Thursday 15 September 2011

sakala janula sammeku siddam avthunna teachers(సకల జనుల సమ్మెకు సిద్ధమవుతున్న టీచర్లు)

సకలజనుల సమ్మెలో పాల్గొనేందుకు అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు సమాయత్తం అవుతున్నారు. బుధవారం నుంచి స్కూళ్లలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. పనిచేస్తున్న టీచర్ల నుంచి అనుమతి లెటర్లు తీసుకుంటూ తెలంగాణ ఉద్యమానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని అత్యధిక స్కూళ్లలో ఈ కార్యక్షికమం ముగిసినట్లు టీటీజేఏసీ చైర్మన్ పూల రవీందర్ తెలిపారు.

telangana theaters bundh

-450 థియేటర్లలో సిన్మాలు ఆడలేదు.. నేడు కూడా బంద్
-తొలి రోజు రూ.3 కోట్ల నష్టం... రూ.40 కోట్ల రెవెన్యూకు గండి
-తాళాలు తెరుచుకోని ఆఫీస్‌లు గేట్‌ల మందు ధర్నాలు
-అన్ని జిల్లాల్లో రాస్తారోకోలుద్రోహుల దిష్టిబొమ్మల దహనం హోరెత్తిన నినాదాలు
రెట్టించిన ఉత్సాహంతో రెండో రోజూ అదే జోరు! ప్రభుత్వ కార్యాలయాల తాళాలు తెరుచుకోలేదు.. ఫ్యాక్టరీల్లో సైరన్‌లు మోగలేదు.. వృత్తులు సాగలేదు.. ఉధృతంగా మొదలైన తెలంగాణ సకల జనుల సమ్మె రెండో రోజు మహోధృతమైంది! రెండో రోజు సమ్మెలోకి సినిమాహాళ్ల సిబ్బంది వచ్చి చేరారు. పది జిల్లాల్లోని దాదాపు 450 థియేటర్లలో బొమ్మ పడలేదు! ఒక్క రోజే సినిమా రంగానికి 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. గురువారమూ సినిమా హాళ్ల బంద్ కొనసాగనుంది! సింగరేణిలో రెండో రోజూ బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. 65వేల మంది కార్మికులు రెండు రోజులుగా తట్టా పార పట్టకపోవడంతో రూ.50 కోట్ల విలువైన ఉత్పత్తి నిలిచిపోయింది! ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు కదల్లేదు.

ప్రధాన ఆదాయ వనరులైన 450 రిజివూస్టేషన్ కార్యాలయాల్లో ఒక్క ముద్ర పడలేదు! రెండు రోజుల్లో రెవెన్యూ నష్టం 40 కోట్లుగా అధికారులు అంచనా వేశారు! ఉద్యోగులంతా ఉద్యమబాటలోనే నిలిచారు. రాష్ట్రం సాధించేదాకా సమ్మె విరమించేది లేదంటూ ఏకకం నినదించారు! ఖమ్మం రణక్షేవూతమైంది. పోలీసులకు, విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థినికి కాలు విరిగింది. కరీంనగర్‌లో విద్యార్థులపై ఓ ఖాకీ రెచ్చిపోయాడు. తెలంగాణ అంటే రౌడీ షీట్ తెరుస్తానని బెదిరించాడు. సంగాడ్డిలో ఎమ్మెల్యే జగ్గాడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడికి దిగారు. ఆదిలాబాద్‌లో అడ్డుగోడ పడింది. చెక్‌పోస్టు ఉద్యోగులందరూ సమ్మెలోకి రావడంతో ఆదిలాబాద్ అంతపూరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద దాదాపు 13 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వివిధ జిల్లాల్లో కార్యాలయాలు, కంపెనీలు, ఫ్యాక్టరీల గేట్‌ల వద్ద జై తెలంగాణ నినాదాలు మారుమోగాయి.డ్రైవర్లు లేక పలువురు జిల్లా స్థాయి అధికారులకు ఇక్కట్లు తప్పలేదు. బైకు ర్యాలీలు, రాస్తారోకోలతో పాలమూరు రహదారులు హోరెత్తాయి. బహిరంగ సభలు, గేట్ మీటింగ్‌లు జరిగాయి. తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉంటున్న రాజకీయ నాయకులకు ఉద్యమ సెగలు తాకుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల మంత్రి శ్రీధర్‌బాబు దిష్టిబొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు మంత్రి డీకే అరుణ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లగొండ జిల్లాలో రోడ్లపై విద్యార్థులు మానవహారాలు నిర్మించారు. సీఎం కిరణ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేవరకొండలో మహిళా టీచర్లు బతుకమ్మలు ఆడారు.

రంగాడ్డి జిల్లా తాండూరులో ఎమ్మెల్యే మహేందర్‌డ్డి మళ్లీ రాజీనామా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటిని ముట్టడించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి ఆందోళనకారులు ముసుగు వేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యమకారులకు మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి వేధింపులు,సమస్యలు వచ్చినా తాము అండగా నిలుస్తామని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అభయమిచ్చారు. కుక్కలకు బొక్కలు వేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులకు పదవులు, కాంట్రాక్టులు పారేస్తే ఊరుకుంటున్నారని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. జీతం రాదన్న రంది తెలంగాణ ఉద్యోగులకు అవసరం లేదని, ప్రస్తుతం జీతాన్ని పొదుపు చేశామని వారు అనుకోవాలని సూచించారు.

ఎన్ని నెలలైనా వడ్డీ, బోనస్‌తో కలిపి వారికి జీతాలిస్తామని కేసీఆర్ మరోసారి భరోసా ఇచ్చారు. రాజకీయ నాయకుల వెనుకడుగు వల్లే తెలంగాణ ఏర్పాటు ఆలస్యమవుతోందని, ఉద్యోగులు ముందుండి పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కె.స్వామిగౌడ్ అన్నారు.అందుకోసమే ఉద్యోగులు ముందుకువచ్చి ఉద్యమంలో మమేకమవుతున్నారని తెలిపారు.

rtc ne thosthunna andhraolla bus lu(ఆర్టీసీని దోస్తున్న ఆంధ్రోళ్ల బస్సు)

సర్కారు ఆదాయానికి ఏటా రూ.1728 కోట్ల గండి
-బడా నేతలు, పెట్టుబడిదారులదే దందా
- ఒకే నెంబర్‌తో రెండ్రెండు బస్సులు..
- అధికారుల కళ్లలో కారం.. పట్టించుకోని ప్రభుత్వం
- ఆంధ్రోళ్ల బస్సులు అడ్డుకుందాం.. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ పిలుపు..
- సమ్మెకు ముందే కీలక పోరుకు రేపే ముహూర్తం 
అక్షరాలా పదిహేడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు! ఇది ఆంధ్రోళ్ల ట్రావెల్స్ సంస్థలు ఆర్టీసీ ఆదాయానికి ఏటా కొడుతున్న గండి! లక్షకుపైగా సిబ్బందితో, వేలాది బస్సులతో, వేల కిలోమీటర్ల సర్వీసులతో గిన్నెస్ రికార్డులు బద్దలు కొడుతున్న ప్రగతి రథ చక్రాన్ని నష్టాల బాట పట్టిస్తున్న వైనం! హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా... రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి మరే ప్రాంతానికైనా! అందమైన రంగుల బస్సులతో ఆర్టీసీ వెన్ను విరుస్తున్న తీరు! సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతిలో తెలంగాణకు జరుగుతున్న దగా సంగతి ఒక ఎత్తయితే.. ఆ స్థాయిలో ఓ ప్రభుత్వ సంస్థను కునారిల్లజేస్తున్న సంఘటిత దోపిడీ దందా మరోఎత్తు! ఆర్టీఏ కళ్లలో కారం కొట్టి.. ఆర్టీసీకి నామం పెట్టి.. ఒకే నెంబరుతో రెండు బస్సులు! ఒకటి హైదరాబాద్‌టు షిర్డీ వెళితే.. మరోటి అమలాపురానికో బెజవాడకో! ఒకటి బెంగళూరు వెళితే.. మరోటి రాజోలుకో రాజమంవూడికో! పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుంది.

ఎందుకంటే.. మరి అంతా తనవాళ్లేనాయె! అధికారులూ చూసీచూడనట్లే ఉంటారు.. రాజకీయ అండదండలున్నాయి కాబట్టి! కూడళ్లు నరకాన్ని తలపిస్తున్నా ట్రాఫిక్ పోలీసులూ సాహసించరు.. ఉత్తరమో దక్షిణమో అందుతుంది కనుక! ఆర్టీసీ కార్మికులు మొత్తుకుంటుంటారు.. తమ సంస్థ నష్టాల్లోకి వెళుతున్నదనన ఆవేదనతో! ఇప్పుడు తెలంగాణవాదులూ కన్నెర్ర జేశారు.. తెలంగాణలో సీమాంధ్ర దోపిడీ మార్గాల్లో ఒకానొక ఆయువు పట్టును మట్టుబెట్టడానికి! ఇందుకు ముహూర్తమూ పెట్టారు. అది రేపే! సమయం సాయంత్రం.. సమరవేదిక ఎల్బీనగర్..!

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (టీ న్యూస్): ఉధృతంగా సాగుతున్న సకల జనుల సమ్మెలో పాల్గొనడానికి ముందే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కీలక ఆందోళనకు పిలుపునిచ్చారు. ఏటా రూ.1728 కోట్లు దోచుకుంటున్న ఆంధ్రోళ్ల బస్సుల పని పట్టడానికి సమాయతె్తైమయ్యారు. నిబంధనలు ఉల్లంఘించి బస్సులు నడుపుతున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల దోపిడీకి అడ్డుకట్ట వేయకుండా సకల జనుల సమ్మెకు వెళితే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ... ఆ అక్రమాలను అడ్డుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు 16వ తేదీని ముహూర్తంగా ఎంచుకుంది. ఈ భారీ కార్యక్షికమంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రజావూఫంట్ కన్వీనర్ గద్‌‌ద ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.

రాజకీయ జేఏసీలోని వివిధ భాగస్వామ్య పక్షాల నేతలు సైతం హాజరవనున్నారు. సీమాంధ్ర దోపిడీకి, అహంకారానికి చిహ్నమైన ప్రైవేటు బస్సుల పనిపట్టే కార్యక్షికమానికి తెలంగాణవాదులు, ఆర్టీసీ తెలంగాణ ఉద్యోగులు భారీగా హాజరు కావాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఆనందం పిలుపునిచ్చారు. పోలీసులు, ప్రభుత్వం ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, ఆర్టీసీ ఉద్యోగి ఒక్కరిపై లాఠీదెబ్బ పడ్డా తెలంగాణ భగ్గుమంటుందని హెచ్చరించారు. 19 నుంచి చేపట్టే బస్సుల నిలిపివేత కార్యక్షికమాన్ని అవసరమైతే 17కు మారుస్తామని తెలిపారు.

రాజధాని అడ్డాగా అడ్డగోలు సంపాదన
కేశినేని, దివాకర్, కాళేశ్వర్, కావేరి, ఏసీఆర్, పోతుల, నవీన్... ఇలా సీమాంధ్ర బస్సుల ట్రావె్ కంపెనీల పేర్లు మాత్రమే వేరు. లక్ష్యం ఒక్కటే. భారీ దోపిడీ. తెలంగాణ నడిబొడ్డున్న ఉన్న హైదరాబాద్ నగరాన్ని అడ్డాగా చేసుకుని అక్రమంగా, అడ్డగోలుగా సంపాదిస్తున్నాయి ఈ సీమాంధ్ర ట్రావెల్ సంస్థలు. లక్షల మంది కార్మికులతో గిన్నిస్ రికార్డు సృష్టించిన ఆర్టీసీని ఈ రంగురంగుల అందమైన బస్సులు ఆగం చేస్తున్నాయి. ఆర్టీసీకి ఏటా వేల కోట్ల రూపాయాల నష్టాన్ని మూటగట్టిస్తున్నాయి. సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భాగ్యనగరం నుంచి నిత్యం సమారు 3000వరకు ట్రావెల్స్, ఇతర ప్రైవేట్ వాహనాలు వివిధ ప్రాంతాలకు ప్రయాణీకులను చేరవేస్తున్నాయి.

వీటిలో 90శాతం సీమాంధ్ర యాజమాన్యాలవే. ఈ బస్సులతో ఆర్టీసీకి అక్షరాలా ఏటా రూ.1728కోట్లకు పైగా నష్టం వస్తోంది. ఒకే నెంబర్‌తో రెండు బస్సులను కూడా నడుపుతూ ప్రభుత్వ ఆదాయానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రభుత్వం, ఆర్టీసీ నెత్తిన కుచ్చు టోపీ పెడుతున్నారని ఆర్టీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కోట్లు కొల్లగొడుతూ కొంత పాపాన్ని అండదండలిస్తున్న సీమాంధ్ర నాయకుల జేబుల్లోనూ వేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

ప్రధాన కూడళ్లే కేంద్రాలు
కూకట్‌పల్లి, ప్యారడైజ్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, బీహెచ్‌ఈఎల్, లక్డీకాపూల్, ఏఎస్‌రావ్‌నగర్, సికింవూదాబాద్ రైల్వే స్టేషన్, ఈసీఐఎల్, టోలిచౌక్... ఇలా నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి నిత్యం వేల మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. ప్రయాణీకుల ఈ అవసరాన్ని గుర్తించిన సీమాంధ్ర వ్యాపారులు నగరంలోని వివిధ కూడళ్లలో ట్రావెల్స్ ఏజన్సీలను నెలకొల్పారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆ కేంద్రాల వద్ద ఇష్టమొచ్చిన రేట్లకు టికెట్లు విక్రయిస్తారు. శనివారమో ఆదివారమో అయితే టికెట్ బరువు మరింత పెరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకే కాకుండా షిర్డీ, బెంగళూర్, చ్నై తదితర రాష్ట్రం వెలుపలి నగరాలకూ సర్వీసులు ఉంటాయి.

ఆర్టీసీకి ఏటా రూ.1728కోట్ల నష్టం
ట్రావెల్స్, ఇతర ప్రైవేట్ వాహనాలతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కి అక్షరాలా రూ.1728 కోట్ల నష్టం వాటిల్లుతున్నదని సమాచారం. నిత్యం 3వేల బస్సులు బయల్దేరుతుంటాయి. ఒక్క బస్సుతో ఆర్టీసీకి రోజుకు 16వేల వరకు నష్టం వస్తుంది. అంటే రోజుకు 3000బస్సులతో దాదాపు రూ.4.80కోట్లు నష్టం. నెలకు రూ.144కోట్లు, ఇలా ఏడాదికి రూ.1728 కోట్ల నష్టం వస్తోందని ఆర్టీసీ అధికారులు లెక్కలు వేస్తున్నారు. సంస్థ నష్టపోవడానికి ప్రైవేట్ ట్రావెల్స్ ప్రధాన కారణమంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎన్నో ఉద్యమాలు చేశాయి. వాటి ఆగడాలను అరికట్టి, ఆర్టీసీని బతికించాలని ప్రభుత్వాలకు చేసుకున్న వినతులన్నీ ఎప్పటికప్పుడు చెత్తబుట్టపాలవుతున్నాయి.

లక్షా 20వేల మంది కార్మికులతో అతిపెద్ద రవాణా సంస్థగా చరిత్ర సృష్టించి, గిన్నెస్ రికార్డు సాధించిన ఆర్టీసీని ప్రస్తుతం గుప్పెడు మంది సీమాంధ్ర పెట్టుబడిదారుల ట్రావెల్ బస్సులు భయపెట్టిస్తున్నాయి. లక్ష మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న భారీ ప్రభుత్వరంగ సంస్థను నిర్వీర్యం చేస్తున్నాయి.

సీమాంధ్ర పెట్టుబడిదారుల పుత్రికలే ఈ ట్రావెల్స్
హైదరాబాద్ నగరంలోని వివిధ ట్రావెల్స్ సంస్థలు దాదాపు సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులవే కావడం గమనార్హం. ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు, ప్రజావూపతినిధులు, పెట్టుబడిదారులే ఈ దందాలను కొనసాగించడం విశేషం. 3000బస్సుల్లో దాదాపు 90శాతం బస్సులు సీమాంవూధులవి కాగా మిగతావి ఇతర ప్రాంతాల వారివి. ట్రావెల్స్, ప్రైవేట్ వాహనాలు సాగిస్తున్న ఈ దందాలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిది ఒక్క బస్సు లేకపోవడాన్ని బట్టే ఎవరు దోపిడీదారులన్నది స్పష్టంగా అర్థమవుతోందని తెలంగాణవాదులు అంటున్నారు.

ఒకే నెంబరు రెండు మూడు బస్సులు
తమ గజకర్ణ, గోకర్ణ, గారడీ విద్యలతో సీమాంధ్ర ట్రావెల్స్ వ్యాపారులు ఆర్టీసీకే కాదు రవాణా శాఖ ఆదాయానికీ కొన్ని కోట్ల రూపాయలు గండి కొడుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వందల వాహనాలు కలిగి ఉన్న వ్యాపారులు ఒకే నెంబర్‌తో రెండు బస్సులను నడుపుతూ రవాణా శాఖ అధికారుల కళ్లలో కూడా కారం కొడుతున్నారు. ఒకే నెంబర్‌తో ఒక బస్సు షిర్డీకి వెళితే మరొకటి అదే నెంబర్‌తో తిరుపతికి వెళుతుంది. వెరసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులు, ఇతరత్రా పన్నులు భారీ మొత్తంలో సీమాంధ్ర వ్యాపారులు ఎగవేస్తున్నారు. ట్రావెల్స్ ఆగడాలు రోజురోజుకు శృతిమించి పోతున్నాయని, ఒకే నెంబర్‌తో రెండు బస్సులు తిరుగుతున్నాయని నెత్తినోరు కొట్టుకొని ఎందరు మొత్తుకున్నా రవాణా శాఖ అధికారులు చూసీ చూడనట్లు ఊరుకోవడం దారుణమంటూ స్వయంగా ఆర్టీసీకి చెందిన ఓ ఉన్నతాధికారే అసహనం వ్యక్తం చేశారు.

అయినా బడా రాజకీయ నేతలు, మంత్రులే ట్రావెల్స్ వ్యాపారం చేస్తుంటే ఇక వారు ఏం చేసినా ఎవరు పట్టించుకుంటారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ నష్టానికి ప్రైవేట్ వాహనాలే కారణమని కుండబద్దలు కొట్టారు.

ప్రధాన రోడ్లపై ట్రావెల్ బస్సులు..టాఫిక్‌తో ప్రజల ఇక్కట్లు
నగరంలోని ప్రధాన ప్రాంతాల కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ట్రావెల్స్ ఏజన్సీల వద్ద బస్సులు నానా హంగామా సృష్టిస్తూ ట్రాఫిక్ సమస్యను ఉత్పన్నం చేస్తున్నాయి. వెళ్ళడానికి రెండు గంటల ముందే ఏజన్సీ ఎదుట రోడ్లపై బస్సులను తెచ్చి పెడుతున్నారు సీమాంధ్ర వ్యాపారులు. దీంతో ట్రాఫిక్ స్తంభించి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ బస్సులు ఏం చేసినా చూసీ చూడనట్లే వెళుతున్నారు. వాళ్లకూ మామూళ్లు ముడుతుంటాయని విమర్శలున్నాయి. పెద్ద వాళ్ళతో పెట్టుకుని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దనే ఏం చేయలేక పోతున్నామని ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. వాటిని హైదరాబాద్ శివార్లలోకి పంపితే కానీ ట్రాఫిక్ సమస్య తీరదని అభివూపాయపడ్డారు.

thata jejamma nu kotaina telangana sadistha(తాత జేజమ్మను కొట్టైనా తెలంగాణ సాధిస్తా)

10 వేల మంది తెలంగాణ నేతలఫోన్ ట్యాపింగ్
- సర్కారు దొంగతనాన్ని బయటపెడతాం
- చైనా వెళ్లే దమ్ముందా? రాయపాటికి సవాల్
- మాట మార్చడానికి సీమాంధ్రులకు సిగ్గూ, శరం, లజ్జ ఉండదా?
- అది నాలుకా? తాటి మట్టా?
- సీమాంధ్రులను చూసి ఊసర సైతం సిగ్గుపడుతున్నాయి
- మొఖం మీద ఉమ్మేసినా పడి ఉంటారా?
- పాలిటెక్నిక్ గర్జనలో కేసీఆర్ 
హైదరాబాద్, సెప్టెంబర్ 14(టీ న్యూస్): ‘తెలంగాణలోని 10వేల మంది నాయకుల ఫోన్లను పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ హరించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? ముఖ్యమంవూతిది దుర్మార్గం. డీజీపీ ఏమిటిదీ?.. తీవ్ర చర్య తప్పదు. ఖబడ్దార్! సర్కారు దొంగతనాన్ని బయటపెడతాం. ఎవరికీ భయపడేది లేదు. ట్యాపింగ్ ట్యూపింగ్‌లు ఏమీ చేయలేవు. దుర్మార్గాలను న్యాయపరంగా ఎదుర్కొంటాం. మానవ హక్కుల కమిషన్‌కు, హైకోర్టుకు వెళతాం’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. బుధవారం సికింవూదాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో పాలిటెక్నిక్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ‘పాలిటెక్నిక్ గర్జన’లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయి.. ప్రసంగించారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మహోధృతంగా ఉద్యమాలు సాగుతుంటే సర్కారు ఆదేశాలతో పోలీసులు ఉద్యమ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ సమాచారాన్ని దొంగచాటుగా సేకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘తెలంగాణ కోసం తాము ఏదైనా బాజాప్తా చేస్తాం. బేజాప్తా చేయం. చిటిక వేస్తే లక్షలాది మంది సైనికుల్లా రంగంలో దిగుతారు. జాగ్రత్త!’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫోన్లను ట్యాపింగ్ చేసే సంస్కృతి ఏమిటని ప్రశ్నించారు. గుంటూరు ఎంపీ రాయపాటికి ఆయన సవాల్ విసిరారు. 1985-87 మధ్యకా లంలో పొగాకులో రాళ్లను నింపి చైనాకు ఎగుమతి చేసి అక్కడ 16మంది ఉరిశిక్షకు గుంటూరు ఎంపీ రాయపాటి కారకుడయ్యారని, అప్పటి నుంచి రాయపాటిని తమకు అప్పగించమని చైనా భారత ప్రభుత్వాన్ని కోరుతోందని తెలిపారు. అప్పట్లో ఈ విషయంపై పార్లమెంట్‌లో ప్రశ్నలు వేయకుండా, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా రాయపాటి మేనేజ్ చేశారని ఆయన ఆరోపించారు.

రాయపాటికి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. తన సొంత ఖర్చుతో టీఆర్‌ఎస్ నాయకుడు పద్మారావును రాయపాటితో చైనాకు పంపుతానని, అయితే ఇండియాకు తిరిగి వచ్చేది ఒక్క పద్మారావు మాత్రమేనని కేసీఆర్ పేర్కొన్నారు. ముమ్మాటికీ తెలంగాణ వచ్చి తీరుతుందని, తాత జేజమ్మను కొట్టైనా తెలంగాణను సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. తెలంగాణవాదులకు త్యాగాలు, పోరాటాలు మాత్రమే తెలుసని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు పురిటి నొప్పుల్లా కొన్ని ఇక్కట్లు తప్పవన్నారు. ప్రస్తుత సమయంలోనే తెలంగాణవాదులంతా బిరుసుగా, మొండిగా, పట్టుదలతో ఉండాలని సూచించారు. ఎన్నో హింసలను భరిస్తున్నామని, ఒక్కో విద్యార్థిపై పోలీసులు వందలాది కేసులు పెట్టారని, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్‌పై 140 కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు.మురళీధర్ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ గర్జనలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ నాయకులు సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ వి.శ్రీనివాస్‌గౌడ్, కో-చైర్మన్లు జీ.దేవివూపసాద్‌రావు, సి.విఠల్, సీడబ్ల్యుసీ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్.విద్యాసాగర్‌రావు, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు కర్నె ప్రభాకర్, పద్మారావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, గువ్వల బాలరాజ్, బేతి సుభాష్‌డ్డి, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్, యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, ప్రభుత్వ లెక్చరర్ల జేఏసీ చైర్మన్ మధుసూదన్‌డ్డి, కత్తి వెంకటస్వామి, ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ వెంక మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌డ్డి, తదితరులు పాల్గొన్నారు.

పాలిటెక్నిక్ జేఏసీ చైర్మన్‌గా మనోహర్‌డ్డి ఎన్నిక
పాలిటెక్నిక్ జేఏసీ చైర్మన్‌గా ఎం.మనోహర్‌డ్డిని ఎన్నుకున్నట్లుగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. పాలిటెక్నిక్ ఉద్యోగులు, అధ్యాపకులు, ఇన్‌వూస్టక్టర్లు కలిసి ఏకక్షిగీవంగా మనోహర్‌డ్డి ఎన్నుకున్నారని వెల్లడించారు.

జీతాల రంది వద్దు..
సీమాంధ్రులలకు సిగ్గూ, షరం, లజ్జ ఉండ దా? అని కేసీఆర్ ప్రశ్నించారు. మంత్రి శైలజానాథ్ మాట్లాడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం, ప్రజలు ఏమనుకుంటారన్న సోయి కూడా వారికి ఉండ దా? అని ప్రశ్నించారు. ‘సీమాంధ్రులలది నాలుకా? తాటి మట్టా?. చెవుల్లో కమ లం పువ్వులు పెడతారా?. సీమాంధ్రులలను చూసి ఊసర కూడా సిగ్గు పడుతున్నాయి. మొఖం మీద ఉమ్మేసినా సిగ్గు లేకుండా ఇక్కడే పడి ఉంటారా?’ అని కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుక్కలు బొక్కలు వేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులకు పదవులు, కాంట్రాక్టులు పారేస్తే ఊరుకుంటున్నారని మండిపడ్డారు. సకల జనుల సమ్మె విజయవంతంగా సాగుతోందని, బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. జీతం రాదన్న రంది తెలంగాణ ఉద్యోగులకు అవసరం లేదని, ప్రస్తుతం జీతాన్ని పొదుపు చేశామని వారు అనుకోవాలని సూచించారు. ఎన్ని నెలలైనా వడ్డీ, బోనస్‌తో కలిపి వారికి జీతాలిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థను చంద్రబాబే తెచ్చారని గుర్తు చేశారు. సీఎం, మంత్రుల పదవులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తే బాగుండేదని ఎద్దేవా చేశా రు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పదం ఉండదని స్పష్టం చేశారు. పొరపాటున ‘తెలంగాణ రాకుంటే సీమాంధ్రులలు బతకనిస్తారా? చెప్పు కింద నలిపేస్తారు. మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ఐకమత్యంతో గమ్యాన్ని చేరాలని, దొంగల భరతం పట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

gani karmikula garjana(గని కార్మికుల గర్జనగని కార్మికుల గర్జన)

గావులలో 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉట్టిపడింది. కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు ప్రకటన వెలువడితే తప్ప మా సమ్మె విరమణ చేసే ప్రసక్త్తి లేదంటున్నారు... మొత్తం 50 బొగ్గు బావులలో రోజుకు లక్షా 45 వేల టన్నుల ఉత్పత్తి అంతా ఆగిపోయింది... లక్ష టన్నులకుపైగా జరిగే రవాణా ఆగింది. రెండు, మూడు రోజులకన్నా ఎక్కువ సరిపోయే స్టాకు విద్యుత్ ప్లాంటులలో నిలువ లేదు. కార్మికులు సకల జనుల సమ్మెలో పట్టుదలతో సమ్మెలో పాల్గొంటున్నారు. పుట్టెడు బండ కిందకుపోయి రాక్షసి బొగ్గును ఉత్పత్తి చేస్తూ దక్షిణ భారతదేశానికి వెలుగును ప్రసాదిస్త్తున్న ఆ కార్మికుల వెతలు తీరాలంటే తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేననే విషయాన్ని కార్మికులే కాదు వారి కుటుంబాలు నమ్ముతాయి... నమ్ముతున్నాయి.... ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని బొగ్గు గనుల ప్రాంతం ఎన్నో ఉద్యమాలకు ప్రతీక... ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు ఇక్కడ పురుడుపోసుకున్నాయి. జీవించే హక్కు కోసం ప్రతి పేదవాడు మంచిగా బతకాలని ఆశించే ఎందరో ఉద్యమ కారులు పుట్టిన గడ్డ ఇది. సింగరేణి కార్మికులు తమ హక్కుల కోసం 56 రోజుల వరకు సుదీర్ఘ సమ్మెలు చేసి న చరిత్ర ఉంది. సింగరేణిలో ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం అంటుకున్నకొలిమిలా కొనసాగుతోంది. దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా సింగరేణిలో కార్మిక వర్గం తెలంగాణ ఆకాంక్షతో ఈ ఏడాది తొమ్మిది సార్లు తమ విధులు బహిష్కరించి పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్ర బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధించేంత వరకు సమ్మె ఆపేది లేదని, బొగ్గు పెల్ల బయటకు తీసేది లేదని, పంపేది లేదని గిరిగీసి కూర్చున్నారు బొగ్గు గని కార్మికులు...

బొగ్గు గని కార్మికులు ఈ రోజు తమ బతుకులు బాగు పడటం కోసం, తమ సింగరేణిని దక్కించుకోవడం కోసం, తమ వనరులను తాము కాపాడుకోవడం కోసం, తమ పిల్లలకు ఉద్యోగాలు రావాలని తెలంగాణ రావాలని కోరుకుంటున్నారు... ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ నుంచి దూరంగా సంస్థను రక్షించుకోవడం కోసం ఉద్యమిస్తున్నారు. ఇదే సంవత్సరం తెలంగాణ మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణలో పాల్గొన్న సందర్భంలో సింగరేణిలోనూ సహాయ నిరాకరణ కార్యక్షికమం కొనసాగింది. చాలా మంది కార్మికులు ఈ ఉద్యమంలో అరెస్టులకు కూడా గురయ్యారు... జైలుపాలయిన వారు ఉన్నారు. చరివూతలో ఎన్నడూ లేని విధంగా సంస్థలో పని చేసే అధికారులు కూడా ఈ ఏడాది జూలై ఐదు, ఆరు తేదీలలో కార్మికులతోపాటు తెలంగాణ కోసం విధులను బహిష్కరించారు. ఇది చారివూతక ఘట్టం.
సింగరేణిలో దశాబ్దాలుగా వలస వాదుల రాజ్యం కొనసాగుతుంది... అధికార గణంలో వారే మెజార్టీలో ఉన్నారు. ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొంత తెలంగాణ వాదులకు అవకాశాలు వస్తున్నాయి...

ఇదంతా ఉద్యమ ఫలితంగానే జరుగుతున్నది. అయితే ఇప్పటికి సింగరేణిలో 610జీవో కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. సీమాంధ్ర వాసుల కోసం మూడున్నర దశాబ్దాల క్రితం క్లరికల్ ఉద్యోగానికి డిగ్రీ అర్హతగా ఉండేది. వాస్తవానికి ఈ రోజు వరకు కూడా అటు కేంద్రంలో, ఇటు రాష్ర్టంలో క్లరికల్ ఉద్యోగానికి ఎస్‌ఎస్‌సీ మాత్రమే అర్హతగా ఉన్నది. అయితే సింగరేణిలో మాత్రం డిగ్రీ అర్హతగా నిర్ణయిం చారు. కేవలం అప్పట్లో తెలంగాణలో విద్యా సౌకర్యం అతి తక్కువ ఉండటం మూలకంగా 10వ తరగతి వరకే చదువులు ఆపేసిన వారు చాలా మంది ఉండేవారు. అలాంటి వారికి క్లరికల్ ఉద్యోగం దొరకకుండా సింగరేణిలో కొంత మంది ఆంధ్రా డైరెక్టర్‌లు ఈ అర్హతను డిగ్రీగా మార్చేశారు. దానితో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వేలాది మంది వచ్చి ఇక్కడ క్లర్కులుగా చేరిపోయారు. ఇలాంటి సింగరేణిలో జరిగాయి. క్వార్టర్ల కేటాయింపులో, ప్రమోషన్‌లలోనూ ఇలా వివక్ష కొనసాగింది.

1969, 1972 ప్రాంతంలో కూడా సింగరేణిలో వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకున్న వారు సింగరేణి వివక్ష గురించి ఇప్పటికి కథలు కథలు గా చెప్పుకుంటుంటారు. నాటి నుంచి రగులుకుంటూ వచ్చిన తెలంగాణ ఆకాంక్ష ఇప్పు డు ఉప్పెనలా బయటకు వచ్చింది. ఈ రోజు కార్మికులు తెలంగాణ కోసం నిరవధిక సమ్మె చేసి దక్షిణ దేశం మొత్తం కూడా పారిక్షిశామిక సంక్షోభాన్ని సృష్టించడానికి సిద్ధమయ్యారు.తెలంగాణ ప్రాంతం ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసిన నేపథ్యంలో వారిని అభినందిస్తూనే కార్మికులు రాజీనామా చేయని వారి దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తున్నారు. రాజీనామా చేయని ప్రజావూపతినిధులను బొగ్గు బావుల ప్రాంతానికి రానివ్వమని మొట్ట మొదట ఏడాది క్రితమే వారిని బహిష్కరించిన, పిలుపునిచ్చిన ఘనత కూడా బొగ్గు గని కార్మికులదే. ఈ రోజు కార్మిక సంఘాల కార్యకలాపాలకు అతీతంగా దాదాపు అన్ని కార్మిక సంఘాలు కలిసి పని చేస్తున్న ఉద్యమం కూడా ఇదే కావడం విశేషం.

అపజయం ఎరుగని తిరుగుబాటుకు మరో పేరయిన సింగరేణి బిడ్డలు ఈ రోజు తెలంగాణ కోసం ఉద్యమించడం అదికూడా తమ గమ్యాన్ని చేరుకునే వరకు ఆగేది లేదని ప్రకటించడం శుభసూచకం. సకల జనుల సమ్మె ద్వారా దక్షిణ భారతదేశంలో పారిక్షిశామిక సంక్షోభం సృష్టించయినా తెలంగాణను సాధించుకుంటామనే గట్టి నమ్మకంతో కార్మికులు ఉన్నారు. నాలుగు వేలకుపైగా దక్షిణ భారతదేశంలోని పరిక్షిశమలన్నీ గని కార్మికుల ఈ సమ్మెతో బంద్ అయిపోతాయి. సమ్మెతో స్వరాష్ట్రాన్ని సాధించుకుంటామని కార్మికులు నినదిస్తున్నారు.

vudyama bata pi givo thuta(ఉద్యమబాటపై జీవో తూటా!)

రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా విద్యా ప్రమాణాల పెంపొందించాలని, అకస్మాత్తుగా సెప్టెంబర్ 9న విడుద ల చేసిన జీవో 130 ఉపాధ్యాయ వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ జీవో ముఖ్యంగా తెలంగాణ టీచర్ల మెడమీద కత్తిలా వేలాడుతోం ది. ఇది ఆ జీవోలోని సారాంశాన్ని చూస్తే అర్థ్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం 2010 ఏప్రిల్1 రోజున విద్యాహక్కును అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి నిర్ణయించింది. అందులో భాగంగా మన రాష్ట్రం జీవో ఎంఎస్ నెం.20 03.03.2011 నుంచి, కేంద్ర ప్రభుత్వ చట్టానికి అనుగుణంగా సర్వశిక్షా అభియాన్ ద్వారా దాన్ని అమలుకు పూనుకున్నది. ఇట్టి జీవో అమలు కోసం రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభుత్వానికి విద్యాహక్కు అమలుకు చేపట్టాల్సిన చర్యల గూర్చి లేఖ నెం.16 ద్వారా సూచించారు.
edit-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaవిద్యాహక్కు చట్టంలోని అంశాలలో మార్పు చేపట్టాలని అనేక మంది మేధావులు విద్యావేత్తలు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు సూచించాయి. అయితే అటు కేంద్ర ఫ్రభుత్వం గానీ ఇటు రాష్ట్ర ప్రభు త్వం గానీ ఆ మార్పుల గురించి పట్టించుకోలేదు. ప్రభుత్వం విద్యారంగంలో 1 నుంచి 8 తరగతుల వరకే తమ బాధ్యత అన్నట్లు వ్యవ హరిస్తున్నది. 1వ తరగతి కంటే ముందున్న పూర్వ బాల్యదశ గురించి కానీ 8వ తరగతి అనంతరం పాఠశాల, కళాశాల విద్య గురించి గానీ పట్టించుకోవడం లేదు. ఆర్‌ఈఎంకు నిధులు అందిస్తున్నా విదేశీ, స్వదేశీ సంస్థలు సూచనల మేరకు ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రజల భాగస్వామ్యం పేర స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)లకు నిర్వహణ, పరిశీలన, పర్యవేక్షణ తదితర మౌలిక వసతుల కల్పనకు అప్పగించింది. పాఠ్యాంశాల ద్వారా ఏమి చెప్పాలో ఎవరి కోసం చెప్పాలో నిర్దేశించే శిక్షణలు మాత్రం రాజీవ్ విద్యామిషన్ ఆర్‌ఎస్‌ఎంఎలకు నిధు లు, విధులు అప్పగించడం ద్వారా విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది.

ఆ నేపథ్యంలోని స్కూల్ మేనేజ్‌మెం ట్ కమిటీల ఏర్పాటు చేతుపూత్తడం లేదా ఎన్నికల ద్వారానైనా తరగతికో ఆరుగు రు తల్లిదంవూడుల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతంలోని గ్రామీణ కమిటీ ల అదేస్థాయిలో మండల, జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచింది. ఈ కమిటీలు ఆయా స్థాయి ల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతలతో పాటు టీచర్లపై అనవసర పెత్తనాన్ని చెలాయించగల స్థితిని కల్పించారు. ఈ కమిటీలు నిజం గా పాఠశాల విద్యారంగ అభివృద్ధికి దోహదపడితే ఆహ్వానించదగ్గవే. కానీ ఇవ్వాళ గ్రామీణ ప్రాంతాల్లో నెలకొని ఉన్న రాజకీయ పెత్తనం ఎట్లా విద్యావ్యవస్థను శాసిస్తున్నదో తెలిసిందే. సకల రంగాల్లో కాంట్రాక్టర్ల కోసం వెంపర్లాడే నాయకులు అక్కడక్కడ ప్రభుత్వం ఆయా పథకాల ద్వారా విడుదల చేస్తున్న నిధులను పాఠశాలకు ఖర్చు చేస్తే మాకేంటి? అన్న పద్ధతిలో ప్రధానోపాధ్యాయులను పర్సం కోసం, కాంట్రాక్టర్ల కోసం వేధిస్తున్న సంఘటనలు అనేకం.

కేవలం మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోసం ఎన్ని గొడవలు సృష్టిస్తున్నారో రోజూ పత్రికల్లో చూస్తున్నాం. ఇలాంటి స్థితిలో ఎన్నికలు జరపాలన్న అంశం తో పాటు, అతి ప్రమాదకరమైన ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని కప్పిపుచ్చుకొని తెలంగాణ టీచర్లను బలిపీఠం ఎక్కించ పూనుకున్న ప్రభు త్వం కుట్రకు నిదర్శనమే 130 జీవో.

‘అన్నం మెతుకులు ఒకచోట ఆకలి మంటలు ఇంకోచోట‘ అన్న కాళోజీ జయంతి రోజున ఈ జీవో విడుదలైంది. ఆయన మాటల్లోనే ఇక్కడి నీళ్ళు, నిధులు కొళ్లగొట్టుకుపోయినా సీమాంధ్ర ప్రాంతంలో మూడు పూటలా పంటలు పండటం వల్ల అయితేనేమి ఆంగ్లా ఆంధ్రా ఆధిపత్యం వల్ల అప్పనంగా తెలంగాణ ప్రాంత విద్య ఉద్యోగ రంగాల్లో తిష్ట వేసిన అధికారుల అసంబద్ధ ప్రణాళికల వల్ల అయితేనేమీ తెలంగాణ ప్రాంత విద్యారంగం సకల సమస్యలను ఎదుర్కొంటున్నది. అత్యధిక అక్షరాస్యత పెరగడానికి కారణమైన గోదావరి జిల్లాలకు అత్యధికంగా బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని పలకా బలపం చేతపట్టాల్సిన పిల్లలు వలసపోతున్న పాలమూరు, అక్షరాస్యత అథోగతిలో ఉండడానికి కారణం ఆంధ్ర వలసాధిపత్య పాలన, వివక్ష తప్ప మరొకటి కాదు.

కన్నబిడ్డల్ని అమ్ముకునే దౌర్భాగ్య స్థితిలో బడికి పంప డం ఓ కళ అయిన చోట, మూడుపూటలా తిని ఏ రందీ లేకుండా చదువుకునే పరిస్థితులున్న ప్రాంతానికి మధ్య సమస్యలను అర్థం చేసుకో లేం. అట్లాంటి స్థితిగతుల్ని మార్చడం ద్వారా విద్యారంగాన్ని తెలంగాణ సామాజిక మార్పు కోసం సాగుతున్న పోరాటంలో ఉపాధ్యాయ వర్గం విద్యార్థులు పోరాటబాట పట్టడం సహజం. తాము చదివిన చదువుకు ఎలాంటి భవిష్యత్తు లేనిచోట తమ బతుకు బాగుకోసం పోరాడే శక్తుల్ని నియంవూతించడానికి ప్రభుత్వం కుట్ర పన్నింది.
2009,డిసెంబర్ 9 నాటి తెలంగాణ ప్రక్రియ సజావుగా సాగి ఉంటే ఇవ్వాళ తెలంగాణ సమాజం ఇంత ఆందోళన, ఆవేదనకు గురయ్యేది కాదు. రెండు సంవత్సరాలుగా పాఠశాల, కళాశాలలు బంద్, ఆందోళనలు తదితర పోరాటాలతో పాటు పాఠశాలల్లో మంచినీళ్ల కోసం, పుస్తకాల కోసం మధ్యాహ్న మెతుకుల కోసం పోరాడటం చూస్తున్నాం.

ఇవి తెలిసినా పట్టించుకోకుండా పిల్లలు చదువుతున్న తరగతుల్లో 60 శాతం కన్నా తరగతి మొత్తం అన్ని సబ్జెక్టుల్లో ఫలితా లు తగ్గితే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు, డిస్మిస్, సస్పెన్షన్ మేజర్ ఫెనాల్టీస్ సెక్షన్ 323 కింద కేసులు పెట్టడానికి కూడా వెనకాడేదిలేదని 130లో స్పష్టం చేసింది. ఈ బెదిరింపులు నిజంగానే విద్యా ప్రమాణాలు పెంచడానికే అయితే స్వాగతించవచ్చు. కానీ ప్రభుత్వమే స్వయంగా విద్యా ప్రమాణాలను దిగజార్చే పద్ధతులను, పథకాలను అమలుచేస్తూ నేరం టీచర్ల మీదకు నెట్టచూపడం తీవ్రంగా వ్యతిరేకించాల్సి ఉంది. ప్రాథమికస్థాయిలో తరగతికో టీచర్ తరగతి గదిలేని పాఠశాలలు, వేల సంఖ్యలో ఉన్నట్లు ‘కాగ్’ నివేదిక స్పష్టం చేసింది. సుమా రు 70వేల పాఠశాలల్లో మెజార్టీ 70 శాతం పాఠశాలలకు కనీసం సురక్షితమై న మంచినీటి సౌకర్యం లేదు.

ఆడపిల్లలకు మూత్రశాలలు లేవని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. వీటి కోసం విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా జీవోలు విడుదల చేసింది. కానీ నిధులు విడుదల చేయకుండా వేలాది పర్యవేక్షణాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులు నిర్లక్షం వహిస్తున్నారు. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీ స్ రూల్స్ అంశం ఏళ్ల తరబడిగా పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమ య్యాయి. వీటితో పాటు ప్రభుత్వమే మాతృభాష పట్ల ప్రైవేట్ విద్యాసంస్థల పట్ల కనబరుస్తున్న ఇంగ్లీషు మోజు, కార్పొరేట్, కాన్సెప్ట్ ఆంధ్రా విద్యాసంస్థల ఆధిపత్యంలో మొత్తం తెలంగాణ విద్యారంగం కుప్పకూలిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. వీటి మెరుగుదల కోసం రేపటి తెలంగాణలో ప్రాథమిక స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ఉచిత నిర్బంధ విద్యను కామన్ స్కూల్ విధానంలో అమలు చేసుకోవడం కోసం తెలంగాణ టీచర్లు గొంతెత్తడం చూస్తున్నాం.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ‘సకల జనుల’ సమ్మెలో ఉపాధ్యాయులు పాల్గొనకుండా,విద్యా ప్రమాణాలు తగ్గుతాయన్న పేరుతో ప్రభుత్వం పన్నాగం పన్నింది. ప్రభుత్వం విడుదల చేసిన 130 జీవోలో ఉపాధ్యాయులను బెదిరించ చూడటం అప్రజాస్వామికం. ఈ జీవో అందరికీ వర్తించేలా ఉన్నప్పటికీ మొత్తం విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను సరిచేయకుండా అమ లు చేయపూనుకోవడడం ప్రాంతీయ వివక్షే. ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా అణగదొక్కడం అన్యాయం. ఈ అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కొవాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనతోనే అది సాధ్యమవుతుంది. అందుకోసమే యావత్ తెలంగాణ టీచర్లు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యస్తున్నారు. అలాగే తెలంగాణలో మెరుగైన విద్యావిధానం కోసం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పోరాటం తప్ప మరో మార్గంలేదు.

vudhyamabi vandanalu(ఉద్యమాభినందనలు)

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా లక్షలాది మంది ఉద్యోగులతో పాటు కోట్లాది మంది సకల జనులు సమ్మెకు దిగిన చరివూతాత్మక సందర్భమిది. మొదటి రోజు సమ్మెను విజయవంతం చేసినందుకు ఉద్యోగులతో సహా తెలంగాణ బిడ్డలందరికీ ‘నమస్తే తెలంగాణ’ అభినందనలు. తెలంగాణ ప్రజల దృఢ నిశ్చయానికి ఈ సమ్మె ప్రతీక. తెలంగాణ కాంక్ష ఎంత బలమైందో తెలియంది కాదు. అయినా సమ్మె ఎట్లా మొదలవుతుందనే విషయమై పల్లెటూరి పిల్లగాండ్లు మొదలుకొని ఖండాంతరాలలోని తెలంగాణ బిడ్డల వరకు ఆసక్తిగా, కొంత ఆందోళనతో చూస్తున్న సందర్భమిది. ఒక్కోసారి మనమీద మనకే నమ్మకం సడలే స్థాయిలో వలసవాదుల ప్రచార ఉధృతి ఉన్నది. అన్ని విష ప్రచారాలను, అపనమ్మకాల ను తోసివేసి సకల జనులు ఐక్యంగా ఉద్యమించడం భూమి పుత్రుల పోరాట చరివూతలోనే అపూర్వ ఘట్టం.

లక్షలాది మంది సాధారణ ఉద్యోగులు, అధికారులు ఎవరి కోసం ఎందుకోసం సమ్మె చేస్తున్నట్టు? వీళ్లు జీత బత్తాల కోసం, ప్రమోషన్ల కోసం సమ్మెకు దిగలేదు. తమ కుటుంబ సభ్యుల భోగ భాగ్యాల కోసం ఉద్యమంలో చేరలేదు. మాతృభూమి తెలంగాణ విముక్తి కోసం కలలుకన్నరు. వలసపాలనలో బానిస బతుకులు భరించలేమన్నరు. పుట్టిన గడ్డ కు, సమాజానికి బాధ్యత వహించాలనే సోయితో ఉద్యమంలోకి దిగిండ్రు. కష్టనష్టాలకు సిద్ధపడ్డరు. కడుపుల చల్ల కదలకుండ పనిచేసే ఉద్యోగస్తులే కాదు, రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవులు కూడా సమ్మెకు దిగి ఇప్పుడు ఆంధ్ర సర్కార్‌ను పరేషాన్ చేస్తున్నరు. సింగరేణి గని కార్మికుల చైతన్యం ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి అంతటికి స్ఫూర్తినిస్తున్నది. అహరహం రెండు చేతుల వేగంగా బీడీలు చుట్టే దయ గల తల్లులు సమ్మెకు దిగిండ్రు. తెలంగాణ తల్లి ఎంత అదృష్టవంతురాలు! ఏ గడ్డమీదనైనా ఇంత మంది త్యాగధనులు పుడతారో లేదో!

కోట్లాది మంది హృదయాలలో వెల్లివిరుస్తున్న సంఘీభావం వెనుక 1969లో ప్రాణా లు పణంగా పెట్టి పోరాడిన పసివాళ్ళు పోసిన చాలు ఉన్నది. అణువణువు కొలిమై రగిలిన శ్రీకాంతాచారి, యాదయ్య, యాదిడ్డి వంటి వందలాది మంది బిడ్డల త్యాగం ఉన్న ది. ఊరూరా, వాడవాడలా జేఏసీలుగా ఏర్పడి పోటీ పడి, వరుస పెట్టి దినం రాత్రి నిరాహారదీక్షలు పట్టి ఉద్యమిస్తున్న కోట్లాది మంది పల్లె బిడ్డల పోరాట పటిమ ఉన్నది. తెలంగాణ ద్రోహులకు సంఘ బహిష్కరణ విధించిన సబ్బండ వర్ణాల కుల కట్టు తీర్పు ఉన్నది. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లాది గొంతులు ఇప్పుడు ఒక్కటై తెలంగాణ కావాలని నినదిస్తున్నయి. ఇంకా సమ్మెలో చేరని నికృష్టులు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నరు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను కాలదన్ని, అధిష్ఠానాలకు వంత పాడుతున్నరు. వారు ఇప్పటికైనా కండ్లు తెరిచి ప్రజల దిక్కు రావాలె. లేదా చరివూతలో ద్రోహులుగా మిగిలిపోతరు.

ఈ సమ్మె హటాత్తుగా వచ్చినది కాదు. మూడు తరాల కష్టాల, కన్నీళ్ళపై తిరుగుబాటు. కనిపించని కుట్రలకు బలైన పల్లె బతుకులు... నీళ్ళు లేక, కరెంటు రాక, గొట్టం బావులు తవ్వీ తవ్వీ అలసిసొలిసి నాలుగు మెతుకుల కోసం అరిగోస అనుభవించిన రైతన్న వెత లు... కందీలు వెలుగుల ఎగిలివారే దానుక కంటికి కునుకు రాకుండా కష్టపడి చదివి రాత పరీక్ష నెగ్గినా, ఇంటర్వ్యూల ఆంధ్ర పెద్దలు ఇకిలించి సకిలించి చేసిన అవమానాలు... ఆఫీసులల్ల, సినిమాలల్ల, పత్రికలల్ల ఎక్కడబడితె అక్కడ తెలంగాణపై ఎటకారాలు... అనేక అన్యాయాలు, అవమానాలు... అనుభవించే ఒక్కో హృదయం ఒక అగ్ని పర్వతం... రగి లి రగిలి... ఒక్కసారి బద్దలైనయి. ఒక మహోద్యమంగా మారినయి.
తెలంగాణ జనం ప్రతి దశలో ప్రతి పరీక్షకు నిలబడి నెగ్గుతూనే ఉన్నరు. 1969లోనే ఎన్నికల ద్వారా తమ ఆకాంక్షను వెల్లడించిండ్రు. మలి దశ ఉద్యమంలో తెలంగాణ వాదానికి కట్టుబడుతున్నట్టు చెప్పిన ప్రతి పార్టీని నెత్తిల పెట్టుకున్నరు.

డిసెంబర్ తొమ్మిది చిదంబరం ప్రకటన తరువాత ఆంధ్ర పార్టీల ద్రోహం బయటపడింది. దీంతో ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణ వాదానికి అనుకూలంగా తిరుగులేని తీర్పు ఇచ్చిండ్రు. త్యాగాలు చేసిండ్రు. ఇప్పుడు సకల జనులు సకల విధాల సమ్మెను చేస్తున్నరు. తెలంగాణ ఆకాంక్ష ఎంత గాఢమైందో నిరూపిస్తున్నరు.

ఆంధ్ర పెత్తందారులు ఇప్పుడేమంటరు? తెలంగాణ ఉద్యమం ఉన్నదా లేదా? ఆంధ్ర మీడియా అబద్ధాల కూతలు ఇంకా ఎన్నాళ్ళు వినిపిస్తది! గూఢచార నివేదికలు, ముఖ్యమంత్రి, గవర్నర్ నివేదికలు ఇంకా తెలంగాణ ఎట్లున్నదని పంపిస్తరు? సకల జనుల సమ్మె సాగుతున్నది. తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వమే లేదు. అంతో ఇంతో ఉంటే ఆంధ్ర ప్రభుత్వమే. సింగరేణి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇంకా ఒక్కో దెబ్బ పడుతనే ఉంట ది. ఉత్తర దక్షిణ భారతాల మధ్య తొవ్వలు బంద్. సరుకులు కొంచబోవుడు బంద్. కోట్ల రూపాయల పన్నుల వసూలు బంద్. సినిమాలు బంద్. ఇంకా వేరే నివేదికలు ఎందుకు? దసరా, దీపావళి పండుగలు వస్తున్నయి. అయినా ఫరవాలేదు. పరాయిపాలనలో పప్ప న్నం కన్నా, బానిసత్వం నుంచి స్వేచ్ఛ కోసం సాగే పోరాటంలో తొక్కన్నం తిందాం. ఖైదీలకు మిఠాయిలు పంచే సర్కారు మనకు వద్దు. ఊచల వెనక సూర్యోదయాన్ని చూస్తున్న రేపటి విజేతలం మనం. మనకు పోరాటమే ఊపిరి. ఆత్మాభిమానమే మన సంపద.

శ్రీకృష్ణ కమిటీ నికృష్టపు సూచనలు మా ముందల చెల్లవ్. ఆంధ్ర పాలకుల మాయోపాయాలు, విభజించి పాలించే నీతి ఇక చెల్లదు. డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు కేంద్రం కట్టుబడాలె. ఏ తారీఖులోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తరో చెప్పాలె. మాకు కావలసింది ఆజాద్... అవును ఆజాద్.. అందుకు ప్రత్మామ్నాయం లేదు.

rahatharula nirbandam 19 ki vaida(రహదారుల నిర్భంధం 19 కువాయిదా)

సకలజనులసమ్మెలో భాగంగా ఈనెల 18న జరుపతలపెట్టిన జాతీయరహదారుల నిర్భంధాన్ని 19 కి వాయిదావేస్తున్నట్లు జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. 18న బ్యాంకు పరీక్షలున్నందున 19కు రహదారుల నిర్భందాన్ని వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు.

thwaralone telangana parishkaram(pradhani)(త్వరలోనే తెలంగాణ పరిష్కారం: ప్రధాని)

న్యూఢిల్లీ: త్వరలోనే తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్ హామీ ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు. గురువారం ప్రధానితో సమావేశమయిన టీకాంగ్రెస్ నేతలకు ప్రధాని హామీ ఇచ్చారని టీజేఏసీ నేతలు తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న సకలజనులసమ్మె నివేదికలు ప్రతిరోజు వస్తున్నాయన్నాయని ప్రధాని తెలిపారన్నారు.
In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts