Saturday 23 July 2011

telangana distircts lo telangana bandh prashantham

ప్రత్యేక తెలంగాణ కోసం ఈ నెల 20న ఢిల్ల్లీలో యాదిరెడ్డి ఆత్మహత్యకు నిరసనగా తెలంగాణ పొలి టికల్‌ జేఏసి పిలుపు మేరకు శుక్రవారం తెలంగాణ జిల్లాలలో నిర్వహించిన శుక్రవారం బంద్‌ విజయవంతమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలను మూసివేసి బంద్‌కు మద్దతు పలికారు. బంద్‌ కారణంగా తెలంగాణ జిల్లాల్లో ఆర్టీసీ సర్వీసులు ఎక్కడి వక్కడే నిలిచి పోయాయి.

రాజధాని నుండి జిల్లాలకు బయలు దేరాల్సిన బస్సులు ఎమ్‌జిబిఎస్‌, జూబ్లీ డిపోల లోనే నిలిపి వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులను ఎదుర్కొన్నారు. అదిలాబాద్‌ జిల్లాలోని ఆరు డిపోల ముందు తెరాస, ఐకాస నేతలు బైటాయించడంతో 600 బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. అదేవిదంగా మెదక్‌ జిల్లాలో ఏడు డిపోల పరిధిలో 550 బస్సులు, మహబూబ్‌నగర్‌జిల్లాలోని లోని ఎనమిది డిపోల పరిధి లోని 804 బస్సులు , నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల పరి ధిలోని 705 బస్సులు, కరీంనగర్‌ జిల్లా పరిధిలోని 11 డిపోలలో ఉన్న 865 బస్సులు, నిజామాబాద్‌ జిల్లాలో 630 బస్సులు రహదారులపైకి రాలేకపోయాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో...
బంద్‌ కారణంగా జిల్లాలో వ్వాపార సంస్థలు, రవాణ సౌకర్యాలు స్థంబించి పోయాయి. జిల్లాలోని షాద్‌నగర్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, గద్వాల డిపోలలో బస్సులను నిలిపివేశారు. ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదు ర్కొన్నారు. ఆర్టీసీకి శుక్రవారం ఒక్కరోజే రూ. 70 లక్ష లకు పైగా నష్టం వచ్చినట్లు అధికారుల అంచనా. యాది రెడ్డి మృతిపై తెలంగాణవాదులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. సీమాంధ్రులకు వ్యతిరెకంగా నినాదాలు చేస్తూ యాదిరెడ్డికి నివాళులు అర్పించారు. టీడీపీ, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమక్రసి, ఐఎన్‌టియుసి, ఎబి విపి, టిఆర్‌ఎస్‌వి, పాలమూర్‌ యూనివర్షిటి విద్యార్థులు బారీగా ర్యాలీలు నిర్వహించి అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.మండల కేంద్రా లలో యాదిరెడ్డికి నివాళులు అర్పించారు.

మెదక్‌ జిల్లాలో...
చెదురుమదురు సంఘటనలు మినహా మెదక్‌లో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోల్‌, మెదక్‌, సిద్దిపేట, గజ్వేల్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో ప్రశాంతంగా బంద్‌ జరగడమే కాకుండా చిన్న చిన్న సంఘటనలు చోటుచేసు కున్నాయి. నారాయణఖేడ్‌లో ఒకరు, సిద్ధిపేటలో నలు గురు యువకులు సెల్‌టవర్‌పైకెక్కారు. హరీష్‌రావుపై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకోవాలని లేకుంటే తీవ్రపరి ణామాలు జరుగుతాయని హెచ్చరించారు. కొండపాకలో ఒక వ్యక్తి టవర్‌పైకెక్కడానికి యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదాశివపేట మండలంలోని నిజాంపూర్‌లో ఒక ఆటో డ్రైవర్‌ సూసైడ్‌ నోట్‌రాసి ఆత్మ హత్య చేసుకున్నాడు. రాజకీయ నాయకులు బిజెపి, టీడీపీ, టిఆర్‌ఎస్‌, మరికొందరు న్యాయవాదులు, ఉద్యో గులు సంగారెడ్డి, కలెక్టరేట్‌ ఉద్యోగులు విధులను బిహ ష్కరించారు.

వరంగల్‌ జిల్లాలో...
బంద్‌ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. బ్యాం కుల నుండి కిల్లీ షాపుల వరకు అన్నింటిని మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జిలు ధరిం చారు. యాదిరెడ్డి మతికి నిరసనగా శాంతి ర్యాలీలు నిర్వ హించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో శాంతి ర్యాలీలు, పలుచోట్ల రాస్తారోకోలు చేసి ప్రత్యేక తెలంగాణ నినాదాలు చేశారు. వరంగల్‌లో అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని ఘనంగా నివాళులు అర్పించాయి. జిల్లా వ్యాప్తంగా బంద్‌ సంపూర్ణంగా జరిగింది. జిల్లాలోని ఎనిమిది బస్‌డిపోల నుంచి 900 బస్సులను ఆపివేశారు. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీకి శుక్రవారం ఒక్కరోజే రూ. 60 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. పోలీసులు భారీ పికె టింగ్‌లు, పెట్రోలింగ్‌లు చేపట్టారు. వరంగల్‌లో జరిగిన బంద్‌ కార్యక్రమంలో టిడిపికి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, హన్మకొండలో జరగిన కార్యక్రమాలలో టిఎన్‌జీవోస్‌ కేంద్రం సంఘం నాయ కులు పరిటాల సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లాలో...
బీజేపి, సిపిఐ (ఎంఎల్‌), జెఏసి, టిఆర్‌ఎస్‌ల ఆధ్వ ర్యంలో నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. రాస్తా రోకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు జెఏసి నాయకులు మాట్లాడుతూ సీమాంధ్ర నాయకుల ప్రలోభాలకు కేంద్రం తలొగ్గి రాష్ర్ట్ర ఏర్పాటు ప్రక్రియను జాప్యం చేస్తోందని తెలంగాణ కోసం బలి దానాలు జరుగుతున్న సోనియాగాంధీకి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు. యాదిరెడ్డికి ఘనంగా నివా ళులు అర్పించారు.

కరీంనగర్‌ జిల్లాలో...
జిల్లాలోని 11 డిపోలలో 900ల ఆర్టీసి బస్సులు డిపో దాటి బయటకు రాలేదు. దీంతో రవాణా స్తంభించి పోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గుర య్యారు.ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరు పట్టికలో సంతకాలు చేసి విధులు బహిష్కరిం చారు. హుజూరాబాద్‌ డివిజన్‌లో ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలి పారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను పలుచోట్ల దగ్ధం చేశారు. అన్ని పార్టీల శ్రేణులు బందులో పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో...
జిల్లా వ్యాప్తంగా బంద్‌ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరి గింది. ఉదయం నుంచి తెలంగాణ వాదులు ఆర్టీసి బస్సులు బయటకు వెళ్లకుండ ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, భైైంసా, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ డిపోల వద్ద బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టిఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలిపెట్టారు. బెల్లంపల్లి డివిజన్‌ పరిధిలో,జిల్లా కేంద్రంలో ర్యాలీలు, మోటార్‌సైకిల్‌ ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పా టును అడ్డుకుంటున్న నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అంతరాష్ట్ర సర్వీసులతో పాటు మరికొన్ని బస్సు లను పోలీస్‌ ఎస్కార్టు మధ్య మధ్యాహ్నం ప్రారంభించారు.

నిజామాబాద్‌ జిల్లాలో ..
జిల్లాలో శుక్రవారం జరిగిన బంద్‌ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు పూర్తిగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపి వేశారు. ఆరు డిపోల్లోని 630 బస్సులు సాయంత్రం వరకు డిపోలకే పరిమితమవటంతో ఆర్టీసీకి రూ.50 లక్షల నష్టం వాటిల్లినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. కామారెడ్డి, నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడ ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమ సంఘాల నేతలు డిపోల ఎదుట బైఠాయించారు.

ఖమ్మం జిల్లాలో ...
రాజకీయ జేఏసీ పక్షాలన్ని బంద్‌లో పాల్గొన్నాయి. జిల్లాలోని ఆరు ఆర్టీసీ బస్స్‌ డిపోల నుంచి ఒక బస్సుకూడా కదలలేదు.దీంతో జిల్లా ఆర్టీసీకి రూ. 20లక్షల ఆదాయం కోల్పోయింది. పాల్వంచలోని కెటిపిఎస్‌ ఉద్యోగులు విధు లకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దెందూకూర్‌- రాయ పట్నంరోడ్డు ఆంధ్రవాహనాలను అడ్డుకున్నారు.

No comments:

Post a Comment

In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts