Saturday 6 August 2011

Sushma Swaraj speaks on Telangana in Parliament - Part 1

ushma Swaraj speech in Lok Sabha on Telangana issue part 2

Sushma Swaraj speaks on Telangana in Parliament - Part 2

Sushma Swaraj excellent speech in Telangana meeting part3

Sushma Swaraj excellent speech in Telangana meeting part1

Sushma Swaraj excellent speech in Telangana meeting part2

Sushma Swaraj speech in Lok Sabha on Telangana issue part 1

pratheyaka telangana ni chandrababu naidu addukunnadu(ప్రత్యేక తెలంగాణను చంద్రబాబు అడ్డుకున్నారు):survey

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అడ్డుకున్నారని ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ సర్వే సత్యనారాయణ విమర్శించారు. 2002లో సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ ఇవ్వవద్దని బీజేపీ నేతలకు చెప్పారని సర్వే ఆరోపించారు. సావధాన తీర్మానం పెట్టిన బీజేపీపై కూడా సర్వే విమర్శలు సంధించారు. తెలంగాణ అంశం బీజేపీ, ఎన్‌డీఏ పాలనలో కూడా ఉందని, కానీ వారు విస్మరించారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వద్దంటూ ఎల్.కె.అద్వానీ అప్పటి బీజేపీ ఎంపీ ఆలె నరేంద్రకు లేఖ రాసిన విషయాన్ని చెప్పారు.

ఆనాడే తెలంగాణ ఇచ్చి ఉంటే ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలపటం అభినందనీయమన్నారు. యూపీఏ సర్కారు ద్వారా కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం నుంచి తప్పుడు ప్రకటనలు రావటం వల్లే ఆత్మబలిదానాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఒక వేళ నేను కూడా రాజీనామా ఇస్తే.. నాసోదరుడు (పక్కనే ఉన్న అంజన్‌కుమార్ యాదవ్‌ను చూపిస్తూ) కూడా రాజీనామా చేస్తే తెలంగాణపై పార్లమెంటులో మాట్లాడేందుకు ఎవరూ ఉండరు’’ అంటూ తను రాజీనామా చేయకపోవటానికి కారణం చెప్పారు.

స్వరాజ్యం నా జన్మహక్కు అని చాటిచెప్పిన బాలగంగాధర్‌తిలక్ స్ఫూర్తిగా ముందుకు వెళ్తానని సర్వే చెప్పారు. ‘‘తెలంగాణ వాలే జాగో.. ఆంధ్రా వాలే భాగో’ అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీది ‘భాగో’ నినాదం కాదు. ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉండవచ్చు. ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం ప్రత్యేక తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని వివరించారు. యూపీ కాంగ్రెస్ కమిటీ చేసిన రెండో ఎస్సార్సీ తీర్మానాన్ని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు ఆపాదించారని సర్వే ఆరోపించారు. రెండో ఎస్సార్సీ వేస్తారని, ఇక తెలంగాణ రాదని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ప్రచారం చేశారని విమర్శించారు.

telangana issue meere thelchukovali chidambaram(మీరే తేల్చుకోవాలి చిదంబరం)

తెలంగాణా.. సమైక్యాంధ్రా?... తెలుగు ప్రజలే పరిష్కరించుకోవాలి
చేతులు దులుపుకున్న చిదంబరం
ఆ పరిష్కారాన్ని అమలు చేయటం మాత్రమే కేంద్రం, పార్లమెంటు చేయగలవు
రాష్ట్ర ప్రజలను చీల్చింది నేను కానీ, కేంద్రం కానీ కాదు.. వారే చీలిపోయారు
హైదరాబాద్ అఖిలపక్ష సమావేశం మినిట్స్ ఆధారంగానే ‘డిసెంబర్ 9’ ప్రకటన
ఆ ప్రకటన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితి మారిపోయింది.. కేంద్రం దానిని గుర్తించింది
ఆ నేపథ్యంలోనే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది.. నివేదికలో ఏం రాయాలో మేం చెప్పలేదు
రాష్ట్రంలో 8 గుర్తింపు పొందిన పార్టీల్లో.. 4 పార్టీలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు
అన్ని పార్టీలూ ఒక స్పష్టమైన నిర్ణయంతో వస్తేనే.. మళ్లీ అఖిలపక్ష సమావేశం సాధ్యం
లోక్‌సభలో బీజేపీ సావధాన తీర్మానానికి కేంద్ర హోంమంత్రి జవాబు

ప్రత్యేక తెలంగాణ - సమైక్యాంధ్ర ఉద్యమాలతో రగులుతున్న రాష్ట్ర సమస్యకు పరిష్కారం ఏమిటో.. తెలుగు ప్రజలే చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. శుక్రవారం లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్ తెలంగాణపై ప్రవేశపెట్టిన సావధాన తీర్మానానికి కేంద్ర హోంమంత్రి చిదంబరం సమాధానం ఇస్తూ.. ఈ సమస్యను తెలుగు ప్రజలు పరిష్కరించుకుంటే కేంద్ర ప్రభుత్వం దానిని అమలు చేస్తుందని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలతో సహా నాలుగు పార్టీలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదన్నారు. అవి కూడా ఒక అభిప్రాయంతో ముందుకు వస్తేనే అఖిలపక్ష సమావేశం ఉంటుందన్నారు. అంతకుముందు.. సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. కేంద్రం 2009 డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే.. మూడింట రెండు వంతుల మద్దతు లభించేలా చూస్తామన్నారు. మరోవైపు.. తీర్మానం నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల మధ్య సభలో తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వీరందరినీ నియంత్రించేందుకు స్పీకర్‌తో పాటు.. కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయాస పడాల్సి వచ్చింది.
ఒకే రాష్ట్రంగా కలిసి ఉండటమో, విడిపోవటమో అన్న సమస్యను తెలుగు ప్రజలే తేల్చుకోవాలని చెప్తూ.. కేంద్ర ప్రభుత్వం భారమంతా రాష్ట్ర ప్రజలపైకి నెట్టేసింది. ‘‘తెలంగాణ డిమాండ్ ఒకవైపు, సమైక్యాంధ్రప్రదేశ్‌నే కొనసాగించాలన్న డిమాండ్ మరోవైపు ఉండటంతో తలెత్తిన సమస్యకు పరిష్కారం.. తప్పనిసరిగా తెలుగు మాట్లాడే ప్రజల నుంచే రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచే (పరిష్కారం) రావాలి. కేంద్రం ఆ పరిష్కారాన్ని అమలు చేయగలదంతే’’ అని కేంద్ర హోంమంత్రి చిదంబరం.. బంతిని రాష్ట్ర ప్రజల కోర్టులోకి నెట్టేసి చేతులు దులుపుకున్నారు. సంక్లిష్టమైన ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కృషిచేస్తోందని ఇన్నాళ్లుగా చెప్తూ వచ్చిన ఆయన.. ఇప్పుడీ సమస్యతో తనకు కానీ, కేంద్రానికీ కానీ సంబంధం లేదని పార్లమెంటు వేదికగా పేర్కొన్నారు. వివాదాన్ని తెలుగు ప్రజలే శాంతియుతంగా పరిష్కరించుకోవాలంటూ.. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను చీల్చింది తానో, కేంద్ర ప్రభుత్వమో కాదని.. రాష్ట్రంలో తలెత్తిన ప్రస్తుత పరిస్థితులకు తమ బాధ్యత ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ‘‘చీలిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. అక్కడి పార్టీలు.. దీనితో మాకే సంబంధమూ లేదు’’ అని నిండు సభలో వక్కాణించారు. రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన పార్టీల్లో.. అధికార, ప్రతిపక్షాలతో సహా 4 పార్టీలు తెలంగాణపై నిర్ణయానికి రాలేదని చెప్పారు. ఆ పార్టీలు నిర్ణయానికి వస్తే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు.

శుక్రవారం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఇచ్చిన సావధాన తీర్మానంపై.. పలువురు నాయకులు ఉద్వేగభరితంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాల హామీలను ప్రస్తావిస్తూ సుష్మ సుదీర్ఘంగా మాట్లాడాక.. కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు సర్వే సత్యనారాయణ, కావూరి సాంబశివరావులు ఆవేశంగా మాట్లాడారు. ఒక సందర్భంలో వారిద్దరి ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ఇరు ప్రాంతాల సభ్యులు వారికి మద్దతుగా కేకలు వేయటంతో పరిస్థితి తీవ్ర గందరగోళానికి దారితీసింది. వీరిని శాంతింపచేయటానికి.. ప్రభుత్వ పెద్దలు చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. వారు శాంతించాక చిదంబరం.. తీర్మానానికి సమాధానం చెప్పారు. ‘‘నేను చాలా విచారంతో మాట్లాడుతున్నా. నేను భయపడ్డట్లే ఈ సావధాన తీర్మానం.. సభలో చీలికతెచ్చే చర్చగా మారింది. దయచేసి.. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు చీలిపోయి ఉన్నారన్న విషయాన్ని అర్థంచేసుకోండి. అక్కడ ఉద్వేగాలను రెచ్చగొట్టే విధంగా పార్లమెంటులో ఎలాంటి వ్యాఖ్యలు కానీ, పని కానీ చేయకూడదు’’ అని పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

‘‘ఈ సమస్యకు పరిష్కారం తెలుగు మాట్లాడే ప్రజల నుంచే రావాలని ఆంధ్రప్రదేశ్ నాయకులకు చెప్పేందుకు నేను ఆది నుంచీ ప్రయత్నిస్తున్నాను. నిజానికి 2010 జనవరి 5వ తేదీన, 2011 జనవరి 6వ తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశాలకు హాజరైన వారికి తెలుసు.. నేను ఈ విషయాన్ని పదేపదే చెప్పా.. పరిష్కారం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచే రావాలి. పార్లమెంటు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆ పరిష్కారాన్ని అమలు మాత్రమే చేయగలవు. తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉందన్న సుష్వాస్వరాజ్ మాటలతో నేను ఏకీభవిస్తున్నా. అయితే.. దీనికి సంబంధించి ఇటీవలి చరిత్రను కూడా విస్మరించకూడదు. ఆ సంఘటనలను పరిగణనలోకి తీసుకోకపోతే.. కేంద్ర ప్రభుత్వం ఎందుకింత ఎక్కువ జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరిస్తోందో అర్థంచేసుకోవటం కష్టమవుతుంది.

ఆ ప్రకటన తర్వాత అంతా మారిపోయింది..

2009 డిసెంబర్ 7న హైదరాబాద్‌లో బీఏసీ సమావేశం, ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం జరిగాయి. ఆ సమావేశాల మినిట్స్ ఆధారంగానే.. కేంద్ర ప్రభుత్వం నా ద్వారా డిసెంబర్ 9 ప్రకటన చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా, ప్రభుత్వ నేతలు నిర్ణయం తీసుకోకుండా.. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఆ ప్రకటన చేయగలరని నమ్మేంత అమాయకులెవరూ లేరని నేను నిజంగా ఆశిస్తున్నా. కానీ.. డిసెంబర్ 9న ఆ ప్రకటన చేసిన అనతికాలంలోనే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మారిపోయింది. అది నిరాకరించలేని సత్యం. ఆంధ్రప్రదేశ్‌లో పాలక పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చీలిపోయాయి. నేను వాటిని చీల్చలేదు. ఈ సభలోని ఏ ఒక్కరూ అవి చీలిపోవాలని కోరుకోరు. కానీ అవి చీలిపోయాయన్నది నిజం. అవి చీలిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ వాస్తవాన్ని గుర్తించక తప్పని పరిస్థితి వచ్చింది. మారిన పరిస్థితిని గుర్తించి.. మేం డిసెంబర్ 23న ప్రకటన చేశాం. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ ప్రతి ఒక్కరినీ సంప్రదించింది. కేంద్ర ఆర్థిక మంత్రిని, నన్నూ సంప్రదించింది. కానీ.. కమిటీ నివేదికలో ఏం రాయాలో మేం చెప్పలేదు. ఇలా చేయి, అలా చేయి.. ఇది రాయి, అది రాయి అని చెప్పటం ప్రభుత్వంలోని మంత్రుల పని కాదు. కమిటీ ఒక నివేదిక రాస్తే.. దాని రచయితలు వారే. అందులో వారు రాసిన దానికి వారే బాధ్యత తీసుకుంటారు. జస్టిస్ శ్రీకృష్ణ వంటి న్యాయమూర్తిని ఎవరూ తప్పుపట్టకూడదు. ఆయన మార్గదర్శక సూత్రాలకు కట్టుబడ్డారు. ఆయన తన నివేదికలో 8వ చాప్టర్‌ను రహస్యంగా ఉంచాలని ఎందుకు చెప్పారో నేనెలా చెప్పగలను? ఆ చాప్టర్ విషయమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ చాప్టర్‌ను బహిర్గతం చేయలేను.’’

పార్టీలు తరచూ వైఖరి మార్చుకుంటుంటాయి

రాజకీయ పార్టీలు తరచూ తమ వైఖరిని మార్చుకుంటుంటాయని చిదంబరం అన్నారు. ‘బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు తెలంగాణ విషయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయటం కుదరదని, ప్రాంతీయ వెనుకబాటుతనానికి అభివృద్ధే పరిష్కారమని అప్పటి హోంమంత్రి అద్వానీ 2002 ఏప్రిల్ ఒకటో తేదీన స్పష్టంచేశారు. ఇప్పుడు ఆ పార్టీ వైఖరి మారింది. దానిని నేను తప్పుపట్టటం లేదు. రాష్ట్రంలో 8 గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. వాటిలో పీఆర్‌పీ.. తను కాంగ్రెస్‌లో విలీనం అవుతున్నట్లు ప్రకటించింది. పార్టీల సంఖ్య 7కు తగ్గింది. అయితే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అనే మరో కొత్త పార్టీ వచ్చింది. అంటే రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల సంఖ్య 8 గానే ఉంది. ఈ 8 పార్టీల వైఖరి ఏమిటి? బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఐ.. మూడు పార్టీలు స్పష్టంగా తెలంగాణ ఏర్పాటును కోరుతున్నాయి. ఒక పార్టీ.. సీపీఎం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తోంది. మరో మూడు పార్టీలు.. బహుశా ఎనిమిదో పార్టీ కూడా.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. తాము ఇంకా తుది నిర్ణయానికి రాలేదని కాంగ్రెస్ చెప్పింది. వారు ఇంకా సంప్రదింపుల ప్రక్రియలోనే ఉన్నారు. టీడీపీ చీలిపోయి ఉంది. ఒక పార్టీగా తాము తుది నిర్ణయం తీసుకోలేదని వారు నాతో చెప్పారు.

ఇక ఎంఐఎం.. తాము నిర్ణయం తీసుకునే ముందు.. కాంగ్రెస్, టీడీపీల నిర్ణయాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు నాతో చెప్పారు. కొత్త పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.. తుది నిర్ణయం తీసుకోవటం గురించి నాతో ఏమీ చెప్పలేదు. నాకు అందిన నివేదికల ప్రకారం.. నెల కిందట వారు నిర్వహించిన సదస్సులో.. తుది నిర్ణయం తీసుకోలేదు. ఇంకా 4 పార్టీలు స్పష్టమైన వైఖరి తీసుకోనందున నేను చేయగలిగిందీ ఏమీ లేదు. మేం ఆ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. దయచేసి మీ సంప్రదింపుల ప్రక్రియను పూర్తిచేయండి. అన్ని పార్టీలూ స్పష్టమైన అభిప్రాయంతో ముందుకు వస్తేనే.. తదుపరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు సాధ్యమవుతుంది. ఇందుకు రెండు మూడు వారాలు పట్టొచ్చు.. రెండు మూడు నెలలూ పట్టొచ్చు. ఈ ప్రక్రియ పూర్తవటానికి వీలుకలిగేలా తెలుగు ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు.

ఎవరూ చనిపోకూడదు..

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు ఢిల్లీకి వచ్చి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని కేంద్ర హోంమంత్రి చిదంబరం అన్నారు. ‘‘అది ఆత్మహత్యా కాదా, మృతుడు రాసినట్లు చెప్తున్న సూసైడ్ నోట్ వాస్తవమైనదా కాదా అన్న అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మరణం మనల్ని చాలా బాధపెడుతుంది. మన యువకుల్లో ఒకరు.. కారణమేదైనా, ఏ కారణంతో, ఏ ఉద్వేగంతో, ఏ నిరాశతో, ఏ ఆగ్రహంతో ప్రేరేపితమైనా.. అతడు ఆత్మహత్య చేసుకుంటే.. అది మనలో ప్రతి ఒక్కరినీ బాధపెడుతుంది. మేం చర్చిస్తూ ఉండగా.. దయచేసి ఇలాంటి తీవ్ర చర్యలకు పాల్పడవద్దని మనమందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేయాలన్నది నా వినతి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మా సొంత పిల్లల వంటివారు. ఈ సమయంలో ఏ ఒక్కరూ లాఠీచార్జిల్లో గాయపడకూడదు. ఎవరూ చనిపోకూడదు. మేం ఒక నిర్ణయానికి వచ్చే వరకూ.. 12 కోట్ల మంది తెలుగు ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు శాంతిసహనాలతో ఉండాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

telangana pi billu pedithe maddatistham( హోం > న్యూస్ హోం > జాతీయం click here బిల్లు పెడితే మద్దతిస్తాం)

అక్కడి నుంచి మాకు ఒక్క ఎంపీ కూడా లేడు..
అయినా విపక్ష బాధ్యతగా దాన్ని ప్రస్తావిస్తున్నా
శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంపై గోప్యతెందుకు?
‘డిసెంబర్ 9’ ప్రకటనకు కేంద్రం కట్టుబడాల్సిందే
యాదిరెడ్డి ఆత్మహత్యను ప్రస్తావించి..
సూసైడ్ నోట్‌ను లోక్‌సభలో చదివిన సుష్మ
తెలంగాణ కోసం బలిదానాలొద్దంటూ తెలుగులో విజ్ఞప్తి

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ మద్దతిస్తుందని లోక్‌సభలో విపక్ష నేత సుష్మా స్వరాజ్ పునరుద్ఘాటించారు. ‘‘ఈ విషయంలో సంప్రదింపులు చాలా అయ్యాయి. ఇకనైనా బిల్లుపెట్టాలి. మూడింట రెండొంతుల మద్దతు లభించేలా చూస్తాం’’ అన్నారు. ‘డిసెంబర్ 9’ ప్రకటనకు కట్టుబడాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభలో, రాష్ట్ర అసెంబ్లీలో తగ్గుతున్న తెలంగాణ గొంతుకను గట్టిగా విన్పించేందుకే సావధాన తీర్మానం పెట్టామని శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. తెలంగాణలో ఆత్మహత్యలు ఆగాలంటూ సభ పిలుపునివ్వాలని కోరారు. ‘‘తెలంగాణ చరిత్ర ఉద్యమాలు, విశ్వాస ఘాతుకాలతో నిండిపోయింది. వారిప్పటికీ స్వాతంత్య్ర సంబరాలు చేసుకోలేకపోతున్నారు. వారి నెత్తిన కత్తి వేలాడుతోంది’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం బలిదానాలొద్దని, రాష్ట్రాన్ని చూసేందుకు బతకాలని తెలుగులో విజ్ఞప్తి చేయడం విశేషం!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తన ‘ప్రియమైన అంశం’గా సుష్మ అభివర్ణించారు. తెలంగాణపై తాము తొలిసారిగా మాట్లాడడం లేదని, ఆ ప్రాంతం నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేకపోయినా విపక్ష బాధ్యతగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నామని చెప్పారు. ‘‘తెలంగాణ ప్రజలు వ్యతిరేకించినా విలీనం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ముల్కీ నిబంధన, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఫార్ములా నంబర్ 6, 610 జీవో, గిర్‌గ్లానీ కమిషన్ వంటివెన్ని చేసినా ఆచరణలో విఫలమయ్యాయి. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ సమయంలో కరీంనగర్ సభలో ఇచ్చిన హామీని విశ్వసించి ప్రజలు ఓట్లేశారు.

తర్వాత ప్రభుత్వంలోనూ టీఆర్‌ఎస్ భాగస్వామి అయింది. సరైన సమయంలో, సంప్రదింపులు, ఏకాభిప్రాయంతో తెలంగాణ ఏర్పాటు చేస్తామని యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలోనూ చెప్పారు. 2009 కూడా వెళ్లిపోయింది గానీ తెలంగాణ ఏర్పాటుకు మాత్రం సరైన సమయం రాలేదు’’ అంటూ పదునైన విమర్శలు చేశారు. యూపీఏ-2 పాలనలో రాష్ట్రపతి ప్రసంగంలో ఏకాభిప్రాయం అంశాన్నీ ఎత్తేశారని ధ్వజమెత్తారు. 2009లో తెలంగాణ నుంచి 12 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా రాష్ట్రం ఏర్పాటులో ఏ పురోగతీ లేదన్నారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష అంశాన్ని 2009 డిసెంబర్ 7న మేం సభలో లేవనెత్తాం.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనను సోనియా జన్మదిన కానుకగా భావించి అక్కడి వారంతా సంబరాలు చేసుకున్నారు. ఆ ప్రకటన తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందనుకున్నారు. కానీ 14 రోజుల్లోనే చిదంబరం మాట మార్చారు. సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయంతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమంటూ డిసెంబర్ 23న ప్రకటన చేశారు’’ అని దుయ్యబట్టారు.

శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణకు అన్యాయమే చేసిందని సుష్మ అనడంతో, ఇది సావధాన తీర్మానమంటూ స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ముఖ్యమైన విషయాలు చెప్పదలచానంటూ సుష్మ కొనసాగించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారని చిదంబరాన్ని ప్రశ్నించారు. మీడియా, పొలిటికల్ మేనేజ్‌మెంట్ ఎలా చేయొచ్చో అందులో సూచించారని సభ దృష్టికి తెచ్చారు. తెలంగాణపై అనేక మోసాలు జరుగుతుండడంతో 600 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇటీవల ఢిల్లీలో యాదిరెడ్డి ఆత్మబలిదానాన్ని ప్రస్తావించారు.

ఆయన ఆత్మహత్య లేఖలోని ముఖ్యాంశాలను చదివి విన్పించారు. తెలంగాణ ఏర్పాటులో జాప్యానికి కారణాలు, పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను సభకు తెలపాలని చిదంబరాన్ని కోరారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, నివేదిక, ఆరు సిఫార్సులు, వాటిపై పార్టీలతో అఖిలపక్ష భేటీ తదితరాలను ఆయన వివరించారు. సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 14 (ఎఫ్)పై తాజా పరిస్థితులను వివరించారు.

తెలంగాణ కోసం ఆ ప్రాంత ఎంపీలు రాజీనామా చేశారని సుష్మ చెబుతుండగా, ‘‘అంతా రాజీనామా చేశారని ఎలా చెబుతారు? కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, ఎంపీలు అంజన్‌కుమార్, సర్వే సత్యనారాయణ చేయలేదు’’ అంటూ కావూరి అభ్యంతర పెట్టారు. దాంతో నలుగురు రాజీనామా చేయలేదంటూ ఆమె సవరించుకున్నారు. ‘‘17 మంది తెలంగాణ ఎంపీల్లో 13 మంది; 119 మంది ఎమ్మెల్యేల్లో 103 మంది ఆవేదనలతో రాజీనామా చేశారు. అల్లరి పిల్లవానికి అమాయకపు అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నామని, కలిసుండలేకపోతే విడిపోవాలనిఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసేప్పుడే తొలి ప్రధాని నెహ్రూ అన్నారు’’ అని పేర్కొన్నారు.

సీమాంధ్ర ఎంపీలు అభ్యంతరం తెలపడంతో సర్వే సత్యనారాయణకు, వారికి వాగ్వాదం జరిగింది. వారికీ మాట్లాడేందుకు సమయమిస్తానంటూ స్పీకర్ సముదాయించారు. ‘‘నేనేమీ ఏ బీజేపీ నేతో చేసిన వ్యాఖ్యలను చెప్పడం లేదు. నెహ్రూ వ్యాఖ్యలనే ప్రస్తావిస్తున్నా. మీరెందుకు అంత బాధపడుతున్నారు? అవి 1956, మార్చి 6న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ప్రచురితమయ్యాయి’’ అని సుష్మ వివరించారు. ‘‘సోదర సోదరీమణులారా..! తెలంగాణ కోసం ఆత్మబలిదానం వద్దు. తెలంగాణ చూడటానికి బతకాలి’’ అంటూ ఆమె ప్రసంగాన్ని తెలుగులో ముగించారు!

telangana esthamani appu cheppaledu(తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదు):kavuri

తెలంగాణపై శుక్రవారం లోక్‌సభలో సావధాన తీర్మానం సందర్భంగా సీమాంధ్ర ఎంపీ కావూరి సాంబశివరావు ప్రసంగం ఆయన మాటల్లో..
రాష్ర్టంలోని వాస్తవాలను సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకొస్తున్నా. 2004 ఎన్నికల ప్రణాళికలోగానీ, సీఎంపీలోగానీ, రాష్ర్టపతి ప్రసంగంలోగానీ ఎక్కడా తెలంగాణను ఏర్పరుస్తామని కాంగ్రెస్ ప్రకటించలేదు. (ఈ చర్చలో కావూరికి ఎలా అవకాశం ఇచ్చారని బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, చర్చలో పాల్గొనాల్సి ఉన్న మరో ఇద్దరు సభ్యులు విరమించుకోవటంతో తన విశేషాధికారం ఉపయోగించి ఆయనకు అవకాశం ఇచ్చినట్లు స్పీకర్ పేర్కొన్నారు.)

కాకినాడలో బీజేపీ తీసుకున్న ఒక ఓటు - రెండు రాష్ట్రాల హామీ నుంచి వెనక్కు తగ్గటానికి బాధ్యుపూవరు? రాష్ర్టం నుంచి ఒక్క ఎంపీ లేని బీజేపీ మాట్లాడటం కడు దయనీయం. రాష్ర్టంలో రెండు శాతం ఓటు బ్యాంకు లేని పార్టీకి తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదు. రాష్ర్టంలోని అన్ని పార్టీల ఆమోదంతోనే శ్రీ కృష్ణ కమిటీ ఏర్పడింది. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి బుర్గుల రామకృష్ణారావు కోరిక మేరకే విశాలాంధ్ర ఏర్పడింది. పసంగం ముగించాల్సిందిగా స్పీకర్, చిదంబరం, ఆజాద్ పదే పదే కోరినా కావూరి ఆగలేదు. మైక్ కట్ చేసిన అనంతరం కూడా నిలబడి ఏదో మాట్లాడుతున్న ఆయనపై చిదంబరం అసంతృప్తిని వ్యక్త పరిచారు.)

loksabha lo Garginchina Sushma Swaraj

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశంపై శుక్రవారం నాడు లోక్‌సభ దద్దరిల్లిపోయింది. వాద ప్రతివాదాలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు.. విమర్శలతో హోరెత్తిపోయింది. కుటిల సమైక్యవాదం.. లోక్‌సభ సాక్షిగా పటాపంచలైంది. అడ్డగోలు వాదన మినహా సూటిగా సమాధానాలు చెప్పలేని దైన్యంలో సీమాంవూధవాదం చిన్నబోయింది. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత యావత్ భారతానికి చేరింది. మొట్ట మొదటిసారిగా తెలంగాణపై సుదీర్ఘ చర్చకు లోక్‌సభ వేదికైంది. తెలంగాణ ఆర్తిని, ఆత్మబలిదానాలను, రాష్ట్రం ఏర్పాటు అవసరాన్ని భారతజాతికి కళ్లకు కట్టినట్లు తెలియజెప్పడంలో తెలంగాణ ఆడబిడ్డ పాత్ర సమర్థంగా పోషించి, వూపతిపక్ష నేత సుష్మాస్వరాజ్ విజయవంతమయ్యారు. అటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సర్వే సత్యనారాయణ సైతం తెలంగాణ నా జన్మహక్కు అంటూ తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ స్థాయిలో గట్టిగా వినిపించారు.

తెలంగాణకు అడుగడుగునా జరిగిన అన్యాయాలను సవివరంగా ప్రస్తావించిన సుష్మ.. వివిధ ఒప్పందాలు ఉల్లంఘనకు గురైన తీరును ఎండగట్టారు. తాజా శ్రీకృష్ణ కమిటీ బండారాన్ని బయటపెట్టారు. నిక్కచ్చిగా.. ముక్కుసూటిగా సుష్మ చేసిన ప్రసంగంతో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి కావూరి సాంబశివరావు బిత్తర పోయారు. హోం మంత్రి చిదంబరం సమాధానాలు వెతుక్కునే పనిలో పడిపోయారు. చివరికి కొత్తగా ఏమీ చెప్పలేకపోయారు. పాత పాటలనే వల్లెవేశారు. ఓ దశలో సుష్మ ప్రసంగంతో కంగుతిన్న చిదంబరం.. తమ చేతిలో ఏమీ లేదని, తేల్చుకోవాల్సింది ఆంధ్రవూపదేశ్‌లోని రాజకీయ పార్టీలేనని పాత మాటలనే పునరుద్ఘాటించారు. తమ పార్టీలోనూ ఏకాభివూపాయం లేదని ఒప్పుకున్నారు.

సుష్మ మాట్లాడుతుంటే కావూరి సాంబశివరావు ఆమెకు అడుగడుగునా అడ్డుపడి అడ్డదిడ్డమైన వాదన చేశారు. కానీ.. ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు. రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ కూడా లేని బీజేపీ తెలంగాణ గురించి మాట్లాడటమేంటన్న కావూరి వాదనను సుష్మ దీటుగా తిప్పి కొట్టారు. కేంద్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మాట్లాడుతున్నామని చెప్పారు. గతంలోనూ తెలంగాణ కోసం మాట్లాడింది తామేనని చెప్పారు. కావూరికి బాసటగా మరో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి లగడపాటి నిలిచినా.. సుష్మ వాగ్ధాటితో మిన్నకుండిపోయారు. అర్థవంతమైన చర్చ జరగలేదని చిదంబరం తేల్చినా.. తెలంగాణపై కాంగ్రెస్ కచ్చితమైన నిర్ణయానికి రాలేదన్న వాస్తవం బయటపడింది. దీంతో ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన నేతలు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలన్న ఒత్తిడి రావచ్చునన్న వాదన వినిపిస్తున్నది. పార్టీకి విధేయతతో ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమవుతామంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉండదని పలువురు తెలంగాణవాదులు అంటున్నారు.

మొత్తం మీద మూడు నెలల్లో చర్చల ప్రక్రియను ముగిస్తామని చిదంబరం ప్రకటించడంతో సావధాన తీర్మానం లక్ష్యం కొంతలో కొంత నెరవేరిందనే చెప్పొచ్చు. చిదంబరం ప్రకటన నేపథ్యంలో మరో మూడు నెలల్లోగా తెలంగాణపై ఒక నిర్ణయం వెలువడుతుందనే ఆశ ప్రజాస్వామ్యవాదుల్లో, తెలంగాణ ప్రజల్లో నెలకొంది. అటు తెలంగాణపై పార్లమెంటులో గంటన్నర పాటు సాగిన చర్చ దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపనుండటంతో అధికార పార్టీ కొంత ఆత్మ రక్షణలో పడింది. తెలంగాణపై నిర్ణయం వెలువరించే ముందు రాష్ట్రంలో జరిగే లాభ నష్టాలను మాత్రం బేరీజు వేసుకుంటున్న అధికార పార్టీ, తాజా విస్తృత చర్చ అనంతరం తన పరిధిని విస్తరించుకోవచ్చన అభివూపాయం వినిపించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. రాజకీయ అవసరాల కోసం వాటిని తుంగలో తొక్కిందనే వాస్తవం చర్చ ద్వారా బహిరంగమవడంతో దేశ వ్యాప్తంగా ఆ పార్టీపై విశ్వసనీయత సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. పైగా ఇకపై కాంగ్రెస్ చేసే వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండబోదు.

ఆ దిశలోనే బీజేపీ చేసిన కృషి ఫలించిందని నిపుణులు అంటున్నారు. లోక్‌పాల్, ధరల పెరుగుదల, అవినీతిపై ప్రభుత్వాన్ని పెద్దగా ఇరుకున పెట్టలేక పోయిన బీజేపీ, తెలంగాణపై జరిగిన చర్చలో మాత్రం పై చేయి సాధించింది. అన్ని విషయాల్లో ప్రతిపక్షాల్లో చీలిక తెచ్చే అధికార పార్టీ తెలంగాణ విషయంలో మాత్రం పార్లమెంటు సాక్షిగా తానే చీలిపోయింది. సొంత పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులను కట్టడి చేయలేక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్, హోం మంత్రి చిదంబరం తలపట్టుకున్నారు. పార్లమెంటు గత సమావేశాల్లో నిరసన తెలిపిన టీ ఎంపీలను బెదిరించి బయటకు పంపిచినవూపణబ్ ఇప్పుడు మాత్రం సీమాంధ్ర నాయకుల పట్ల ఉదాసీనత ప్రదర్శించారు. సీమాంధ్ర ఎంపీలు కావూరి, లగడపాటి, ఆనంత, రాయపాటి, సబ్బం హరి తదితరులు చర్చకు ఆడుగడుగునా అడ్డుతగిలారు.

సావధాన తీర్మానంపై చర్చకు అనుమతిస్తున్నానని స్పీకర్ ప్రకటించిన వెను వెంటనే కావూరి లేచి నిలబడి ‘‘రాష్ట్రం గురించి వాస్తవాలు, గణాంకాలు తెలియని సుష్మ.. రాజకీయ కారణాలతోనే తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు’’ అని ప్రతిపక్ష నాయకురాలిని అవమాన పరిచే విధంగా వ్యవహరించారు. తామంతా చర్చకు అనుమతివ్వాలని ఎన్నిసార్లు కోరినా నిరాకరించి, బీజేపీకి అవకాశం ఎలా ఇస్తారని స్పీకర్ అధికారాన్నే ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అడ్డు తగలొద్దని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ప్రశాంతంగా చర్చ జరగకుండా సీమాంధ్ర ఎంపీలు తీవ్రంగా ప్రయత్నించారు. రాష్ట్రం నుండి ఒక్క ఎంపీలేని బీజేపీ తెలంగాణ గురించి మాట్లాడటం దయనీయం.... రాష్ట్రంలో రెండు శాతం ఓటు బ్యాంకు లేని పార్టీకి తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదు.. అంటూ సుష్మ ప్రసంగిస్తుండగానే రన్నింగ్ కామెంటరీలకు దిగారు.

మాట్లాడటానికి అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పినా.. తెలంగాణ విషయంలో తమ వైఖరి తప్ప మరో వైఖరి వినిపడకూడదనే తీరుగా ప్రవర్తించారు. అమరుడైన యాదిడ్డి ఆత్మహత్య లేఖలోని అంశాలను సభ దృష్టికి తేవాలని సుష్మాస్వరాజ్ ప్రయత్నిస్తుంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి లేఖ ఆయన వ్యక్తిగతమని, దాన్ని మీరెలా చదువుతారని కావూరి అభ్యంతరం పెట్టారు. యాదిడ్డి రాసిన లేఖ ఆయన రాసిందేనా? అన్న విషయం తేలాల్సి ఉందని అమరులను చులకన చేసి మాట్లాడారు. ఇక తమ పార్టీ ఎంపీ సర్వే సత్యనారాయణ మాట్లాడుతుండగా తెలంగాణ కోసం అందరూ రాజీనామాలు చేస్తే నువ్వేందుకు సభకొచ్చావంటూ వెటకారాన్ని ప్రదర్శించారు. ‘తెలంగాణ కోసం పార్లమెంటులో ఆత్మహత్య చేసుకుంటానన్నావు కదా’ అంటూ తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆత్మహత్యలే శరణ్యం అన్న విధంగా వ్యవహరించారు.

తెలంగాణకు మద్దతిస్తున్నా... ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలను గౌరవిస్తున్నానని గురుదాస్ దాస్ గుప్తా చెప్పినపుడు వీరావేశంతో బల్లలు చరిచిన సీమాంధ్ర ఎంపీలు ఆంధ్రా ప్రాంతం మొత్తం ఆగం కావొద్దనే అర్థంతోనే ఆయా ప్రాంతాను గౌరవిస్తున్నానని గురుదాస్ పేర్కొనడంతో చిన్నబుచ్చుకున్నారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకే సమైక్య రాష్ట్రం కోసం పాటు పడుతున్నామని అసత్యాలు పలికే సీమాంధ్ర నాయకులు, అక్కడి ప్రజలు బాగుండాలని ఎవరైనా కోరుకుంటే మాత్రం బల్లలు చరచలేని దైన్యంలో పడిపోయారు. చివరిలో మాట్లాడిన చిదంబరం.. తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. బంతిని రాష్ట్ర పార్టీల కోర్టుల్లోకి నెట్టారు. తెలంగాణ అంశంలో ముందుగా నిర్ణయం తీసుకోవాల్సింది ఆయా పార్టీలేనని తేల్చారు.

రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది ప్రధాన పార్టీల్లో నాలుగుకుపైగా పార్టీలు తెలంగాణపై తమ వైఖరిని ఇంత వరకూ ఖరారు చేసుకోలేదని చెప్పారు. ‘‘ఈ సమస్యకు పరిష్కారం తెలుగు మాట్లాడేవారి నుంచి, ఆంధ్రవూపదేశ్ ప్రజల నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను ముందుకు తీసుపోవటమే చేయగలదు. పార్లమెంటు కూడా ఆ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడమే చేయగలదు’’ అని చిదంబరం చేతుపూత్తేశారు. బీజేపీ సభ్యులు గోపీనాథ్ ముండే, రమేష్ కూడా చర్చలో పాల్గొనాల్సి ఉన్నా వారు ఉపసంహరించుకున్నారు.

Sushma Swaraj telugu matalu in loksabha

సోదర సోదరీమణులారా..
తెలంగాణ కోసం బలిదానాలొద్దు.. తెలంగాణ చూడటానికి
బతికుండాలి.. బతికుండాలి..
బతికుండాలి..


- సుష్మాస్వరాజ్ తెలుగు మాటలు





telangana na janmahakku:survey(తెలంగాణ నా జన్మహక్కు)

తెలంగాణపై శుక్రవారం లోక్‌సభలో సావధాన తీర్మానం సందర్భంగా తెలంగాణ ఎంపీ సర్వే సత్యనారాయణ (మల్కాజిగిరి) ప్రసంగం ఆయన మాటల్లో..

నాకు రాజకీయ జన్మనిచ్చిన సోనియాగాంధీ ఇక్కడ ఉంటే తెలంగాణ ఇచ్చి ఉండేవారు. అనారోగ్యంతో ఉన్న ఆమె త్వరగా కోలుకోవాలని తెలంగాణ ప్రజల తరుపున దేవున్ని ప్రార్థిస్తున్నా. సుష్మాస్వరాజ్ అన్నట్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగానే గాక ప్రత్యేక దేశంగా ఉండేది. తెలంగాణను భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుమీద మద్రాసు నుంచి విడిపోయిన సీమాంవూధతో కలిపారు. అప్పుడు మద్రాసు గురించి మాట్లాడిన సీమాంవూధులు ఇప్పుడు హైదారాబాద్ గురించి మాట్లాడుతున్నారు. నెహ్రూ మాటకు అనుగుణంగానే అవసరం అనుకున్నప్పుడు సీమాంవూధతో విడాకులు తీసుకుంటాం. కాంగ్రెస్ నాయకురాలు సోనియా తెలంగాణపై కొనసాగుతున్న వివక్షను అర్థం చేసుకున్నందునే తెలంగాణ ఇస్తుందనే విషయం తెలుసు. తెలంగాణ ఇవ్వాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ అందరూ నివసించవచ్చు. కేసీఆర్ అన్నట్లుగా ఆంధ్రావాలా భాగో అనే నైజం మాది కాదు. చిన్న రాష్ట్రాలే వేగవంతంగా ప్రగతిని సాధిస్తాయి. (తెలంగాణ కోసం పార్లమెంటులో ఆత్మహత్య చేసుకుంటానన్నావు అని సీమాంధ్ర నాయకులు కామెంట్ చేయగా..) యాదిడ్డిలాంటి పిల్లలు బలిదానాలు చేసుకోవద్దనే తెలంగాణకోసం కాంగ్రెస్ సభ్యులుగా ఆత్మహత్య చేసుకుంటామన్నాం. మా ప్రజలను చావనియ్యం. బాలగాంగాధర్ తిలక్ స్ఫూర్తిగా తెలంగాణ మా జన్మహక్కు. రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించండి. పసంగాన్ని తొందరగా ముగించాలని స్పీకర్ కోరగా) తెలంగాణ ప్రజలు చస్తున్నారు.. సుష్మాలాగా సీనియర్ కాకపోయినా తోటి సహచరులు రాజీనామా చేసినందున మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి.

ఉద్యోగుల సమ్మె, టీ మంత్రుల రాజీనామాలతో రాష్ర్టంలో పాలన అస్తవ్యస్థమైంది. (మరి మీరు రాజీనామా చేయలేదేం అన్న మాటలపై) నేను, అంజన్‌కుమార్ యాదవ్ రాజీనామాచేస్తే తెలంగాణ గురించి ఎవరు మాట్లాడుతారని రాజీనామా చేయలేదు. నాయకురాలిని ధిక్కరించను. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన (తెలంగాణ) కానుకను వెనక్కు తీసుకోరు. కొందరు ఆటంకాలు కల్పించి తెలంగాణను అడ్డుకున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అంటున్నారు. అది ఎవ్వరి జాగీరు కాదు. హైదరాబాద్ తెలంగాణకు తల లాంటిది. మొండెం నుంచి తలను వేరు చేయొద్దు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలి. విభజన, సమైక్యత అన్న రెండే రెండు అంశాల మీద నివేదించాల్సిన శ్రీ కృష్ణ కమిటీ ఇదంతా చెప్పడం అనవసరం.

అది రాజకీయ రిపోర్టు. ప్యాకేజీలు, అభివృద్ధి మండళ్లతో తెలంగాణకు న్యాయం జరగదు.. తెలంగాణ ఏర్పాటుతోనే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమవతుంది. నిర్దిష్ట కాలపరిమితి లేకుండా చర్చలు చేయడం అనవసరం. తెలంగాణ విషయాన్ని పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. యూపీని విభజించడానికి రెండో ఎస్సార్సీ అని అధిష్టానం అంటుంటే సీమాంవూధులు తెలంగాణకు కూడా అదే సూత్రంతో లింకు పెడుతున్నారు. ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డా సీమాంవూధులు అడ్డుకోవటంవల్లే తెలంగాణ రాలేదు. తెలంగాణను తాత్సారం చేస్తున్నందునే పిల్లలు మరణిస్తున్నారు. తెలంగాణ విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి వీడాలి.

esma gisma janthanai:jac(ఎస్మా..గిస్మా....జాన్తానై..!)

ఖమ్మంతెలంగాణ సాధనలో భాగంగా ఉద్యోగ జేఏసీ నిర్వహించ తలపెట్టిన ఆందోళలనల్లో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఐ ఎంఎల్, బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మద్దతును ప్రకటించాయి. పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో జరిగిన దీక్షలకు రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం ప్రకటించారు.

కొత్తగూడెంలో జరిగిన దీక్షలలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాబంశివరావు, పాల్వంచలో జరిగిన దీక్షలకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావులు సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగిన దీక్షల్లో ఉద్యోగులు ఎస్మా జీవో ప్రతులను దహనం చేశారు. ఈ దీక్షల్లో జిల్లాలోని ఆయా ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి.

నాలుగున్నర కోట్ల ఆకాంక్ష నెరవేరబోతోంది...
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష త్వరలో నెరవేర బోతోందని మంత్రి రాంరెడ్డి అన్నారు. కూసుమంచిలో జరిగిన దీక్షల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం మరలా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

సాధ్యమైనంత త్వరలో తెలంగాణ వస్తుందని, ఈమేరకు టీ కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారన్నారు. చర్చల అనంతరం ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ కోసం నాలుగున్నర కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారని , వారి ఆకాంక్ష నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సీమాంధ్రు లు రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని వారి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఇక్కడి వారు నిజమైన ఉద్యమ సారథులని కితాబిచ్చిన మంత్రి, తెలంగాణ అమర వీరుల త్యాగాలు వృథా కావన్నారు..

భయపడేది లేదు....
దీక్షల్లో పాల్గొన్న జేఏసీ నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఎస్మా చట్టం ప్రయోగిస్తామని బెదిరిస్తే భయపడేది లేదన్నారు. ఉడుత ఊపులకు మహావృక్షం ఊగదని, తెలంగాణ ఉద్యోగుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు.

ఈ దీక్షలల్లో జై తెలంగాణ , జైజై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సీఎం కూడా వారికి వంత పాడుతూ సీమాంధ్ర బుద్ధి చూపిస్తున్నారని విమర్శించారు.

అత్యవసర సర్వీసుల పేరుతో కీలకమైన ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఈనెల 17 నుంచి జరిగే సకల జనుల సమ్మెకు వెళ్ళకుండా చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. అందులో భాగంగానే ఎస్మా చట్టం పేరుతో బెదిరిస్తున్నాడని, ఆయనకు ఉద్యోగుల చేతుల్లో పతనం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు.

రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు మరల రాజీనామాలు చేసి ఆమోదింపచేసుకోవాలని, గతంలో రాజీనామా చేయని వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఉగ్రరూపం చూపక ముందే ప్రభుత్వాలు తెలంగాణ ప్రకటించాలని, లేకుంటే ఇక్కడి సీమాధ్రులను ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని అన్నారు.

ఈ ఆందోళనల్లో జేఏసీ చైర్మన్ కనకాచారి, ఉద్యోగ జేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, ఖాజామియా, టీజీవో ప్రదాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, సంగం వెంకటనర్సయ్య, బత్తుల సోమయ్య, మనోహర్, విజయ్ శ్రనివాసరావు, వెంకటేశ్వర్లు, భద్రయ్య వెంకటరెడ్డి, ప్రభాకర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts