Monday, 25 July 2011

e sari andharu raginama cheyali:ktr

తెలంగాణ కోసం గతంలో రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులతో పాటు రాజీనామా చేయని వారు కూడా ఈసారి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్పీకర్ రాజీనామాలు ఆమోదించలేదనే కుంటిసాకుతో వెనక్కి తగ్గితే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజాభిప్రాయం ప్రకారమే ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని పిలుపునిచ్చారు. జైపాల్‌రెడ్డి తన నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సిగ్గుపడుతున్నానని అమరవీరుడు యాదిరెడ్డి రాసిన సూసైడ్ నోట్ చైసైనా జైపాల్‌రెడ్డి లాంటి వాల్లు కళ్లు తెరవాలని తెలిపారు. జైపాల్‌రెడ్డి ఇప్పటికే చాలా కాలం పదవిని పట్టుకుని వేలాడాడన్నారు. వెయ్యేళ్లు ఎవరూ జీవించరని, ఇప్పటికైనా, ఈ ముసలితనంలో తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసి తెలంగాణ ద్రోహిగా ముద్రపడకుండా జైపాల్‌రెడ్డి నడుచుకోవాలని కోరారు.

Saturday, 23 July 2011

Khammam lo telangana bandh prashantham

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించటాన్ని నిరసిస్తూ తెలంగాణ జెఏసి ఇచ్చిన బంద్ పిలుపు శుక్రవారం ఖమ్మం జిల్లాలో విజయవంతమైంది. సిపిఐ, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి, బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలతోపాటు ఉద్యోగుల జెఏసి కూడా బంద్‌లో పాల్గొంది. జెఏసితో కలిసి న్యూడెమోక్రసీ, బిజెపి బంద్‌లో పాల్గొనగా టిఆర్‌ఎస్, సిపిఐలు విడివిడిగా పాల్గొన్నాయి. కృష్ణా జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోకి ఎటువంటి వాహానాలు రానివ్వకుండా మధిర మండలంలో రోడ్లపై కంప వేశారు. ఖమ్మంలో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఫ్లెక్సీని సిపిఐ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

telangana pi charchalu malli malli

తెలంగాణపై చర్చల ప్రక్రియ మరోసారి ప్రారంభించేందుకు టి.కాంగ్రెస్‌ను ఒప్పించటంలో ఆ‘జాదూ’ విజయం సాధించారు. తెలంగాణను జీరోనుంచి మొదలు పెట్టక తప్పదని ఇంతకుముందు ప్రకటించిన ఆజాద్, కథను మళ్లీ అక్కడికే తీసుకొచ్చారు. శుక్రవారం తెలంగాణ ప్రజాప్రతినిధులతో మూడు గంటల పాటు విస్తృతంగా చర్చించిన ఆజాద్, అనంతరం సోమవారం నుంచీ ఇరుపక్షాలతో చర్చల ప్రక్రియ తాజాగా ప్రారంభం కానుందని మీడియాకు ప్రకటించారు. అందులో భాగంగానే సోమవారం పదిమంది తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతామన్నారు. అయితే, తెలంగాణపై తాజాగా చర్చలు ప్రారంభించే అంశంపై ఎంపీలు, మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఆజాద్ సమక్షంలోనే ఎంపీలు, మంత్రులు పరస్పర విమర్శలకు దిగినట్టు తెలిసింది. సీనియర్ నాయకులు జోక్యం చేసుకుని సర్దిచెప్పటంతో పరిస్థితి సద్దుమణిగింది. కొందరు ఎంపీలు సమావేశం ముగిసిన తరువాతా వాదులాడుకోవటం కనిపించింది. శుక్రవారం ఆజాద్‌తో మరోసారి సమావేశమైన టి.కాంగ్రెస్, సోమవారం నుంచి అధికారిక చర్చల్లో పాల్గొనేందుకు అంగీకరించారు. వాస్తవానికి శుక్రవారం నుంచే ఆజాద్‌తో అధికారిక చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆజాద్‌తో చర్చలు జరిపే పదిమందిని ఎంపిక చేసుకోవటంలో టి.కాంగ్రెస్ విఫలమైంది. తెలంగాణపై మళ్లీ చర్చలు ప్రారంభించాల్సిన అవసరం లేదంటూ ఇద్దరు ముగ్గురు ఎంపీలు గట్టిగా వాదించటంతో, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వారిపై విమర్శలకు దిగారు. ఇదిలావుంటే, ఆగస్టు 1నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే ‘తెలంగాణ’పై సానుకూల నిర్ణయం ప్రకటిస్తే రాజీనామాలు ఉపసంహరించుకుంటామని కొందరు ఎంపీలు ప్రతిపాదించారు. దీనిపై ఆజాద్ స్పందిస్తూ పరిమిత గడువులోగా తెలంగాణపై సానుకూల ప్రకటన చేయటం ఎంతమాత్రం సాధ్యం కాదని తెగేసి చెప్పినట్టు సమాచారం. యుపిఏ సంకీర్ణ సర్కారుకు ఎంపీల రాజీనామాల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా కుండబద్దలు కొట్టారు. దీంతో టి.కాంగ్రెస్ బృందం అయోమయంలో పడింది.
ముందు నిర్ణయించిన ప్రకారమైతే శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు పదిమంది నేతలతో తెలంగాణ అంశంపై ఆజాద్ అధికారిక చర్చలు ప్రారంభించాలి. అయితే ఆజాద్‌తో చర్చలు జరిపేందుకు వెళ్లాల్సిన పదిమందిని ఎంపిక చేసుకోవటంలో టి.కాంగ్రెస్ బృందం విఫలమైంది. మంత్రి కె జానారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు సాయంత్రం ఐదు గంటలకు ఆజాద్ వద్దకొచ్చి చర్చల అజెండా నిర్ణయిస్తే, చర్చలకు వస్తామని స్పష్టం చేశారు. ఇరువురు నేతలతో దాదాపు గంటపాటు చర్చలు జరిపిన ఆజాద్, అనంతరం మిగతా నేతలనూ అక్కడికి పిలిపించారు. ఆజాద్ మరోసారి 30మంది తెలంగాణ నేతలతో మూడు గంటలపాటు సంప్రదింపులు జరిపారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని టి.కాంగ్రెస్ గట్టిగా వివరించింది. దీనిపై ఆజాద్ స్పందిస్తూ ‘మీరిలా ప్రతిసారీ అందరూ మాట్లడుతూ కూర్చుంటే సమస్యను పరిష్కరించలేం’ అని స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర నేతల మధ్య ఏకాభిప్రాయం సాధించాలంటే ఇరుపక్షాలకూ చెందిన ఎంపిక చేసిన కొంతమందితో మాత్రమే సంప్రదింపులు జరుపుతామని ఆజాద్ తెగేసి చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యతపై మీ వాదన వినిపించింది. దానిపై సీమాంధ్ర నేతల అభిప్రాయాలు తెలుసుకుంటాం. వారు వ్యక్తం చేసే అంశాలపై మీ వాదనలు మళ్లీ వింటాం. ఇలా ఇరుపక్షాలతో పలు దఫాలు చర్చలు జరిపితేనే సమస్యకు పరిష్కారం కనుగొనే వీలు కలుగుతుంది’ అని ఆజాద్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే రాజధాని హైదరాబాద్ విషయంలో ఏం చేయాలనేది కూడా పరిశీలించవచ్చునని ఆయన సూచించినట్టు సమాచారం. ఇరుపక్షాలతో తాను జరిపే చర్చలపై ప్రభుత్వానికి, పార్టీకి నివేదిక అందిస్తానని, నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం ఉంటుందని టి.కాంగ్రెస్ బృందానికి ఆజాద్ స్పష్టం చేశారు. దీంతో సోమవారం నుంచీ తెలంగాణపై తాజా చర్చలు జరిపేందుకు టి.కాంగ్రెస్ అంగీకరించటంతో వివాదానికి తెర పడిందని అంటున్నారు.
రాజీనామాల విషయంలో విభేదాలు
ఎంపీ సభ్యత్వాలకు సమర్పించిన రాజీనామాలను యథాతథంగా కొనసాగించాలా? లేక ఉపసంహరించుకోవాలా? అనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల్లో విభేదాలు పొడసూపాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సానుకూల ప్రకటన చేస్తే రాజీనామాలు ఉపసంహరించుకుంటామని కొందరు ఎంపీలు చేసిన ప్రతిపాదనను మరికొందరు ఎంపీలు గట్టిగా వ్యతిరేకించారని అంటున్నారు. చర్చల పేరిట మరోసారి మోసం చేస్తున్నారని ఒకరిద్దరు ఎంపీలు ఆరోపించినట్టు తెలిసింది. కొందరు రాష్ట్ర మంత్రులు రాజీనామాల విషయంలో మెత్తపడ్డారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చలు
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చ జరిగింది. సీమాంధ్ర నేతలతో తాను జరిపిన చర్చల గురించి లోక్‌సభ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ వివరంచారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణ, సీమాంధ్ర నేతలతో జరుపుతున్న చర్చల గురించి కూడా కోర్ కమిటీ సమీక్షించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆజాద్ ఇరుపక్షాల నాయకులతో చర్చలు జరిపిన అనంతరం యుపిఏ సంకీర్ణ సర్కారు, కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ అంశంపై ఒక ప్రకటన చేస్తుందని అంటున్నారు.

telangana distircts lo telangana bandh prashantham

ప్రత్యేక తెలంగాణ కోసం ఈ నెల 20న ఢిల్ల్లీలో యాదిరెడ్డి ఆత్మహత్యకు నిరసనగా తెలంగాణ పొలి టికల్‌ జేఏసి పిలుపు మేరకు శుక్రవారం తెలంగాణ జిల్లాలలో నిర్వహించిన శుక్రవారం బంద్‌ విజయవంతమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలను మూసివేసి బంద్‌కు మద్దతు పలికారు. బంద్‌ కారణంగా తెలంగాణ జిల్లాల్లో ఆర్టీసీ సర్వీసులు ఎక్కడి వక్కడే నిలిచి పోయాయి.

రాజధాని నుండి జిల్లాలకు బయలు దేరాల్సిన బస్సులు ఎమ్‌జిబిఎస్‌, జూబ్లీ డిపోల లోనే నిలిపి వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులను ఎదుర్కొన్నారు. అదిలాబాద్‌ జిల్లాలోని ఆరు డిపోల ముందు తెరాస, ఐకాస నేతలు బైటాయించడంతో 600 బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. అదేవిదంగా మెదక్‌ జిల్లాలో ఏడు డిపోల పరిధిలో 550 బస్సులు, మహబూబ్‌నగర్‌జిల్లాలోని లోని ఎనమిది డిపోల పరిధి లోని 804 బస్సులు , నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల పరి ధిలోని 705 బస్సులు, కరీంనగర్‌ జిల్లా పరిధిలోని 11 డిపోలలో ఉన్న 865 బస్సులు, నిజామాబాద్‌ జిల్లాలో 630 బస్సులు రహదారులపైకి రాలేకపోయాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో...
బంద్‌ కారణంగా జిల్లాలో వ్వాపార సంస్థలు, రవాణ సౌకర్యాలు స్థంబించి పోయాయి. జిల్లాలోని షాద్‌నగర్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, గద్వాల డిపోలలో బస్సులను నిలిపివేశారు. ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదు ర్కొన్నారు. ఆర్టీసీకి శుక్రవారం ఒక్కరోజే రూ. 70 లక్ష లకు పైగా నష్టం వచ్చినట్లు అధికారుల అంచనా. యాది రెడ్డి మృతిపై తెలంగాణవాదులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. సీమాంధ్రులకు వ్యతిరెకంగా నినాదాలు చేస్తూ యాదిరెడ్డికి నివాళులు అర్పించారు. టీడీపీ, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమక్రసి, ఐఎన్‌టియుసి, ఎబి విపి, టిఆర్‌ఎస్‌వి, పాలమూర్‌ యూనివర్షిటి విద్యార్థులు బారీగా ర్యాలీలు నిర్వహించి అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.మండల కేంద్రా లలో యాదిరెడ్డికి నివాళులు అర్పించారు.

మెదక్‌ జిల్లాలో...
చెదురుమదురు సంఘటనలు మినహా మెదక్‌లో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోల్‌, మెదక్‌, సిద్దిపేట, గజ్వేల్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో ప్రశాంతంగా బంద్‌ జరగడమే కాకుండా చిన్న చిన్న సంఘటనలు చోటుచేసు కున్నాయి. నారాయణఖేడ్‌లో ఒకరు, సిద్ధిపేటలో నలు గురు యువకులు సెల్‌టవర్‌పైకెక్కారు. హరీష్‌రావుపై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకోవాలని లేకుంటే తీవ్రపరి ణామాలు జరుగుతాయని హెచ్చరించారు. కొండపాకలో ఒక వ్యక్తి టవర్‌పైకెక్కడానికి యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదాశివపేట మండలంలోని నిజాంపూర్‌లో ఒక ఆటో డ్రైవర్‌ సూసైడ్‌ నోట్‌రాసి ఆత్మ హత్య చేసుకున్నాడు. రాజకీయ నాయకులు బిజెపి, టీడీపీ, టిఆర్‌ఎస్‌, మరికొందరు న్యాయవాదులు, ఉద్యో గులు సంగారెడ్డి, కలెక్టరేట్‌ ఉద్యోగులు విధులను బిహ ష్కరించారు.

వరంగల్‌ జిల్లాలో...
బంద్‌ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. బ్యాం కుల నుండి కిల్లీ షాపుల వరకు అన్నింటిని మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జిలు ధరిం చారు. యాదిరెడ్డి మతికి నిరసనగా శాంతి ర్యాలీలు నిర్వ హించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో శాంతి ర్యాలీలు, పలుచోట్ల రాస్తారోకోలు చేసి ప్రత్యేక తెలంగాణ నినాదాలు చేశారు. వరంగల్‌లో అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని ఘనంగా నివాళులు అర్పించాయి. జిల్లా వ్యాప్తంగా బంద్‌ సంపూర్ణంగా జరిగింది. జిల్లాలోని ఎనిమిది బస్‌డిపోల నుంచి 900 బస్సులను ఆపివేశారు. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీకి శుక్రవారం ఒక్కరోజే రూ. 60 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. పోలీసులు భారీ పికె టింగ్‌లు, పెట్రోలింగ్‌లు చేపట్టారు. వరంగల్‌లో జరిగిన బంద్‌ కార్యక్రమంలో టిడిపికి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, హన్మకొండలో జరగిన కార్యక్రమాలలో టిఎన్‌జీవోస్‌ కేంద్రం సంఘం నాయ కులు పరిటాల సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లాలో...
బీజేపి, సిపిఐ (ఎంఎల్‌), జెఏసి, టిఆర్‌ఎస్‌ల ఆధ్వ ర్యంలో నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. రాస్తా రోకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు జెఏసి నాయకులు మాట్లాడుతూ సీమాంధ్ర నాయకుల ప్రలోభాలకు కేంద్రం తలొగ్గి రాష్ర్ట్ర ఏర్పాటు ప్రక్రియను జాప్యం చేస్తోందని తెలంగాణ కోసం బలి దానాలు జరుగుతున్న సోనియాగాంధీకి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు. యాదిరెడ్డికి ఘనంగా నివా ళులు అర్పించారు.

కరీంనగర్‌ జిల్లాలో...
జిల్లాలోని 11 డిపోలలో 900ల ఆర్టీసి బస్సులు డిపో దాటి బయటకు రాలేదు. దీంతో రవాణా స్తంభించి పోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గుర య్యారు.ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరు పట్టికలో సంతకాలు చేసి విధులు బహిష్కరిం చారు. హుజూరాబాద్‌ డివిజన్‌లో ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలి పారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను పలుచోట్ల దగ్ధం చేశారు. అన్ని పార్టీల శ్రేణులు బందులో పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో...
జిల్లా వ్యాప్తంగా బంద్‌ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరి గింది. ఉదయం నుంచి తెలంగాణ వాదులు ఆర్టీసి బస్సులు బయటకు వెళ్లకుండ ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, భైైంసా, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ డిపోల వద్ద బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టిఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలిపెట్టారు. బెల్లంపల్లి డివిజన్‌ పరిధిలో,జిల్లా కేంద్రంలో ర్యాలీలు, మోటార్‌సైకిల్‌ ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పా టును అడ్డుకుంటున్న నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అంతరాష్ట్ర సర్వీసులతో పాటు మరికొన్ని బస్సు లను పోలీస్‌ ఎస్కార్టు మధ్య మధ్యాహ్నం ప్రారంభించారు.

నిజామాబాద్‌ జిల్లాలో ..
జిల్లాలో శుక్రవారం జరిగిన బంద్‌ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు పూర్తిగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపి వేశారు. ఆరు డిపోల్లోని 630 బస్సులు సాయంత్రం వరకు డిపోలకే పరిమితమవటంతో ఆర్టీసీకి రూ.50 లక్షల నష్టం వాటిల్లినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. కామారెడ్డి, నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడ ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమ సంఘాల నేతలు డిపోల ఎదుట బైఠాయించారు.

ఖమ్మం జిల్లాలో ...
రాజకీయ జేఏసీ పక్షాలన్ని బంద్‌లో పాల్గొన్నాయి. జిల్లాలోని ఆరు ఆర్టీసీ బస్స్‌ డిపోల నుంచి ఒక బస్సుకూడా కదలలేదు.దీంతో జిల్లా ఆర్టీసీకి రూ. 20లక్షల ఆదాయం కోల్పోయింది. పాల్వంచలోని కెటిపిఎస్‌ ఉద్యోగులు విధు లకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దెందూకూర్‌- రాయ పట్నంరోడ్డు ఆంధ్రవాహనాలను అడ్డుకున్నారు.

telangana pi cheppalisindi cheppam:chandrababu

తెలంగాణ అంశంపై తెలు గుదేశం పార్టీ 2009 డిసెంబర్‌ 9కి ముందే చెప్పాల్సింది ఎప్పుడో చెప్పిందని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది అధి కారంలో ఉన్న కేంద్రమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ర్టంలో అనిశ్చితి తొలగించి నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్సేనన్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన మండల పార్టీ అధ్యక్షుల మూడో బృందం వర్స్‌షాప్‌లో చంద్రబాబు ప్రసంగించారు. సమావేశం ప్రారంభంలో ఢిల్లీలో ఆత్మ హత్య చేసుకున్న యాదిరెడ్డికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసం గింస్తూ యాదిరెడ్డి మృతి బాధాకరమని పేర్కొన్నారు.

యువకులు సమస్య పరిష్కారం చేయని ప్రభుత్వంపై పోరాడాలే తప్ప బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే అధికారులు విధులు నిర్వహి స్తారంటూ ఏపీ భవన్‌లో టిఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు ఓఎస్‌ డిపై దాడి చేయడాన్ని ఖండించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఆలస్యం చేయ కుండా తెలంగాణ అంశాన్ని తక్షణమే పరిష్కరించాలని డి మాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాన్ని అవినీతిలో ముంచి, అభివృద్ధిని దెబ్బతీసి అస్తవ్యస్తంగా మార్చిందని విమర్శించారు. టిడిపి కాపాడిన భూములను సెజ్‌ల పేరుతో ధారాదత్తం చేసి సొంత కంపెనీ లలో పెట్టుబడులు పెట్టించుకున్నారని విమర్శించారు.

ప్రాజెక్టులపై రూ.60 వేల కోట్లు ఖర్చు పెట్టినా 6 వేల ఎక రాలకు సాగునీరు అందించలేక పోయారని ధ్వజమెత్తారు. 18 నెలల్లో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న హామీ అతీగతీ లేకుండా పోయిందన్నారు. గోదావరిపై బాబ్లీ సహా 13 ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోలేక పోయారని, కృష్ణా, వంశధార వివాదాలను పరిష్కరించలేక పోయారని మండి పడ్డారు. ఉత్తర తెలంగాణ ఏడారిగా మారకూడదనే ఉద్దే శంతో మహారాష్టక్రు వ్యతిరేకంగా బాబ్లీపై పోరాడి జైలుకెళ్తే దానిని కూడా రాజకీయం చేశారనిఆవేదన వ్యక్తం చేశారు.

ఖనిజ సంపద దోచేశారు
ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలోని ఇనుప ఖనిజం మొత్తం గాలి జనార్ధనరెడ్డి, వైఎస్‌ జగన్‌లు లూటీ చేశారని చంద్ర బాబు నాయుడు ఆరోపించారు. 14 నెలల్లో రూ. 1800 కోట్లు దోపిడీ చేశారని ధ్వజ మెత్తారు. ముఖ్యమంత్రుల ప్రమేయంతోనే ఇది జరిగిం దన్నారు.

కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది...
నక్సలైట్ల చేతిలో మరణించినా, భూములు-ఆస్తులు కోల్పోయినా, అక్రమ కేసులలో చిక్కుకున్నా అధైర్యపడ కుండా టిడిపి జెండా మోస్తున్న కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదన్నారు. తనకు వచ్చిన పేరు ప్రతిష్ట అంతా కార్యకర్తల వల్లేనని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అన్నారు. ఎన్టీఆర్‌ మొమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా ఉచిత విద్య, వైద్యం, తాగు నీటి వసతి, ఉపాధి అవకాశాల కల్పన కార్యక్రమాలు చేపట్టామన్నారు.
చివరి రక్తపు బొట్టు వరకు కార్యకర్తల కోసం, ప్రజల కోసం పని చేస్తానన్నారు. ఈ సదస్సుకు నామా నాగేశ్వరరావు, దాడి వీరభద్రరావు, తుమ్మల నాగేశ్వర రావు, కడియం శ్రీహరి, రావుల చంద్రశేఖరరెడ్డి, అర వింద్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు హాజరై ప్రసంగించారు. పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

telangana lo bandh karanam ga nilichina rtc buses

తెలంగాణలో బంద్‌ కారణంగా నిలిచిన బస్సులు

నేడు తెలంగాణ బంద్‌ సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాలో బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. నగరంలోని ఎంజీబీఎస్‌, జూబ్లీబస్‌స్టేషన్‌ నుంచి వెళ్లాల్సిన బస్సులు నిలిపివేశారు. ఆదిలాబాద్‌లోని ఆరు డిపోల పరిధిల్లో 600 బస్సులు నిలిచిపోయాయి. ఉదయం నుంచే బస్సులు డిపోలనుంచి బయటికి వెళ్లనీయకుండా టిఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

మెదక్‌ జిల్లాలో ఏడు డిపోల పరిధిలో 550 బస్సులు, నిలిచిపోయాయి. డిపోల ఎదుట ఆందోళనకారులు ధర్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హకీంపేట డిపోనుంచి బస్సుల్ని బయటకు వెళ్లకుండా నిలిపివేశారు. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లాలో బంద్‌ సందర్భంగా 8 డిపోల్లో, 804 బస్సుల్ని నిలిపివేశారు. తెలంగాణ బంద్‌కి మద్దతుగా షాద్‌నగర్‌లో తెలంగాణ వాదులు రోడ్డుపై బైఠాయించారు. నల్గొండ రీజియన్‌లోని 7 డిపోల్లో 705 బస్సులు నిలిచిపోయాయి. టిఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు డిపోల ముందు బైఠాయించారు. కరీంనగర్‌లో 11 డిపోల్లో 865 బస్సుల్ని నిలిచిపోయాయి. నిజామాబాద్‌లో 630 బస్సులు డిపోలోనే ఆగిపోయాయి.

we will go with resign:t-congress

కాంగ్రెస్ అధిష్టానానికి ఆగస్టు 1 తేదిని డెడ్‌లైన్‌ను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నేతలు విధించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రక్రియపై కేంద్రం నుండి సానుకూల ప్రకటన రాకుంటే రాజీనామాలతో ముందుకు వెళ్తామని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రతినిధులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంటే తమకు అభ్యంతరం లేదని ఆజాద్‌కు తెలిపినట్టు సమాచారం. సీమాంధ్ర నాయకుల అభ్యంతరాలేమిటో తమకు తెలుపాలని ఆజాద్‌ను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు కోరినట్టు తెలిసింది. ఆజాద్‌తో సమావేశమనంతరం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ బయలుదేరారు.
In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts