Tuesday, 20 September 2011
sep 24,25 rail roko(24,25న రైలు రోకో) jai telangana
సకలజనులసమ్మెలో భాగంగా ఈనెల 24,25లలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైలురోకోలు చేపట్టాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అక్టోబర్‌లో హైదరాబాద్ నగరాన్ని దిగ్భంధనం చేయనున్నట్లు తెలిపారు
thommido rojuku cherina sakala janula samme(తొమ్మిదో రోజుకు చేరిన సమ్మె)
తెలంగాణలో సకల జనుల సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించి తమ నిరసనను తెలుపుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఈ రోజు నుంచి దీక్షలో పాల్గొనున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని బంద్ చేస్తామని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. డాక్టర్లు, న్యాయవాదులు, విద్యార్థులు, లెక్చరర్లు సమ్మెలో పాల్గొంటున్నారు.
thikkulu pikkatillela thigbandam(దిక్కులు పిక్కటిల్లేలా దిగ్బంధం )
పయ్య తిరగలేదు..చీమ దూరలేదు
-అపూర్వ స్థాయిలో రోడ్లపై ఆందోళన
-ఢిల్లీకి సెగ తాకించిన రహదారుల దిగ్బంధం
- తొమ్మిది ప్రధాన కేంద్రాల్లోనూ విజయవంతం
- వందలాది ఉప కేంద్రాల్లో ఆందోళనలు.. లక్షలాదిగా పాల్గొన్న తెలంగాణవాదులు
- ఏక కంఠంతో జై తెలంగాణ నినాదాలు.. వేల సంఖ్యలో నిలిచిన లారీలు
- నల్లగొండ సరిహద్దుల్లో గోడ కట్టారు.. పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు బంద్
- డిపోల్లోనే బస్సులు.. విధులు బహిష్కరించిన 50వేల మంది ఆర్టీసీ కార్మికులు
- మోగని బడి గంటలు.. తెరుచుకోని కార్యాలయాలు
- మిన్నంటిన ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు.. పెరిగిన నిర్బంధం.. పలు చోట్ల అరెస్టులు
తొమ్మిది ప్రధాన కేంద్రాలు.. వందలాది ఉప కేంద్రాలు.. లక్షలాది ప్రజలు.. 14 గంటలపాటు.. జాతీయ రహదారుల దిగ్బంధం! పయ్య తిరగలేదు.. చీమ చొరబడలేదు..! ఏ ఉద్యమ చరివూతలోనూ లేనంతగా.. ఏ ఆందోళనలోనూ కనీవినీ ఎరుగనంతగా.. అపూర్వ ఉద్యమ సమ్మేళనం.. సకల జనులు ఒక్కటైన చేతనం! రహదారుల దిగ్బంధానికి ఆర్టీసీ సమ్మె తోడై.. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య సంబంధాలు తెగిపోయిన తరుణం! తెలంగాణ నుంచి సీమాంవూధకు వెళ్లిన బస్సు లేదు.. సీమాంధ్ర నుంచి తెలంగాణలోకి వచ్చిన వాహనంలేదు! అంతా దిగ్బంధం! కిలోమీటర్ల పొడవున స్తంభించిపోయిన ట్రాఫిక్.. వేల సంఖ్యలో నిలిచిపోయిన లారీలు.. బస్సులు.. ! పొరుగు రాష్ట్రాలకూ రోడ్లు మూసుకుపోయాయి! ఇది సోమవారం నాటి రహదారుల దిగ్బంధం, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫలితం! ఉదయం నుంచి రాత్రి దాకా ఉద్యమం హోరెత్తింది.
ఆదిలాబాద్ జిల్లా అంతపూరాష్ట్ర సరిహద్దు భోరజ్ వద్ద 20వేల మంది రోడ్లపైకి వస్తే.. మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద 40వేల మంది ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. నల్లగొండ జిల్లాలో 9వ నెంబర్ జాతీయ రహదారి దాదాపు 150 కిలోమీటర్ల మేర స్తంభించిపోయింది. రోడ్లపై 30వేల మంది ప్రజలు ఏక కంఠంతో జై తెలంగాణ నినాదాలు చేశారు. ఇతర తెలంగాణ జిల్లాలోనూ అదే జోరు కనిపించింది. పది జిల్లాల్లో మొత్తం 9,637 బస్సులుంటే కేవలం 45 బస్సులు మాత్రమే.. అదీ పోలీసు పహారాతో నడిచాయి. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దూకారు. బస్టాండ్లు బోసిపోయాయి. డిపోలన్నింటికీ తాళాలు పడ్డాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రసాధన దిశగా సకల జనుల సమ్మె ఏడు రోజులను పూర్తి చేసుకుంది! ఎక్కడా వాహనాలు తెలంగాణ సరిహద్దులను దాటలేదు. సరిహద్దులన్నీ జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లాయి.
అటు ఉద్యోగులు, కార్మికుల సమ్మె సమరోత్సాహంతో సాగుతున్నది. ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తెరుచుకోలేదు. ఫ్యాక్టరీ సైరన్ మోగలేదు. బడి గంట కొట్టనేలేదు. సింగరే గనుల్లో అదే నిర్మానుష్యం. వివిధ పట్టణాలు, గ్రామాల్లో నిరాహార దీక్షలు.. నిరసన ప్రదర్శనలు హోరెత్తించాయి. సమ్మెను అణచివేసేందుకు సీమాంధ్ర సర్కారు కుతంవూతాలు జోరు పెరిగాయి. నిర్బంధకాండ అమల్లోకి వచ్చింది. పలు జిల్లాల్లో భారీగా అరెస్టుల పర్వం సాగింది. సింగరేణిలో పోలీసులు విరుచుకుపడ్డారు. 30 మంది మహిళలు సహా 150 మంది కార్మికులను అరెస్టు చేశారు. ఓ కార్మికుడి కాలు విరగ్గొట్టారు. ఇటు రాజధానిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, నిజాం కాలేజీల్లో లాఠీలు విరిగాయి.. బాష్పవాయుగోళాలు పేలాయి.. రబ్బరు తూటాలు దూసుకొచ్చాయి! అయినా వెరవబోమన్న తెలంగాణవాదులు.. వేరుపడేదాకా ఉద్యమం విరమించేది లేదని ప్రతినబూనారు!!
sakala janula samme effect(సకలజనుల సమ్మె ఎఫెక్ట్)
ఎల్లుండునుంచే దసరా సెలవులు
పాఠశాలలకు దసరా సెలవులు ఈనెల 22 నుంచే ఇస్తున్నట్లు పాఠశాల సంచాలకులు ప్రకటించారు.
ఆర్టీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు:
సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. ఈ మేరకు ఆర్టీసీ యజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్: రేపటినుంచి ఉద్యోగాల్లో పాల్గొనే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఆర్టీసీ యజమాన్యం ప్రకటించింది.
ఆర్టీసీలో ఉద్యోగాలు:
ఆర్టీసీలో కండక్టర్లుగా, డ్రైవర్‌లుగా చేరదలచిన అర్హులైన అభ్యర్థులు ఆయా రీజనల్ కార్యాలయాల్లో ఇంటర్వూలకు హాజరు కావాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
సమ్మె విఛ్చిన్నానికి ఆర్టీసీ కుట్ర:
సకలజనుల సమ్మె విచ్ఛిన్నానికి ఆర్టీసీ యాజమాన్యం కుట్ర పన్నుతుందని ఆర్టీసీ తెలంగాణ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి ఆరోపించారు. తొలగించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
cm tho dgp beti(సీఎంతో డీజీపీ భేటీ)
సీఎం కిరణ్‌కుమార్‌తో డీజీపీ దినేశ్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. సకలజనులసమ్మె ప్రభావంపై చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని డీజీపీని సీఎం ఆదేశించారు.
sammetho dimma thirigindi(సమ్మెతో దిమ్మతిరిగింది..)
జిల్లాల్లో నిలిచిన బిల్లుల వసూళ్లు
- సై అన్న జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు
- సీమాంధ్ర చెత్త ఒకేసారి ఊడ్చేస్తామని ప్రతిన
- అప్రతిహతంగా ఆర్టీసీ, సింగరేణి సమ్మెలు
- వీరోచితంగా సాగుతున్న ఉద్యోగులు
- ఉద్యమ బాటలో హోరెత్తుతున్న జిల్లాలు
సర్కారుకు షాక్ శంఖారావం పూరించిన కరెంటోళ్లు
ఎనిమిది రోజులుగా అప్రతిహతంగా సాగుతున్న సకల జనుల సమ్మె.. మంగళవారం నాడు మరింత ఉధృతమైంది. ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాలు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు వీరోచితంగా సాగిస్తున్న సమ్మె సమరంలోకి మంగళవారం నాడు కరెంటోళ్లు దూకారు. సర్కారు కుర్చీకి కరెంట్ వైర్లు తగిలించి.. శాంపిల్ షాక్ ఇచ్చారు. మున్ముందు ఓల్టేజ్ పెంచి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తామని హెచ్చరిక చేశారు. తెలంగాణలో అత్యవసర సేవలు మినహా ఎలాంటి పనులు జరగబోవని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కరెంటు బిల్లుల వసూళ్లు నిలిచిపోయాయి.
మరోవైపు హైదరాబాద్‌లో పారిశుద్ధ్య కార్మికులు సైతం సై అన్నారు. తెలంగాణను శుభ్రం చేసుకోవడంతో పాటు.. సీమాంధ్ర చెత్తను ఒకేసారి ఊడ్చేస్తామని ప్రతినబూనారు. అటు కార్యాలయాలు తెరుచుకోక.. బొగ్గు గనుల్లో ఉత్పత్తి లేక.. ఆర్టీసీ చక్రం తిరగక కల్లోలానికి గురవుతున్న సీమాంధ్ర సర్కారు... సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రల పావులు కదిపింది. సకల జనుల సమ్మెపై కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో 74 కంపెనీల పారామిలిటరీని మోహరించిన ప్రభుత్వం.. మరో 25 కంపెనీల బలగాలు పంపాలని కేంద్రాన్ని కోరింది.
శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఖాకీలను ఉసిగొల్పుతున్నది. సర్కారు ఆదేశాలతో రెచ్చిపోయిన ఖాకీలు.. సోమవారం ఉస్మానియా వర్సిటీలో, నిజాం కాలేజీలో తమ ప్రతాపాన్ని చూపారు. సకల జనుల సమ్మె నేపథ్యంలో విలేకరులతో మాట్లాడిన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి... సమ్మె వల్ల నష్టపోతున్నది తెలంగాణేనని తేల్చారు. తెలంగాణ విషయం తన చేతిలో ఏమీ లేదని, ప్రజలంతా సహకరించాలని విన్నవించారు. సీఎం వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ‘‘నీ చేతిలో చేయడానికి ఏమీ లేనప్పుడు నువ్వు ఉన్నది ఎందుకు? గాడిద పండ్లు తోమడానికా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
kcr thiksha vaddu(కేసీఆర్... దీక్ష వదు!)
యోచన మానాలని తెలంగాణ శ్రేణుల ఒత్తిడి
పట్టువీడేది లేదంటున్న టీఆర్‌ఎస్ అధినేత
సర్కారు తీరుపై కేసీఆర్ ఆగ్రహం
- పోలీసుల దౌర్జన్యాలపై ఆవేదన
- ఇవే ఆయనలో పట్టుదల పెంచాయి?
- కేసీఆర్‌తో కేకే భేటీ
- సానుకూల నిర్ణయం రాకుంటే మేమూ మీతోపాటే దీక్షలో...
- కేసీఆర్‌కు కేకే ప్రతిపాదన!
- అక్టోబర్ 2 దాకా వేచి చూద్దాం
- జేఏసీ, టీఆర్‌ఎస్ నేతల సూచన
- ఉధృతంగా ఉద్యమిద్దామన్న జేఏసీ
- 24, 25 తేదీల్లో రైల్ రోకోలు
- అక్టోబర్ 15లోగా చలో హైదరాబాద్
తెలంగాణ సాధనలో మడమ తిప్పని పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మరోసారి ఆమరణ దీక్షకు దిగే అంశంపై తీవ్ర స్థాయిలో తర్జనభర్జనలు సాగుతున్నాయి. అయితే.. కేసీఆర్ మాత్రం తన పట్టు వీడటం లేదని తెలిసింది. కానీ.. తెలంగాణ ఉద్యమ శ్రేణులు కూడా అంతే స్థాయిలో కేసీఆర్ ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఉద్యమ రూపాలు చాలా ఉన్నందున, వాటిని ప్రస్తుతం తీవ్రంగానే అమలు చేస్తున్నందున అమరణ దీక్షను వాయిదా వేసుకోవాలని ప్రజా సంఘాలు, టీఎన్జీవో నేతలు, రాజకీయ పార్టీలు, నాయకుల నుంచి కేసీఆర్‌పై ఒత్తిళ్లు వస్తున్నాయి. కేసీఆర్ మరోసారి ఆమరణ దీక్షకు యోచన చేస్తున్నారన్న అంశం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆయనతో పలు వర్గాల నేతలు ఉదయం నుంచి సంప్రదింపులు జరిపారు. రాజ్యసభ సభ్యుడు, సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కే కేశవరావు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అమరణంపై చర్చలు జరిపారు. టీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చినందున అక్టోబర్ రెండో తేదీ వరకు వేచి చూడాలని, ఆ తరువాత ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని కేకే సూచించారు.
అటు జేఏసీ కూడా మరో దఫా ఉధృత కార్యక్షికమానికి సిద్ధమైంది. అక్టోబర్‌లో చలో హైదరాబాద్‌కు, ఈ నెల 24, 25 తేదీల్లో రైల్ రోకోలకు పిలుపునిచ్చింది. అక్టోబర్‌లో చలో హైదరాబాద్‌కు పిలుపు ఇవ్వాలని నిశ్చయించింది. తాము జైళ్లకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, తీవ్ర నిర్ణయాలు వద్దని జేఏసీ నేతలు, ఉద్యమ సంఘాల నాయకులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం తన పట్టు వీడటం లేదని టీఆర్‌ఎస్ ఆంతరంగిక వర్గాలు చెబుతున్నాయి. సకల జనుల సమ్మె మహోధృతంగా సాగుతున్న తరుణంలో కూడా కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల నుంచి ఉలుకూ పలుకూ లేకపోగా.. ఆందోళనకారులపై దౌర్జన్యాలు పెచ్చుమీరిపోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి. వీటన్నింటి ఫలితంగానే ఈ సారి ఎలాగైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనే పట్టుదల ఆయనలో పెరుగుతున్నదని వారు అంటున్నారు. కనుక తాను ఆమరణ దీక్షకు వెళ్లయినా సరే తన కర్తవ్యాన్ని నెరవేర్చాలని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే కేసీఆర్‌ను కలిసిన కేకే.. దీక్ష వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాజకీయ జేఏసీతో సంప్రతింపులు జరిపిన తర్వాతే దీక్ష విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన కేకేకు వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీ, న్యూడెమోక్షికసీ, సీపీఐ నేతలు సైతం దీక్ష వద్దని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాయి. దీంతో మంగళవారం సాయంత్రం లోటస్‌పాండ్‌లో జేఏసీలోని కీలక రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ సమావేశమయ్యారు. దీక్ష చేపట్టడంపై ప్రధానంగా చర్చించారు. దీక్ష వాయిదా వేయాలని వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్లపైనా చర్చ జరిగిందని సమాచారం. దీనిపై జేఏసీ స్టీరింగ్ కమిటీలో తుది చర్చ జరపాలని నేతలు భావిస్తున్నారు. ఉద్యమంలో అందరం కలిసి సాగుదామని, ఆమరణదీక్ష వద్దని ఉద్యోగ సంఘాలు సైతం కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చాయి. ఉదయం నుండి కేసీఆర్ ఇంట్లో జరిగిన సంప్రతింపుల సందర్భంగానే ఆమరణ దీక్షపై కేసీఆర్ ఒక ప్రకటన చేస్తారని అందరూ ఉత్కం గురయ్యారు. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న రాజీనామాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సమాయత్తమవుతున్నట్లు సంకేతాలు వస్తున్న తరుణంలో దీక్షను కొద్ది రోజుల పాటు వాయిదావేసుకోవాలని టీఆర్‌ఎస్ నేతలు కూడా కేసీఆర్‌కు సూచించినట్లు సమాచారం.
మరో మహోద్యమానికి జేఏసీ సమాయత్తం
కేసీఆర్ దీక్షపై చర్చించిన రాజకీయ జేఏసీ.. పలు ఉధృత పోరాట రూపాలను చర్చించింది. ఈ నెల 24, 25 తేదీల్లో భారీ స్థాయిలో రైల్‌రోకోలు జరపాలని నిర్ణయించారు. ఈ రెండు రోజుల ఉద్యమంతో ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి మధ్య రైళ్ల రాకపోకలు మొత్తం బంద్ అయ్యేలా ఉద్యమాన్ని రూపొందించాలని తీర్మానించారు. తద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ అంశం చర్చ జరిగేలా చూడాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ గతిని మార్చే రీతిలో అక్టోబర్ నెలలో చలో హైదరాబాద్‌కు పిలుపునివ్వాలని నిర్ణయానికి వచ్చారు. అక్టోబర్ 15లోగానే ఈ కార్యక్షికమానికి రూపకల్పన చేయాలని తీర్మానించారు.
నిర్ణయం రాకుంటే మేమూ దీక్షలోకి: కేకే
‘‘తెలంగాణపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే మేమూ దీక్షలో కూర్చుంటాం. అందరం కలిసి అమరణ దీక్ష చేద్దాం’’ అని కేసీఆర్‌తో తన భేటీ సందర్భంగా కేశవరావు ప్రతిపాదించినట్లు తెలిసింది. సుమారు గంటకు పైగా ఇద్దరూ ఆమరణ దీక్షపై చర్చించారు. తెలంగాణపై తామందరం కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నామని ఈ సందర్భంగా కేసీఆర్‌కు కేకే చెప్పినట్టు తెలిసింది. ఈ నెల 25న అధిష్ఠానాన్ని కలవడానికి ఢిల్లీ వెళుతున్నామని, కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని చెప్పినట్టు సమాచారం. గులాం నబీ ఆజాద్ కూడా ఈ నెల 30 వరకూ సమయం కోరినందున దీక్ష యోచన మానాలని కోరినట్టు తెలిసింది.
Subscribe to:
Posts (Atom)
Pages
In this blog it consists of all categories of
Telangana information such as Telangana
images,Telangana information,Telangana
maps,Telangana videos,Telangana movies,Telangana
news,Telangana history,Telangana
Samskruthi,Festivals of Telangana,Bathukamma :
Telangana Festival,bonalu........etc
Disclamier
The entire content available in this blog is my personal views only.
There is no connection with any one for the content I published in this blog.
I Just want to share my views about telangana. Because I am belongs to Telangana.
Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana...........
We do any thing for Telangana.
If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts