Saturday 23 July 2011

ashru nayanalatho yadireddy anthyakriyalu

అశ్రునయనాలతో యాదిడ్డి అంత్యక్షికియలు
- కన్నీటి సంద్రమైన పెద్దమంగళారం
- ఊరు ఊరంతా శ్మశానవాటికకు
- పొద్దంతా ఉపవాసంతోనే
- పెల్లుబికిన ఉద్యమ నినాదాలు
- రెండు గంటలపాటు అంతిమయాత్ర
- దుఖ్ఖం ఆపుకోలేక పోయిన హరీష్‌రావు
- పాడెమోసిన టీఆర్‌ఎస్ నేతలు
- ఎర్రబెల్లి వాహనంపై రాళ్ల దాడి

ఉద్యమ ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు చాటిన పోరుబిడ్డ మందడి యాదిడ్డికి అశ్రు నయనాలు, ఉద్యమగీతాలు, జోహార్ల మధ్య రంగాడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఆయన స్వగ్రామమైన పెద్దమంగళారంలో శుక్రవారం ఘనంగా అంత్యక్షికియలు జరిగాయి. అంతిమయాత్ర సందర్భంగా పెద్దమంగళారం గ్రామం కన్నీటి జన సంద్రమైంది. యాదిడ్డి కు టుంబంతోపాటే ఉపవాసం ఉన్న పెద్దమంగళారం.. ఊరు ఊరంతా శ్మశానవాటికకు కదిలొచ్చింది. ఓవైపు బంద్‌తో ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా తెలంగాణ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా కదలివచ్చిన తెలంగాణవాదులు, ఉద్యమకారులతో పాటు అశేషంగా తరలివచ్చిన జనవూపవాహం మధ్య అంతిమయాత్ర రెండు గంటల పాటు కొనసాగింది.

మా తెలంగాణ మాకు ఇవ్వండంటూ ఏకంగా ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్‌భవన్ సమీపంలో ఆత్మబలిదానం చేసిన యాదిడ్డి ధైర్యసాహసాలను, అతడి ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కీర్తిస్తూ పాడిన పాటలతో అంతిమయావూతలో పాల్గొనేందుకు వచ్చిన వారి హృదయాలు ద్రవించాయి. ఆయన ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరం కృషిచేస్తామంటూ ప్రతినబూనారు. ఉదయం 11.45 గంటలకు మొదలైన అంతిమయాత్ర మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. మృతదేహాన్ని పూలతో అలంకరించిన ట్రాక్టర్‌పై ఉంచి గ్రామ ప్రధాన వీధులగుండా ఊరేగించి శ్మశానవాటికలో అంతిమ సంస్కారం నిర్వహించారు. ఢిల్లీలో పోస్టుమార్టం నిర్వహించినప్పటి నుంచి యాదిడ్డి మృతదేహం వెంటే ఉన్న టీఆర్‌ఎస్ నేతలు హరీశ్, కేటీఆర్, ఈటెల రాజేందర్‌లు పాడె మోసి అతడికి అంతిమ సంస్కారాలు పూర్తయ్యేంత వరకూ ఉన్నారు.
జనసంవూదమైన పెద్దమంగళారం యాదిడ్డి అంతిమయావూతలో పాల్గొనేందుకు తెలంగా వ్యాప్తంగా ప్రజలు విశేషంగా తరలిరావటంతో పెద్దమంగళారం జనసంవూదంగా మారింది.

మొన్నటి వరకు సామాన్య యువకుడిగా ఉండి, ఒక్కడే ఢిల్లీకి వెళ్లి ఆత్మత్యాగం చేయటంతో చరివూతలోకి ఎక్కాడని ప్రతి ఒక్కరూ కీర్తించారు. యాదిడ్డి అంత్యక్షికియల్లో పాల్గొనాలని, కడసారి చూపు చూడాలని గ్రామస్తులంతా పనులన్నీ వదులుకుని ఇంటి వద్దే ఉండి అంతిమయావూతలో పాల్గొన్నారు. యాదిడ్డి బలిదానం గురించి తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, వివిధ పార్టీల నాయకులు, కళాకారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు, తెలంగాణవాదులు గురువారం రాత్రి నుండే వేల సంఖ్యలో పెద్దమంగళారం తరలివచ్చారు. యాదిడ్డి భౌతికకాయం చేరుకున్నది మొదలు శుక్రవారం మధ్యాహ్నం అంతిమ సంస్కరణలు ముగిసే వరకు గ్రామంలో కన్నీళ్ళు కార్చని వారులేరు. మంచికి మారుపేరుగా, తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు తన బలిదానంతోనే రావాలని ఆకాంక్షించిన సాహసిగా యాదిడ్డిని కొనియాడుతూ కట్టలు తెంచుకునే కన్నీళ్లను ఆపుకోలేక పోయారు.

తెలంగాణ గడ్డలో తమ పులిబిడ్డగా యాదిడ్డి చేసిన సాహసం దేశ చరివూతలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెప్పారు. ఇదిలా ఉండగా పెద్దమంగళారంలో రెండు రోజులుగా కనీసం ఒక్క ఇంట్లో నైనా పొయ్యిలు రాజుకోలేదు. ఊరు ఊరంతా ఉపవాసంతో ఉండిపోయారు. కన్నీళ్లతోనే వారు గడిపారు. అంతిమయావూతకు వచ్చిన వారు కూడా ఉపవాసం ఉన్నారు.

కన్నీటి పర్యంతమైన హరీశ్‌రావు
యాదిడ్డి మృతదేహానికి నివాళులర్పించేందుకు అతడి ఇంటికి వచ్చిన టీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్‌రావు.. యాదిడ్డి తల్లి చంద్రమ్మను ఒక్కసారిగా కంట తడిపెట్టారు. ‘‘మీ బిడ్డ చరివూతకారుడమ్మా. అతనిలేని లోటును ఎవరం తీర్చలేం..’’ అంటూ ఆమెను ఓవైపు ఓదార్చుతూనే తాను కన్నీళ్లను ఆపుకోలేక పోయారు. ‘‘అమ్మా నేనూ నీ కొడుకునే’’ అంటూ రోదించారు. అమ్మ చేతి వంట తిందామనుకున్నా.. ఎక్కడ మనసు మారుస్తుందోనని తినకుండానే వచ్చేశానని యాదిడ్డి రాసిన లేఖ చూసి తట్టుకోలేక పోయానని చెప్పారు. ‘‘ఎం ధీశాలిని కన్నావు తల్లీ.. నీ వెంటే మేముంటాం. యాదిడ్డి ఆశయాలు సాధిస్తాం..’’ అంటూ ఓదార్చారు. మీడియాతో మాట్లాడుతూ కూడా యాదిడ్డి ఆత్మబలిదానం వెనుక ఉన్న కారణాన్ని, లేఖలో అతడు ఏ విధంగా రాశాడో చెబుతూ మళ్లీ కన్నీటిపర్యంతమయ్యారు.

హైదరాబాద్ నుంచి కచ్చితమైన నిర్ణయంతోనే అన్నింటికీ సిద్ధమై అతడు బయలుదేరి అనుకున్న పని చేయడం ఎంతో బాధించిందని రోదించారు. కొద్దిసేపు ఏం మాట్లాడలేని పరిస్థితిలో మౌనంగా ఉండిపోయారు. అంతిమ యాత్రలో చివరి సారిగా కేటీఆర్, ఈటెల రాజేందర్, వేదకుమార్ తదితరులతో కలిసి పాడెమోశారు.

టీడీపీ నాయకులకు తప్పని నిరసన
టీడీపీ నేతలకు యాదిడ్డి అంత్యక్షికియల సందర్భంగానూ నిరసన తప్పలేదు. యాదిడ్డికి నివాళులర్పించి తమ వాహనాలవైపు వెళుతున్న టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌డ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కేఎస్.రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌డ్డిలను ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు వెంబడించారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు, టీడీపీల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. దాంతో వారు త్వరత్వరగా తమ వాహనాలవద్దకు చేరుకుని వాటిల్లో ఎక్కి బయలుదేరే సమయంలో విద్యార్థులు రాళ్లతో వారి వాహనాలపై దాడిచేశారు. ఎర్రబెల్లి వాహనంపై రాయిపడినా వాహనాన్ని ఆపకుండా అలాగే వెళ్లిపోయారు.

అంతిమ నివాళిఘటించిన నేతలు
యాదిడ్డికి అంతిమ నివాళులు అర్పించేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, కో-చైర్మన్ విఠల్, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మెన్ స్వామిగౌడ్, గెజిటెడ్ ఉద్యోగలు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కే తారక రామారావు, కొప్పుల ఈశ్వర్, గడ్డం అరవిందడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ, జీ తెలుగు చానల్ సీఈవో శైలేష్‌డ్డి, టీఆర్‌ఎస్ పశ్చిమ అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, రంగాడ్డి జడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌డ్డి, టీడీపీ నేతలు దేవేందర్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డాక్టర్ పీ మహేందర్‌డ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌డ్డి, స్వప్న, గడ్డం వెంకట్‌డ్డి, దేశమల్ల ఆంజనేయులు, టీడీపి తిరుగుబాటు ఎమ్మెల్యేలు హరీశ్వర్‌డ్డి, రామన్న, కాంగ్రెస్ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, సీపీఐ ముదిగొండ ఎమ్మెల్యే యాదిగిరి, ఎమ్మెల్సీ రహమాన్‌లు పెద్దమంగళారం చేరుకున్నారు.

అలాగే బీజేపీ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగర్‌రావు, ఆ పార్టీ నేతలు బద్దం బాల్‌డ్డి, మల్లాడ్డి, రంగన్న, అంజన్‌కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకుడు కార్తీక్‌డ్డి, మాజీ ఎమ్మెల్యే కోదండడ్డి, టీటీడీ మాజీ సభ్యుడు కాలే యాదయ్య, సీనియర్ నాయకులు పడాల వెంకటస్వామి, జ్ఞానేశ్వర్, జడ్పీటీసీ బాల్‌రాజ్, ఎంపీపీ కరణం రాజ్యలక్ష్మి, ప్రకాష్‌గౌడ్, రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక సంఘం అధ్యక్షుడు ఎల్లయ్య, న్యాయవాదుల జేఏసీ కో-కన్వీనర్ గోవర్థన్‌డ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్, పుస్తకాల నర్సింగ్‌రావు, యాదయ్య, మండల కాంగ్రెస్ ఆధ్యక్షులు పురుషోత్తమడ్డి, గోపాల్‌డ్డి, టీఆర్‌ఎస్ ఎస్సీసెల్ రాష్ర్ట అధ్యక్షుడు మందుల శామ్యూల్, కార్యదర్శి బద్దం బాస్కర్‌డ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జి దేశమోళ్ల అంజనేయులు, జిల్లా యూత్ అధ్యక్షుడు గడ్డం వెంకట్‌డ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న సతీష్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్, యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క, భీంభరత్, కడమంచి నారాయణదాసు, తెలంగాణ బలిదానం దర్శకుడు రఫీ, కథానాయిక సుమాంజలి, న్యూ డెమాక్షికసీ నాయకులు గోవర్థన్ తదితరులు పెద్దమంగళారం చేరుకున్నారు. యాదిడ్డి అంతిమయావూతలో పాల్గొన్నారు.

ఉద్యమ పాటలతో హోరెత్తిన ఊరు
కళాకారులు గద్దర్, విమలక్క, రసమయి బాలకిషన్, సాయిచంద్, జలజ, రాజు తదితరులు సహా పెద్దమంగళారానికి చేరుకున్న కళాకారులు.. ఆలపించిన అమరవీరుల గీతాలతో గ్రామం హోరెత్తింది. యాదిడ్డి.. నువ్వు అమరుడవన్నా.. అంటూ గద్దర్‌గళం విప్పడంతో అందరూ కన్నీరు కార్చారు. వీరులారా వందనం.. అమరులారా వందనం.. అంటూ విమలక్క, తెలంగాణ బిడ్డలు, అమరులు, బాధలు తదితరాలపై రసమయి బాలకిషన్, సాయిచంద్‌లు పాటలు పాడారు. వీరందరికీ వేలాది ప్రజలు, వివిధ పార్టీల నేతలు సైతం కోరస్‌లిచ్చారు. ఇదే సమయంలో విద్యార్థులు, తెలంగాణవాదులు సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ అధినేత సోనియా, కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి, సీమాంధ్ర నేతలు లగడపాటి, రాయపాటి, కావూరి, టీజీ వెంక పయ్యావుల కేశవ్, మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ తదితరులకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా మహిళలు శాపనార్థాలు పెట్టారు.

పోలీసు వలయంలో పెద్దమంగళారం
యాదిడ్డి అంతిమయాత్ర సందర్భంగా పెద్ద మంగళారం పోలీసుల వలయంగా మారింది. గ్రామానికి ఆరు వాహనాల్లో 120 మందితో కూడిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చింది. కేరళ, మహారాష్ట్రలకు చెందిన వజ్ర కంపెనీ బెటాలియన్ చేరుకుంది. వాటర్ క్యానన్‌లు, టీయర్ గ్యాస్ వ్యాన్‌లు రావటంతోనే పెద్ద మంగళారం గ్రామాల్లోని ప్రాంతాలను వారు పర్యటించారు. 50 మంది మహిళా సీఆర్‌పీఎఫ్ జవాన్లు చేరుకున్నారు. రాజకీయ పార్టీలు, విద్యార్థులు చేయబోయే కార్య్రకమాలపై నిఘావర్గాలకు చెందిన 15 మంది ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఫోటోలు తీస్తూ గ్రామస్తులను భయవూభాంతులను చేశారు. నిఘా విభాగాలకు చెందిన పలువురు తాము జేఏసీ నేతలమంటూ యాదిడ్డికి పూల దండలు తెచ్చి, జనంతో కలిసి తిరగడం, విలేకరులు, రాజకీయ నేతలు, జేఏసీ ప్రతినిధుల ఫోన్ నెంబర్లు సేకరించటం టీ న్యూస్ కంట పడింది.

సీమాంధ్ర మీడియాకు దాడుల భయం
యాదిడ్డి అంతిమ యాత్రను కవర్ చేసేందుకు వచ్చిన సీమాంధ్ర మీడియాపై జనం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర రంగుడబ్బాలు తప్పుదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో స్టూడియో ఎన్, సాక్షి, ఎన్‌టీవీ, టీవీ5, ఏబీఎన్, మహాటీవీ తదితర చానళ్ల ప్రతినిధులపై విద్యార్థులు, తెలంగాణవాదులు ఆవేశం ప్రదర్శించారు. దీంతో వీటి లైవ్ వాహనాలను మొయినాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించి పోలీసులు రక్షణ కల్పించారు. తరువాత జనాన్ని నాయకులు సముదాయించడంతో లైవ్ కవరేజ్ వాహనాలు వచ్చి తమ పని చేసుకున్నాయి.

చంద్రమ్మను ఓదార్చిన అల్లం నారాయణ
యాదిడ్డి తల్లి చంద్రమ్మ, చెల్లెలు మంగమ్మలను నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ, జీ తెలుగు చానల్ సీఈవో శైలేష్‌డ్డిలు ఓదార్చారు. చంద్రమ్మ కన్నీళ్ళు చూసి చలించిపోయారు. యాదిడ్డి చెల్లి మంగమ్మకు తాము అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. యాదిడ్డి ఆశయ సాధనకు తామంతా పోరాటం చేస్తామన్నారు.

యాదన్న సాక్షిగా ప్రతిన
తెలంగాణ కోసం అసువులు బాసి, తనదే చివరి చావు కావాలని కోరుకున్న యాదిడ్డి బలిదానం సాక్షిగా తాము ఉద్యమం సాగిస్తామని టీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, రాజేందర్, కేటీఆర్‌లు ప్రతిజ్ఞ చేశారు. యాదిడ్డి ఖనన స్థలంలో వారు కార్యకర్తలు, విద్యార్థులు, వేలాది మందితో ప్రతిజ్ఞ చేయించారు. అంతిమయావూతలో పాల్గొన్న ఉస్మానియా జేఏసీ నేతలు పిడమర్తి, రాజారంయాదవ్, కిషోర్‌కుమార్, కైలాష్ తదితరులు యాదిడ్డి ఆశయాలు సాధిస్తామని ప్రతినబూనారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తామని, సీమాంవూధుల భరతం పడుతామని హెచ్చరించారు.

పటిష్ట భద్రత
అంతిమయాత్ర సందర్భంగా ఎలాంటి సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏసీపీలు, పదిమంది సీఐలు, 25మంది ఎస్‌ఐలతో పాటు వందలాది మంది సిబ్బంది, ర్యాపిడ్‌యాక్షన్, సీఆర్‌పీఎఫ్ దళాలు ఇందులో పాల్గొన్నాయి. అంతిమయాత్ర సజావుగా సకాలంలో జరగటం, ఎలాంటి అపక్షిశుతి చోటుచేసుకోకపోవటంతో వారు ఊపిరిపీల్చుకుని వెనుదిరిగారు.

No comments:

Post a Comment

In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts