ట్రాక్‌లపై వంటావార్పు
-ప్రయాణికులకు భోజనాలు పెట్టిన ఉద్యమకారులు
-నేతలపై పోలీసుల దౌర్జన్యం
-కరీంనగర్‌లో కలెక్టర్‌కూ నిరసనల సెగ
-రామగుండంలో సింగరేణి కళాకారుల ధూంధాం
-సింగరేణిలో బొగ్గు సరఫరాకు అంతరాయం
-నిలిచిన వందకుపైగా రైళ్లు
-హైదరాబాద్‌లో 35 ఎంఎంటీఎస్‌లు రద్దు
-598 మంది తెలంగాణవాదుల అరెస్ట్
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ‘ప్రత్యేక’ ఆకాంక్ష పట్టాలపై పరుగులు పెట్టింది. మిన్నంటిన తెలం‘గానం’ ముందు రైలు కూత చిన్నబోయింది. రైలు కంటే వేగంగా నిరసనల సెగ ఢిల్లీని తాకింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నిర్వహించిన రైల్‌రోకో విజయవంతమైంది. తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది ఉద్యమకారులు ఉదయాన్నే పట్టాలపైకి చేరుకుని బైఠాయించారు. పలు చోట్ల ట్రాక్‌పైనే వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. నగరంలోని చెర్లపల్లి, రంగాడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ నేత ఇంద్రసేనాడ్డి తదితరులు పాల్గొన్నారు. సికింవూదాబాద్‌లో బీజేపీ నేత దత్తావూతేయతోపాటు వందలాది మంది తెలంగాణవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్‌లో ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే హరీష్‌రావు తదితరులు పట్టాలపై బైఠాయించి అక్కడే భోజనాలు చేశారు.
కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావును పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో పలు ఎక్స్‌వూపెస్ రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. నల్లగొండలో పోలీసులు ఉద్యమకారులపై చేయిచేసుకున్నారు. కరీంనగర్‌లో కలెక్టర్‌కూ ఉద్యమ సెగ తగిలింది. పలుచోట్ల ఉద్యమ నేతలను పోలీసులు అరెస్ట్ చేయగా నిరసనగా స్టేషన్ల వద్ద ధర్నాకు దిగారు. రామగుండంలో కళాకారులు ధూంధాం నిర్వహించారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో సింగరేణి నుంచి బొగ్గు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. హైదరాబాద్ నగరంలో 35 ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు వందకుపైగా ఇతర రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసి కొన్నింటిని దారి మళ్లించింది.
టీ న్యూస్, నెట్‌వర్క్: రంగాడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ నాయకుడు ఇంద్రసేనాడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు ప్రభాకర్, రాంమోహన్‌రావు, పీఓడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య, జిల్లా జేఏసీ చైర్మన్ చల్మాడ్డి తదితరులు పట్టాలపై బైఠాయించారు. దక్షిణాద్రి, పద్మావతి ఎక్స్‌వూపెస్‌లను నిలిపివేశారు. తాండూరులో రాజ్‌కోట్, గరీబ్థ్,్ర హుస్సేన్ సాగర్ ఎక్స్‌వూపెస్‌ను ఆపివేశారు. వికారాబాద్‌లో ప్యాసింజర్‌తోపాటు గూడ్స్‌రైలును టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిలిపివేశారు. శంకర్‌పల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్, టీఆర్‌ఎస్ పశ్చిమ రంగాడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పండిత్‌రావు ఆధ్వర్యంలో పట్టాలపై బైఠాయించగా పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్‌లో నిజామాబాద్ ఎక్స్‌వూపెస్‌ను నిలిపివేశారు. సికింవూదాబాద్‌లో పట్టాలపై నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేత బండారు దత్రావూతేయ, టీఆర్‌ఎస్ నేతలు పద్మారావు, సదానంద్‌తోపాటు వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జేఏసీ కన్వీనర్ కోదండరాం, కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్యతోపాటు వందలాది మంది ఉదయం 6 గంటలకే చర్లపల్లిలో పట్టాలపై బైఠాయించారు.
విద్యానగర్‌లో టీఆర్‌ఎస్ నగర కార్యదర్శి కట్టా సుధాకర్ ఆధ్వర్యంలో రైల్‌రోకో నిర్వహించారు. నగరంలో 35 ఎంఎంటీఎస్ రైళ్లు సాయంత్రం 6 గంటల వరకు రద్దయ్యాయి. ఖమ్మం జిల్లాలో రైళ్లను అడ్డుకున్న 250 మంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో 60 వేల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయా యి. మణుగూరులో కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్‌ను, కారేపల్లి గాంధీనగర్, మధిర, గార్ల, తడికలపూడిలో గూడ్స్ రైళ్లను అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, పొలిట్‌బ్యూరో సభ్యుడు రామారావు, సుబ్బారావు, రామ్మూర్తి, నరేందర్, సీపీఐ ఎంఎల్ నాయకులు చంద్రశేఖర్, వెంక సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌డ్డి తదితరులను అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా ఈదులనాగులపల్లి వద్ద ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే హరీష్‌రావు పట్టాలపై బైఠాయించారు.
వడియారం వద్ద మాజీ ఎమ్మెల్యేలు రామలింగాడ్డి, పద్మాదేవేందర్‌డ్డి రైల్‌రోకోలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్‌నగర్ వద్ద నాగాపూర్ - కాజీపేట ప్యాసింజర్‌ను నిలిపివేశారు. 75 మందిని అరెస్ట్ చేశారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే అరవిందడ్డి, మందమపూరిలో ఎమ్మెల్యే నల్లాల ఓదెలు నేతృత్వంలో రాస్తారోకో చేశారు. సిర్పూర్‌లో మాజీ ఎమ్మెల్యే రాజ్యలక్ష్మి, ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్ నేత గోవర్ధన్‌డ్డి, జిల్లాలోని తూర్పు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సతీశ్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు జితేందర్‌డ్డి, బెక్కెం జనార్దన్, శారద, యమున, మహెమూద్, మోహన్‌బాబు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైల్‌రోకోలో పాల్గొనగా, బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాం డుడ్డి, రాములు, కొండయ్య పాల్గొన్నారు.
జడ్చర్లలో టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు లక్ష్మాడ్డి, నాయకులు అంజయ్యయాదవ్, జేఏసీ కన్వీనర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. మధనాపురంలో టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నిరంజన్‌డ్డి, టీఆర్‌ఎస్ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌డ్డి, బీజేపీ నాయకులు ప్రభాకర్‌డ్డి, బి.కృష్ణ పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో టీఆర్‌ఎస్ నాయకులు వెంకవూటామ్‌డ్డి, శ్రీధర్‌డ్డి, బీజేపీ నాయకుడు నింగిడ్డి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో జేఏసీ కన్వీనర్ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో రైల్‌రోకో చేస్తుండగా హుజూర్‌నగర్ సీఐ విజయ్‌కుమార్ జేఏసీ నేతపై చేయిచేసుకోవడంతో, తెలంగాణవాదులు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగా రు. చిట్యాలలో చౌటుప్పల్ సీఐకి, జేఏసీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వలిగొండలో పట్టాల మీదనే వం టావార్పు నిర్వహించగా, రాయగిరి వద్ద రెండు గూడ్స్ రైళ్లను నిలపివేశారు.
భువనగిరిలో బీజేపీ నేత ఇంద్రసేనాడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి, రామగుండం మీదుగా ఢిల్లీ వెళ్లే రైళ్లన్నీ ఆగిపోయాయి. జగిత్యాలలో సిర్పూర్ కాగజ్‌నగర్‌కు వెళ్లే పుష్‌పుల్ ఫాస్ట్ ప్యాసింజర్‌ను అడ్డుకున్నారు. పెద్దపల్లిలో పట్టాలపై బైఠాయించిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణాడ్డి, టీఆర్‌ఎస్ నేతలు సత్యనారాయణడ్డి, మనోహర్‌డ్డిని అరెస్టు చేశారు. అరెస్టుకు నిరసనగా రాజీవ్హ్రదారిపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి, కలెక్టర్‌ను అడ్డుకున్నారు. రామగుండంలో సింగరేణిలో ధూంధాం నిర్వహించారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో పట్టాలపై బైఠాయించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితోపాటు సీపీఐ, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నేతృత్వంలో పట్టాలపై వాలీబాల్ ఆడారు. అజంతా ఎక్స్‌వూపెస్‌ను నిలిపివేశారు. సదాశివనగర్ రైల్వే స్టేషన్‌లో ఎల్లాడ్డి ఎమ్మెల్యే రవీందర్‌డ్డి పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో రైళ్లను అడ్డుకున్న తెలంగాణవాదులు ప్రయాణికులకు నీళ్లు, ఆహారం సరఫరా చేశారు. పలు స్టేషన్లలో లింకు, చార్మినార్, గౌతమి, రాజేంవూదనగర్, భాగమతి ఎక్స్‌వూపెస్ రైళ్లను నిలిపివేశారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిడ్డి, న్యాయవాదులు గుడిమళ్ల రవికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావు అమరేందర్‌డ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ సహోదరడ్డి తదితరులు రైలు రోకోల్లో పాల్గొన్నారు. డాక్టర్స్ ఫోరం రైల్వే స్టేషన్లలో వైద్య శిబిరాలు నిర్వహించారు. పోలీసులు వందలాది మందిని అరెస్టు చేశారు. జనగామలో టీఆర్‌ఎస్ నేత యాదగిరిడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో జీవీఆర్, నెక్కొండలో పార్టీ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, పరమేశ్వర్, విద్యాసాగర్, ఎల్గూర్‌రంగంపేటలో సిరికొండ మధుసూదనచారి, కాజీపేటలో దాస్యం వినయభాస్కర్, మహబూబాబాద్‌లో తక్కళ్లపల్లి రవీందరరావు సహ పలువురి నేతలపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తన్నది.
Friday, 15 July 2011
Subscribe to:
Post Comments (Atom)
Pages
In this blog it consists of all categories of
Telangana information such as Telangana
images,Telangana information,Telangana
maps,Telangana videos,Telangana movies,Telangana
news,Telangana history,Telangana
Samskruthi,Festivals of Telangana,Bathukamma :
Telangana Festival,bonalu........etc
Disclamier
The entire content available in this blog is my personal views only.
There is no connection with any one for the content I published in this blog.
I Just want to share my views about telangana. Because I am belongs to Telangana.
Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana...........
We do any thing for Telangana.
If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts
No comments:
Post a Comment