Thursday 21 July 2011

Renuka Yellamma

Medaram Sammakka & Saralamma Jathara (Telangana Temple)

Sammakka Sarakka Jatara

MEDARAM JATHARA SAMMAKKA SARAKKA WARANGAL

Medaram Jatara

sammakka saralamma

sammakka sarakka koya cultural dance at maraigudem.mp4

Sammakka Sarakka Jatara and history

telangana brathuku chithram

ఏటి కాల్వలు ఎండుకుపోయినాయి ,

బీడు భూములు నోరు తెరిసినయి

కంటికి పుట్టెడు దుక్కం తీసిరి

చుక్క నీరుకై పుడుక తీసిరి

ఎదురు తిరుగుతాం ఎత్తర జెండా తెలంగాణా కు

ఎదురు తిరిగె వారిని ఎల్లగొడుతం

Sammakka Saralamma Jatara :Telangana Festivals

Medaam Sammakka Saralamma Jatara



Sammakka Saralamma Jatara is the one of the recognized
and famous festival in Telangana. This is also called Medaram Jatara
this is the trinal festival of honoring the goddesses celebrated in Telangana
region of Andhra Pradesh, India it is the story about valiant fight of a mother
and daughter. they are Sammakka Sarakka Jatara,Sammakka Jatara with the reigning rulers against an
injust law.

Medaram Jatara this is biggest festival in all over india. medaram is located
120 kms away from warangal city.
Medaram Jatara
it is also called Sammakka Saralamma Jatara
Medaram is a village in warangal district, Andhra Pradesh In INDIA.
A popular geligious congregation or Jatara called Sammakka Sarakka Jatara place
for threee days biennially in this village.

today 22July Telangana bandh- TJAC

Telangana political Joint action committee has called for telangana bandh, prof.Kodandaram talking to press told that”government is suppressing workers employees agitating right. Andra Pradesh Chief minister N.Kiran Kumar Reddy is threatening of using Essential Services Maintenance ACT( ESMA). Political parties TRS, BJP, Nagam Group are supporting the bandh.”

Telangana -simandhra Congress leaders bheti

తెలంగాణ-సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ
ఉద్యమం ఉప్పెనలా సాగుతున్న తరుణంలో కొందరు సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆమోస్, యాదవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి భేటీ అయి రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని తీర్మానించారు.

Supported the strike bjp

సమ్మెకు మద్దతు తెలిపిన బీజేపీ
తెలంగాణ ఉద్యోగుల పైన ఈగ వాలిన ఊరుకునేది లేదని బీజేపీ సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగరరావు తెలిపారు. సకల జనుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగులు ఏ నేరం చేశారని ఎస్మా ప్రయోగిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

telangana kosam yadireddy balithanam

తెలం గాణ రాష్ట్ర ఏర్పాటుకోసం మరో యువ కుడు దేశరాజధానిలో ఆత్మబలిదానం చేసుకున్నాడు. దేశరాజధానిలోని పార్ల మెంటు భవనం ముందు ఉరివేసుకుని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీ పెద్ద లకు తెలియపరుస్తూ ఆత్మహత్య చేసు కున్నాడు. అతడు రంగారెడ్డి జిల్లాకు ఆ పేరు రావడానికి కారణమైన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా రంగారెడ్డి స్వగ్రామం పెద్దమంగళారంకు చెందిన యువకుడు. కుటుంబసభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన మందాడి నర్సింహారెడ్డి, చంద్రకళల పెద్ద కుమారుడు యాదిరెడ్డి(30) గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో లంగర్‌హౌస్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ ఒక సారికూడా అప్పటి నుండి ఇంటికి రాలేదు.

కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేవాడు. 15 సంవత్సరాలక్రితం తండ్రి నర్సింహారెడ్డి మరణించాడు. యాదిరెడ్డికి తమ్ముడు ఓంరెడ్డి(27) చెల్లి మంగమ్మ(26) తల్లి చంద్రకళ(50) ఉన్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన యాదిరెడ్డి పార్లమెంట్‌ భవనం ముందు ఉన్న పార్క్‌లో వేపచెట్టుకు ఉరి వేసుకున్నాడని ఢిల్లీ పోలీసులు అతని స్నేహితులకు ఉదయం 9: 30 గంటలకు సమాచారం అందించారు. యాదిరెడ్డి స్నేహితుల ద్వారా మరణ వార్త అందుకున్న తల్లి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయింది. యాదిరెడ్డి బలిదానం వార్త విన్న గ్రామస్తులు స్నేహితులు ఇంటికి చేరుకుని వారి తల్లిని, కుటుంబసభ్యులను ఓదార్చి వారు యాదిరెడ్డితో గడపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుని కన్నీరు మున్నీరయ్యారు.

telangana kosam ikyamga vudhyamistham

తెలంగాణ సాధన కోసం అన్ని ప్రజా సంఘాలు, సంస్థలతో కలసి ఐక్యం గా ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌, తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ విమలక్క అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని వారు బీజేపీ కార్యాలయంలో కలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణపై కిషన్‌రెడ్డితో వారు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం కేంద్రం వైఖరి చూస్తుంటే తెలంగాణ ఇచ్చేది లేదన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. ఫలితంగా రాష్ట్రం లోని పార్టీలు, పోరాట సంస్థల్లో చీలికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం ప్రస్తుత తెలంగాణ రాజకీయ జేఏసీని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రణబ్‌ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యల తో తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారని కిషన్‌ రెడ్డి అన్నారు. కేంద్రం వైఖరి చూస్తుంటే తెలంగాణ ఇవ్వటం కష్టమని స్పష్టమవుతున్నదన్నారు.

Telangana employees strike

ప్రత్యేక తెలగాణ రాష్ట్రం ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంతానికి చెందిన వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యా మ్నాయ చర్యలకు దిగింది. అందులో భాగంగా.. ఉద్యోగులను సమ్మె కు వెళ్లకుండా నియంత్రించేందుకు వారిపై ఎస్మా (అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం) ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ మేరకు సమ్మె వల్ల ఏర్పడనున్న ఇబ్బందులు, ప్రత్యా మ్నాయ ఏర్పాట్లపై ముఖ్యమంత్రికి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమ్మె అనంతరం తలెత్తే పరిస్థితి వల్ల సామాన్యులు ఇబ్బంది పడకూడదని ఆదేశించారు.

ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్లే ముందే వారిపై ఎస్మా ప్రయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో 18 రోజుల పాటు చేసిన సమ్మె వల్ల వచ్చిన నష్టం, తలెత్తిన పరిపాలనపరమైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌ ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే సమ్మెపై ఎస్మా ప్రయోగించాలని సూచించినట్లు తెలిసింది. ఉద్యోగుల డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వ పరిథిలో లేని డిమాండ్లను తీర్చడం ఎలా సాధ్యమవుతుందని సీఎం అధికా రుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెలంగాణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిథిలోనిదని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలుంటే దానిపై చర్చించడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

ఇదిలాఉండగా... తెలంగాణకు చెందిన టీచర్లు, ఆర్‌టిసీ, విద్యుత్‌, రెవిన్యూ, వాటర్‌వర్స్‌, మునిసిపల్‌ తదితర విభాగాల సిబ్బందితోపాటు ఈ పర్యాయం సింగరేణి కార్మికులు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఒక ప్రకటన చేయాలని. లేకపోతే.. ఆగస్టు తొలి వారం నుంచి ప్రత్యేక రాష్ట్రం కోరుతూ తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసా ్తమని ఇప్పటికే తెలంగాణ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసిన సమ్మె నోటీసులో పేర్కొన్నాయి. మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ ఇప్పటికే ఈ ప్రాంత మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు తమ పదవులకు రాజీ నా మా చేశారు.

ఇదిలా ఉండగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై ఇటు సీమాంధ్ర నాయకులతోపాటు.. అటు కాంగ్రెస్‌ అధిష్టానం కూడా అంత ఆసక్తి కనబరచకపోవడంతో.. తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాయి.ఈ పరిస్థితుల్లో ఆగస్టు తొలి వారం నుంచి రాష్ట్ర ప్ర భుత్వ ఉద్యోగులు, టీచర్లు, సింగరేణి, ఆర్‌టిసి ఉద్యోగులు, ఇతర పరిశ్రమల పనిచేసే కార్మిక సంఘాలు తమ పోరాటాలను ఉధృతం చేయడానికి నిర్ణయించుకున్నాయి. అప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు స్పందించకపోతే నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోమని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో పౌరుల అత్యవసర సేవలకు ఎటువంటి అసౌ కర్యం కలుగకూడదని ప్రజల భద్రత, రక్షణ పట్ల అత్యంత జాగ్ర త్తగా వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీనిలో భాగంగా మున్పిపల్‌, శానిటేషన్‌, ప్రజా ఆరోగ్యం, గ్రామీణ, పట్టణ మంచి నీటి సరఫరా, పౌరసరఫరాల పంపిణీ, వైద్య ఆరోగ్య సేవలు, ప్రజా రవాణా, కమ్యూనికేషన్లు, విద్యుత్‌, బొగ్గు ఉత్పత్తి తదితర సేవల్లో ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కటు ్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా ముఖ్య మంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి బుధవారం అత్యవసర సేవలన్నీ యధా విధిగా రాష్ట్ర పౌరులకు చేరాలని ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికా రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

రెవెన్యూ వనరులపై ప్రత్యేక దృష్టి...
ఇటీవల జరిగిన ముంబై పేలుళ్లు, ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న బోనాలు, రంజాన్‌, గణేష్‌ చతుర్ధి వంటి పండుగల నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తగిన భద్రతా చర్యలు చేపడుతున్నది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె నోటీసుతో ఆగస్టు తొలి వారం నుంచి ప్రభుత్వ రెవిన్యూ ఆదాయం ఏమాత్రం తగ్గకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం వాణిజ్యం, ఎకై్సజ్‌, రవాణా, అటవీ, రిజిస్ట్రేషన్లు తదితర రెవిన్యూ శాఖల అధి కారులను ఆదేశించారు.

బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జె సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జి సుధీర్‌, డిజిపి దినేశ్‌రెడ్డి, ఇంట ిలిజిన్స్‌ ఐజీ మహేందర్‌రెడ్డి, సిటీ పోలీసు కమిషనర్‌ ఏకె ఖాన్‌, జిహెచ్‌ఎమ్‌సి కమిషనర్‌ ఎం.టి కృష్ణబాబు, ఆర్‌టిసి ఎమ్‌డి బి ప్రసాదరావు, ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో ఎమ్‌డిలు అజైయ్‌ జైన్‌, విజ యానంద్‌, హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ వర్క్స్‌ ఎమ్‌డి జగదీశ్వర్‌ తది తర అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగులపై ఉక్కుపాదం ః దేవీ ప్రసాద్‌
అయితే, ప్రభుత్వ ప్రయత్నాలపై తెలంగాణ ఉద్యోగాల సం ఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఎస్మా ప్రయోగిస్తే పరిపాలన స్తంభిస్తుందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఆగస్టు తొలి వారం నుంచి సమ్మె నోటీసు జారీచేయడంతో.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులపై అనేక రకాలుగా భయబ్రాంతులకు గురి చేస్తున్నదని, పలు శాఖల్లో ఇప్పటికే ఎస్మాను తలపించే విధంగా తెలంగాణ ఉద్యోగులను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తు న్నట్లు తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభు త్వంతో చర్చించి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు చేప ట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌కు మరో షాక్‌...
గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2010-11 పార్టనర్‌ షిప్‌ సమ్మిట్‌ చెన్నయ్‌కు తరిలిపోయింది. తాజాగా సెప్టెంబర్‌ 19,20 తేదీల్లో జరిగాల్సిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ కూడా రద్దైంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని స్థానంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు, సీఐఐ సంయుక్తంగా 2012 పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ను నిర్వహించడానికి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియచేసినట్లు సర్కార్‌ జారీచేసిన ఉత్తర్వులో పేర్కొన్నది.

ఇదిలా ఉండగా.. పరిశ్రమల అసోసియేషన్లు మాత్రం 2012 పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ షెడ్యూల్‌ ప్రకారం జరగకపోతే.. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికంగా కోలుకోలేని విధంగా నష్టపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌తో పోల్చుకుంటే.. 2012 పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ ద్వారా అదనపు ప్రయోజనాలుంటాయని, ఈ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల సీఇఓలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2012 జనవరిలో పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ పేరుతో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించాలని చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

ajad pi t-congress aagraham

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అంశంలో ఏ నిర్ణయం చేస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా ప్రాంతాలకతీతంగా హర్షిస్తారు? అనే కోణంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తున్న ప్రస్తుత తరుణంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి, కేంద్ర మంత్రి గులాంనబీ అజాద్‌ తెలంగాణ సమస్యను మొదటికి తెచ్చే విధంగా వ్యవహ రించారని ఈ ప్రాంత కాంగ్రెస్‌ సీనియర్‌ నాయ కులు ఆగ్రహోదగ్రులవుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను అయిదు, లేక ఆరు పేజీలతో నోట్‌ను తయారుచేసి ఇవ్వాలని అజాద్‌ కోరడాన్ని పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు తప్పుబడుతున్నారు. అంతేగాక మంగళ వారంనాడు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో మాట్లాడిన అజాద్‌ సంధించిన ప్రశ్నలు, మాట్లాడిన వైనం పరిశీలిస్తే ఒక అడ్వొకేట్‌లా ప్రశ్నలను సంధిం చినట్లుగా ఉందని కొందరు సీనియర్‌ నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్ది న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని, సోనియా మేడమ్‌ ముందు మాట్లాడేందుకు తనకు 'టాకింగ్‌ పాయింట్స్‌ కావాలి కదా! అని ఆజాద్‌ కోరడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. జరిగిన అన్యాయాలకు ప్రతి గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరు తుండగా ఆజాద్‌ ఇలా జరిగిన తప్పులను సరిది ద్దుతానని ముందుకు రావడంతో అనేక అనుమా నాలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను 'ఫూల్స్‌ (తెలివి తక్కువ)ను చేసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకివ్వాలి?, తెలంగాణను ఇస్తే సీమాం ధ్రలో కాంగ్రెస్‌పార్టీ గల్లంతవుతుంది కదా!, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.ఆర్‌.ఎస్‌. అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు లబ్ది చేకూరుతుంది కదా! అని అజాద్‌ నిలదీసినట్లుగా అడగటం తమను కలచివే సిందని అంటున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల గురించి, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాల గురించి, తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌, టి.ఆర్‌.ఎస్‌.ఆవిర్భావం, కె.సి.ఆర్‌.తో అజాద్‌కున్న సంబంధాలు, 2009 డిసెంబర్‌ 9వ తేదీన చిదం బరం చేసిన ప్రకటన, ఆ తర్వాత జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, నివేదికను ఇవ్వడం, అంతకు ముందు ప్రణబ్‌ముఖర్జీ కమిటి, సి.ఎల్‌.పి.లో తీర్మానాలు జరిగినవైనం, సోనియాగాంధీ హామీలు, కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పొందుపరిచిన వైనం, యు.పి.ఎ.ప్రభుత్వంలో కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంలో తెలంగాణ అంశం, రాష్ట్రపతి ప్రసం గాల్లో తెలంగాణ సమస్యను ప్రస్తావించడం వంటి మొత్తం వ్యవహారంపై కూలంకషంగా, స్పష్టమైన అవగాహన ఉన్న అజాద్‌ ఇప్పుడు ఏమీ తెలియ నట్లుగా 1965 నుంచి ఇప్పటి వరకూ తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ఒక నోట్‌ ఇవ్వాలని కోరడం బాధగా ఉందని పలువురు సీనియర్‌ నాయకులు తీవ్ర మనస్థాపం వ్యక్తంచేస్తున్నారు. పెద్ద మనుషుల ఒప్పందాల ఉల్లంఘన, 610 జీవోను అమలు చేయకపోవడం, ఉద్యోగ, విద్య, వైద్య, వ్యవ సాయం, విద్యుత్తు, ఇతర అనేక రంగాల్లో తెలం గాణ దగాకు గురయ్యిందనే అంశాలపై కాంగ్రెస్‌ అధిష్టానంలో ఏ నాయకుడిని కదిలించినా కనీసం పది పాయింట్లను స్పష్టంగా చెప్పగలరని అంటు న్నారు. అధిష్టానంలో కీలకమైన పాత్ర పోషిస్తూ, ఆంధ్రప్రదేశ్‌పైన, తెలంగాణపైన స్పష్టమైన అవగా హన ఉన్న నాయకుడిగా అధిష్టానం గుర్తించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా వచ్చిన అజాద్‌ ఇలా మాట్లాడటం సబబుగాలేదని, ఆయన తీరును చూస్తుంటే తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రపూరి తంగా వ్యవహరిస్తున్నారేమోననే అనుమానం కలు గుతోందని అంటున్నారు.
ఒకవైపు తెలంగాణను ఇవ్వకుండా నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తే పార్టీకి పుట్టగతులుండవని, కాంగ్రెస్‌ నాయకులెవ్వరూ తెలంగాణ పల్లెల్లో తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని అధిష్టానం లోని ప్రతి ఒక్క నేతకూ వివ రిస్తూ వచ్చామని చెప్పారు.అంతేగాక వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మూలంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని, కనీసం తెలంగాణాలోనైనా కాంగ్రెస్‌ను బ్రతికించాలని అధినేత్రి సోనియాగాంధీకి ప్రత్య క్షంగా, పరోక్షంగా వివరిస్తూ వచ్చామని అంటు న్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, చివరకు ఎంపీలు కూడా ఎవ్వరి స్థాయిల్లో వారు తెలంగాణ కోసం ఉద్య మాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారని, ఇంత జరుగుతున్నా, రాజకీయంగా అంతులేని సంక్షోభ పరిస్థితులున్నప్పటికీ అజాద్‌ సాదాసీదాగా తెలం గాణపై నోట్‌ అడగటం,తెలంగాణకు జరిగిన అన్యా యాలను సరిదిద్దుతానని చెబుతుండటం విడ్డూ రంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయినప్పటికీ అజాద్‌ను నొప్పించకుండా, తమలోని ఆవేదన, బాధను దిగమింగుకొని నోట్‌కు బదులుగా జరిగిన అన్యాయాల నివేదికలనే అందజేశామని వివరిం చారు.అయిదురాష్ట్రాల ఎన్నికలను సాకుగా చూపిం చి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ వేచి ఉండా లని ఆదేశించినందున తాముఎలాంటి ఉద్యమాలు చేయలేదని, ఈనెలాఖరుకు గానీ, జూన్‌ మొదటి వారంలో స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమ కార్యాచరణలను ప్రకటిస్తామని కాంగ్రెస్‌ అధిష్టా నాన్ని, ముఖ్యంగా గులాంనబీఅజాద్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు హెచ్చరిస్తున్నారు

telangana kosam delhi lo athma hathya

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఆత్మహత్యలు చేసుకోవటం దేశ రాజధాని ఢిల్లీకి పాకింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన మందాటి యాదిరెడ్డి అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున పార్లమెంటుకు సమీపంలోని శాస్ర్తీ భవన్ వెనుక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని, తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు మాటి,మాటికి అడ్డుపడుతున్నందుకు బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు యాది రెడ్డి ఒక లేఖలో పేర్కొన్నారు. యాది రెడ్డి మృతదేహం వద్ద లభించిన సంచిలో దాదాపు పది విడి పేజీల ఆత్యహత్యకు ముందు రాసిన లేఖ పోలీసులకు లభించింది.
యాది రెడ్డి ఆత్మహత్యా విషయం తెలియగానే రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి వాకబు చేశారు. ఆయన రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లి మృత దేహాన్ని చూడటంతోపాటు హైదరాబాదుకు టెలిఫోన్ చేసి యాదిరెడ్డి బంధువులతో మాట్లాడారు. యాదిరెడ్డి సోదరుడు, మరో ఇద్దరు సన్నిహితులు ఢిల్లీకి వచ్చేందుకు ఆయన ఏర్పాట్లు చేశారు. గురువారం పోస్టుమార్టం జరిగిన అనంతరం యాదిరెడ్డి భౌతికకాయాన్ని ఆయన సోదరునికి అప్పగించి విమానం ద్వారా హైదరాబాదుకు పంపించేందుకు హనుమంతరావు ఏర్పాటు చేస్తున్నారు.
పార్లమెంటుకు సమీపంలోని శాస్ర్తీ భవన్ వెనుక భాగంలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియగానే హుటాహుటిన అక్కడికి వెళ్లామని పార్లమెంటు స్ట్రీట్ పోలీసులు తెలిపారు. చెట్టుకు వేళాడుతున్న యాదిరెడ్డి భౌతికకాయాన్ని వెంటనే రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించామని వారు చెప్పారు. యాదిరెడ్డి భౌతికకాయం వద్ద హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌లో రాసిన లేఖ లభించిందని వారు చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఈనెల 17 తేదీలోగా అనుకూల నిర్ణయం తీసుకుంటారని భావించాననీ, కానీ అలా జరగకపోవటంతో తాను ఢిల్లీకి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నానని యాదిరెడ్డి ఆ లేఖలో తెలిపారు. పది పేజీల లేఖలో ప్రతి పేజీపై జైతెలంగాణా అనే నినాదం రాసి ఉన్నది. తన తల్లితో పాటు పలువురికి క్షమాపణలు చెప్పారు.

హనుమంతరావు దిగ్భ్రాంతి
యాదిరెడ్డి ఆత్మహత్య పట్ల హనుమంతరావు దిగ్భ్రాంతి, తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడాలి కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకోటం అర్థరహితమని ఆయన అభిప్రాయపడ్డారు. యువకులు, విద్యార్థులెవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడరాదని ఆయన హితవు పలికారు. ఏఐసిసి అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ కూడా యాదిరెడ్డి ఆత్మహత్య పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర సంఘటని ఆయన చెప్పారు. తెలంగాణ చాలా సున్నితమైన అంశం, భావోద్రేకంతో కూడుకున్నది కాబట్టి అందరు ఆలోచించి వ్యవహరించాలని ఆయన సూచించారు. తెలంగాణతో సహా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటుపై ఏకాభిప్రాయాన్ని సాధించవలసి ఉన్నదని ఆయన తెలిపారు.

Urura T - congres The March

ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ పిలుపు మేరకు బుధవారం తెలంగాణ జిల్లాల్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలు విజయవంతంగా జరిగాయి. రాజీనామాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేతలు జిల్లాలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భువనగిరి, ఆలేరుల్లో పర్యటించారు. ఆలేరులో ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ దీక్షలో పాల్గొన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో దీక్షలకు ఎమ్మెల్యే ఆర్.దామోదర్‌రెడ్డి హాజరయ్యారు. నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, దేవరకొండలో ఎమ్మెల్యే బాలూనాయక్ దీక్షల్లో పాల్గొన్నారు.

వరంగల్ జిల్లాలో అన్ని మండల కేంద్రాలతో పాటు, జనగామ, వరంగల్ నగరంలో పెద్ద సంఖ్యలో దీక్షా శిబిరాలకు అనూహ్యస్పందన లభించింది. ఉద్యమకారులు తెలంగాణ ఆటాపాటలతో హోరెత్తించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, కొండేటి శ్రీధర్, మాలోతు కవిత ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన దీక్షల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, భువనగిరి ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, సోమారపు సత్యనారాయణ, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు.

కరీంనగర్‌లో ఎంపీ పొన్నం ప్రభాకర్, శంకరపట్నంలో ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ స్వయంగా దీక్ష చేపట్టారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు కరీంనగర్ దీక్షకు, ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో సంఘీభావం పలికారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో జరిగిన దీక్షకు పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు, డీసీసీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ హాజరుకాగా, వికారాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లో డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి, నిర్మల్‌లో మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌లలో ఎంపీ వివేక్, మాజీ మంత్రి గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాగాయి. కాగా, మెదక్ జిల్లాలో దీక్షలు మొక్కుబడిగా సాగాయి.

డీసీసీ అధ్యక్షుడు, పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అందుబాటులో ఉన్నా దీక్షలకు డుమ్మా కొట్టారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కూడా దీక్షల జాడలకు వెళ్లలేదు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ప్రాతినిథ్యం వహిస్తున్న అందోలు నియోజకవర్గంలో దీక్ష ఊసు కనిపించలేదు.

Telangana Today rastarokolu

నేడు తెలంగాణలో రాస్తారోకోలు





రామచంద్రాపురం (మెదక్), న్యూస్‌లైన్: ప్రత్యేక రాష్ట్రం కోసం ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట ప్రాణత్యాగం చేసిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉద్యమకారుడు యాదిరెడ్డి మృతికి సంతాపంగా గురువారం తెలంగాణ జిల్లాల్లో రాస్తారోకోలు చేయాలని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. బుధవారం భెల్ అధికార కార్మిక సంఘం (ఐఎన్‌టీయూసీ) కార్యాలయంలో జరిగిన కార్మికుల జేఏసీ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

అనేక మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్రం కళ్లు తెరవకపోవడం బాధాకరమన్నారు. సీమాంధ్ర నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాలు అమ్ముడు పోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి కేంద్రం వెంటనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐక్యపోరాటం అవససరమని చెప్పారు. రాష్ట్రం సాధించే వరకు రాజీలేని పోరాటం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

Telangana 'temporary solution' on the center of the exercise

తెలంగాణకు ‘తాత్కాలిక పరిష్కారం’పై కేంద్రం కసరత్తు







జమ్మూకాశ్మీర్‌కు తక్కువ.. గూర్ఖాలాండ్‌కన్నా ఎక్కువ ‘స్వయంపాలన’!

తెలంగాణ ప్రాంతానికి విస్తృతాధికారాలతో కూడిన ప్రాదేశిక అథారిటీ
సొంత ఆర్థికవనరులు, రెవెన్యూ విధానం, పరిపాలనా విభాగం, ఉద్యోగాల నియామకం... తదితర అధికారాలు
ప్రణబ్, చిదంబరం, ఆజాద్‌ల సూచనల మేరకు అనేక జాగ్రత్తలతో కసరత్తు
ముందుగానే అన్ని వర్గాలతో చర్చించాక బహిర్గతం చేసే యోచనలో కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో చర్చల్లో వివరించనున్న కాంగ్రెస్ అధిష్టానం
అథారిటీ తాత్కాలిక ఏర్పాటేనని, అందరికీ ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారం కోసం కసరత్తు కొనసాగుతుందని హామీ ఇచ్చే యోచన

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: సంక్లిష్టమైన తెలంగాణ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా.. ఆ ప్రాంతానికి విస్తృతాధికారాలు గల ‘ప్రాదేశిక అథారిటీ’ (టెరిటోరియల్ అథారిటీ)ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయం లేనందున.. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తూనే.. తాత్కాలిక పరిష్కారంగా మరింత ఆకర్షణీయమైన, మరింత హేతుబద్ధమైన ఏర్పాటుపై కసరత్తు చేసే బాధ్యతను కేంద్ర హోంశాఖకు అప్పగించినట్లు తెలిసింది. ఆమేరకు తెలంగాణ ప్రాంతానికి ‘ప్రాదేశిక అథారిటీ’ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ అధికారులు రూపొందిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు బుధవారం ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపాయి. ఈ ప్రాదేశిక అథారిటీ అధికారాల విషయంలో.. జమ్మూకాశ్మీర్‌కు గల ‘స్వయంప్రతిపత్తి’ (అటానమీ)కి కొంచెం తక్కువగాను, ఇటీవల గూర్ఖాలాండ్‌కు ప్రకటించిన ‘స్వయంపాలన’ (టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్)కు కొంచెం ఎక్కువగాను ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి.
‘‘తెలంగాణ ప్రాంతానికి విస్తృత అధికారాలు ఇచ్చేలా ఒక అథారిటీని ఏర్పాటు చేసే విషయాన్ని అధ్యయనం చేసి విధివిధానాలతో కూడిన ప్రతిపాదనను రూపొందించే పనిని మాకు అప్పగించారు. ఇందులో.. సొంత ఆర్థికవనరులు, రెవెన్యూ విధానం, పరిపాలనా విభాగం, ఉద్యోగాల నియామకం మొదలైనవన్నీ ఉంటాయి. ఒకవిధంగా.. ప్రత్యేక రాష్ట్ర హోదాకు కొంచెం తక్కువ స్థాయి అధికారాలన్నీ ఉంటాయి. అసోంలోని కర్బీ ఆంగ్‌లాంగ్ ప్రాంతానికి ఏర్పాటు చేసిన ప్రాదేశిక పాలనా మండలికి, పశ్చిమబెంగాల్‌లో గూర్ఖాలాండ్‌కు ప్రతిపాదించిన ప్రాదేశిక పాలనా మండలికన్నా.. ఎక్కువ అధికారాలు తెలంగాణ ప్రాదేశిక అథారిటీకి ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం కాగలదు’’ అని ఆ వర్గాలు వివరించాయి. రాష్ట్రానికి చెందిన వేర్వేరు గ్రూపులతో చర్చల్లో ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో.. ప్రాదేశిక అథారిటీ ఏర్పాటు ‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు పరిష్కారం కనుగొనటం’లో ఒక ముందడుగుగా ఉంటుందని అభివర్ణించాయి. ఈ ప్రాదేశిక అథారిటీ రూపకల్పనలో.. కాంగ్రెస్ అధిష్టానం ప్రతినిధులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్, ప్రణబ్‌ముఖర్జీ, చిదంబరం వంటి సీనియర్ మంత్రుల సూచనల మేరకు అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

తెలంగాణ నేతలతో చర్చల్లో ‘ప్రతిపాదన’

మరోవైపు.. చర్చల విషయంలో పార్టీ తెలంగాణ నేతలు మొత్తబడుతుండటంతో పాటు, సీమాంధ్ర నేతలు ఏ రూపంలోనైనా సంపూర్ణ మద్దతు అందిస్తామని హామీ ఇవ్వటంతో.. రాష్ట్రంలో గందరగోళంగా తయారైన పార్టీ వ్యవహారాలపై పట్టు సాధించటానికి ప్రాదేశిక అథారిటీ ఏర్పాటుతో కొంత సమయం లభిస్తుందని.. కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తోంది. చర్చలకు వస్తున్న తెలంగాణ నేతలకు ప్రత్యామ్నాయ మార్గాలన్నింటినీ మరోసారి వివరిస్తారని.. సహనం, సంయమనం అవసరాన్ని విశదీకరిస్తారని.. అదే సమయంలో ప్రతిపాదిత ‘ప్రాదేశిక అథారిటీ’ వివరాలను తెలియజేస్తారని సమాచారం. చిన్నచిన్న బృందాలతోనే చర్చలు జరుపుతామని గులాంనబీ ఆజాద్ పేర్కొనటం వెనుక కారణం ఇదేనని చెప్తున్నారు.

ఇదే తుది నిర్ణయం కాదు...

శ్రీకృష్ణ కమిటీ సిఫారసులపై ప్రజాభిప్రాయం బలంగా చీలిపోయిన నేపథ్యంలో.. ఈ ప్రాదేశిక అథారిటీ ఏర్పాటును డిసెంబర్ 9, డిసెంబర్ 22వ తేదీల ప్రకటనలకు ముందే చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం కాంగ్రెస్ ఢిల్లీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈసారి ప్రాదేశిక అథారిటీ ప్రతిపాదనను ఇప్పుడే బహిర్గతం చేయకుండా జాగ్రత్త పాటిస్తూ.. దీనిపై ముందుగానే అన్ని విధాలుగా ఆలోచించి, సంబంధిత వర్గాల వారందరితో మరింతగా చర్చించాలని కేంద్రం భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ ప్రతిపాదనతో పాటే.. ‘‘ఈ ఏర్పాటు తుది నిర్ణయం కాదు. అన్ని వర్గాల వారికీ ఆమోదయోగ్యంగా ఉండే సరైన నిర్ణయానికి వచ్చే వరకూ.. కొంతకాలం పాటు తాత్కాలిక ఏర్పాటు మాత్రమే’’ అన్న హామీ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.

In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts