వెంటనే కావూరి లేచి నిలబడి ‘‘రాష్ట్రం గురించి వాస్తవాలు, గణాంకాలు తెలియని సుష్మ.. రాజకీయ కారణాలతోనే తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు’’ అని ప్రతిపక్ష నాయకురాలిని అవమాన పరిచే విధంగా వ్యవహరించారు. తామంతా చర్చకు అనుమతివ్వాలని ఎన్నిసార్లు కోరినా నిరాకరించి, బీజేపీకి అవకాశం ఎలా ఇస్తారని స్పీకర్ అధికారాన్నే ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అడ్డు తగలొద్దని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ప్రశాంతంగా చర్చ జరగకుండా సీమాంధ్ర ఎంపీలు తీవ్రంగా ప్రయత్నించారు. రాష్ట్రం నుండి ఒక్క ఎంపీలేని బీజేపీ తెలంగాణ గురించి మాట్లాడటం దయనీయం.... రాష్ట్రంలో రెండు శాతం ఓటు బ్యాంకు లేని పార్టీకి తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదు.. అంటూ సుష్మ ప్రసంగిస్తుండగానే రన్నింగ్ కామెంటరీలకు దిగారు.

మాట్లాడటానికి అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పినా.. తెలంగాణ విషయంలో తమ వైఖరి తప్ప మరో వైఖరి వినిపడకూడదనే తీరుగా ప్రవర్తించారు. అమరుడైన యాదిడ్డి ఆత్మహత్య లేఖలోని అంశాలను సభ దృష్టికి తేవాలని సుష్మాస్వరాజ్ ప్రయత్నిస్తుంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి లేఖ ఆయన వ్యక్తిగతమని, దాన్ని మీరెలా చదువుతారని కావూరి అభ్యంతరం పెట్టారు. యాదిడ్డి రాసిన లేఖ ఆయన రాసిందేనా? అన్న విషయం తేలాల్సి ఉందని అమరులను చులకన చేసి మాట్లాడారు. ఇక తమ పార్టీ ఎంపీ సర్వే సత్యనారాయణ మాట్లాడుతుండగా తెలంగాణ కోసం అందరూ రాజీనామాలు చేస్తే నువ్వేందుకు సభకొచ్చావంటూ వెటకారాన్ని ప్రదర్శించారు. ‘తెలంగాణ కోసం పార్లమెంటులో ఆత్మహత్య చేసుకుంటానన్నావు కదా’ అంటూ తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆత్మహత్యలే శరణ్యం అన్న విధంగా వ్యవహరించారు.

తెలంగాణకు మద్దతిస్తున్నా... ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలను గౌరవిస్తున్నానని గురుదాస్ దాస్ గుప్తా చెప్పినపుడు వీరావేశంతో బల్లలు చరిచిన సీమాంధ్ర ఎంపీలు ఆంధ్రా ప్రాంతం మొత్తం ఆగం కావొద్దనే అర్థంతోనే ఆయా ప్రాంతాను గౌరవిస్తున్నానని గురుదాస్ పేర్కొనడంతో చిన్నబుచ్చుకున్నారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకే సమైక్య రాష్ట్రం కోసం పాటు పడుతున్నామని అసత్యాలు పలికే సీమాంధ్ర నాయకులు, అక్కడి ప్రజలు బాగుండాలని ఎవరైనా కోరుకుంటే మాత్రం బల్లలు చరచలేని దైన్యంలో పడిపోయారు. చివరిలో మాట్లాడిన చిదంబరం.. తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. బంతిని రాష్ట్ర పార్టీల కోర్టుల్లోకి నెట్టారు. తెలంగాణ అంశంలో ముందుగా నిర్ణయం తీసుకోవాల్సింది ఆయా పార్టీలేనని తేల్చారు.

రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది ప్రధాన పార్టీల్లో నాలుగుకుపైగా పార్టీలు తెలంగాణపై తమ వైఖరిని ఇంత వరకూ ఖరారు చేసుకోలేదని చెప్పారు. ‘‘ఈ సమస్యకు పరిష్కారం తెలుగు మాట్లాడేవారి నుంచి, ఆంధ్రవూపదేశ్ ప్రజల నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను ముందుకు తీసుపోవటమే చేయగలదు. పార్లమెంటు కూడా ఆ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడమే చేయగలదు’’ అని చిదంబరం చేతుపూత్తేశారు. బీజేపీ సభ్యులు గోపీనాథ్ ముండే, రమేష్ కూడా చర్చలో పాల్గొనాల్సి ఉన్నా వారు ఉపసంహరించుకున్నారు.

Sushma Swaraj telugu matalu in loksabha

సోదర సోదరీమణులారా..
తెలంగాణ కోసం బలిదానాలొద్దు.. తెలంగాణ చూడటానికి
బతికుండాలి.. బతికుండాలి..
బతికుండాలి..


- సుష్మాస్వరాజ్ తెలుగు మాటలు





telangana na janmahakku:survey(తెలంగాణ నా జన్మహక్కు)

తెలంగాణపై శుక్రవారం లోక్‌సభలో సావధాన తీర్మానం సందర్భంగా తెలంగాణ ఎంపీ సర్వే సత్యనారాయణ (మల్కాజిగిరి) ప్రసంగం ఆయన మాటల్లో..

నాకు రాజకీయ జన్మనిచ్చిన సోనియాగాంధీ ఇక్కడ ఉంటే తెలంగాణ ఇచ్చి ఉండేవారు. అనారోగ్యంతో ఉన్న ఆమె త్వరగా కోలుకోవాలని తెలంగాణ ప్రజల తరుపున దేవున్ని ప్రార్థిస్తున్నా. సుష్మాస్వరాజ్ అన్నట్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగానే గాక ప్రత్యేక దేశంగా ఉండేది. తెలంగాణను భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుమీద మద్రాసు నుంచి విడిపోయిన సీమాంవూధతో కలిపారు. అప్పుడు మద్రాసు గురించి మాట్లాడిన సీమాంవూధులు ఇప్పుడు హైదారాబాద్ గురించి మాట్లాడుతున్నారు. నెహ్రూ మాటకు అనుగుణంగానే అవసరం అనుకున్నప్పుడు సీమాంవూధతో విడాకులు తీసుకుంటాం. కాంగ్రెస్ నాయకురాలు సోనియా తెలంగాణపై కొనసాగుతున్న వివక్షను అర్థం చేసుకున్నందునే తెలంగాణ ఇస్తుందనే విషయం తెలుసు. తెలంగాణ ఇవ్వాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ అందరూ నివసించవచ్చు. కేసీఆర్ అన్నట్లుగా ఆంధ్రావాలా భాగో అనే నైజం మాది కాదు. చిన్న రాష్ట్రాలే వేగవంతంగా ప్రగతిని సాధిస్తాయి. (తెలంగాణ కోసం పార్లమెంటులో ఆత్మహత్య చేసుకుంటానన్నావు అని సీమాంధ్ర నాయకులు కామెంట్ చేయగా..) యాదిడ్డిలాంటి పిల్లలు బలిదానాలు చేసుకోవద్దనే తెలంగాణకోసం కాంగ్రెస్ సభ్యులుగా ఆత్మహత్య చేసుకుంటామన్నాం. మా ప్రజలను చావనియ్యం. బాలగాంగాధర్ తిలక్ స్ఫూర్తిగా తెలంగాణ మా జన్మహక్కు. రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించండి. పసంగాన్ని తొందరగా ముగించాలని స్పీకర్ కోరగా) తెలంగాణ ప్రజలు చస్తున్నారు.. సుష్మాలాగా సీనియర్ కాకపోయినా తోటి సహచరులు రాజీనామా చేసినందున మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి.

ఉద్యోగుల సమ్మె, టీ మంత్రుల రాజీనామాలతో రాష్ర్టంలో పాలన అస్తవ్యస్థమైంది. (మరి మీరు రాజీనామా చేయలేదేం అన్న మాటలపై) నేను, అంజన్‌కుమార్ యాదవ్ రాజీనామాచేస్తే తెలంగాణ గురించి ఎవరు మాట్లాడుతారని రాజీనామా చేయలేదు. నాయకురాలిని ధిక్కరించను. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన (తెలంగాణ) కానుకను వెనక్కు తీసుకోరు. కొందరు ఆటంకాలు కల్పించి తెలంగాణను అడ్డుకున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అంటున్నారు. అది ఎవ్వరి జాగీరు కాదు. హైదరాబాద్ తెలంగాణకు తల లాంటిది. మొండెం నుంచి తలను వేరు చేయొద్దు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలి. విభజన, సమైక్యత అన్న రెండే రెండు అంశాల మీద నివేదించాల్సిన శ్రీ కృష్ణ కమిటీ ఇదంతా చెప్పడం అనవసరం.

అది రాజకీయ రిపోర్టు. ప్యాకేజీలు, అభివృద్ధి మండళ్లతో తెలంగాణకు న్యాయం జరగదు.. తెలంగాణ ఏర్పాటుతోనే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమవతుంది. నిర్దిష్ట కాలపరిమితి లేకుండా చర్చలు చేయడం అనవసరం. తెలంగాణ విషయాన్ని పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. యూపీని విభజించడానికి రెండో ఎస్సార్సీ అని అధిష్టానం అంటుంటే సీమాంవూధులు తెలంగాణకు కూడా అదే సూత్రంతో లింకు పెడుతున్నారు. ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డా సీమాంవూధులు అడ్డుకోవటంవల్లే తెలంగాణ రాలేదు. తెలంగాణను తాత్సారం చేస్తున్నందునే పిల్లలు మరణిస్తున్నారు. తెలంగాణ విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి వీడాలి.

esma gisma janthanai:jac(ఎస్మా..గిస్మా....జాన్తానై..!)

ఖమ్మంతెలంగాణ సాధనలో భాగంగా ఉద్యోగ జేఏసీ నిర్వహించ తలపెట్టిన ఆందోళలనల్లో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఐ ఎంఎల్, బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మద్దతును ప్రకటించాయి. పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో జరిగిన దీక్షలకు రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం ప్రకటించారు.

కొత్తగూడెంలో జరిగిన దీక్షలలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాబంశివరావు, పాల్వంచలో జరిగిన దీక్షలకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావులు సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగిన దీక్షల్లో ఉద్యోగులు ఎస్మా జీవో ప్రతులను దహనం చేశారు. ఈ దీక్షల్లో జిల్లాలోని ఆయా ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి.

నాలుగున్నర కోట్ల ఆకాంక్ష నెరవేరబోతోంది...
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష త్వరలో నెరవేర బోతోందని మంత్రి రాంరెడ్డి అన్నారు. కూసుమంచిలో జరిగిన దీక్షల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం మరలా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

సాధ్యమైనంత త్వరలో తెలంగాణ వస్తుందని, ఈమేరకు టీ కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారన్నారు. చర్చల అనంతరం ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ కోసం నాలుగున్నర కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారని , వారి ఆకాంక్ష నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సీమాంధ్రు లు రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని వారి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఇక్కడి వారు నిజమైన ఉద్యమ సారథులని కితాబిచ్చిన మంత్రి, తెలంగాణ అమర వీరుల త్యాగాలు వృథా కావన్నారు..

భయపడేది లేదు....
దీక్షల్లో పాల్గొన్న జేఏసీ నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఎస్మా చట్టం ప్రయోగిస్తామని బెదిరిస్తే భయపడేది లేదన్నారు. ఉడుత ఊపులకు మహావృక్షం ఊగదని, తెలంగాణ ఉద్యోగుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు.

ఈ దీక్షలల్లో జై తెలంగాణ , జైజై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సీఎం కూడా వారికి వంత పాడుతూ సీమాంధ్ర బుద్ధి చూపిస్తున్నారని విమర్శించారు.

అత్యవసర సర్వీసుల పేరుతో కీలకమైన ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఈనెల 17 నుంచి జరిగే సకల జనుల సమ్మెకు వెళ్ళకుండా చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. అందులో భాగంగానే ఎస్మా చట్టం పేరుతో బెదిరిస్తున్నాడని, ఆయనకు ఉద్యోగుల చేతుల్లో పతనం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు.

రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు మరల రాజీనామాలు చేసి ఆమోదింపచేసుకోవాలని, గతంలో రాజీనామా చేయని వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఉగ్రరూపం చూపక ముందే ప్రభుత్వాలు తెలంగాణ ప్రకటించాలని, లేకుంటే ఇక్కడి సీమాధ్రులను ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని అన్నారు.

ఈ ఆందోళనల్లో జేఏసీ చైర్మన్ కనకాచారి, ఉద్యోగ జేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, ఖాజామియా, టీజీవో ప్రదాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, సంగం వెంకటనర్సయ్య, బత్తుల సోమయ్య, మనోహర్, విజయ్ శ్రనివాసరావు, వెంకటేశ్వర్లు, భద్రయ్య వెంకటరెడ్డి, ప్రభాకర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 2 August 2011

తెలంగాణకు జరిగిన అన్యాయాలు

  • రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం కింద సేవలనందించటానికి ప్రబుత్వం అనుమతించిన హాస్పిటల్స్ 409 .వీటిలో 296 హాస్పిటల్స్ ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయ్ !తెలంగాణలో వున్నవి కేవలం 113 .ఈ 113 లో 36 ఆంధ్ర ప్రాంతీయులవే. 2010 మార్చి వరకు ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వం పెట్టిన మొత్తం కర్చు 1554 కోట్లు .ఇందులో ఆంధ్ర ప్రాంతం దక్కించుకున్న వాటా 1438 కోట్లు.తెలంగాణలో కర్చు చేసింది కేవలం 116 కోట్లు.ప్రజల ప్రాణాలను కాపాడే అపర సంజీవని అని చెప్పుకునే ఆరోగ్యశ్రీ లో కూడా తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది.
  • ఒక ప్రాంత వ్యక్తి ముక్యమంత్రి అయితే మరో ప్రాంత వ్యక్తికి ఉపముక్యమంత్రి పదవి ఇవ్వాలి .ఇది పెద్ద మనుషుల ఒప్పందంలో ముక్యమైన అంశం .1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రాయలసీమకు చెందినా నీలం సంజీవరెడ్డి cm అయ్యాడు.ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంత వ్యక్తిని ఉపముక్యమంత్రిని చేయాలి కాని అది జరగలేదు పైగా ఉపముక్యమంత్రి పదవి ఆరో వేలు వంటిదని వ్యాక్యనించారు నీలం.విచిత్రం ఏంటంటే......కర్నూల్ రాజధాని గ ఉన్న అప్పటి ఆంధ్ర రాష్ట్రానికి 13 నెలల పాటు ఉపముక్యమంత్రిగా పనిచేసాడు .
  • రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు 13,ఇందులో .....9 ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయ్!తెలంగాణలో ఉన్నవి నాలుగు కాలేజిలే .ఆ నాలుగింటిలో రెండు రాజధాని హైదరాబాద్ లో ఉన్నాయ్!ఆ రెండు నిజాం స్థాపంచిన ఉస్మానియా.......గాంధి మెడికల్ కాలేజిలు! మొత్తంగా రాష్ట్రంలో 1800 మెడికల్ సీట్లు ఉండగా .పది జిల్లాలు ,40 .69 శాతం జనాబా ఉన్న తెలంగాణకు దక్కినది కేవలం 600 సీట్లే !అంతేకాదు ......రాజధాని హైదరాబాద్లో ఉన్న 350 సీట్లలో సగం కూడా తెలంగాణ విద్యార్థులకు దక్కట్లేదు.
  • రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంగించి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లో 1969 నుంచి 1985 మధ్య కాలంలో 58 వేల మందియా ఆంధ్ర ప్రాంతీయులను నియనిన్చినట్టు జై భారత్ రెడ్డి కమిషన్ తేల్చి చెప్పింది!తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళనతో....1985 లో అప్పటి ప్రభుత్వం అక్రంగా నియమితులైన వ్యక్తులను వెనక్కి పంపడానికి జీవో 610...విడుదల చేసింది.ఒక సంవత్సరంలోగా ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది కాని 25 సంవత్సరాలు గడుస్తున్న నేటికి ఆ జీవో అమలుకు నోచుకోలేదు .మలి దశ తెలంగాణ ఉద్యమమ మొదలైన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం 610 జీవో పై వేసిన గిర్ గ్లాని కమిషన్ 2004 లో తన నివేదిక ఇచ్చింది.ఉల్లంగానాలు యదేచ్చగా కొనసాగుతున్నై అని తేల్చింది.రూల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని తేల్చి....వాళ్ళను వెనక్కి పంపాలని సిఫారసు చేసింది.నిజాన్ని కుండబద్దలు కొట్టిన నిజాయితి గల ఒక సీనియర్ అధికారి గిర్ గ్లాని సిఫారసు లకు ఇవాల్టికి దిక్కు మొక్కు లేదు.తెలంగాణ ఉద్యోగ సంఘాల లెక్క ప్రకారం ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగాల్లో రెండు లక్షల మంది ఆంధ్ర ప్రాంతీయులు పనిచేస్తున్నారు!
  • రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్యా 18,ఇందులో 12 ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయ్ తెలంగాణలో ఉన్నవి కేవలం 6 !మొత్తం గవర్నమెంట్ ఇంజనీరింగ్ సీట్ల సంఖ్యా 3760 ఇందులో 2625 సీట్లు.....అంటే సుమారు 70 శాతంఆంధ్ర కాలేజీ ల లో నే ఉన్నాయ్. తెలంగాణ విద్యార్థులకు అందుభాటులో ఉన్న సీట్లు 1135 మాత్రమే!వీటిలో కూడా రాజధాని లో ఉన్న 710 సీట్లు తెలంగాణ విద్యార్థులకు పూర్తిగా దక్కడం లేదు.

  • తెలంగాణ అనే అంశం పైకి లేచిన ప్రతి సారి చాల మంది తెలంగాణ లేదా ఆంధ్ర కు గుడ్డిగా సపోర్ట్ చేస్తారు .1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి మన తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉంది .మనకు జరిగిన అన్యాయాలు ఒక్కసారి చుడండి .


    1. తెలంగాణ లో 10 జిల్లాలు,ఆంధ్ర లో 9 జిల్లాలు మరియు రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయ్.ఇందులో తెలంగాణలోని 7 జిల్లాలు,ఆంధ్రలోని 3 జిల్లాలు,రాయలసీమలోని 1 జిల్లా వెనుక బడి ఉన్నాయ్ . అంటే దాదాపు 70% తెలంగాణ జిల్లాలు ,35% ఆంధ్ర జిల్లాలు మరియు 25% రాయలసీమ జిల్లాలు వెనక బడి ఉన్నాయ్.
    2. 45% రాష్ట్ర ఆదాయం తెలంగాణ నుంచి వస్తుండగా 28% మాత్రమే తెలంగాణకు కర్చు పెడుతున్నారు మిగితా ఆదాయాన్ని ఆంధ్ర మరియు రాయలసీమలో కర్చు పెడుతున్నారు.
    3. మాములుగా మనం కేనాల్స్ ద్వారా పంట సాగు చేస్తాం .ఆ కేనల్స్ ద్వారా సాగు అవుతున్నమన తెలంగాణ లోని భూమి ఒక్క గుంటూరు జిల్లా(ఆంధ్ర) లో సాగు అవుతున్న భూమి కన్నా తక్కువ అంటే నమ్మశక్యం కాదు.
    4. నాగార్జున సాగర్ డ్యాం నల్గొండ(తెలంగాణ) జిల్లా లో ఉంది .కాని దాని నుంచి కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు మాత్రమే సాగు అవుతున్నవి .
    5. రెండు పెద్ద నదులు ఐనటువంటి కృష్ణా మరియు తుంగబధ్ర నదులు రాష్ట్రంలోకి మహబూబ్ నగర్ లో ప్రవేశిస్తున్నై కాని ఆ జిల్లా ఎప్పుడు కరువుతో అల్లలాడుతుంది .
    6. RDS ప్రాజెక్టూ మహబూబ్ నగర్ లో 85000 ఎకరాలు సాగు చేయడానికి నిర్మించగా రాయలసీమ నాయకులూ ఆ ప్రాజెక్టూ గేట్లను పేల్చేసి కర్నూల్-కడప ప్రాజెక్టూ కు తరలిస్తున్నారు.
    7. తెలంగాణ జిల్లాల్లో సంవత్సరానికి ఒక్క పంటనే పండించగాలుగుతున్నాం కాని ఆంధ్ర మరియు రాయలసీమలలో మాత్రం ఒక సంవత్సరానికి మూడేసి పంటలు పండిస్తున్నారు కారణం నీరు .
    8. 1986 లో తెర పైకి వచ్చిన 610 G.O ఇప్పటి వరకు అమలు కాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు .మాములుగా 610G.O ఎక్కడి ప్రాంత ఉద్యోగాలు అక్కడి ప్రాంతం వాళ్ళు చేసుకోవాలని రూపొందించింది కాని ఆంధ్ర వాళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు రావని చేసిన కుట్ర ఇది .భారతదేశ చరిత్రలో 25 సంవత్సరాలుగా అమలు కాని ఏకైక G.O 610 G.O.
    9. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కింద తెలంగాణా లోని ఐదు జిల్లాలు ,సీమంద్ర లోని రెండు జిల్లాలు ఉన్నాయి ,ఆని ఉద్యోగులు మాత్రం సీమంద్ర నుంచు ఐదుగురు కాగ తెలంగాణా నుంచి ఇద్దరు ఇదెక్కడి న్యాయం సీమంద్ర పాలకులారా?ఒక్కసారి ఆలోచించండి
In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts