Tuesday 20 September 2011

pedda pulli orignal song

Okkokka Biyyapu ginja telugu folk song

Balaamani barana banthipule telangana song

KODIPAYA LACCHAMMADI telangana folk song

MADANO NAVAYYARI telugu folk song

O Raaye Maradala telangana folk songs

TELANGANA VANDANAALU

telanganasongs - oru telangana na peru telangana

Jeera Yadi Unchu Adapilla Telangana Songs - Video.flv

meluko1.001 Jai Telangana

telangana songs - langavoni vesukunna

TELANGANA NEW SONG

telangana songs -orugallu pillada

telangana songs - bagunnava bammrdi

Pielum Koduka (Folk Song ) - Telugu Christian song

Pailam Koduka - Bro.Sailanna Songs

chinni chinnidanive o pilla.DAT

FOLK SONG BINOY MARU RELARE RELA

telangana.....yelamanda ...........emotional song

telangana janapada geetalu

elamanda (telangana)

OORU TELANGANA

telangana songs -pilaga sampatho

mudhula rajalo koduka vuthara mesthuno bidda

Telangana Brathuku Poratam illu pailam chudu mayamma

Madhu priya funny telangana song

Telangana Paata: Batukamma Song; Yememi Kayappune; HD

Telangana Pata; Poddu Poddula; Beautiful Folk Song HD

Cycle Ekki Nuvve Ponga "O SAMPATH" telangana folk songs

srikanth chary song telangana-Telangana songs

TRS 10 years celebration speeches

osmania campus lo udayinchina kiranama by ramadevi

jaya jaya he telangana by Ramadevi

yelamanda song by kishore

Chiru statement in favour of telangana

Telangana-still seeking justice part 1

Telangana-still seeking justice part 2

Telangana-still seeking justice part 3

Telangana-still seeking justice part 4

Telangana-still seeking justice part5/5

Telangana Student power

Tribute to telangana vidyarthi-sreekanth chari

Telangana jang-Urdu

Telangana Flok Song Malli Chettu Needa kimdha madano oyari

amma nannu ammake

Jai bolo telangana songs video PODUSTUNNA PODDU MEEDA.. By GADDAR

Jara Pylam Must watch Song Folk

bava--maradalu song telangana

001 Telangana folk songs{ telangana jayabheri }[yethara mana janda]

ooru telangana [rajigo rajanna]

telangana folk songs vinod yadav

Telangana Paata: Veerulara Vandanam, A salute to the Students of Telangana HD

Telangana Folk Songs - Bottu meda adindhi Nagu

Madhu Priya own song in 1 part Google Chrome

revolutionary songs(emunnadakko)

Chalo dhoom dham by vimala akka

Jai bolo telangana 1.wmv

Jai bolo telangana 2.wmv

Gaaradi Chestunru from Jai bolo telangana

Jai bolo Telangana- podustunna poddumeeda.wmv

Osmania campus lo udayinchina kiranama

telangana folk songs - enni kastale pellama

Gall Gall Sappulla (Bhavana) Jaanapadalu.

Telangana Paata: Golla Mallamma: with Full Bass HD: Kolatam

telangana folk songs vinod yadav

rastam vidipothe avariki anny nillu(రాష్ట్రం విడిపోతే ఎవరికెన్ని నీళ్లు?)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ, సీమాంధ్ర లేక తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ రాష్ట్రాలుగా ఏర్పడితే కృష్ణా, గోదావరి నదులలో ఎవరికెంత వాటా వస్తుందో చెప్తారా?




ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినా లేక మూడు రాష్ట్రాలుగా విడిపోయి నా తెలంగాణ వాటాలో తేడారాదు. సీమాంవూధకు వచ్చే వాటాలు, వేటికవే ప్రత్యేకంగానే ఉన్నాయి. కాబట్టి అవి కూడా పంచుకోవడానికి ఇబ్బందేమీ ఉండదు.

ముందు కృష్ణా నదీ జలాల గురించి మాట్లాడుకుందాం. కృష్ణా నదీ జలాలను బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను జరిపింది. మన రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం నికర జలాలు (75శాతం విశ్వసనీయతన నిర్ధారించబడిన నీరు) 811 టీఎంసీలు (శత కోటి ఘనపు అడుగులు) దక్కాయి.

బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపిన తరువాత ప్రభుత్వం ప్రాజెక్టుల కేటాయింపులలో కొంత సర్దుబాటు చేసింది. ఫలితంగా తెలంగాణకు 295.26 టీఎంసీలు, కోస్తాంధ్రకు 369.74 టీఎంసీలు, రాయలసీమకు 146 టీఎంసీలు లభించాయి. బచావత్ ట్రిబ్యునల్ కాల పరిమితి ముగిసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవతరించింది. కొత్త ట్రిబ్యునల్ 75 శాతం ప్రాతిపదికను మార్చి కొత్తగా 65 శాతం ప్రాతిపదికను అనుసరించింది. ఫలితంగా రాష్ట్రానికి బచావత్ 811 టీఎంసీలకు అదనంగా 45 టీఎంసీలు లభించగలవని ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ 45 టీఎంసీలలో ఆరు టీఎంసీల ను నదిలో వదలవలసిన కనీస నీటి ప్రవాహంగా నిర్ధారించి, మిగిలిన 39 టీఎంసీలలో తొమ్మిది టీఎంసీలను జూరాలకు కేటాయించి,ఇంకా మిగిలిన మూడు టీఎంసీలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో క్యారీ ఓవర్ నిలువ (carry over storage)నిమిత్తం వాడుకోవాలని నిర్ధారించింది. ఒకరకం గా ఈ క్యారీ ఓవర్ స్టోరేజీ ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిదన్న మాట. ఈ సంవత్స రం వర్షాలు బాగా పడి, వచ్చే సంవత్సరం నీటి కొరత ఏర్పడే అవకాశముం ఆ పరిస్థితిని అధిగమించడానికి ఈ క్యారీ ఓవర్ స్టోరేజీ ఉపయోగపడుతుంది. ఆ వచ్చే సంవత్సరం కూడా బాగా వర్షాలు పడితే ఈ క్యారీ ఓవర్ స్టోరేజీని ఇతర ప్రాజెక్టులకు ప్రభుత్వం ఉపయోగించుకునే అవకాశముంది.


బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ చేసిన ఇంకోపనేమంటే కృష్ణానదిలో లభించే మిగులు జలాలను అంచనాగట్టి మూడు రాష్ట్రాలకు పంచింది. ఆంధ్రప్రదేశ్ కు 145 టీఎంసీల మిగులు జలాలను కేటాయించడం జరిగింది. రాయలసీమ కు ఉపయోగపడే ‘తెలుగు గంగ’ ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయిం చి, మిగిలిన 120 టీఎంసీలను పైన చెప్పిన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల క్యారీ ఓవర్ స్టోరేజీకి జత కలిపింది. అంటే క్యారీ ఓవర్ స్టోరేజీ 30 టీఎంసీల నికర జలాలు, 120 టీఎంసీల మిగులు జలాలు మొత్తం 150 టీఎంసీలవుతుంది. అయితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రాష్ట్రాలు ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టులో సవాలు చేయడమే కాక ప్రస్తుతం ట్రిబ్యునల్ ఎదు ట కూడా వాదవూపతివాదనలు కొనసాగుతున్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంతిమంగా తమ అవార్డుకు అధికార పత్రం (official gazette)లో ప్రకటించే వరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమలులో లేనట్టే. అప్పటి వరకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డే చెలామణి అవుతుంది.

బచావత్ ట్రిబ్యునల్ అవార్డు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులలో స్వల్పంగా మన ప్రభుత్వం చేసిన సవరణల ఆధారంగా తెలంగాణకు 295.26 టీఎంసీలు లభ్యమవుతున్నట్టు శాసనసభలో రాష్ట్ర ప్రభు త్వం ప్రకటన చేసింది. ఆ ప్రకటన అనుసరించి తెలంగాణలో నికర జలాల ను ఉపయోయోగించుకునే ప్రాజెక్టుల వివరాలివి (టీఎంసీలలో) నాగార్జునసాగర్ ఎడమ గట్టు కాలువ 106.20, డిండి 3.70, పాలేరు 4.00, పాకా ల 2.60, వైరా 3.70, కోయల్ సాగర్ 3.90, రాజోలిబండ స్కీం 15.90, మూసి 9.40, లంకాసాగర్ 1.00, కోటిపల్లివాగు 2.00, ఓక చెట్టువాగు 1.90 చిన్న తరహా సాగునీరు 90.82, జూరాల 17.84, శ్రీశైలం ఆవిరి నష్టం 11.00, జంట నగరాల తాగునీటి సరఫరా 1.30, భీమా 20.00 మొత్తం 295.26 టీఎంసీలు.

శాసనసభలో భారీ నీటి పారుదల శాఖా మంత్రి చేసిన అదే ప్రకటనలో మిగులు జలాలలో తెలంగాణకు 72.32 టీఎంసీలు కూడా కేటాయించినట్టు చెప్పారు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ 26.22, నెట్టంపాడు 20.00, కల్వకుర్తి 25.00, జంట నగరాల తాగునీటి సరఫరాకు 1.10 మొత్తం 72.32 టీఎంసీలు. ఈ రకంగా మొత్తం తెలంగాణకు 367.58 టీఎంసీల నీరు అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మిగు లు జలాల విషయం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు ఈ మిగులు జలాల కేటాయింపులకు ఎలాంటి చట్టబద్ధత, సాధికారత ఉండ దు. కనుక ఈలోగా తెలంగాణ ఏర్పడితే కృష్ణానది నికర జలాలలో తెలంగాణకు 295.26 టీఎంసీలు మాత్రమే దక్కుతాయని, అంతకు మించి అవకాశం లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. నికర జలాల విషయం తరువాత తేలుతుంది.

ఇక గోదావరి విషయానికి వస్తే తెలంగాణ, కోస్తాంధ్ర మధ్యే కేటాయింపులుంటాయి. ఈ నదీ జలాల పైన కూడా బచావత్ ట్రిబ్యునలే నివేదిక సమర్పించింది. వివిధ రాష్ట్రాలు పరస్పరం చేసుకున్న ఒప్పందాల ఆధారంగా ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డు ప్రకారం మన రాష్ట్రానికి గోదావరి నికర జలాలు 1480 టీఎంసీలుగా నిర్ధారణ జరిగింది. మన ప్రభుత్వం లోగడ అధికారికంగా ప్రకటించిన ప్రాజెక్టుల వివరాల ప్రకారం భారీ ప్రాజెక్టులకు 1270.28 టీఎంసీలు, మధ్య తరహా ప్రాజెక్టులకు 64.25 టీఎంసీ లు, చిన్న తరహా ప్రాజెక్టులకు 139.77 టీఎంసీలు, పారిక్షిశామిక, తాగునీటి అవసరాలకు 5.70 టీఎంసీలు మొత్తం 1480 టీఎంసీల వినియోగం ఉంటుంది. భారీ ప్రాజెక్టులలో తెలంగాణకు 705.68 టీఎంసీలు, ఆంధ్రకు 564.60 టీఎంసీలని లెక్కలు కట్టింది.

ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్రాజెక్టు వివరాలు (వినియోగం టీఎంసీలలో)
తెలంగాణలో నిర్మించబడినవి

నిజాంసాగర్ - 58.00, మంజీర తాగునీటి పథకం -2.97, సింగూరు- 11.00, కడం-13.42, శ్రీరాంసాగర్ ప్రథమ దశ-145.35, కిన్నెరసాని-8.14- మొత్తం 238.88 టీఎంసీలు
తెలంగాణలో నిర్మాణంలో ఉన్నవి
లెండి-2.80, గుత్ప-3.04 అలీసాగర్-2.96, ఎల్లంపల్లి-63.00, దేవాదుల 50.00, శ్రీరాంసాగర్ వరద కాలువ-20.00, శ్రీరాంసాగర్ ద్వితీయదశ-40.00 మొత్తం 171.80 టీఎంసీలు.
తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు
దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్-20.00, ఇందిరాసాగర్ రుద్రమకోట-20.00- మొత్తం 40.00 టీఎంసీలు.

తెలంగాణలో తలపెట్టిన ప్రాజెక్టులు
ప్రాణహిత చేవెళ్ల-160.00, ఇచ్చంపల్లి 85.00 మొత్తం 245.00 టీఎంసీలు
ఈవిధమైన నాలుగు కేటగిరిలలోని ప్రాజెక్టుల మొత్తం వినియోగం 705.68 టీఎంసీలు. ఆంధ్రకు సంబంధించిన ప్రాజెక్టులు రెండే రెండు. నిర్మించబడిన ధవళేశ్వరం బ్యారేజీ-263.60 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న పోలవరం-301.00 టీఎంసీలు-మొత్తం వినియోగంలో 564.60 టీఎంసీలు.
అయితే ప్రభుత్వం లోగడ ప్రకటించిన ప్రాజెక్టులు, వాటి వినియోగంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు నిజాంసాగర్ వినియోగం 58 టీఎంసీలు లేదు. ప్రస్తుతం 30 టీఎంసీలకు మించిలేదు. ఇచ్చంపల్లి నిర్మాణంలో లేదు. కంతనపల్లి ఇచ్చంపల్లికి బదులుగా వచ్చింది. అంతిమంగా కంతనపల్లికి 100 టీఎంసీల వినియోగం అని భావిస్తున్నారు.

గుత్ప, అలీ సాగర్‌ల నిర్మాణం పూర్తయింది. దేవాదుల వినియోగం 50 కి బదులుగా 38.18 టీఎంసీలుగా మాత్రమే ఉంది. ఏదేమైనా ప్రభుత్వం ప్రకటించినట్టుగా తెలంగాణలో భారీ ప్రాజెక్టుల వినియోగం 705.68 టీఎంసీలని భావించవచ్చు. ఇక మధ్యతరహా ప్రాజెక్టుల విషయానికి వస్తే.. రాష్ట్రం మొత్తానికి 64.25 టీఎంసీల వినియోగంగా అంచనా వేశారు. అందులో సుమారు 60 టీఎంసీల వినియోగం తెలంగాణలోనే ఉంటుంది. ఇక చిన్నతరహా ప్రాజెక్టుల విషయానికి వస్తే మొత్తం వినియోగం 139.77 టీఎంసీలలో అత్యధిక భాగం తెలంగాణలోనే ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. గోదావరి జలాల వినియోగంలో సుమా రు 580 టీఎంసీలలోపు ఆంధ్రకు, 900 టీఎంసీల కన్నా కాస్త ఎక్కువగా తెలంగాణకు దక్కుతుందని ఆశించవచ్చు. పోలవరానికి కేటాయించిన 301 టీఎంసీలలో పోలవరానికి ప్రత్యామ్నాయంగా చేపట్టిన తాటిపూడి, పుష్క రం, చాగల్నాడు వినియోగాలు కూడా 301 టీఎంసీలలో భాగమై ఉంటా యి.

ప్రభుత్వం 165 టీఎంసీల వినియోగంతో ప్రకటించిన ‘దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్’ కేవలం మిగులు (లేక వరద) జలాలపై ఆధారపడి ఉన్నది అన్న విషయం ప్రభుత్వం పదేపదే చెప్తున్నా అంత నమ్మదగినదిగా అనిపించడం లేదు. కారణం పోతిడ్డిపాడు విషయంలో కూడా ప్రభుత్వం వరద జలాలని చెప్పి నికర జలాలను తరలించడమే. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణానదిలో లభ్యమయ్యే నికరజలాలు 811 టీఎంసీలలో తెలంగాణకు 295.26 టీఎంసీలు (మిగులు జలాలు 72.32 టీఎంసీలని ప్రకటించినా నిర్ధారణ కాలేదు). ఇక గోదావరి జలాలలోని నికర జలాల మొత్తం 1480 టీఎంసీలలో 900 టీఎంసీలు (సుమారు)గా ఉంటాయని భావించవచ్చు. సమస్యల్లా గోదావరిపైన ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులు చాలా మటుకు నిర్మాణం కావలసి ఉన్నవి. అవి ఎప్పు డు పూర్తవుతాయో తెలియదు. ఈ లోగా ప్రభుత్వం దుర్మార్గంగా చేపట్టిన దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ పూర్తయి సమస్యలు సృష్టించవచ్చు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే లభ్యమయ్యే జలాల సంపూర్ణ వినియోగం గురించి శరవేగంగా ప్రయత్నాలు మొదలుపెట్టడానికి రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు వ్యూహాలు రచిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు అటు కాగితాలపైనో, భూమిపైనో అసంపూర్తిగా ప్రజలను వెక్కిరిస్తూ ఉంటాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టు ఉంది ప్రస్తుత తెలంగాణ పరిస్థితి.

ఇదీ సంగతి
నదీజలాలు-రకాలు

నదీ జలాలను నికరజలాలు (dependable waters) మిగులు జలాలు (surpless waters), వరద జలాలు (flood waters)గా వర్గీకరణ చేయవచ్చు. నమ్మకంగా వస్తాయని అంచనావేసే నీళ్లు నికర జలాలు. ప్రస్తుతం సాగునీటి వ్యవస్థ 75 శాతం విశ్వసనీయత ఆధారం గా రూపుదిద్దుకుంటున్నది. ప్రాజెక్టులు 75 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన కడ్తున్నారంటే నూరు సంవత్సరాల కాలంలో 75 సంవత్సరాల పాటు తప్పక వస్తుందన్న నేటి పరిమాణాన్ని అంచనా వేసి నికర జలాలని చెప్పుకుంటున్న ఆ నీటి ఆధారంగా అన్నమాట. మిగిలిన 25 సంవత్సరాలు నికర జలాల పరిణామం కన్న తక్కువ నీరు వస్తుందని భావించవచ్చు. ఈ 75 సంవత్సరాలలో తప్పక వస్తుందన్న నీటి పరిమాణం కంటే కొన్ని ఏళ్లలో ఎక్కువ నీరు వస్తే ఆ నీటిని ‘మిగులు జలాలు’గా వ్యవహరిస్తాం. మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులను ప్రణాళిక సంఘం సాధారణ పరిస్థితుల్లో ఆమోదించదు. మిగులు జలాల విశ్వసనీయత తక్కువ కావడమే అందుకు కారణం. అలా రూపొందించిన ప్రాజెక్టులు ఎక్కువ కాలం నిండ కుండా ఖాళీగా ఉండి ప్రజాధనం దుర్వినియోగం కావడానికి హేతువు అవుతాయని కేంద్రం అభివూపాయం. నదుల్లో ఉధృతంగా వరదలు వచ్చినప్పుడు ప్రవహించే నీటిని ‘వరద జలాలు’గా చెప్పుకుంటాం. వీటని ఒడిసిపట్టుకోవడం కాని వీటి ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకోవడం కాని సాధ్యమయ్యే పనికాదు. అందుకు కేంద్రం ఒప్పుకోదు. అయితే వ్యవహారం మామూలుగా వచ్చే ప్రవాహా న్ని కూడా వరద జలాలని, మిగులు జలాలను కూడా వరద జలాలని అశాస్త్రీయంగా పేర్కొనడం గమనిస్తున్నాం.
-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

telangana vachaka valla sangathi chustham(తెలంగాణ వచ్చాక వాళ్ల సంగతి చూస్తం)

హింసిస్తున్న పోలీసుల వివరాలు సేకరిస్తున్నాం: కేటీఆర్
- గీత దాటుతున్న ఖాకీలు: కోదండరాం
- వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదు: ఈటెల
- నిజాం కాలేజీ విద్యార్థులకు పరామర్శ 
నాంపల్లి,
ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు కుక్కలు నిజాం హాస్టల్‌లోకి చొరబడి తెలంగాణ బిడ్డలపై క్రూరంగా దాడులు చేశాయని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్యని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఉస్మానియా, కాకతీయ యునివర్సిటీలతోపాటు నిజాంలో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదిన పోలీసు అధికారులను వివరాలు సేకరిస్తున్నామన్నారు. విద్యార్థులను దారుణంగా హింసిస్తున్న పోలీసులను, తెలంగాణ వచ్చిన తర్వాత బట్టలూడదీసి, శంకరగిరి మాన్యాలకు పట్టిస్తామని హెచ్చరించారు. నిజాం హాస్టల్‌లో జరిగిన పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థులను మంగళవారం జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌తో కలిసి కేటీఆర్ పరామర్శించారు.

ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై జరిగిన దాడులు.. నాలుగున్నర కోట్లమంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. తాను హైదరాబాదీనేనని, ఇదే కళాశాలలో చదివిన సీఎం కిరణ్‌కుమార్‌డ్డి చెప్పుకుంటున్నారని, ఆయన పర్యవేక్షణలోనే ఖాకీలు విద్యార్థులను చితకబాదడం దారుణమని మండిపడ్డారు. దీనికి బాధ్యులైన పోలీసులను సీఎం కనీసం మందలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు అకున్ సబర్వాల్, నర్సయ్య, శివకుమార్‌లు రెచ్చిపోయి విద్యార్థులను కొట్టారని, వారి సంగతి తర్వాత తేల్చుతామని హెచ్చరించారు. వీరు తీరు మారకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు.

రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడంలో భాగంగానే పోలీసుల దారుణాలు పెచుమీరుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అసెంబ్లీకి కూతవేటు దూరాన ఉన్న నిజాం హాస్టల్‌పై పోలీసులు విరుచుకుపడటం దారుణమని ఖండించారు. విద్యార్థులపై దమనినీతి ప్రదర్శించి పోలీసు అధికారులు సర్కారు పట్ల తమకున్న రాజభక్తిని చాటుకున్నారని మండిపడ్డారు. వారు రేపు తెలంగాణ వచ్చిన తర్వాత వడ్డీతో సహా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్షికమంలో మాజీ ఎంపి వినోద్‌కుమార్, బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తావూతేయ, ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు, వెంకటడ్డి పాల్గొన్నారు.

ప్రిన్సిపాల్ రాజీనామా..ఆ తర్వాత మాట మార్చి...
పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన ప్రిన్సిపాల్ నాయుడు అశోక్‌పై విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిని నిరసిస్తూ ఆయనను నిలదీశారు. విద్యార్థులపై అకారణంగా దాడి జరిపించిన డీసీపీ అకున్ సబర్వాల్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలని పట్టుపట్టారు. పోలీసులు రెచ్చిపోవడానికి ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనను ఘెరావ్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రిన్సిపల్ నాయుడు అశోక్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే మాట మార్చారు. తాను రాజీనామా చేయలేదని ప్రిన్సిపాల్ నాయుడు అశోక్ మీడియా ప్రతినిధులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.

sigareni karmikula samme

కార్మికులపైకి బదిలీల వల... సింగరేణి ముద్దుబిడ్డలు బేఖాతర్ -తుపాకీ నీడలో రహస్యంగా బొగ్గు రవాణా -ఎన్టీపీసీకి కోల్ ఇండియా నుంచి బొగ్గు! -నిత్యం 15వేల టన్నుల బొగ్గు దిగుమతి -ఎన్టీపీసీలో 1,914 మెగావాట్లకు పుంజుకున్న విద్యుత్ ఉత్పత్తి -సమ్మె ప్రభావం నుంచి బయటపడేందుకు సర్కారు విఫలయత్నాలు -ఎక్కడికక్కడే కుట్రలను భగ్నం చేస్తున్న సంఘాలు -రూ.200 కోట్ల ఉత్పత్తికి విఘాతం..రూ.64 కోట్ల వేతనాలు త్యాగం ఒకటే గమనం, ఒకటే గమ్యం..అలుపు లేదు మనకు, తెలంగాణ సాధించే వరకు..’అనే తదేక సంకల్పంతో సింగరేణి సోదరులు ముందుకు సాగుతున్నారు. యాజమాన్యం, సర్కారు కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధనవైపు పరుగులు పెడుతున్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సర్కారు తాజాగా ప్రయోగించిన ‘కోరుకున్న చోటుకే బదిలీ’ అస్త్రం కూడా విఫలమైంది. ఈ తాయిలానికి సైతం ఎవరూ ముందుకు రాకపోవడంతో బలవూపయోగమే సరైందని సర్కారు భావిస్తోంది. అమాయకులైన కార్మికులను భయపెట్టి అర్ధరాత్రి వేళలో బలవంతంగా పనులు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడక్కడా ఉన్న కొద్దిపాటి నిల్వలను రహస్యంగా తరలిస్తున్నారు. ఉత్పత్తిని, రవాణాను ఎక్కడికక్కడే అడ్డుకోవడంతో సర్కారు తలపట్టుకుంటోంది.సింగరేణిలో సమ్మె మంగళవారం 8వ రోజుకు చేరింది. ఇప్పటికి 200 కోట్ల ఉత్పత్తికి విఘాతం కలిగింది. కార్మికులు 64 కోట్ల వేతనాలు కోల్పోయారు. పోలీసుల బల ప్రయోగం రామగుండం పారిక్షిశామిక ప్రాంతం (కోల్‌బెల్ట్)లో కార్మికులతో బలవంతంగా పనులు చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినప్పటికీ వారి తీరులో మార్పులేదు. మంగళవారం ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు-3లో కొంతమంది కార్మికులను తీసుకువచ్చారని, వారితో పనులు చేయించే అవకాశముందని తెలియడంతో ప్రాజెక్టుకు వెళ్లిన జేఏసీ కో-ఆర్డినేటర్ మాదాసు రామ్మూర్తితో పాటు హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, ఏఐటీయూసీ నాయకులను అరెస్టు చేశారు. కార్మిక సంఘాల ఆందోళనతో వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు-1 నుంచి సుమారు 3వేల టన్నుల బొగ్గును ఎన్టీపీసీకి వ్యాగన్ల ద్వారా తరలించారు. గోదావరిఖనికి చెందిన కొంతమంది కార్మికులు దూర ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు, వారిని ఖనికి బదిలీ చేస్తామని ప్రలోభపెట్టి పనులు చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి పనులు ప్రారంభించేందుకు వీలుగా భారీ వాహనాల్లో డీజిల్ నింపి సిద్ధంగా ఉంచడం, ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న 20వేల టన్నుల బొగ్గును తరలించేందుకు ప్రయత్నాలు చేస్తు వ్యాగన్లను సిద్ధంగా పెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మణుగూరు నుంచి భారీగా బొగ్గు ? రామగుండం ఎన్టీపీసీకి నిత్యం 15వేల టన్నుల బొగ్గు రావడం వల్ల ఇబ్బంది లేకుండా విద్యుత్ ఉత్పత్తి సాగుతోందని ఎన్టీపీసీ అధికార ప్రతినిధి జాన్ తెలిపారు. మంగళవారం రామగుండం ఎన్టీపీసీలో 1,914 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, అన్ని యూనిట్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. మణుగూరు నుంచి రామగుండం ఎన్టీపీసీకి నిరంతరాయంగా బొగ్గు రవాణా సాగుతూనే ఉంది. కొత్తగూడెం నుంచి రైలు ద్వారా 7,548 టన్నులు, రోడ్డు ద్వారా 1,060 టన్నులు, ఇల్లందు డివిజన్ నుంచి రైలు ద్వారా 4,009 టన్నులు, మణుగూరులో రైలు ద్వారా 20,078 టన్నులు, రోడ్డు ద్వారా 1,477 టన్నులు, రామగుండం డివిజన్-3 నుంచి 2,100 బొగ్గు రవాణా జరిగిందని వివరించారు. సోమవారం కొత్తగూడెం (6,168 టన్నులు), మణుగూరు (13,635 టన్నులు) రామగుండం (1,700 టన్నులు) మినహా ఎక్కడా బొగ్గు ఉత్పత్తి జరగలేదు. సమ్మెకు మద్దతు సింగరేణి కార్మికులకు సంఘీభావం తెలుపడానికి టీజేఎఫ్, అఖిలపక్షం ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగింది. ఆదిలాబాద్ జిల్లాలో లక్షెట్టిపేట నుంచి మొదలైన ర్యాలీ మంచిర్యాల, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల మీదుగా సాగింది. శ్రీరాంపూర్, గోదావరి ఖనిలో బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. వివిధ కార్మిక సంఘాల నాయకులతోపాటు సీపీఐ ఎమ్మెల్యేలు గుండా మల్లేశ్, కూనమనేని సాంబశివరావు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జీ అరవింద రెడ్డి, నల్లాల ఓదెలు తదితరులు కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. నల్లాల ఓదెలు, ఏఐటీయూసీ సింగరేణి విభాగం ప్రధాన కార్యదర్శి వాసిడ్డి సీతారామయ్య సోమవారం కొత్తగూడెం రీజియన్‌లో కార్మికులతో మాట్లాడారు. అక్కడే రాస్తారోకో నిర్వహించిన కెంగర్ల మల్లయ్య అరెస్టయ్యారు. జేఏసీ కో ఆర్డినేటర్ మాదాసు రాంమూర్తి, కన్వీనర్‌లు గోసిక మల్లేశ్, చాంద్‌పాషా, హెచ్ రవీందర్, కళాధర్, తదితరులతోపాటు ఈబీజీకేఎస్ నాయకులు బంటు సారయ్య, చంద్రయ్య, సంపత్, జే రవీందర్, ఓ రాజశేఖర్, ప్రవీణ్, శ్రీనివాస్‌రావు ఏఐటీయూసీ నాయకులు గోపు సారయ్య, వై గట్టయ్య, దయాకర్ రెడ్డి, వేల్పుల నారాయణ, చిప్ప నర్సయ్య, ఐఎన్టీయూసీ నాయకులు, ఎమ్మెల్సీ బీ వెంకవూటావు, కాంపెల్లి సమ్మయ్య, డీ అన్నయ్య, రాయలింగు, మహిపాల్ రెడ్డి, రాజారాం, ఇఫ్టూ అధ్యక్షులు టీ శ్రీనివాస్, బీ సంపత్ కుమార్, జాఫర్, దాస్, సాధనవేని వెంక హెచ్‌ఎంఎస్ నాయకులు రాజిడ్డి, రహీం, ఓజియర్, సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నీరేటి రాజయ్య, కుమార్, టీఎన్టీయూసీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, ఏఐఎఫ్‌టీయూ నేత అంజయ్య ఆయా ప్రాంతాలలో ఆందోళనల్లో పాల్గొన్నారు.

apsrtc thamana nithi(ప్రగతి చక్రం దమననీతి)

1,325 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు -మిగిలినవారు విధులకు హాజరైతే తక్షణమే క్రమబద్ధీకరణ అని ప్రకటన -అద్దె బస్సులపై కొరడా -తక్షణమే క్రమబద్ధీకరణ అని ప్రకటన -సమ్మెను నీరుకార్చే ప్రచారాలను నమ్మొద్దు టీజేఏసీ చైర్మన్ కోదండరాం :సకల జనుల సమ్మెలో భాగమై.. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులపై సీమాంధ్ర సర్కారు ఉక్కుపాదం మోపింది. ఆర్టీసీ యాజమాన్యం తన సీమాంధ్ర నైజం బహిర్గతం చేస్తూ కుతంవూతాలకు తెరతీసింది. సమ్మెలో పాల్గొంటున్న కాంట్రాక్టు కార్మికుల ఆత్మసై్థర్యాన్ని దెబ్బతీసేందుకు కుటిల అస్త్రాలను ప్రయోగించింది. నోటీసులిచ్చినా బెదరకుండా తెలంగాణ కోసం తెగించి సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికులపై యాజమాన్యం దమననీతిని ప్రదర్శించింది. 1,350 మంది కాంట్రాక్టు కార్మికులపై వేటు వేసింది. వీరిలో 675 మంది డ్రైవర్లు, 680 మంది కండక్టర్లున్నారు. వీరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీకి సుమారు 10వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులున్నారు. వీరిలో ఆరు వేల మంది సర్వీసు క్రమబద్ధీకరణకు అర్హులని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. వీరు బుధవారం విధులకు హాజరైతే.. మొదటి దశలో భాగంగా 2,899 మంది సర్వీసును తక్షణమే క్రమబద్ధీకరించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. సీఎం ఏర్పాటు చేసిన రవాణా టాస్క్‌ఫోర్సు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి లక్ష్మీపార్థసారథి, కమిషనర్ హీరాలాల్ సమారియా, ఆర్టీసీ ఎండీ ప్రసాదరావులతో కూడిన టాస్క్‌ఫోర్సు మంగళవారం భేటీ అయింది. ఈ భేటీలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు, క్రమబద్ధీకరణ, అద్దె బస్సులపై కొరడా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించారు. అద్దె బస్సులపై కొరడా ఆర్టీసీ అద్దె బస్సులు కూడా సమ్మెలో పాల్గొంటుండడాన్ని యాజమాన్యం తీవ్రంగా పరిగణిస్తోంది. తెలంగాణలో ఉన్న 1,000కిపైగా అద్దె బస్సులను వెంటనే తిప్పకపోతే, తమ మధ్యనున్న ఒప్పందాన్ని రద్దు చేస్తామని అద్దె బస్సు యజమానులకు ఆర్టీసీ నోటీసులిచ్చింది. దీంతో 200 అద్దె బస్సులను తిప్పడానికి మంగళవారం ప్రయత్నాలు జరిగాయి. హైదరాబాద్‌లో పోలీసుల భద్రత నడుమ తిప్పిన బస్సులు అద్దెవేనని సమాచారం. కార్మికులను విధుల్లో చేర్పించే బాధ్యత మాదే -ఆర్టీసి జేఏసి ఛైర్మన్ ఆనందం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించడాన్ని ఆర్టీసి జేఏసి తీవ్రంగా ఖండించింది. తొలగించే కార్మికులందర్ని విధుల్లో చేర్పించే బాధ్యతను తాము తీసుకుంటామని జేఏసి ఛైర్మన్ ఆనందం ప్రకటించారు. గతంలో కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని ఎన్ని ఉద్యమాలు చేసినా చలించని ఆర్టీసి యాజమాన్యం తెలంగాణ కోసం రెండు రోజుల సమ్మె పూర్తి కాక ముందే వారిని తొలగించడంలో అత్యుత్సాహం ప్రదర్శించిందని ఆయన ధ్వజమెత్తారు. కాంట్రాక్ట కార్మికుల పై వేసిన వేటును నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలపై వేసిన వేటుగా భావిస్తున్నామన్నారు. ఇది సీమాంధ్ర పాలకుల అహంకారానికి నిదర్శనం - ఎన్‌ఎంయు(టి) కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును గుర్తింపు యూనియన్‌గా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని నేషనల్ మజ్దూర్ యూనియన్ తెలంగాణ (ఎన్‌ఎంయు)(టి) ఛైర్మన్ థామస్‌డ్డి, కన్వీనర్ అశ్వథామడ్డి, కో-కన్వీనర్ కె.హన్మంతు అన్నారు. వారి సర్వీసుల క్రమబద్ధీకరణకు ఎన్‌ఎస్‌యుటి చేస్తున్న పోరాటం ఒక పక్క కొనసాగుతుండగానే సమ్మె పేరిట యాజమా న్యం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధకరమని మండిపడ్డారు. తొలగించిన 1350 కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే దాకా ఎన్‌ఎంయుటి రాజీలేని పోరాటం సాగిస్తుందన్నారు. తెలంగాణ కోసం సమ్మె చేస్తుంటే అదే తెలంగాణకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులపై వేటు వేయడం సీమాంధ్ర పాలకుల అహంకారానికి నిదర్శనమన్నారు. బుధవారం విధులకు హాజరైతే మిగతా కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తానంటున్న యాజమాన్యం దొంగ మాటలను నమ్మోద్దని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకావద్దని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ఈ తొలగింపుతో ఆర్టీసి సమ్మె మరింత ఉదృతం - ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్(ఇయూ) తెలంగాణ ఫోరం కన్వీనర్ రాజిడ్డి తీవ్రంగా ఖండించారు. సమ్మెకు వెళ్ళేముందు మీ ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తామని వారికి హమీ ఇచ్చామని, దీనిలో భాగంగానే సమ్మె ముగిసిన తరువాత తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి చేర్పించిన తరువాతే తాము విధుల్లో చేరుతామని స్పష్టం చేశారు. సమ్మె రెండవ రోజే అత్యుత్సాహంతో సీమాంధ్ర పాలకులు తీసుకున్న నిర్ణయం పట్ల ఇయు తెలంగాణ పోరం తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుతో ఆర్టీసి సమ్మె మరింత ఉధృతమవుతుందని ఆయన హెచ్చరించారు. తొలగింపు కక్షసాధింపు చర్య: ఎంఎన్‌యూ నేత లక్ష్మణ్ కరీంనగర్: కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ తీసుకున్న చర్యను ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఎంఎన్‌యూ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఇది కక్షసాధింపు చర్యగా మండిపడ్డారు. సమ్మె ముగిసిన అనంతరం డ్యూటీలో ఉంటూ కాంట్రాక్టు కార్మికులు చేరిన అనంతరం తాము చేరుతామని వారిని తొలగించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెను నీరుకార్చే ప్రచారాలను నమ్మొద్దు - టిజేఏసీ చైర్మన్ కోదండరాం కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగులకు ఎటువంటి ప్రమాదం లేదని టిజేఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సమ్మెను నీరుకార్చటానికి జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ హక్కుల ర ణకై, జీతాలకై టి జాక్ బాధ్యత తీసుకుంటుందని ఆయన కార్మికులకు భరోసా ఇచ్చారు.

kcr tho jac nethala samavesham(కేసీఆర్‌తో జేఏసీ నేతల సమావేశం)

సకలజనుల సమ్మెను మరింత ఉధృతం చేయటానికి తీసుకోవాలిసిన చర్యల గురించి చర్చించేందుకు జేఏసీ నేతలు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అన్ని విభాగాల ఉద్యోగులు, ప్రజలు సకలజనులసమ్మెలో భాగస్వాములవుతున్నందున సమ్మెను మరింత ముందుకు తీసుకు పోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో కోదండరాం, బీజేపీ, న్యూడెమొక్రసీ, ఉద్యోగసంఘ నాయకులు పాల్గొన్నారు.

sep 24,25 rail roko(24,25న రైలు రోకో) jai telangana

సకలజనులసమ్మెలో భాగంగా ఈనెల 24,25లలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైలురోకోలు చేపట్టాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అక్టోబర్‌లో హైదరాబాద్ నగరాన్ని దిగ్భంధనం చేయనున్నట్లు తెలిపారు

thommido rojuku cherina sakala janula samme(తొమ్మిదో రోజుకు చేరిన సమ్మె)

తెలంగాణలో సకల జనుల సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించి తమ నిరసనను తెలుపుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఈ రోజు నుంచి దీక్షలో పాల్గొనున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని బంద్ చేస్తామని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. డాక్టర్లు, న్యాయవాదులు, విద్యార్థులు, లెక్చరర్లు సమ్మెలో పాల్గొంటున్నారు.

thikkulu pikkatillela thigbandam(దిక్కులు పిక్కటిల్లేలా దిగ్బంధం )

పయ్య తిరగలేదు..చీమ దూరలేదు -అపూర్వ స్థాయిలో రోడ్లపై ఆందోళన -ఢిల్లీకి సెగ తాకించిన రహదారుల దిగ్బంధం - తొమ్మిది ప్రధాన కేంద్రాల్లోనూ విజయవంతం - వందలాది ఉప కేంద్రాల్లో ఆందోళనలు.. లక్షలాదిగా పాల్గొన్న తెలంగాణవాదులు - ఏక కంఠంతో జై తెలంగాణ నినాదాలు.. వేల సంఖ్యలో నిలిచిన లారీలు - నల్లగొండ సరిహద్దుల్లో గోడ కట్టారు.. పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు బంద్ - డిపోల్లోనే బస్సులు.. విధులు బహిష్కరించిన 50వేల మంది ఆర్టీసీ కార్మికులు - మోగని బడి గంటలు.. తెరుచుకోని కార్యాలయాలు - మిన్నంటిన ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు.. పెరిగిన నిర్బంధం.. పలు చోట్ల అరెస్టులు తొమ్మిది ప్రధాన కేంద్రాలు.. వందలాది ఉప కేంద్రాలు.. లక్షలాది ప్రజలు.. 14 గంటలపాటు.. జాతీయ రహదారుల దిగ్బంధం! పయ్య తిరగలేదు.. చీమ చొరబడలేదు..! ఏ ఉద్యమ చరివూతలోనూ లేనంతగా.. ఏ ఆందోళనలోనూ కనీవినీ ఎరుగనంతగా.. అపూర్వ ఉద్యమ సమ్మేళనం.. సకల జనులు ఒక్కటైన చేతనం! రహదారుల దిగ్బంధానికి ఆర్టీసీ సమ్మె తోడై.. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య సంబంధాలు తెగిపోయిన తరుణం! తెలంగాణ నుంచి సీమాంవూధకు వెళ్లిన బస్సు లేదు.. సీమాంధ్ర నుంచి తెలంగాణలోకి వచ్చిన వాహనంలేదు! అంతా దిగ్బంధం! కిలోమీటర్ల పొడవున స్తంభించిపోయిన ట్రాఫిక్.. వేల సంఖ్యలో నిలిచిపోయిన లారీలు.. బస్సులు.. ! పొరుగు రాష్ట్రాలకూ రోడ్లు మూసుకుపోయాయి! ఇది సోమవారం నాటి రహదారుల దిగ్బంధం, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫలితం! ఉదయం నుంచి రాత్రి దాకా ఉద్యమం హోరెత్తింది. ఆదిలాబాద్ జిల్లా అంతపూరాష్ట్ర సరిహద్దు భోరజ్ వద్ద 20వేల మంది రోడ్లపైకి వస్తే.. మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద 40వేల మంది ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. నల్లగొండ జిల్లాలో 9వ నెంబర్ జాతీయ రహదారి దాదాపు 150 కిలోమీటర్ల మేర స్తంభించిపోయింది. రోడ్లపై 30వేల మంది ప్రజలు ఏక కంఠంతో జై తెలంగాణ నినాదాలు చేశారు. ఇతర తెలంగాణ జిల్లాలోనూ అదే జోరు కనిపించింది. పది జిల్లాల్లో మొత్తం 9,637 బస్సులుంటే కేవలం 45 బస్సులు మాత్రమే.. అదీ పోలీసు పహారాతో నడిచాయి. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దూకారు. బస్టాండ్లు బోసిపోయాయి. డిపోలన్నింటికీ తాళాలు పడ్డాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రసాధన దిశగా సకల జనుల సమ్మె ఏడు రోజులను పూర్తి చేసుకుంది! ఎక్కడా వాహనాలు తెలంగాణ సరిహద్దులను దాటలేదు. సరిహద్దులన్నీ జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లాయి. అటు ఉద్యోగులు, కార్మికుల సమ్మె సమరోత్సాహంతో సాగుతున్నది. ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తెరుచుకోలేదు. ఫ్యాక్టరీ సైరన్ మోగలేదు. బడి గంట కొట్టనేలేదు. సింగరే గనుల్లో అదే నిర్మానుష్యం. వివిధ పట్టణాలు, గ్రామాల్లో నిరాహార దీక్షలు.. నిరసన ప్రదర్శనలు హోరెత్తించాయి. సమ్మెను అణచివేసేందుకు సీమాంధ్ర సర్కారు కుతంవూతాలు జోరు పెరిగాయి. నిర్బంధకాండ అమల్లోకి వచ్చింది. పలు జిల్లాల్లో భారీగా అరెస్టుల పర్వం సాగింది. సింగరేణిలో పోలీసులు విరుచుకుపడ్డారు. 30 మంది మహిళలు సహా 150 మంది కార్మికులను అరెస్టు చేశారు. ఓ కార్మికుడి కాలు విరగ్గొట్టారు. ఇటు రాజధానిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, నిజాం కాలేజీల్లో లాఠీలు విరిగాయి.. బాష్పవాయుగోళాలు పేలాయి.. రబ్బరు తూటాలు దూసుకొచ్చాయి! అయినా వెరవబోమన్న తెలంగాణవాదులు.. వేరుపడేదాకా ఉద్యమం విరమించేది లేదని ప్రతినబూనారు!!

sakala janula samme effect(సకలజనుల సమ్మె ఎఫెక్ట్)

ఎల్లుండునుంచే దసరా సెలవులు పాఠశాలలకు దసరా సెలవులు ఈనెల 22 నుంచే ఇస్తున్నట్లు పాఠశాల సంచాలకులు ప్రకటించారు. ఆర్టీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు: సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. ఈ మేరకు ఆర్టీసీ యజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్: రేపటినుంచి ఉద్యోగాల్లో పాల్గొనే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఆర్టీసీ యజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీలో ఉద్యోగాలు: ఆర్టీసీలో కండక్టర్లుగా, డ్రైవర్‌లుగా చేరదలచిన అర్హులైన అభ్యర్థులు ఆయా రీజనల్ కార్యాలయాల్లో ఇంటర్వూలకు హాజరు కావాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సమ్మె విఛ్చిన్నానికి ఆర్టీసీ కుట్ర: సకలజనుల సమ్మె విచ్ఛిన్నానికి ఆర్టీసీ యాజమాన్యం కుట్ర పన్నుతుందని ఆర్టీసీ తెలంగాణ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి ఆరోపించారు. తొలగించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

cm tho dgp beti(సీఎంతో డీజీపీ భేటీ)

సీఎం కిరణ్‌కుమార్‌తో డీజీపీ దినేశ్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. సకలజనులసమ్మె ప్రభావంపై చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని డీజీపీని సీఎం ఆదేశించారు.

sammetho dimma thirigindi(సమ్మెతో దిమ్మతిరిగింది..)

జిల్లాల్లో నిలిచిన బిల్లుల వసూళ్లు - సై అన్న జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు - సీమాంధ్ర చెత్త ఒకేసారి ఊడ్చేస్తామని ప్రతిన - అప్రతిహతంగా ఆర్టీసీ, సింగరేణి సమ్మెలు - వీరోచితంగా సాగుతున్న ఉద్యోగులు - ఉద్యమ బాటలో హోరెత్తుతున్న జిల్లాలు సర్కారుకు షాక్ శంఖారావం పూరించిన కరెంటోళ్లు ఎనిమిది రోజులుగా అప్రతిహతంగా సాగుతున్న సకల జనుల సమ్మె.. మంగళవారం నాడు మరింత ఉధృతమైంది. ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాలు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు వీరోచితంగా సాగిస్తున్న సమ్మె సమరంలోకి మంగళవారం నాడు కరెంటోళ్లు దూకారు. సర్కారు కుర్చీకి కరెంట్ వైర్లు తగిలించి.. శాంపిల్ షాక్ ఇచ్చారు. మున్ముందు ఓల్టేజ్ పెంచి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తామని హెచ్చరిక చేశారు. తెలంగాణలో అత్యవసర సేవలు మినహా ఎలాంటి పనులు జరగబోవని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కరెంటు బిల్లుల వసూళ్లు నిలిచిపోయాయి. మరోవైపు హైదరాబాద్‌లో పారిశుద్ధ్య కార్మికులు సైతం సై అన్నారు. తెలంగాణను శుభ్రం చేసుకోవడంతో పాటు.. సీమాంధ్ర చెత్తను ఒకేసారి ఊడ్చేస్తామని ప్రతినబూనారు. అటు కార్యాలయాలు తెరుచుకోక.. బొగ్గు గనుల్లో ఉత్పత్తి లేక.. ఆర్టీసీ చక్రం తిరగక కల్లోలానికి గురవుతున్న సీమాంధ్ర సర్కారు... సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రల పావులు కదిపింది. సకల జనుల సమ్మెపై కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో 74 కంపెనీల పారామిలిటరీని మోహరించిన ప్రభుత్వం.. మరో 25 కంపెనీల బలగాలు పంపాలని కేంద్రాన్ని కోరింది. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఖాకీలను ఉసిగొల్పుతున్నది. సర్కారు ఆదేశాలతో రెచ్చిపోయిన ఖాకీలు.. సోమవారం ఉస్మానియా వర్సిటీలో, నిజాం కాలేజీలో తమ ప్రతాపాన్ని చూపారు. సకల జనుల సమ్మె నేపథ్యంలో విలేకరులతో మాట్లాడిన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి... సమ్మె వల్ల నష్టపోతున్నది తెలంగాణేనని తేల్చారు. తెలంగాణ విషయం తన చేతిలో ఏమీ లేదని, ప్రజలంతా సహకరించాలని విన్నవించారు. సీఎం వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ‘‘నీ చేతిలో చేయడానికి ఏమీ లేనప్పుడు నువ్వు ఉన్నది ఎందుకు? గాడిద పండ్లు తోమడానికా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

kcr thiksha vaddu(కేసీఆర్... దీక్ష వదు!)

యోచన మానాలని తెలంగాణ శ్రేణుల ఒత్తిడి పట్టువీడేది లేదంటున్న టీఆర్‌ఎస్ అధినేత సర్కారు తీరుపై కేసీఆర్ ఆగ్రహం - పోలీసుల దౌర్జన్యాలపై ఆవేదన - ఇవే ఆయనలో పట్టుదల పెంచాయి? - కేసీఆర్‌తో కేకే భేటీ - సానుకూల నిర్ణయం రాకుంటే మేమూ మీతోపాటే దీక్షలో... - కేసీఆర్‌కు కేకే ప్రతిపాదన! - అక్టోబర్ 2 దాకా వేచి చూద్దాం - జేఏసీ, టీఆర్‌ఎస్ నేతల సూచన - ఉధృతంగా ఉద్యమిద్దామన్న జేఏసీ - 24, 25 తేదీల్లో రైల్ రోకోలు - అక్టోబర్ 15లోగా చలో హైదరాబాద్ తెలంగాణ సాధనలో మడమ తిప్పని పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మరోసారి ఆమరణ దీక్షకు దిగే అంశంపై తీవ్ర స్థాయిలో తర్జనభర్జనలు సాగుతున్నాయి. అయితే.. కేసీఆర్ మాత్రం తన పట్టు వీడటం లేదని తెలిసింది. కానీ.. తెలంగాణ ఉద్యమ శ్రేణులు కూడా అంతే స్థాయిలో కేసీఆర్ ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఉద్యమ రూపాలు చాలా ఉన్నందున, వాటిని ప్రస్తుతం తీవ్రంగానే అమలు చేస్తున్నందున అమరణ దీక్షను వాయిదా వేసుకోవాలని ప్రజా సంఘాలు, టీఎన్జీవో నేతలు, రాజకీయ పార్టీలు, నాయకుల నుంచి కేసీఆర్‌పై ఒత్తిళ్లు వస్తున్నాయి. కేసీఆర్ మరోసారి ఆమరణ దీక్షకు యోచన చేస్తున్నారన్న అంశం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆయనతో పలు వర్గాల నేతలు ఉదయం నుంచి సంప్రదింపులు జరిపారు. రాజ్యసభ సభ్యుడు, సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కే కేశవరావు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అమరణంపై చర్చలు జరిపారు. టీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చినందున అక్టోబర్ రెండో తేదీ వరకు వేచి చూడాలని, ఆ తరువాత ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని కేకే సూచించారు. అటు జేఏసీ కూడా మరో దఫా ఉధృత కార్యక్షికమానికి సిద్ధమైంది. అక్టోబర్‌లో చలో హైదరాబాద్‌కు, ఈ నెల 24, 25 తేదీల్లో రైల్ రోకోలకు పిలుపునిచ్చింది. అక్టోబర్‌లో చలో హైదరాబాద్‌కు పిలుపు ఇవ్వాలని నిశ్చయించింది. తాము జైళ్లకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, తీవ్ర నిర్ణయాలు వద్దని జేఏసీ నేతలు, ఉద్యమ సంఘాల నాయకులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం తన పట్టు వీడటం లేదని టీఆర్‌ఎస్ ఆంతరంగిక వర్గాలు చెబుతున్నాయి. సకల జనుల సమ్మె మహోధృతంగా సాగుతున్న తరుణంలో కూడా కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల నుంచి ఉలుకూ పలుకూ లేకపోగా.. ఆందోళనకారులపై దౌర్జన్యాలు పెచ్చుమీరిపోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి. వీటన్నింటి ఫలితంగానే ఈ సారి ఎలాగైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనే పట్టుదల ఆయనలో పెరుగుతున్నదని వారు అంటున్నారు. కనుక తాను ఆమరణ దీక్షకు వెళ్లయినా సరే తన కర్తవ్యాన్ని నెరవేర్చాలని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ను కలిసిన కేకే.. దీక్ష వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాజకీయ జేఏసీతో సంప్రతింపులు జరిపిన తర్వాతే దీక్ష విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన కేకేకు వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీ, న్యూడెమోక్షికసీ, సీపీఐ నేతలు సైతం దీక్ష వద్దని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాయి. దీంతో మంగళవారం సాయంత్రం లోటస్‌పాండ్‌లో జేఏసీలోని కీలక రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ సమావేశమయ్యారు. దీక్ష చేపట్టడంపై ప్రధానంగా చర్చించారు. దీక్ష వాయిదా వేయాలని వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్లపైనా చర్చ జరిగిందని సమాచారం. దీనిపై జేఏసీ స్టీరింగ్ కమిటీలో తుది చర్చ జరపాలని నేతలు భావిస్తున్నారు. ఉద్యమంలో అందరం కలిసి సాగుదామని, ఆమరణదీక్ష వద్దని ఉద్యోగ సంఘాలు సైతం కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చాయి. ఉదయం నుండి కేసీఆర్ ఇంట్లో జరిగిన సంప్రతింపుల సందర్భంగానే ఆమరణ దీక్షపై కేసీఆర్ ఒక ప్రకటన చేస్తారని అందరూ ఉత్కం గురయ్యారు. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న రాజీనామాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సమాయత్తమవుతున్నట్లు సంకేతాలు వస్తున్న తరుణంలో దీక్షను కొద్ది రోజుల పాటు వాయిదావేసుకోవాలని టీఆర్‌ఎస్ నేతలు కూడా కేసీఆర్‌కు సూచించినట్లు సమాచారం. మరో మహోద్యమానికి జేఏసీ సమాయత్తం కేసీఆర్ దీక్షపై చర్చించిన రాజకీయ జేఏసీ.. పలు ఉధృత పోరాట రూపాలను చర్చించింది. ఈ నెల 24, 25 తేదీల్లో భారీ స్థాయిలో రైల్‌రోకోలు జరపాలని నిర్ణయించారు. ఈ రెండు రోజుల ఉద్యమంతో ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి మధ్య రైళ్ల రాకపోకలు మొత్తం బంద్ అయ్యేలా ఉద్యమాన్ని రూపొందించాలని తీర్మానించారు. తద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ అంశం చర్చ జరిగేలా చూడాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ గతిని మార్చే రీతిలో అక్టోబర్ నెలలో చలో హైదరాబాద్‌కు పిలుపునివ్వాలని నిర్ణయానికి వచ్చారు. అక్టోబర్ 15లోగానే ఈ కార్యక్షికమానికి రూపకల్పన చేయాలని తీర్మానించారు. నిర్ణయం రాకుంటే మేమూ దీక్షలోకి: కేకే ‘‘తెలంగాణపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే మేమూ దీక్షలో కూర్చుంటాం. అందరం కలిసి అమరణ దీక్ష చేద్దాం’’ అని కేసీఆర్‌తో తన భేటీ సందర్భంగా కేశవరావు ప్రతిపాదించినట్లు తెలిసింది. సుమారు గంటకు పైగా ఇద్దరూ ఆమరణ దీక్షపై చర్చించారు. తెలంగాణపై తామందరం కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నామని ఈ సందర్భంగా కేసీఆర్‌కు కేకే చెప్పినట్టు తెలిసింది. ఈ నెల 25న అధిష్ఠానాన్ని కలవడానికి ఢిల్లీ వెళుతున్నామని, కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని చెప్పినట్టు సమాచారం. గులాం నబీ ఆజాద్ కూడా ఈ నెల 30 వరకూ సమయం కోరినందున దీక్ష యోచన మానాలని కోరినట్టు తెలిసింది.
In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts